logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఇందిరమ్మ ఇల్లు కల సాకారం నూతన ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభోత్సవ కార్యక్రమం లో నాయకులు. ఇందిరమ్మ ఇల్లు కల సాకారం నూతన ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభోత్సవ కార్యక్రమం లో నాయకులు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలంలోని చిన లింగాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు అనసూర్య, చంద్రయ్య లు ఈరోజు గృహప్రవేశం నిర్వహించగా ఇట్టి కార్యక్రమం కు ముఖ్య అతిథులుగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్ టోనీ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరెళ్ల నరసింగం గౌడ్ గారీ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేయడం జరిగింది,అనంతరం లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలుపుతూ కెకె మహేందర్ రెడ్డి గారు పంపించిన చిరు కానుక ప్రవీణ్ టోనీ చేతుల మీదుగా అందివ్వడం జరిగింది.లబ్ధిదారులు ప్రజా పాలన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి గారికి ,కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమం లో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు నేరల నర్సింగ0 గౌడ్ గారు ,నాయకులు బైరినేని రాము,యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు మునిగేల రాజు,మిరాల శ్రీనివాస్,నారా గౌడ్,రవీంద్రారెడ్డి మరియు నాయకులు,మహిళలు పాల్గొన్నారు.

3 hrs ago
user_Satheesh gangu
Satheesh gangu
జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
3 hrs ago

ఇందిరమ్మ ఇల్లు కల సాకారం నూతన ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభోత్సవ కార్యక్రమం లో నాయకులు. ఇందిరమ్మ ఇల్లు కల సాకారం నూతన ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభోత్సవ కార్యక్రమం లో నాయకులు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలంలోని చిన లింగాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు అనసూర్య, చంద్రయ్య లు ఈరోజు గృహప్రవేశం నిర్వహించగా ఇట్టి కార్యక్రమం కు ముఖ్య అతిథులుగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్ టోనీ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరెళ్ల నరసింగం గౌడ్ గారీ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేయడం జరిగింది,అనంతరం లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలుపుతూ కెకె మహేందర్ రెడ్డి గారు పంపించిన చిరు కానుక ప్రవీణ్ టోనీ చేతుల మీదుగా అందివ్వడం జరిగింది.లబ్ధిదారులు ప్రజా పాలన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి గారికి ,కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమం లో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు నేరల నర్సింగ0 గౌడ్ గారు ,నాయకులు బైరినేని రాము,యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు మునిగేల రాజు,మిరాల శ్రీనివాస్,నారా గౌడ్,రవీంద్రారెడ్డి మరియు నాయకులు,మహిళలు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • Post by ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    1
    Post by ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    8 hrs ago
  • పత్రిక ప్రకటన తేది:13.03.2026 కామారెడ్డి జిల్లా శుక్రవారం ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అమలు చేస్తున్న 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా పంచాయితీ, మున్సిపాలిటీ పరిధిలో నిర్వహిస్తున్న పరిశుభ్రత కార్యక్రమం లో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని టెక్రియాల్ చెరువు వద్ద నిర్వహిస్తున్న శానిటేషన్ ను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పరిశీలించారు. అనంతరం సదాశివ నగర్ – క్రుప్రియల్ హైవే ఇరుపక్కల జరుగుతున్న శానిటేషన్ పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పరిసర ప్రాంతాలను పరిశీలిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు పంచాయతీ, మున్సిపల్ సిబ్బంది సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. టెక్రియాల్ చెరువులో గణేష్, దుర్గాదేవి నిమజ్జనం జరిగిన ప్రదేశాలలో చెరువు పరిసర ప్రాంతాల్లో శుభ్రతను కాపాడేందుకు సంబంధిత శాఖల అధికారులు చెరువు వద్ద పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించి, శానిటేషన్ పనులు పూర్తి చేసి, ఈరోజు సాయంత్రం లోపు ఆ ప్రాంతాన్ని సమతలంగా (లెవెల్) చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజల ఆరోగ్యం , పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా చెరువు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా చూడాలని ప్రజాప్రతినిధులు పరిశుభ్రత కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అధికారులకు సూచించారు.
    1
    పత్రిక ప్రకటన 
తేది:13.03.2026
కామారెడ్డి జిల్లా శుక్రవారం
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అమలు చేస్తున్న 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా  పంచాయితీ, మున్సిపాలిటీ పరిధిలో నిర్వహిస్తున్న పరిశుభ్రత కార్యక్రమం లో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని టెక్రియాల్ చెరువు వద్ద  నిర్వహిస్తున్న శానిటేషన్ ను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పరిశీలించారు.
అనంతరం సదాశివ నగర్ – క్రుప్రియల్ హైవే ఇరుపక్కల జరుగుతున్న శానిటేషన్ పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.   
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పరిసర ప్రాంతాలను పరిశీలిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు పంచాయతీ, మున్సిపల్ సిబ్బంది సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు.
టెక్రియాల్ చెరువులో గణేష్,  దుర్గాదేవి నిమజ్జనం జరిగిన ప్రదేశాలలో  చెరువు పరిసర ప్రాంతాల్లో శుభ్రతను కాపాడేందుకు సంబంధిత శాఖల అధికారులు చెరువు వద్ద పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించి, శానిటేషన్ పనులు పూర్తి చేసి, ఈరోజు సాయంత్రం లోపు ఆ ప్రాంతాన్ని సమతలంగా (లెవెల్) చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ప్రజల ఆరోగ్యం , పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా చెరువు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.
చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా చూడాలని ప్రజాప్రతినిధులు  పరిశుభ్రత కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కలెక్టర్ తెలిపారు.  ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అధికారులకు సూచించారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    5 hrs ago
  • ​కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల పరిధిలో సంచలనం సృష్టించిన ఆర్‌ఎంపి వైద్యుడిపై దాడి చేసి కళ్ళలో కారం చల్లి చైన్ స్నాచింగ్ పాల్పడిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నేరానికి పాల్పడిన మైనర్ బాలుడితో సహా ఐదుగురిని అరెస్ట్ చేశారు. అరెస్టు అయిన వారిని కరీంనగర్ లో సిపి గౌస్ ఆలం సమక్షంలో మీడియాకు చూపించి వివరాలు వెల్లడించారు. ​గన్నేరువరం మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన తమ్మనవేని కొమురయ్య ఆర్‌ఎంపిగా పనిచేస్తున్నారు. అతనిపై ఈనెల 11న రాత్రి దారి దోపిడికి పాల్పడిన ముఠాను 24 గంటల్లో పోలీసులు అరెస్టు చేశారు. మైనర్ బాలుడితో పాటు గుండ్లపల్లికి చెందిన ​పెనుగొండ అబినైజర్, ​పంబాల నాగరాజు, నుస్తులాపూర్ కు చెందిన మాచర్ల రామ్ చరణ్ గౌడ్, పెద్దపల్లి జిల్లా బొట్లవనపర్తికి చెందిన ​గుజ్జేటి మధువర్ధన్ ఐదుగురు ముఠాగా ఏర్పడి జల్సాలకు అలవాటు పడ్డారు. గతంలో అద్దెకు తీసుకున్న ఎర్టిగా కారు డ్యామేజీకి సంబంధించి యజమానికి చెల్లించాల్సిన 40 వేల కోసం దొంగతనానికి పథకం వేశారు. ఒంటరిగా తిరిగే ఆర్ఎంపి కొమురయ్య మెడలోని బంగారు గొలుసును లక్ష్యంగా చేసుకుని 11న కరీంనగర్‌లో ఒక స్విఫ్ట్ డిజైర్ కారును అద్దెకు తీసుకుని మాటు వేశారు. నేదునూర్ నుండి తన మోటార్ సైకిల్‌పై ఆర్ఎంపీ వస్తుండగా, నిందితులు కారులో వెంబడించారు. నేదునూర్ శివారులోని మామిడి తోట వద్ద అతడిని అడ్డుకుని, కళ్ళలో కారం చల్లి భయభ్రాంతులకు గురిచేశారు. అనంతరం ఆయన మెడలోని తులం బంగారు గొలుసు, 1,000/-నగదు దోచుకుని పరారయ్యారు. దారి దోపిడీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు కరీంనగర్ రూరల్ ఏసిపి విజయ్ కుమార్ పర్యవేక్షణలో తిమ్మాపూర్ సిఐ సదన్ కుమార్ దర్యాప్తు చేపట్టి మైనర్ బాలుడితో పాటు అబినైజర్, నాగరాజు, రామ్ చరణ్ గౌడ్, ​గుజ్జేటి మధువర్ధన్ ను అరెస్టు చేశామని సిపి తెలిపారు. ముఠా సభ్యులు కోహెడ మండలంలో ఒక కరెంటు మోటారు దొంగతనం చేసినట్లు తెలిపారు. ​నేరానికి ఉపయోగించిన స్విఫ్ట్ డిజైర్ కారు, ​ఒక తులం బంగారు గొలుసు, ​4 మొబైల్ ఫోన్లు, 1,000/- నగదు స్వాధీనం చేసుకున్నట్లు సిపి చెప్పారు.
    3
    ​కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల పరిధిలో సంచలనం సృష్టించిన ఆర్‌ఎంపి వైద్యుడిపై దాడి చేసి కళ్ళలో కారం చల్లి  చైన్ స్నాచింగ్ పాల్పడిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నేరానికి పాల్పడిన మైనర్ బాలుడితో సహా ఐదుగురిని అరెస్ట్ చేశారు.
అరెస్టు అయిన వారిని కరీంనగర్ లో సిపి గౌస్ ఆలం సమక్షంలో మీడియాకు చూపించి వివరాలు వెల్లడించారు. ​గన్నేరువరం మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన తమ్మనవేని కొమురయ్య ఆర్‌ఎంపిగా పనిచేస్తున్నారు. అతనిపై ఈనెల 11న రాత్రి దారి దోపిడికి పాల్పడిన ముఠాను 24 గంటల్లో పోలీసులు అరెస్టు చేశారు. మైనర్ బాలుడితో పాటు గుండ్లపల్లికి చెందిన
​పెనుగొండ అబినైజర్,
​పంబాల నాగరాజు, నుస్తులాపూర్ కు చెందిన మాచర్ల రామ్ చరణ్ గౌడ్, పెద్దపల్లి జిల్లా బొట్లవనపర్తికి చెందిన ​గుజ్జేటి మధువర్ధన్ ఐదుగురు ముఠాగా ఏర్పడి జల్సాలకు అలవాటు పడ్డారు. గతంలో అద్దెకు తీసుకున్న ఎర్టిగా కారు డ్యామేజీకి సంబంధించి యజమానికి చెల్లించాల్సిన 40 వేల కోసం దొంగతనానికి పథకం వేశారు. ఒంటరిగా తిరిగే ఆర్ఎంపి కొమురయ్య మెడలోని బంగారు గొలుసును లక్ష్యంగా చేసుకుని 11న కరీంనగర్‌లో ఒక స్విఫ్ట్ డిజైర్ కారును అద్దెకు తీసుకుని మాటు వేశారు. నేదునూర్ నుండి తన మోటార్ సైకిల్‌పై ఆర్ఎంపీ వస్తుండగా, నిందితులు కారులో వెంబడించారు. నేదునూర్ శివారులోని మామిడి తోట వద్ద అతడిని అడ్డుకుని, కళ్ళలో కారం చల్లి భయభ్రాంతులకు గురిచేశారు. అనంతరం ఆయన మెడలోని తులం బంగారు గొలుసు, 1,000/-నగదు దోచుకుని పరారయ్యారు. దారి దోపిడీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు కరీంనగర్ రూరల్ ఏసిపి విజయ్ కుమార్ పర్యవేక్షణలో తిమ్మాపూర్ సిఐ సదన్ కుమార్ దర్యాప్తు చేపట్టి మైనర్ బాలుడితో పాటు అబినైజర్, నాగరాజు, రామ్ చరణ్ గౌడ్, ​గుజ్జేటి మధువర్ధన్ ను అరెస్టు చేశామని సిపి తెలిపారు. ముఠా సభ్యులు కోహెడ మండలంలో ఒక కరెంటు మోటారు దొంగతనం చేసినట్లు  తెలిపారు. ​నేరానికి ఉపయోగించిన స్విఫ్ట్ డిజైర్ కారు, ​ఒక తులం బంగారు గొలుసు, ​4 మొబైల్ ఫోన్లు, 1,000/- నగదు స్వాధీనం చేసుకున్నట్లు సిపి చెప్పారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    7 hrs ago
  • మెడికల్ రియంబర్స్ మెంటు బిల్లుల అవుట్ వర్డు రిజిస్టర్ పరిపాలన విభాగం లో లేదనిఎసిబిడిఎస్పిసుదర్శన్ తెలిపారు. డిజిపి ఆదేశాలమేరకు ఈరోజు తనిఖీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఆసుపత్రిలో 282ఫైల్ కు గాను సెక్షన్ సూపరింటెండెంట్ లతీఫోద్దిన్ ముజాయిద్దిన్ వద్ద 116 ఫైలు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. విచారణ నివేదిక పై అధికారులకు పంపిస్తామనితెలిపారు. మెడికల్ రియంబర్స్మెంట్ ఫణమదరఖాస్తుదారులతో సూపర్డెంట్ వారితో మాట్లాడి ఇవ్వడం జరిగిందని తెలిపారు.
    1
    మెడికల్ రియంబర్స్ మెంటు బిల్లుల అవుట్ వర్డు రిజిస్టర్ పరిపాలన విభాగం లో లేదనిఎసిబిడిఎస్పిసుదర్శన్ తెలిపారు. డిజిపి ఆదేశాలమేరకు ఈరోజు తనిఖీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఆసుపత్రిలో 282ఫైల్ కు గాను సెక్షన్ సూపరింటెండెంట్ లతీఫోద్దిన్ ముజాయిద్దిన్ వద్ద 116 ఫైలు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. విచారణ నివేదిక పై అధికారులకు పంపిస్తామనితెలిపారు. మెడికల్ రియంబర్స్మెంట్ ఫణమదరఖాస్తుదారులతో సూపర్డెంట్ వారితో మాట్లాడి ఇవ్వడం జరిగిందని తెలిపారు.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    హవేలీఘనాపూర్, మెదక్, తెలంగాణ•
    7 hrs ago
  • గ్యాస్ కొత్తగా ఉందని చాలామంది రెండు లేదా మూడు సిలిండర్లు బుక్ చేసుకుంటున్నారు అలా అక్కర్లేదు డొమెస్టిక్ సిలిండర్లకు ఎటువంటి కోరతలేదు మీరు ఎటువంటి చింత చేయనక్కర్లేదు ఎవరైనా ఇంతకుముందు లాగానే బుక్ చేసుకోవాలి అని జిల్లా కలెక్టర్ హైమావతి తెలిపారు
    1
    గ్యాస్ కొత్తగా ఉందని చాలామంది రెండు లేదా మూడు సిలిండర్లు బుక్ చేసుకుంటున్నారు అలా అక్కర్లేదు డొమెస్టిక్ సిలిండర్లకు ఎటువంటి కోరతలేదు మీరు ఎటువంటి చింత చేయనక్కర్లేదు ఎవరైనా ఇంతకుముందు లాగానే బుక్ చేసుకోవాలి అని జిల్లా కలెక్టర్ హైమావతి తెలిపారు
    user_Ashok Kumar Potta
    Ashok Kumar Potta
    Local News Reporter గజ్వేల్, సిద్దిపేట, తెలంగాణ•
    8 hrs ago
  • మెదక్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పాలన విభాగంలో శుక్రవారం ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. పలు ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతం ఆసుపత్రి రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, పూర్తి వివరాలను మధ్యాహ్నం తర్వాత వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. ఈ సోదాలతో జిల్లాలోని అన్ని శాఖల అధికారులు, సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
    1
    మెదక్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పాలన విభాగంలో శుక్రవారం ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. పలు ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతం ఆసుపత్రి రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, పూర్తి వివరాలను మధ్యాహ్నం తర్వాత వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. ఈ సోదాలతో జిల్లాలోని అన్ని శాఖల అధికారులు, సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
    user_MERCY
    MERCY
    Local News Reporter మెదక్, మెదక్, తెలంగాణ•
    12 hrs ago
  • అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. సిరిసిల్ల పట్టణం అశోక్ నగర్ లోని అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో పిల్లల హాజరు రిజిస్టర్ తనిఖీ చేసి, మొత్తం ఎందరు పిల్లలు ఉన్నారు? రోజూ ఎందరు వస్తున్నారో ఆరా తీశారు. పలువురు పిల్లల తల్లులతో మాట్లాడి.. గుడ్డు, పోషకాహారం ఇస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పిల్లల ఎత్తు, బరువు కొలిచిన వివరాలు, ఆన్లైన్ అలాగే రిజిస్టర్ నమోదు చేసిన వివరాలు పరిశీలించారు. కేంద్రంలో నిలువు ఉన్న గుడ్లు, బాలా అమృతం తనిఖీ చేశారు. పిల్లల ఎత్తు, బరువు కొలిచే యంత్రాల పనితీరు పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాలకు పిల్లలు రోజూ వచ్చేలా వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. పిల్లలు, గర్భిణులు, బాలింతలు అంగన్వాడీ కేంద్రాల సేవలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపు నిచ్చారు.
    1
    అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. సిరిసిల్ల పట్టణం అశోక్ నగర్ లోని అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో పిల్లల హాజరు రిజిస్టర్ తనిఖీ చేసి, మొత్తం ఎందరు పిల్లలు ఉన్నారు? రోజూ ఎందరు వస్తున్నారో ఆరా తీశారు. పలువురు పిల్లల తల్లులతో మాట్లాడి.. గుడ్డు, పోషకాహారం ఇస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పిల్లల ఎత్తు, బరువు కొలిచిన వివరాలు, ఆన్లైన్ అలాగే రిజిస్టర్ నమోదు చేసిన వివరాలు పరిశీలించారు. కేంద్రంలో నిలువు ఉన్న గుడ్లు, బాలా అమృతం తనిఖీ చేశారు. పిల్లల ఎత్తు, బరువు కొలిచే యంత్రాల పనితీరు పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాలకు పిల్లలు రోజూ వచ్చేలా వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. పిల్లలు, గర్భిణులు, బాలింతలు అంగన్వాడీ కేంద్రాల సేవలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపు నిచ్చారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    3 hrs ago
  • *కామారెడ్డిలో పారిశ్రామిక వాడ (ఇండస్ట్రియల్ కారిడార్) కేంద్ర భారీ పరిశ్రమలు & ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ గారిని దేశ రాజధాని ఢిల్లీలో కలిసిన కామారెడ్డి శాసన సభ్యులు శ్రీ కాటిపల్లి వెంకట రమణ రెడ్డి గారు* ఈ సందర్భంగా ఆయన ప్రకటన విడుదల చేశారు కామారెడ్డి జిల్లా కేంద్రంలో పారిశ్రామిక వాడ ఏర్పాటు చెయటమే కాకుండా జిల్లా కేంద్రంతో పాటు 7 మండలాలలో యువతకి, మహిళలకి ఉపాధి అవకాశాలు పెంచే విధంగా ప్రభుత్వ, పైవేటు రంగాలు సంఘటితంగా నూతన పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ గారికి విన్నవించినట్టు ఆయన తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయని, విద్యావంతులైన యువకులు, మహిళలకి కొదవ లేదని, వారిని భాగస్వామ్యం చేస్తూ పరిశ్రమలు నెలకొల్పితే ప్రస్తుతం ఆర్థికంగా నిలదొక్కుకోవడమే కాకుండా ఉత్పాదకత పెరిగి అభివృద్ధి చెందిన ప్రాంతంగా కామారెడ్డి ప్రాంతానికి మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విషయమై మంత్రిగారు మౌఖిక ఆదేశాలు జారీ చేసి *సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా సంస్థలు (MSME)* ఇతర విభాగాల వారితో సమగ్ర విచారణ చేపడతామని మంత్రి గారు సూచించినట్టు తెలిపారు.
    1
    *కామారెడ్డిలో పారిశ్రామిక వాడ (ఇండస్ట్రియల్ కారిడార్)  కేంద్ర భారీ పరిశ్రమలు & ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ గారిని దేశ రాజధాని ఢిల్లీలో కలిసిన కామారెడ్డి శాసన సభ్యులు శ్రీ కాటిపల్లి వెంకట రమణ రెడ్డి గారు*
ఈ సందర్భంగా ఆయన ప్రకటన విడుదల చేశారు
కామారెడ్డి జిల్లా కేంద్రంలో పారిశ్రామిక వాడ ఏర్పాటు చెయటమే కాకుండా జిల్లా కేంద్రంతో పాటు 7 మండలాలలో యువతకి, మహిళలకి ఉపాధి అవకాశాలు పెంచే విధంగా ప్రభుత్వ, పైవేటు రంగాలు సంఘటితంగా నూతన పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ గారికి విన్నవించినట్టు ఆయన తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయని, విద్యావంతులైన యువకులు, మహిళలకి కొదవ లేదని, వారిని భాగస్వామ్యం చేస్తూ పరిశ్రమలు నెలకొల్పితే ప్రస్తుతం ఆర్థికంగా నిలదొక్కుకోవడమే కాకుండా ఉత్పాదకత పెరిగి అభివృద్ధి చెందిన ప్రాంతంగా కామారెడ్డి ప్రాంతానికి మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విషయమై మంత్రిగారు మౌఖిక ఆదేశాలు జారీ చేసి *సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా సంస్థలు (MSME)* ఇతర విభాగాల వారితో సమగ్ర విచారణ చేపడతామని మంత్రి గారు సూచించినట్టు తెలిపారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    5 hrs ago
  • కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ గ్రామస్తులు రోడ్డెక్కారు. ముంపు గ్రామంగా ప్రకటించి పునరావాసం కల్పించాలని ఆందోళనకు దిగారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వెంటనే నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించి పునరావాసం కల్పిస్తామని చెప్పిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ప్రస్తుతం తమ గోడు పట్టించుకోవడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ వద్ద ధర్నా నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గతంలో 7 ట్రాక్టర్లలో కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం సమర్పించామని తెలిపారు. ఎన్నికల ముందు నెలకు ఒకసారి వచ్చిన ఎమ్మెల్యే ప్రస్తుతం పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ముంపు గ్రామంగా ప్రకటిస్తామని హనుమాన్ గుడి సాక్షిగా హామీ ఇచ్చారని రెండున్నర ఏళ్ళు కావస్తున్న ఇప్పటి వరకు పట్టించుకోవడం లేదని విమర్శించారు. మళ్ళీ వర్షాకాలం ఆరంభం అయితే ప్రతి ఇంటిలోకి నీరు చేరుతోందని, తక్షణమే ముంపు గ్రామంగా ప్రకటించి పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిచో ఆందోళన ఉధృతం చేసి నారాయణపూర్ రిజర్వాయర్ కట్టకు గండి పెడతామని హెచ్చరించారు.
    1
    కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ గ్రామస్తులు రోడ్డెక్కారు. ముంపు గ్రామంగా ప్రకటించి పునరావాసం కల్పించాలని ఆందోళనకు దిగారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వెంటనే నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించి పునరావాసం కల్పిస్తామని చెప్పిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ప్రస్తుతం తమ గోడు పట్టించుకోవడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ వద్ద ధర్నా నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గతంలో 7 ట్రాక్టర్లలో కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం సమర్పించామని తెలిపారు. ఎన్నికల ముందు నెలకు ఒకసారి వచ్చిన ఎమ్మెల్యే ప్రస్తుతం పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.  ముంపు గ్రామంగా ప్రకటిస్తామని హనుమాన్ గుడి సాక్షిగా హామీ ఇచ్చారని రెండున్నర ఏళ్ళు కావస్తున్న ఇప్పటి వరకు పట్టించుకోవడం లేదని విమర్శించారు. మళ్ళీ వర్షాకాలం ఆరంభం అయితే ప్రతి ఇంటిలోకి నీరు చేరుతోందని, తక్షణమే ముంపు గ్రామంగా ప్రకటించి పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిచో ఆందోళన ఉధృతం చేసి నారాయణపూర్ రిజర్వాయర్ కట్టకు గండి పెడతామని హెచ్చరించారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    14 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.