కామారెడ్డిలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయాలని కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి శ్రీనివాస్ వర్మ ను కలిసిన ఎమ్మెల్యే రమణారెడ్డి *కామారెడ్డిలో పారిశ్రామిక వాడ (ఇండస్ట్రియల్ కారిడార్) కేంద్ర భారీ పరిశ్రమలు & ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ గారిని దేశ రాజధాని ఢిల్లీలో కలిసిన కామారెడ్డి శాసన సభ్యులు శ్రీ కాటిపల్లి వెంకట రమణ రెడ్డి గారు* ఈ సందర్భంగా ఆయన ప్రకటన విడుదల చేశారు కామారెడ్డి జిల్లా కేంద్రంలో పారిశ్రామిక వాడ ఏర్పాటు చెయటమే కాకుండా జిల్లా కేంద్రంతో పాటు 7 మండలాలలో యువతకి, మహిళలకి ఉపాధి అవకాశాలు పెంచే విధంగా ప్రభుత్వ, పైవేటు రంగాలు సంఘటితంగా నూతన పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ గారికి విన్నవించినట్టు ఆయన తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయని, విద్యావంతులైన యువకులు, మహిళలకి కొదవ లేదని, వారిని భాగస్వామ్యం చేస్తూ పరిశ్రమలు నెలకొల్పితే ప్రస్తుతం ఆర్థికంగా నిలదొక్కుకోవడమే కాకుండా ఉత్పాదకత పెరిగి అభివృద్ధి చెందిన ప్రాంతంగా కామారెడ్డి ప్రాంతానికి మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విషయమై మంత్రిగారు మౌఖిక ఆదేశాలు జారీ చేసి *సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా సంస్థలు (MSME)* ఇతర విభాగాల వారితో సమగ్ర విచారణ చేపడతామని మంత్రి గారు సూచించినట్టు తెలిపారు.
కామారెడ్డిలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయాలని కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి శ్రీనివాస్ వర్మ ను కలిసిన ఎమ్మెల్యే రమణారెడ్డి *కామారెడ్డిలో పారిశ్రామిక వాడ (ఇండస్ట్రియల్ కారిడార్) కేంద్ర భారీ పరిశ్రమలు & ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ గారిని దేశ రాజధాని ఢిల్లీలో కలిసిన కామారెడ్డి శాసన సభ్యులు శ్రీ కాటిపల్లి వెంకట రమణ రెడ్డి గారు* ఈ సందర్భంగా ఆయన ప్రకటన విడుదల చేశారు కామారెడ్డి జిల్లా కేంద్రంలో పారిశ్రామిక వాడ ఏర్పాటు చెయటమే కాకుండా జిల్లా కేంద్రంతో పాటు 7 మండలాలలో యువతకి, మహిళలకి ఉపాధి అవకాశాలు పెంచే విధంగా ప్రభుత్వ, పైవేటు రంగాలు సంఘటితంగా నూతన పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ గారికి విన్నవించినట్టు ఆయన తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయని, విద్యావంతులైన యువకులు, మహిళలకి కొదవ లేదని, వారిని భాగస్వామ్యం చేస్తూ పరిశ్రమలు నెలకొల్పితే ప్రస్తుతం ఆర్థికంగా నిలదొక్కుకోవడమే కాకుండా ఉత్పాదకత పెరిగి అభివృద్ధి చెందిన ప్రాంతంగా కామారెడ్డి ప్రాంతానికి మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విషయమై మంత్రిగారు మౌఖిక ఆదేశాలు జారీ చేసి *సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా సంస్థలు (MSME)* ఇతర విభాగాల వారితో సమగ్ర విచారణ చేపడతామని మంత్రి గారు సూచించినట్టు తెలిపారు.
- పత్రిక ప్రకటన తేది:13.03.2026 కామారెడ్డి జిల్లా శుక్రవారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం అడ్లూర్–ఎల్లారెడ్డి గ్రామపంచాయతీ పరిధిలో గ్రామ అధికారుల ద్వారా అడ్లూర్ శివారులో నిర్వహిస్తున్న ప్లాస్టిక్ సేకరణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తనిఖీ చేసి తగు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా అధికారులు నేషనల్ హైవే పైన ఉన్న డాబా హోటళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. హైవే పైన ఉన్న అన్ని డాబా హోటళ్లకు పంచాయతీ కార్యదర్శులు (PSs) నోటీసులు జారీ చేసి, వారికి సంబంధిత లైసెన్సులు ఉన్నాయా లేదా, అలాగే నేషనల్ హైవే అధికారుల అనుమతి తీసుకున్నారా లేదా అనే విషయాలను పరిశీలించాలని ఆదేశించారు. కలెక్టర్ గారి అప్పీల్: ప్రయాణికులు , ప్రజలు నేషనల్ హైవే పైన ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాస్టిక్, ఫుడ్ వేస్టేజ్, పేపర్ వేస్టేజ్ వంటి చెత్తను వేయకుండా రోడ్లను పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ గవిజ్ఞప్తి చేశారు. ఈ దిశగా గ్రామపంచాయతీలు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా నేషనల్ హైవే పైన ఉన్న డాబా హోటళ్లను పంచాయతీ కార్యదర్శులు (PS), ఎంపీఓ (MPO), ఎంపీడీవో (MPDO)లు సంయుక్తంగా తనిఖీ చేసి, నేషనల్ హైవే అనుమతులు , గ్రామపంచాయతీ అనుమతులు ఉన్నాయా లేదా పరిశీలించాలని ఆదేశించారు. హోటళ్ల నుండి వచ్చే చెత్తను రోడ్డుపై వేస్తే సంబంధిత గ్రామపంచాయతీలు అధిక మొత్తంలో జరిమానాలు విధించాలని కలెక్టర్ ఆదేశించారు.1
- మెడికల్ రియంబర్స్ మెంటు బిల్లుల అవుట్ వర్డు రిజిస్టర్ పరిపాలన విభాగం లో లేదనిఎసిబిడిఎస్పిసుదర్శన్ తెలిపారు. డిజిపి ఆదేశాలమేరకు ఈరోజు తనిఖీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఆసుపత్రిలో 282ఫైల్ కు గాను సెక్షన్ సూపరింటెండెంట్ లతీఫోద్దిన్ ముజాయిద్దిన్ వద్ద 116 ఫైలు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. విచారణ నివేదిక పై అధికారులకు పంపిస్తామనితెలిపారు. మెడికల్ రియంబర్స్మెంట్ ఫణమదరఖాస్తుదారులతో సూపర్డెంట్ వారితో మాట్లాడి ఇవ్వడం జరిగిందని తెలిపారు.1
- మెదక్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పాలన విభాగంలో శుక్రవారం ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. పలు ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతం ఆసుపత్రి రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, పూర్తి వివరాలను మధ్యాహ్నం తర్వాత వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. ఈ సోదాలతో జిల్లాలోని అన్ని శాఖల అధికారులు, సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.1
- గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు అందరికీ వినతిపత్రాలు అందించే కార్యక్రమం లో భాగంగా సిరిసిల్ల నియోజకవర్గం ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంపు కార్యాలయంలో వినతిపత్రం అందించడం జరిగింది.గ్రామపంచాయతీ కార్మికులందరికీ 26,000 వేతనం అందించాలి మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలి పెండింగ్ జీతాలు అందించాలి రెండో పి ఆర్ సి గ్రామపంచాయతీ కార్మికులకు వర్తింపచేయాలి అని ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంప్ ఆఫీస్ వద్ద ధర్నా చేసి వినతి అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మూషం రమేష్ జిల్లా ఉపాధ్యక్షులు యూనియన్ జిల్లా అధ్యక్షులు బూర శ్రీనివాస్ గౌడ్. కార్యదర్శి మల్యాల నరసయ్య సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి జిల్లా నాయకులు. ఎలిగేటి రాజశేఖర్ మండల నాయకులు. గూడెం శ్రీనివాస్. రవి మల్లయ్య బిక్షపతి. గంభీరావుపేట మండల అధ్యక్షుడు అంజయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు1
- ప్రభుత్వం జిల్లాకు అవసరమైన వంట గ్యాస్ సరఫరా చేస్తుందని ప్రజలెవరు వంటగ్యాస్ కొరకు ఆందోళన చెందరాదని జిల్లా కలెక్టర్ కే. హైమవతి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కే. హైమావతి జిల్లా ప్రజల ఉద్దేశించిమాట్లాడుతూ మన జిల్లాలో 03 లక్షల 32 వేల 850 డొమెస్టిక్ వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని, దాదాపు 1500 కమర్షియల్ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని గతంలో ప్రభుత్వం సరఫరా చేసిన విధంగానే ఇప్పుడు కూడా మన జిల్లాకు అవసరమైన వంట గ్యాస్ ను ప్రభుత్వం ఎలాంటి ఇబ్బంది లేకుండా సరఫరా చేస్తుందని అన్నారు. ఎప్పటిలాగే మన జిల్లా ప్రజలకు అవసరమైన స్థాయిలో వంట గ్యాస్ సరఫరా చేస్తున్నందున ప్రజలు అనవసర భయాందోళనలకు గురై ఎక్కువ సిలిండర్ లను బుక్ చేసుకోరాదని అన్నారు. ఎక్కువ సిలిండర్లను బుక్ చేసుకోవడం వలననే ఇబ్బందులు తలెత్తుతాయి కాబట్టి ప్రజలు వంటగ్యాస్ విషయంలో ఎలాంటి ఆందోళన చెందరాదని సూచించారు. అదేవిధంగా కమర్షియల్ వంట గ్యాస్ ను కూడా సరఫరా చేస్తామని తెలిపారు.1
- మెదక్ జిల్లా Shivampet Mandal లోని అల్లీపూర్, లింగోజీగూడ, కొత్తపేట్, పిల్లుట్ల, పాలు గ్రామాల్లో వార్డు సభ్యుల శిక్షణ తరగతులు నిర్వహించబడ్డాయి. ఈ శిక్షణలో వార్డు సభ్యులకు పంచాయతీ విధులు, గ్రామ అభివృద్ధి, ప్రభుత్వ పథకాల అమలు గురించి అవగాహన కల్పించబడింది. మండల అధికారులు, పంచాయతీ సెక్రటరీలు ఈ కార్యక్రమంలో పాల్గొని వార్డు సభ్యులతో సమన్వయం కోసం సూచనలు చేశారు.1
- గ్యాస్ కొత్తగా ఉందని చాలామంది రెండు లేదా మూడు సిలిండర్లు బుక్ చేసుకుంటున్నారు అలా అక్కర్లేదు డొమెస్టిక్ సిలిండర్లకు ఎటువంటి కోరతలేదు మీరు ఎటువంటి చింత చేయనక్కర్లేదు ఎవరైనా ఇంతకుముందు లాగానే బుక్ చేసుకోవాలి అని జిల్లా కలెక్టర్ హైమావతి తెలిపారు1
- పత్రిక ప్రకటన తేది:13.03.2026 కామారెడ్డి జిల్లా శుక్రవారం ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అమలు చేస్తున్న 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా పంచాయితీ, మున్సిపాలిటీ పరిధిలో నిర్వహిస్తున్న పరిశుభ్రత కార్యక్రమం లో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని టెక్రియాల్ చెరువు వద్ద నిర్వహిస్తున్న శానిటేషన్ ను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పరిశీలించారు. అనంతరం సదాశివ నగర్ – క్రుప్రియల్ హైవే ఇరుపక్కల జరుగుతున్న శానిటేషన్ పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పరిసర ప్రాంతాలను పరిశీలిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు పంచాయతీ, మున్సిపల్ సిబ్బంది సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. టెక్రియాల్ చెరువులో గణేష్, దుర్గాదేవి నిమజ్జనం జరిగిన ప్రదేశాలలో చెరువు పరిసర ప్రాంతాల్లో శుభ్రతను కాపాడేందుకు సంబంధిత శాఖల అధికారులు చెరువు వద్ద పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించి, శానిటేషన్ పనులు పూర్తి చేసి, ఈరోజు సాయంత్రం లోపు ఆ ప్రాంతాన్ని సమతలంగా (లెవెల్) చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజల ఆరోగ్యం , పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా చెరువు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా చూడాలని ప్రజాప్రతినిధులు పరిశుభ్రత కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అధికారులకు సూచించారు.1