Shuru
Apke Nagar Ki App…
శివంపేట్‌లో వార్డు సభ్యుల శిక్షణ చివరి రోజుపంచాయతీ విధులపై అవగాహన కార్యక్రమం మెదక్ జిల్లా Shivampet Mandal లోని అల్లీపూర్, లింగోజీగూడ, కొత్తపేట్, పిల్లుట్ల, పాలు గ్రామాల్లో వార్డు సభ్యుల శిక్షణ తరగతులు నిర్వహించబడ్డాయి. ఈ శిక్షణలో వార్డు సభ్యులకు పంచాయతీ విధులు, గ్రామ అభివృద్ధి, ప్రభుత్వ పథకాల అమలు గురించి అవగాహన కల్పించబడింది. మండల అధికారులు, పంచాయతీ సెక్రటరీలు ఈ కార్యక్రమంలో పాల్గొని వార్డు సభ్యులతో సమన్వయం కోసం సూచనలు చేశారు.
ASHOK VENGANI
శివంపేట్‌లో వార్డు సభ్యుల శిక్షణ చివరి రోజుపంచాయతీ విధులపై అవగాహన కార్యక్రమం మెదక్ జిల్లా Shivampet Mandal లోని అల్లీపూర్, లింగోజీగూడ, కొత్తపేట్, పిల్లుట్ల, పాలు గ్రామాల్లో వార్డు సభ్యుల శిక్షణ తరగతులు నిర్వహించబడ్డాయి. ఈ శిక్షణలో వార్డు సభ్యులకు పంచాయతీ విధులు, గ్రామ అభివృద్ధి, ప్రభుత్వ పథకాల అమలు గురించి అవగాహన కల్పించబడింది. మండల అధికారులు, పంచాయతీ సెక్రటరీలు ఈ కార్యక్రమంలో పాల్గొని వార్డు సభ్యులతో సమన్వయం కోసం సూచనలు చేశారు.
More news from తెలంగాణ and nearby areas
- విద్యార్థులు తమలోని భయాన్ని పూర్తిగా విడనాడి పట్టుదల, క్రమశిక్షణతో చదివిపదవ తరగతి ఫలితాలలో మెదక్ జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపి, రాష్ట్రంలో మంచి పేరు తేవాలని జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ విద్యార్థులకు పలు సూచనలు చేస్తూ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు .పదవ తరగతి పరీక్షలు నిమిత్తం విద్యాశాఖ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ నెంబర్. 9848214166. ఏర్పాటుపదవ తరగతి పరీక్షలు విద్యార్థులు మరియు అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు.మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ జిల్లా లో పదవ తరగతి పరీక్షలు ఈ నెల 14.03.2026 నుండి 16.04.2026 వ తేది వరకు నిర్వహణ మొత్తం 68 రెగ్యులర్ సెంటర్ లలో జరగనున్నాయి. మొత్తం 11247 మరియు 100 ప్రైవేట్ అభ్యర్థులు ఈ పరీక్షలకుహాజరవుతున్నారని చెప్పారు. ఈ క్రింది సూచనలను పాటించాల్సిందిగా కోరటమైనది.: ఉదయం 09.30 నుండి 12.30/12.50 PM వరకు జరుగుతుంది,విద్యార్థులు వారికీ కేటాయించిన పరీక్షా కేంద్రమును ఒక రోజు ముందుగా సందర్శించి పరీక్షా ప్రారంభపు తేది రోజు పరీక్షా కేంద్రం చేరుకొనుటకు గల అవాంతరాలను/ ఆలస్యాన్ని నివారించడానికి ఈ చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. విద్యార్థులకు జారీ చేయబడిన పరీక్షా హాల్ టికెట్ నందు గానీ, OMR షీట్ నందు గానీ ఏవైన ప్రింటింగ్ పొరపాట్లు ఉంటె సంబందిత ఆధార ప్రతులతో ఇన్విజిలేటర్ లేదా చీఫ్ సూపరింటెండెంట్ గారి దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. పరీక్షా కేంద్రంలోని పరీక్షా నిర్వహణ సిబ్బందికి సూచనలు.పరీక్షా కేంద్రం నకు కేటాయించబడిన సిబ్బంది అందరు గుర్తింపు కార్డ్లను ధరించవలెను. పరీక్షా కేంద్రంలో పరీక్షా నిర్వహణకు కేటాయించబడిన సిబ్బంది తప్ప ఇతరులకు ప్రవేశం నిషేధించబడిందని చెప్పారు. పరీక్షా కేంద్రంలోని ముఖ్య పరీక్షా పర్యవేక్షకుని అనుమతిలేనిదే ఎవ్వరు పరీక్షా కేంద్రంలోకి ప్రవేశం ఉండదని వెల్లడించారు. పరీక్షా కేంద్రంనకు చుట్టుపక్కల 100 మీటర్ల వరకు 163 B.N.S.S సెక్షన్ అమలులో ఉన్నందున జనం సమూహాలుగా గుమిగూడి ఉండుట నిషేధంఅని చెప్పారు.ఆయా పరీక్షా తేదిలలో ఉదయం 8.00 నుండి సాయంత్రంశ 01.00 గంటల వరకు జీరాక్స్ సెంటర్లు మూసి వుంచవలెను. పరీక్షా కేంద్రం లోకి చీఫ్ సూపరింటెండెంట్, డిపార్టుమెంటు ఆఫీసర్, ఇన్విజిలేటర్, మెడికల్ సిబ్బంది, అటెండర్, వాటర్ బాయ్స్, అభ్యర్థులు మరియు ఇతర పరీక్షా నిర్వహణ సిబ్బంది ఎవ్వరు కూడా సెల్ ఫోన్స్, పేజర్లు & క్యాలక్యులేటర్ మరియు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకొని రావడం నిషేధం. అని తెలిపారు. కేంద్రంలో గుర్తించినట్లయితే సంబందికులపై ప్రభుత్వ పరిక్షల మాల్ ప్రాక్టీసు నిరోధక చట్టం 25/1997 ప్రకారం క్రమ శిక్షణ చర్యలు చేపట్టబడును. అని అన్నారు. ప్రతి పరీక్షా కేంద్రం నందు ఏదైనా అత్యవసర సమాచారం తెలియజేయుటకు ఆయా పరీక్షా కేంద్రములకు ఆయా తేదిలలో విధులు కేటాయించబడిన పోలీస్ సిబ్బంది యొక్క ఫోన్ ను మాత్రమే వినియోగించవలెను. వివరించారు. ఇట్టి వినియోగానికి కూడా' కాల్ రిజిస్టర్ నిర్వహించి ఇన్కమింగ్ మరియు ఔట్గోయింగ్ కాల్స్ ను విధిగా రిజిస్టర్ ఇంతకముందే సరఫరా చేయబడిన పరిక్షల నిర్వహణ-శిక్షణా-కరదీపికలోని సూచనలను పాటిస్తూ సజావుగా పరిక్షల సహకరించవలసినదిగా కోరారు.1
- పరిశ్రమలు, సర్వీస్ సెక్టార్ డెవలప్ అయితేనే తలసరి ఆదాయం పెరుగుతుంది.1
- కామారెడ్డి: 'దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాలి' ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం |కల్పించాలని రాష్ట్ర దివ్యాంగుల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు బైండ్ల భూపతి కోరారు. గురువారం కామారెడ్డిలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం బస్సుల్లో కేవలం 50 శాతం రాయితీ మాత్రమే ఉందని, దానిని పూర్తిగా ఎత్తివేసి ఉచితంగా ప్రయాణించే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం సమర్పించినట్లు ఆయన తెలిపారు.1
- Post by ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్1
- కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ గ్రామస్తులు రోడ్డెక్కారు. ముంపు గ్రామంగా ప్రకటించి పునరావాసం కల్పించాలని ఆందోళనకు దిగారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వెంటనే నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించి పునరావాసం కల్పిస్తామని చెప్పిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ప్రస్తుతం తమ గోడు పట్టించుకోవడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ వద్ద ధర్నా నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గతంలో 7 ట్రాక్టర్లలో కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం సమర్పించామని తెలిపారు. ఎన్నికల ముందు నెలకు ఒకసారి వచ్చిన ఎమ్మెల్యే ప్రస్తుతం పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ముంపు గ్రామంగా ప్రకటిస్తామని హనుమాన్ గుడి సాక్షిగా హామీ ఇచ్చారని రెండున్నర ఏళ్ళు కావస్తున్న ఇప్పటి వరకు పట్టించుకోవడం లేదని విమర్శించారు. మళ్ళీ వర్షాకాలం ఆరంభం అయితే ప్రతి ఇంటిలోకి నీరు చేరుతోందని, తక్షణమే ముంపు గ్రామంగా ప్రకటించి పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిచో ఆందోళన ఉధృతం చేసి నారాయణపూర్ రిజర్వాయర్ కట్టకు గండి పెడతామని హెచ్చరించారు.1
- *నల్లగొండ జిల్లా :-* • మునుగోడు మండలం కల్వలపల్లి గ్రామంలో భూగర్భ జలాలు అడుగంటి ఎండిపోతున్న వరి పంటలను పరిశీలించిన ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం. • భూగర్భ జలాలు అడుగంటంతో ట్యాంకర్ల ద్వారా రైతులు ఇతర ప్రాంతాల నుండి నీటిని తరలించి తమ పంటను కాపాడే ప్రయత్నం చేస్తున్నా రైతులు *ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కామెంట్స్ :-* • అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే రైతుల పంటలు ఎండిపోతున్నాయి. • బ్రాహ్మణ వెళ్ళాముల చెరువు నీళ్లను సద్వినియోగం చేయడంలో అధికారులు విఫలమయ్యారు. • ఉదయ సముద్రం బ్రాహ్మణ వెళ్ళాముల ప్రాజెక్టు నుండి కిష్టాపురం వరకు కాల్వ పొడగించి మునుగోడు మండల గ్రామాల చెరువులను నింపాలి • నల్లగొండ నకిరేకల్ నియోజకవర్గనికి కొలమానం లేకుండా నీరు తరలించడం అన్యాయం. • పంటలు ఎండిన రైతు ఎకరాకి 40 వేల నష్టపరిహారం ఇవ్వాలి. • ఆరుగాలం శ్రమించి సాగుచేసిన పంటలు కండ్ల ముందే ఎండిపోయే బాధ నేను స్వయాన అనుభవించిన. • మునుగోడు మండలంలోని కలువల పల్లి,పులిపలుపుల చెరువులకు నీరిచ్చే అవకాశం ఉన్న అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారు. • బోరు బావుల పై ఆధారపడి వ్యవసాయం చేసే ఎంతోమంది రైతులు నష్టపోతున్నారు.1
- ప్రజా ప్రతినిధులు , అధికారులు సమన్వయంతో పని చేసి గ్రామ అభివృద్ధి చేయాలి ఎమ్మెల్యే రోహిత్ రావు ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయంతో పని చేసి ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలని ఎమ్మెల్యేమైనంపల్లి రోహిత్ రావు అన్నారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రజా పాలనా ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ చైర్మన్లకు, కౌన్సిలర్లకు, సర్పంచులకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కార్యక్రమాన్నికి ముఖ్య అతిథిగా పాల్గోని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్,మెదక్ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక నోడల్ అధికారి శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ నగేష్ లుజ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంబించారు. అనంతరంతెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే.. తో ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. పట్టణ ,గ్రామస్థాయిలో ప్రజా ప్రతినిధులు అధికారుల సమన్వయంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు చేరాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఒక బృహత్కర కార్యక్రమం ఇది అని అన్నారు. గ్రామ సర్పంచులు గ్రామం నాది అనే స్వభావాన్ని కలిగి ఉండాలన్నారు. 99 రోజుల్లో అనేక కార్యక్రమాల చేపడుతునట్లు చెప్పారు. సుబిక్షమైన పట్టణ ,పల్లెల కోసం నిరంతరం కృషి చేయాలన్నారు. శాసన సభ్యులు మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ..ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల అబివృద్ధి , ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం నిరతరం శ్రమిస్తున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు, జీరో విద్యుత్,సన్నబియ్యం,మెడికల్ కాలేజీ,యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం లాంటి అనేక పథకాలు చేపట్టామన్నారు.అధికారులు ప్రజా ప్రతినిధులు ప్రజల సమస్యలను తీర్చి, పథకాలు ముందుకు తీసుకెళ్లాలన్నారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. శాంతి భద్రతను కాపాడాలని,రోడ్డు ప్రమాదాల.వల్ల రోజు రోజుకు మరణాల సంఖ్య పెరుగుతుందని, ట్రాఫిక్ నిబంధనలు పాటించి,డ్రగ్స్,సైబర్ క్రైమ్ పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. నోడల్ అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. పట్టణ,గ్రామీణ ప్రజా ప్రతినిధుల పదవి చిన్నదైన బాధ్యత పెద్దదన్నారు.పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా అవసరాలను తీర్చాలన్నారు. అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ..పట్టణ,గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి పథంలో నడవాలంటే ప్రజా ప్రతినిధులు అధికారులు ప్రజల సమస్యలను గుర్తించి, పరిష్కారం చూపించాలన్నారు . అంతకు ముందు సమాచార పౌర సంబంధాల శాఖ మెదక్ జిల్లా వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాల ఫోటోల ఎగ్జిబిషన్ ను అదనపు కలెక్టర్ నగేష్,జిల్లా అధికారులతో కలసి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తిలకించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ ఎల్లయ్య, ఆర్డీవో రమాదేవి, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు. #comment #follow #subscribe #news #like1
- ఫార్మా, ఐటి లాగే ఫిల్మ్ ఇండస్ట్రీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం1
- కామారెడ్డి: 'కిడ్నీ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి' కిడ్నీ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కామారెడ్డి అడిషనల్ వైద్యాధికారి వెంకటేశ్వర్లు. గురువారం ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని పురస్కరించుకొని కిడ్నీ పనితీరుపై ప్రభుత్వ ఆసుపత్రిలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కిడ్నీ పనితీరును ఆయన వివరించారు. కార్యక్రమంలో డయాలసిస్ సెంటర్ మేనేజర్ శ్రీనివాస్, వైద్య సిబ్బంది ఉన్నారు.1