అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి గ్రామాభివృద్ధి చేయాలి మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు ప్రజా ప్రతినిధులు , అధికారులు సమన్వయంతో పని చేసి గ్రామ అభివృద్ధి చేయాలి ఎమ్మెల్యే రోహిత్ రావు ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయంతో పని చేసి ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలని ఎమ్మెల్యేమైనంపల్లి రోహిత్ రావు అన్నారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రజా పాలనా ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ చైర్మన్లకు, కౌన్సిలర్లకు, సర్పంచులకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కార్యక్రమాన్నికి ముఖ్య అతిథిగా పాల్గోని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్,మెదక్ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక నోడల్ అధికారి శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ నగేష్ లుజ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంబించారు. అనంతరంతెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే.. తో ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. పట్టణ ,గ్రామస్థాయిలో ప్రజా ప్రతినిధులు అధికారుల సమన్వయంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు చేరాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఒక బృహత్కర కార్యక్రమం ఇది అని అన్నారు. గ్రామ సర్పంచులు గ్రామం నాది అనే స్వభావాన్ని కలిగి ఉండాలన్నారు. 99 రోజుల్లో అనేక కార్యక్రమాల చేపడుతునట్లు చెప్పారు. సుబిక్షమైన పట్టణ ,పల్లెల కోసం నిరంతరం కృషి చేయాలన్నారు. శాసన సభ్యులు మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ..ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల అబివృద్ధి , ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం నిరతరం శ్రమిస్తున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు, జీరో విద్యుత్,సన్నబియ్యం,మెడికల్ కాలేజీ,యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం లాంటి అనేక పథకాలు చేపట్టామన్నారు.అధికారులు ప్రజా ప్రతినిధులు ప్రజల సమస్యలను తీర్చి, పథకాలు ముందుకు తీసుకెళ్లాలన్నారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. శాంతి భద్రతను కాపాడాలని,రోడ్డు ప్రమాదాల.వల్ల రోజు రోజుకు మరణాల సంఖ్య పెరుగుతుందని, ట్రాఫిక్ నిబంధనలు పాటించి,డ్రగ్స్,సైబర్ క్రైమ్ పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. నోడల్ అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. పట్టణ,గ్రామీణ ప్రజా ప్రతినిధుల పదవి చిన్నదైన బాధ్యత పెద్దదన్నారు.పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా అవసరాలను తీర్చాలన్నారు. అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ..పట్టణ,గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి పథంలో నడవాలంటే ప్రజా ప్రతినిధులు అధికారులు ప్రజల సమస్యలను గుర్తించి, పరిష్కారం చూపించాలన్నారు . అంతకు ముందు సమాచార పౌర సంబంధాల శాఖ మెదక్ జిల్లా వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాల ఫోటోల ఎగ్జిబిషన్ ను అదనపు కలెక్టర్ నగేష్,జిల్లా అధికారులతో కలసి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తిలకించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ ఎల్లయ్య, ఆర్డీవో రమాదేవి, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు. #comment #follow #subscribe #news #like

- మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మన *రామయంపేట మున్సిపాలిటీ 5వ వార్డు కౌన్సిలర్ చౌదరి చరిత గారు* యోగ ద్వారా ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో వాటి గురించి వివరిస్తూ స్పీచ్ ఇవ్వడం జరిగింది.1
- మెదక్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పాలన విభాగంలో శుక్రవారం ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. పలు ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతం ఆసుపత్రి రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, పూర్తి వివరాలను మధ్యాహ్నం తర్వాత వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. ఈ సోదాలతో జిల్లాలోని అన్ని శాఖల అధికారులు, సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.1
- మెదక్ జిల్లా Shivampet Mandal లోని అల్లీపూర్, లింగోజీగూడ, కొత్తపేట్, పిల్లుట్ల, పాలు గ్రామాల్లో వార్డు సభ్యుల శిక్షణ తరగతులు నిర్వహించబడ్డాయి. ఈ శిక్షణలో వార్డు సభ్యులకు పంచాయతీ విధులు, గ్రామ అభివృద్ధి, ప్రభుత్వ పథకాల అమలు గురించి అవగాహన కల్పించబడింది. మండల అధికారులు, పంచాయతీ సెక్రటరీలు ఈ కార్యక్రమంలో పాల్గొని వార్డు సభ్యులతో సమన్వయం కోసం సూచనలు చేశారు.1
- కామారెడ్డి: 'దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాలి' ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం |కల్పించాలని రాష్ట్ర దివ్యాంగుల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు బైండ్ల భూపతి కోరారు. గురువారం కామారెడ్డిలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం బస్సుల్లో కేవలం 50 శాతం రాయితీ మాత్రమే ఉందని, దానిని పూర్తిగా ఎత్తివేసి ఉచితంగా ప్రయాణించే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం సమర్పించినట్లు ఆయన తెలిపారు.1
- సదాశివపేట మండలంలోని వెంకటపూర్ లో ఈరోజు ఉదయం తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో అక్షర(5)తులసిదాస్(55), కిట్టయ్య(58), సుధాకర్ పరమేశ్వరి (15) సహా 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న సదాశివపేట 108 సిబ్బంది EMT రఘురాం, పైలెట్ శ్రీనివాస్ లు వెంటనే స్పందించి సంఘటన స్థలానికి చేరుకొని బాధితులకు ప్రథమ చికిత్స అందిస్తూ సామాజిక ఆరోగ్య కేంద్రం సదాశివపేటకి తరలించారు. ప్రస్తుతం బాధితుల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు.2
- సంగారెడ్డి జిల్లాలో ఇన్స్పైర్ మనక్ కార్యక్రమానికి 104 మంది విద్యార్థులు ఎంపిక: మీడియాతో వివరాలు తెలిపిన జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డి1
- కుషాయిగూడ డివిజన్ నాగార్జున నగర్ కాలనీలోని సాయి సింధు ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాసుల సతీష్ గౌడ్, కాసుల పోషయ్య గౌడ్ ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి చర్లపల్లి మాజీ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పెన్నులు, పెన్సిళ్లు, ప్యాడ్లు తదితర పరీక్ష సామాగ్రిని అందజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షల సమయంలో ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు. క్రమశిక్షణతో చదివి మంచి ఫలితాలు సాధించి తల్లిదండ్రులు, గురువులు మరియు పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలను పెట్టుకుని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ప్రోత్సహించారు.కార్యక్రమ నిర్వాహకులు కాసుల సతీష్ గౌడ్ మాట్లాడుతూ తాను మొదటి తరగతి నుండి పదో తరగతి వరకు ఇదే పాఠశాలలో చదువుకున్నానని తెలిపారు. తాను చదివిన పాఠశాల విద్యార్థులకు తన వంతు సహాయం చేయడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, శ్రీనివాస్ రెడ్డి, యాదగిరి, భాను, శివ, శ్రీకాంత్, ప్రవీణ్, సాయి చరణ్ తదితరులు, స్థానిక నాయకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.3
- మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసన్ పల్లి గ్రామంలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రం ఏడుపాయల వన దుర్గాభవాని దేవస్థానం లో లడ్డు, పులిహోర తయారీ కేంద్రంలో గ్యాస్ కొరత ఏర్పడింది. ఈ సందర్భంగా దేవాలయ ఈవో వీరేశం మాట్లాడుతూ దేశాల మధ్య యుద్ధం తో గ్యాస్ రవాణా నిలిచిపోవడం వల్ల గ్యాస్ కొరత ఏర్పడిందని అన్నారు. దేవస్థానం లడ్డు, పులిహోర తయారీ కోసం గ్యాస్ కొరత ఏర్పడిందని దీంతో కట్టెల పొయ్యి సహాయం తో తయారీ చేస్తున్నట్లు తెలిపారు. దేవాదాయ శాఖ దేవాలయాల కోసం గ్యాస్ ను ఏర్పాటు చేసి గ్యాస్ కొరత లేకుండా చూడాలని ఆయన కోరారు.1