logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

వెంకటాపూర్ గ్రామస్తులపై తేనెటీగల దాడి పలువురి పరిస్థితి విషమం...! సదాశివపేట మండలంలోని వెంకటపూర్ లో ఈరోజు ఉదయం తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో అక్షర(5)తులసిదాస్(55), కిట్టయ్య(58), సుధాకర్ పరమేశ్వరి (15) సహా 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న సదాశివపేట 108 సిబ్బంది EMT రఘురాం, పైలెట్ శ్రీనివాస్ లు వెంటనే స్పందించి సంఘటన స్థలానికి చేరుకొని బాధితులకు ప్రథమ చికిత్స అందిస్తూ సామాజిక ఆరోగ్య కేంద్రం సదాశివపేటకి తరలించారు. ప్రస్తుతం బాధితుల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు.

6 hrs ago
user_SRIRAMULA KIRANKUMAR
SRIRAMULA KIRANKUMAR
Public Health Department Kandi, Sangareddy•
6 hrs ago

వెంకటాపూర్ గ్రామస్తులపై తేనెటీగల దాడి పలువురి పరిస్థితి విషమం...! సదాశివపేట మండలంలోని వెంకటపూర్ లో ఈరోజు ఉదయం తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో అక్షర(5)తులసిదాస్(55), కిట్టయ్య(58), సుధాకర్ పరమేశ్వరి (15) సహా 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న సదాశివపేట 108 సిబ్బంది EMT రఘురాం, పైలెట్ శ్రీనివాస్ లు వెంటనే స్పందించి సంఘటన స్థలానికి చేరుకొని బాధితులకు ప్రథమ చికిత్స అందిస్తూ సామాజిక ఆరోగ్య కేంద్రం సదాశివపేటకి తరలించారు. ప్రస్తుతం బాధితుల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు.

More news from Sangareddy and nearby areas
  • సదాశివపేట మండలంలోని వెంకటపూర్ లో ఈరోజు ఉదయం తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో అక్షర(5)తులసిదాస్(55), కిట్టయ్య(58), సుధాకర్ పరమేశ్వరి (15) సహా 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న సదాశివపేట 108 సిబ్బంది EMT రఘురాం, పైలెట్ శ్రీనివాస్ లు వెంటనే స్పందించి సంఘటన స్థలానికి చేరుకొని బాధితులకు ప్రథమ చికిత్స అందిస్తూ సామాజిక ఆరోగ్య కేంద్రం సదాశివపేటకి తరలించారు. ప్రస్తుతం బాధితుల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు.
    2
    సదాశివపేట మండలంలోని వెంకటపూర్ లో ఈరోజు ఉదయం తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో అక్షర(5)తులసిదాస్(55), కిట్టయ్య(58), సుధాకర్ పరమేశ్వరి (15) సహా 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న సదాశివపేట 108 సిబ్బంది EMT రఘురాం, పైలెట్ శ్రీనివాస్ లు వెంటనే స్పందించి సంఘటన స్థలానికి చేరుకొని బాధితులకు ప్రథమ చికిత్స అందిస్తూ సామాజిక ఆరోగ్య కేంద్రం సదాశివపేటకి తరలించారు. ప్రస్తుతం బాధితుల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు.
    user_SRIRAMULA KIRANKUMAR
    SRIRAMULA KIRANKUMAR
    Public Health Department Kandi, Sangareddy•
    6 hrs ago
  • సంగారెడ్డి జిల్లాలో ఇన్స్పైర్ మనక్ కార్యక్రమానికి 104 మంది విద్యార్థులు ఎంపిక: మీడియాతో వివరాలు తెలిపిన జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డి
    1
    సంగారెడ్డి జిల్లాలో ఇన్స్పైర్ మనక్ కార్యక్రమానికి 104 మంది విద్యార్థులు ఎంపిక: మీడియాతో వివరాలు తెలిపిన జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డి
    user_Sangareddy News
    Sangareddy News
    జర్నలిస్ట్ రామచంద్రాపురం, సంగారెడ్డి, తెలంగాణ•
    19 hrs ago
  • మెదక్ జిల్లా Shivampet Mandal లోని అల్లీపూర్, లింగోజీగూడ, కొత్తపేట్, పిల్లుట్ల, పాలు గ్రామాల్లో వార్డు సభ్యుల శిక్షణ తరగతులు నిర్వహించబడ్డాయి. ఈ శిక్షణలో వార్డు సభ్యులకు పంచాయతీ విధులు, గ్రామ అభివృద్ధి, ప్రభుత్వ పథకాల అమలు గురించి అవగాహన కల్పించబడింది. మండల అధికారులు, పంచాయతీ సెక్రటరీలు ఈ కార్యక్రమంలో పాల్గొని వార్డు సభ్యులతో సమన్వయం కోసం సూచనలు చేశారు.
    1
    మెదక్ జిల్లా Shivampet Mandal లోని అల్లీపూర్, లింగోజీగూడ, కొత్తపేట్, పిల్లుట్ల, పాలు గ్రామాల్లో వార్డు సభ్యుల శిక్షణ తరగతులు నిర్వహించబడ్డాయి. ఈ శిక్షణలో వార్డు సభ్యులకు పంచాయతీ విధులు, గ్రామ అభివృద్ధి, ప్రభుత్వ పథకాల అమలు గురించి అవగాహన కల్పించబడింది. మండల అధికారులు, పంచాయతీ సెక్రటరీలు ఈ కార్యక్రమంలో పాల్గొని వార్డు సభ్యులతో సమన్వయం కోసం సూచనలు చేశారు.
    user_ASHOK VENGANI
    ASHOK VENGANI
    Court reporter శివంపేట, మెదక్, తెలంగాణ•
    4 hrs ago
  • కుషాయిగూడ డివిజన్ నాగార్జున నగర్ కాలనీలోని సాయి సింధు ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాసుల సతీష్ గౌడ్, కాసుల పోషయ్య గౌడ్ ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి చర్లపల్లి మాజీ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పెన్నులు, పెన్సిళ్లు, ప్యాడ్లు తదితర పరీక్ష సామాగ్రిని అందజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షల సమయంలో ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు. క్రమశిక్షణతో చదివి మంచి ఫలితాలు సాధించి తల్లిదండ్రులు, గురువులు మరియు పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలను పెట్టుకుని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ప్రోత్సహించారు.కార్యక్రమ నిర్వాహకులు కాసుల సతీష్ గౌడ్ మాట్లాడుతూ తాను మొదటి తరగతి నుండి పదో తరగతి వరకు ఇదే పాఠశాలలో చదువుకున్నానని తెలిపారు. తాను చదివిన పాఠశాల విద్యార్థులకు తన వంతు సహాయం చేయడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, శ్రీనివాస్ రెడ్డి, యాదగిరి, భాను, శివ, శ్రీకాంత్, ప్రవీణ్, సాయి చరణ్ తదితరులు, స్థానిక నాయకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
    3
    కుషాయిగూడ డివిజన్ నాగార్జున నగర్ కాలనీలోని సాయి సింధు ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాసుల సతీష్ గౌడ్, కాసుల పోషయ్య గౌడ్ ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి చర్లపల్లి మాజీ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పెన్నులు, పెన్సిళ్లు, ప్యాడ్లు తదితర పరీక్ష సామాగ్రిని అందజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షల సమయంలో ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు. క్రమశిక్షణతో చదివి మంచి ఫలితాలు సాధించి తల్లిదండ్రులు, గురువులు మరియు పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలను పెట్టుకుని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ప్రోత్సహించారు.కార్యక్రమ నిర్వాహకులు కాసుల సతీష్ గౌడ్ మాట్లాడుతూ తాను మొదటి తరగతి నుండి పదో తరగతి వరకు ఇదే పాఠశాలలో చదువుకున్నానని తెలిపారు. తాను చదివిన పాఠశాల విద్యార్థులకు తన వంతు సహాయం చేయడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, శ్రీనివాస్ రెడ్డి, యాదగిరి, భాను, శివ, శ్రీకాంత్, ప్రవీణ్, సాయి చరణ్ తదితరులు, స్థానిక నాయకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
    user_Suresh Sagar
    Suresh Sagar
    కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    2 hrs ago
  • గజ్వేల్, సిద్దిపేట జిల్లా 13 మార్చి 2026 : ప్రజా తెలంగాణ న్యూస్/ రామాయణ రచయిత్రి, తొలి తెలుగు కవియిత్రి ఆతుకూరి మొల్లమాంబ జయంతి వేడుకలు సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీలోని ఆమె విగ్రహానికి గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ చందన రవీందర్ మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు అలాగే 14వ వార్డు కౌన్సిలర్ గుంటుకు లక్ష్మీ శ్రీనివాస్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ తెలుగు సాహితీ వనంలో మొల్లమాంబ అజరామరమైన ముద్ర వేశారని కొనియాడారు. సామాన్య కుటుంబంలో జన్మించినప్పటికీ, తన ప్రతిభతో రామాయణాన్ని సరళమైన తెలుగులో అందించిన ఆమె స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. మహిళా లోకానికి ఆమె ఒక మార్గదర్శి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, పిసిసి రాష్ట్ర కార్యదర్శి నాయిని యాదగిరి, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పట్టణ అధ్యక్షులు మోహన్నగారి రాజు, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి నక్క రాములు గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గాడిపల్లి శ్రీనివాస్, జంగం రమేష్ గౌడ్, చిట్కుల శివారెడ్డి, శేఖర్, కుమ్మర సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
    4
    గజ్వేల్, సిద్దిపేట జిల్లా 13 మార్చి 2026 : ప్రజా తెలంగాణ న్యూస్/
రామాయణ రచయిత్రి, తొలి తెలుగు కవియిత్రి ఆతుకూరి మొల్లమాంబ జయంతి వేడుకలు సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీలోని ఆమె విగ్రహానికి గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ చందన రవీందర్ మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు అలాగే  14వ వార్డు కౌన్సిలర్ గుంటుకు లక్ష్మీ శ్రీనివాస్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ తెలుగు సాహితీ వనంలో మొల్లమాంబ అజరామరమైన ముద్ర వేశారని కొనియాడారు. సామాన్య కుటుంబంలో జన్మించినప్పటికీ, తన ప్రతిభతో రామాయణాన్ని సరళమైన తెలుగులో అందించిన ఆమె స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. మహిళా లోకానికి ఆమె ఒక మార్గదర్శి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, పిసిసి రాష్ట్ర కార్యదర్శి నాయిని యాదగిరి, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పట్టణ అధ్యక్షులు మోహన్నగారి రాజు, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి నక్క రాములు గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గాడిపల్లి శ్రీనివాస్, జంగం రమేష్ గౌడ్, చిట్కుల శివారెడ్డి, శేఖర్, కుమ్మర సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
    user_Gousuddin Md
    Gousuddin Md
    అంబర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    3 hrs ago
  • మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మన *రామయంపేట మున్సిపాలిటీ 5వ వార్డు కౌన్సిలర్ చౌదరి చరిత గారు* యోగ ద్వారా ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో వాటి గురించి వివరిస్తూ స్పీచ్ ఇవ్వడం జరిగింది.
    1
    మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మన *రామయంపేట మున్సిపాలిటీ 5వ వార్డు కౌన్సిలర్ చౌదరి చరిత గారు* యోగ  ద్వారా ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో వాటి గురించి వివరిస్తూ స్పీచ్ ఇవ్వడం జరిగింది.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    హవేలీఘనాపూర్, మెదక్, తెలంగాణ•
    2 hrs ago
  • మెదక్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పాలన విభాగంలో శుక్రవారం ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. పలు ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతం ఆసుపత్రి రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, పూర్తి వివరాలను మధ్యాహ్నం తర్వాత వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. ఈ సోదాలతో జిల్లాలోని అన్ని శాఖల అధికారులు, సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
    1
    మెదక్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పాలన విభాగంలో శుక్రవారం ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. పలు ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతం ఆసుపత్రి రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, పూర్తి వివరాలను మధ్యాహ్నం తర్వాత వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. ఈ సోదాలతో జిల్లాలోని అన్ని శాఖల అధికారులు, సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
    user_MERCY
    MERCY
    Local News Reporter మెదక్, మెదక్, తెలంగాణ•
    4 hrs ago
  • మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసన్ పల్లి గ్రామంలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రం ఏడుపాయల వన దుర్గాభవాని దేవస్థానం లో లడ్డు, పులిహోర తయారీ కేంద్రంలో గ్యాస్ కొరత ఏర్పడింది. ఈ సందర్భంగా దేవాలయ ఈవో వీరేశం మాట్లాడుతూ దేశాల మధ్య యుద్ధం తో గ్యాస్ రవాణా నిలిచిపోవడం వల్ల గ్యాస్ కొరత ఏర్పడిందని అన్నారు. దేవస్థానం లడ్డు, పులిహోర తయారీ కోసం గ్యాస్ కొరత ఏర్పడిందని దీంతో కట్టెల పొయ్యి సహాయం తో తయారీ చేస్తున్నట్లు తెలిపారు. దేవాదాయ శాఖ దేవాలయాల కోసం గ్యాస్ ను ఏర్పాటు చేసి గ్యాస్ కొరత లేకుండా చూడాలని ఆయన కోరారు.
    1
    మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసన్ పల్లి గ్రామంలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రం ఏడుపాయల వన దుర్గాభవాని దేవస్థానం లో  లడ్డు, పులిహోర తయారీ కేంద్రంలో గ్యాస్ కొరత ఏర్పడింది. ఈ సందర్భంగా దేవాలయ ఈవో వీరేశం మాట్లాడుతూ దేశాల మధ్య యుద్ధం తో గ్యాస్ రవాణా నిలిచిపోవడం వల్ల గ్యాస్ కొరత ఏర్పడిందని అన్నారు. దేవస్థానం లడ్డు, పులిహోర తయారీ కోసం గ్యాస్ కొరత ఏర్పడిందని దీంతో కట్టెల పొయ్యి సహాయం తో తయారీ చేస్తున్నట్లు తెలిపారు. దేవాదాయ శాఖ దేవాలయాల కోసం గ్యాస్ ను ఏర్పాటు చేసి గ్యాస్ కొరత లేకుండా చూడాలని ఆయన కోరారు.
    user_MERCY
    MERCY
    Local News Reporter మెదక్, మెదక్, తెలంగాణ•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.