కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ పుట్టిన రోజు వేడుకలను లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.. ఉచిత వైద్య శిబిరం ఏర్పాటుచేసి ఆరోగ్య పరీక్షలు వైద్య సలహాలు అందించారు.. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంటి వైద్య శిబిరంలో లబ్ధిదారులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు, మందులు అవసరం ఉన్నవారికి ఉచితంగా అందించారు.. ఆకలి నివారణ లో భాగంగా చేపట్టిన మీల్స్ అండ్ వీల్స్ కార్యక్రమంలో నిరుపేదలకు అభాగ్యులకు భోజనాలు ఏర్పాటు చేశారు లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ ప్రజాసేవలో ఎప్పుడు ముందంజలో ఉంటుందని మేయర్ కులగాని శ్రీనివాస్ లయన్స్ క్లబ్ సభ్యులను అభినందించారు.. ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ అధ్యక్షులు మేడం శివకాంత్ పటేల్ లయన్ చిదుర సురేష్, లయన్ బట్టు వినోద్, లయన్ మెతుకు కృష్ణ చైతన్య, లయన్ ముక్క శరత్ కుంభం ప్రసాద్ ఐత సూరజ్ డాక్టర్ కార్తీక్ కొండ రాంబాబు పాట నాగేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మేయర్ శ్రీనివాస్ కు శుభాకాంక్షలు తెలిపారు
కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ పుట్టిన రోజు వేడుకలను లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.. ఉచిత వైద్య శిబిరం ఏర్పాటుచేసి ఆరోగ్య పరీక్షలు వైద్య సలహాలు అందించారు.. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంటి వైద్య శిబిరంలో లబ్ధిదారులకు
ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు, మందులు అవసరం ఉన్నవారికి ఉచితంగా అందించారు.. ఆకలి నివారణ లో భాగంగా చేపట్టిన మీల్స్ అండ్ వీల్స్ కార్యక్రమంలో నిరుపేదలకు అభాగ్యులకు భోజనాలు ఏర్పాటు చేశారు లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్
ప్రజాసేవలో ఎప్పుడు ముందంజలో ఉంటుందని మేయర్ కులగాని శ్రీనివాస్ లయన్స్ క్లబ్ సభ్యులను అభినందించారు.. ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ అధ్యక్షులు మేడం శివకాంత్ పటేల్ లయన్ చిదుర సురేష్, లయన్ బట్టు వినోద్,
లయన్ మెతుకు కృష్ణ చైతన్య, లయన్ ముక్క శరత్ కుంభం ప్రసాద్ ఐత సూరజ్ డాక్టర్ కార్తీక్ కొండ రాంబాబు పాట నాగేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మేయర్ శ్రీనివాస్ కు శుభాకాంక్షలు తెలిపారు
- కరీంనగర్ లో మహమ్మద్ ప్రవక్త జన్మదిన పురస్కరించుకుని మిలాద్-ఉన్-నబీ సందర్భంగా ఘనంగా శోభాయాత్ర మిలాద్-ఉన్-నబీ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలో ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో భారీ శోభాయాత్ర చేపట్టారు. ప్రధాన వీధుల గుండా సాగిన ఈ ఊరేగింపులో శాంతి, సోదరభావ సందేశాలను చాటారు. యువకులు పవిత్ర పతాకాలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించగా, ప్రజాప్రతినిధులు ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.3
- ఎస్సీ మాలలకు ఉన్న రోస్టర్ విధానాన్ని వెంటనే రద్దు పరచాలని డిమాండ్ చేస్తూ నిరసన రాష్ట్రంలో విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎస్సీ మాలలకు ఉన్న రోస్టర్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో మాల మహానాడు నాయకులు నిరసన తెలిపారు. ఈనెల 31న మాలమహానాడు ఆధ్వర్యంలో తలపెట్టిన చలో సెక్రటేరియట్ వాల్ పోస్టర్లను ఈ సందర్భంగా విడుదల చేశారు. గతంలో ఎస్సీ ఏబిసిడి వర్గీకరణలో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ చేసిన పార్ట్ 1, 2, 3, 4 విధానంతో మాలలకు తీవ్ర నష్టం జరుగుతోందని మాల మహానాడు నాయకులు ఆరోపించారు. 46% రోస్టర్ విధానంతో ఉద్యోగ ఉపాధి అవకాశాలలో తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రోస్టర్ విధానాన్ని రద్దుచేసి వాళ్లకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రోస్టర్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ ఈనెల 31న లక్షలాదిమంది మాలలు మాల మహానాడు ఆధ్వర్యంలో హైదరాబాద్ ను దిగ్బంధనం చేసి సెక్రటేరియట్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు.2
- శ్రావణమాసం రెండవ బుధవారం భీమన్న క్షేత్రంలో భక్తుల రద్దీ వేములవాడ భీమన్న క్షేత్రం భక్తజన సందోహంగా మారింది. శ్రావణమాసం రెండవ బుధవారం సందర్భంగా స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. భక్తులు తలనీలాలు సమర్పించి, స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కులు చెల్లించుకుని దర్శనం చేసుకున్నారు. అభిషేక ప్రియుడైన స్వామివారికి భక్తులు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించగా, అమ్మవారికి కుంకుమ పూజలు చేశారు. గండాలు తొలగాలని కోరుకుంటూ గండదీపంలో నూనె పోసి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ పరిసరాల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సౌకర్యాలు కల్పిస్తూ ఏర్పాట్లను పర్యవేక్షించారు.1
- *కోడెల సంరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యం జరగకుండా చర్యలు* *కోడెల మృతిపై విచారణకు ఆదేశం* *నూతన గోశాల నిర్మాణానికి 40 ఎకరాల స్థలం* *రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్* *గోశాలను సందర్శించిన విప్ పాల్గొన్న ఆలయ ఈఓ, మున్సిపల్ చైర్మన్ అధికారులు* వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు సమర్పిస్తున్న కోడెలు, ఆవుల సంరక్షణ కోసం గోశాలను మరింత పటిష్టం చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. బుధవారం రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గోశాలను సందర్శించారు... ఇటీవల ఐదు కోడెలు మృతి చెందిన ఘటనపై, గోశాల నిర్వాహకులు, దేవాదాయ శాఖ అధికారులు, సంబంధిత పశువైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారు మాట్లాడుతూ చిన్న వయసు కోడెలను దూర ప్రాంతాల నుంచి తీసుకురావడం, వాతావరణ మార్పులు, వ్యాధులు తదితర కారణాల వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. భక్తులు రాజన్నకు మొక్కు చెల్లించే ఉద్దేశంతో పాలు మరవని చిన్న కోడెలను సమర్పించకుండా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కనీసం ఏడాది వయసు వచ్చిన తర్వాత కోడెలను సమర్పిస్తే అవి వాతావరణానికి అలవాటు పడి అనారోగ్యానికి గురికాకుండా ఉండే అవకాశం ఉంటుందని సూచించారు. గోశాలకు కొత్తగా వచ్చే కోడెలను 15 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచి, వయసు ఆధారంగా గ్రేడింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. చిన్న కోడెలు, పెద్ద కోడెలను వేర్వేరుగా ఉంచేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఒకదానిపై మరొకటి ఎగబడటం, పొడుచుకోవడం వంటి ఘటనలతో గాయాలు కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వర్షాకాలం నేపథ్యంలో గోశాలలో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ఎప్పటికప్పుడు శుభ్రపరిచేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గోశాలలో పచ్చిగడ్డి, దాతలు అందించే పశుగ్రాసంతో పాటు అవసరమైన దాణాను నాణ్యతలో రాజీ లేకుండా అందిస్తున్నామని తెలిపారు. ఇటీవల జరిగిన కోడెల మృతి ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. మానవ తప్పిదం లేదా అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఘటన జరిగిందని తేలితే ప్రభుత్వ పరంగా తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.. వేములవాడలో ఆధునిక పద్ధతుల్లో నూతన గోశాల నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు 40 ఎకరాల స్థలాన్ని సేకరించి, క్యాబినెట్ ఆమోదం కూడా పొందినట్లు తెలిపారు. త్వరలోనే నిర్మాణానికి సంబంధించిన చర్యలు చేపట్టి వీలైనంత త్వరగా నూతన గోశాలను అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తామని చెప్పారు. ప్రస్తుతం ఉన్న గోశాల సామర్థ్యాన్ని కూడా పెంచుతున్నామని, భక్తులు సమర్పించే కోడెలను సక్రమంగా సంరక్షించి, అవసరమైన సమయంలో భక్తులకు అందించే విధంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. పాలు ఇవ్వలేని పరిస్థితికి చేరుకున్న ఆవులను కూడా కొందరు భక్తులు ఆలయానికి తీసుకొచ్చి వదిలేస్తున్నారని, వాటి సంరక్షణకు కూడా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని రాజన్న ఆలయానికి సమర్పించే కోడెల సంరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యం జరగకుండా ప్రభుత్వం, దేవాదాయ శాఖ, పశుసంవర్ధక శాఖ సమన్వయంతో పనిచేస్తామని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటామని స్పష్టం చేశారు.4
- యూపీఐ లావాదేవీలకు పదేళ్ళు ...టీ తాగి యుపిఐ పేమెంట్ చేసిన కేంద్రమంత్రి బండి సంజయ్ దేశంలో యూపీఐ లావాదేవీలు ప్రారంభమై పదేళ్ళు అయింది. యూపిఐ పేమెంట్లకు దశాబ్దం పూర్తికావడంతో కరీంనగర్ లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వేడుకలు నిర్వహించారు. డిప్యూటీ మేయర్ సునీల్ రావు కార్పొరేటర్ ప్రవీణ్ రావుతో పాటు పలువురు బిజెపి నాయకులతో కలిసి కేంద్రమంత్రి బండి సంజయ్ టీ తాగి యూపీఐ పేమెంట్ చేశారు. నగదు రహిత లావాదేవీలతో దేశం పురోగతి సాధిస్తుందని తెలిపారు.1
- బీసీల హక్కుల సాధనకు ఐక్యంగా పనిచేయాలి: జాతీయ బీసీ చైతన్య సమితి జాతీయ అధ్యక్షుడు, వ్యవస్థాపకుడు బీసీ రమణ జాతీయ బీసీ చైతన్య సమితి జగిత్యాల జిల్లా కమిటీలలో నూతనంగా నియమితులైన నాయకులకు జాతీయ బీసీ చైతన్య సమితి జాతీయ అధ్యక్షుడు, వ్యవస్థాపకుడు బీసీ రమణ హైదరాబాద్ లో నియామక పత్రాలు అందజేశారు. నూతన బాధ్యతలు స్వీకరించిన నాయకులు బీసీల హక్కుల సాధనకు క్రమశిక్షణతో, ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. బీసీల సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లి సామాజిక న్యాయం కోసం కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో సాంబారి కళావతి, కస్తూరి నరేష్, ఆడెపు సత్యం, అల్లే సుదర్శన్, సిరికొండ చంద్రన్న, ఎనుగుర్తి శ్రవణ్, రాజేష్, రాజ శేఖర్, చెట్పెల్లి సురేష్, గుండేటి మారుతి పాల్గొన్నారు.4
- పోగొట్టుకున్న సెల్‌ఫోన్ల ఆచూకీని గుర్తించిన పోలీసులు.. స్వాధీనం చేసుకున్న 142 సెల్‌ఫోన్లను వాటి యజమానులకు అప్పగించిన రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఫోన్ పోయిందా... దొంగిలించబడిందా...? సీఈఐఆర్ పోర్టల్‌ను సద్వినియోగం చేసుకోండి: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా* * రూ. 27.40 లక్షల విలువైన 142 సెల్‌ఫోన్లు బాధితులకు అందజేత* రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సెల్‌ఫోన్‌ను పోగొట్టుకున్నా లేదా దొంగిలించబడినా వెంటనే స్పందించి సీఈఐఆర్ (CEIR) పోర్టల్‌ను సద్వినియోగం చేసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు. మంగళవారం సెల్‌ఫోన్ల రికవరీకి సంబంధించి పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు సీసీఎస్ ఏసీపీలు రవీందర్, ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ సీసీఎస్, ఐటీ సెల్ బృందాలు సెల్‌ఫోన్ రికవరీ మేళా నిర్వహించాయి. ఈ సందర్భంగా పోగొట్టుకున్న, దొంగిలించబడిన సెల్‌ఫోన్ల ఆచూకీని గుర్తించి,పోలీసులు స్వాధీనం చేసుకున్న 142 సెల్‌ఫోన్లను వాటి యజమానులకు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, దొంగిలించబడిన లేదా పోగొట్టుకున్న సెల్‌ఫోన్ల ఆచూకీని గుర్తించేందుకు సీసీఎస్‌తోపాటు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటివరకు 10,420 మంది సీఈఐఆర్ పోర్టల్‌లో ఫిర్యాదులు నమోదు చేయగా,అందులో 3,717 సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకుని వాటి యజమానులకు అందజేసినట్లు తెలిపారు.గత కొంతకాలంగా సీసీఎస్,ఐటీ సెల్ పోలీసులు ప్రత్యేకంగా శ్రమించి మరో 142 సెల్‌ఫోన్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. సెల్‌ఫోన్ దొంగతనాలు, పోగొట్టుకున్న ఫోన్ల సమస్యల పరిష్కారానికి భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్స్ విభాగం సీఈఐఆర్ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిందని తెలిపారు. ప్రస్తుత జీవనశైలిలో మొబైల్ ఫోన్ అత్యంత కీలకమైన సాధనంగా మారిందని అన్నారు.ఏదైనా సమాచారం తెలుసుకోవాలన్నా, నగదు చెల్లింపులు చేయాలన్నా, ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలన్నా మొబైల్ ఫోన్‌పైనే ఎక్కువగా ఆధారపడుతున్నామని పేర్కొన్నారు. ఎవరైనా తమ మొబైల్ ఫోన్‌ను పోగొట్టుకున్నా లేదా దొంగిలించబడినా వెంటనే సీఈఐఆర్ పోర్టల్‌లో సంబంధిత ఫోన్‌ను బ్లాక్ చేయడంతోపాటు, సంబంధిత పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని సీపీ ప్రజలకు సూచించారు. సీఈఐఆర్ పోర్టల్ ముఖ్యంగా పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన మొబైల్ ఫోన్‌లను గుర్తించడంలో ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. పోర్టల్‌లో నమోదు చేసిన ఫోన్ వివరాల ఆధారంగా, ఆ మొబైల్ ఫోన్‌ను ఇతర రాష్ట్రాల్లో లేదా ఇతర నెట్‌వర్క్‌లలో ఉపయోగించకుండా నిరోధించవచ్చని చెప్పారు. దీంతో దొంగిలించబడిన ఫోన్‌ను వినియోగించడం కష్టతరమవుతుందని పేర్కొన్నారు. ఈ విధానం ద్వారా సెల్‌ఫోన్ చోరీలను తగ్గించడంతోపాటు, పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన ఫోన్లను తిరిగి గుర్తించి యజమానులకు అందించే అవకాశం మరింత పెరుగుతుందని సీపీ తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (పరిపాలన) కె.శ్రీనివాస్,సీసీఎస్ ఏసీపీలు రవీందర్, ప్రవీణ్ కుమార్,వై. కృష్ణారెడ్డి,టి.గోపి,పి. బాలాజీ వరప్రసాద్, ఐటీ కోర్ ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్ గౌడ్, ఎస్‌ఐలు బి.జీవన్, ఎం.చంద్రశేఖర్, ఎం.ఏ.నసీర్, ఎం. శివకేశవులు,కె. భాస్కర్ రావు,బి. భూమన్న,బి.శిరీష, శెట్టి లలిత,ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.1
- రామగుండం లో గుజరాత్.NIA తనిఖీలు., * పూర్తి స్థాయిలో విచారణ జరపాలని రామగుండం సిపి కి వినతిపత్రం అందించిన విశ్వహింద్ పరిషత్ రామగుండం లో గుజరాత్ NIA తనిఖీల సంబంధించి రామగుండం పోలీసు కమీషనర్ కు వినతి పత్రం సమర్పించిన విశ్వహిందూ పరిషత్ నాయకులు. నిన్ను రామగుండం అయోధ్య నగర్ లో ముజాహిల్ అనే విద్యార్థి నీ గుజరాత్ NIA వారు అతని ఇంటిని సోదాలు నిర్వహించి అతని ఫోన్. లాప్టాప్ తీసుకువెళ్ళి అతనిని NTPC పోలీస్ స్టేషన్ లో విచారించడం జరిగింది.. ఈ సందర్భంగా పరిషత్. విభాగ కార్యదర్శి. అయోధ్య రవీందర్ మాట్లాడుతూ పారిశ్రామిక ప్రాంతంలో గత కొన్ని సంవత్సరాల నుండి ఇక్కడ ఉగ్రవాద జడలు ఉన్నాయి.. అనేకమంది ఇక్కడ షెల్టర్ తీసుకున్నారు. అనేకసార్లు ఇక్కడ జాతీయ నిగూ సంస్థ ల తనిఖీలు జరిగాయి.. కావున పోలీసు వారు ఇలాంటి సంఘటనలను సీరియస్ గా తీసుకొని పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కోరారు... ఈ కార్యక్రమంలో. జిల్లా సహా కార్యదర్శి అడ్డిగొప్పుల రాజు. నగర్ కార్యదర్శి మునిగాల సంపత్. వెంకటస్వామి. లింగాన్న. రాజేశ్. తిరుపతి. మరియు బాధ్యులు పాల్గొన్నారు.....1