జిల్లా ఇంచార్జ్ మంత్రి బి.సి. జనార్ధన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు* జిల్లా ఇంచార్జ్ మంత్రి బి.సి. జనార్ధన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు* మదనపల్లి, మార్చి 30: *అన్నమయ్య జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు మరియు రాష్ట్ర రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రివర్యులు శ్రీ బి.సి. జనార్ధన్ రెడ్డి గారిని రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు సోమవారం రోజు మదనపల్లిలో మర్యాదపూర్వకంగా కలిశారు*. మదనపల్లిలో నిర్వహించనున్న ‘జీరో పావర్టీ – P4’ కార్యక్రమం మొదటి వార్షికోత్సవ వేడుకలకు హాజరయ్యేందుకు విచ్చేసిన మంత్రి గారిని, పార్లమెంట్ అధ్యక్షులు ప్రసాద్ బాబు గారు ,స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు, శ్రీరామ్ చినబాబు గారు రాజంపేట టీడీపీ పార్లమెంట్ కార్యాలయంలో కలిసి మాట్లాడినారు. ఈ సందర్భంగా రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ప్రజా సమస్యలు, అభివృద్ధి అవసరాలు, అలాగే టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎదుర్కొంటున్న అంశాలను మంత్రి గారి దృష్టికి ప్రసాద్ బాబు గారు తీసుకువెళ్లి వివరించారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల అమలులో వేగం పెంచేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి గారు సానుకూలంగా స్పందించినట్లు ప్రసాద్ బాబు తెలిపారు.
జిల్లా ఇంచార్జ్ మంత్రి బి.సి. జనార్ధన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు* జిల్లా ఇంచార్జ్ మంత్రి బి.సి. జనార్ధన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు* మదనపల్లి, మార్చి 30: *అన్నమయ్య జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు మరియు రాష్ట్ర రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రివర్యులు శ్రీ బి.సి. జనార్ధన్ రెడ్డి గారిని రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు సోమవారం రోజు మదనపల్లిలో మర్యాదపూర్వకంగా కలిశారు*. మదనపల్లిలో నిర్వహించనున్న ‘జీరో పావర్టీ – P4’ కార్యక్రమం మొదటి వార్షికోత్సవ వేడుకలకు హాజరయ్యేందుకు విచ్చేసిన మంత్రి గారిని, పార్లమెంట్ అధ్యక్షులు ప్రసాద్ బాబు గారు ,స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు, శ్రీరామ్ చినబాబు గారు రాజంపేట టీడీపీ పార్లమెంట్ కార్యాలయంలో కలిసి మాట్లాడినారు. ఈ సందర్భంగా రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ప్రజా సమస్యలు, అభివృద్ధి అవసరాలు, అలాగే టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎదుర్కొంటున్న అంశాలను మంత్రి గారి దృష్టికి ప్రసాద్ బాబు గారు తీసుకువెళ్లి వివరించారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల అమలులో వేగం పెంచేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి గారు సానుకూలంగా స్పందించినట్లు ప్రసాద్ బాబు తెలిపారు.
- సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండలo కటారుపల్లి గ్రామంలో యోగువేమన ఉత్సవాలు రెండో రోజు వైభవంగా నిర్వహించారు. సోమవారం చాందిని బండ్లు పానక పన్నీరు తోపాటు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి యోగివేమన భక్తాదులు హాజరై స్వామివారిని దర్శించుకుంటున్నారు. భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు ఆలయ పీఠాధిపతులు నంద వేమారెడ్డి తెలిపారు.1
- అన్నం సరిపోలేదు మళ్లీ పెట్టమన్నందుకు ప్రిన్సిపాల్ దాష్టికం విద్యార్థినులను మోకాళ్ళ మీద కూర్చోబెట్టిన ప్రిన్సిపాల్ నల్గొండ జిల్లా దామరచర్ల బీసీ గురుకుల పాఠశాలలో విద్యార్థినిలు అన్నం సరిపోలేదు మళ్లీ పెట్టమన్నందుకు రాత్రి 8 గంటల నుండి 9 గంటల వరకు మోకాళ్ళ మీద కూర్చోబెట్టి పైశాచికంగా వ్యవహరించిన ప్రిన్సిపాల్ ఎక్కువ అన్నం ఎక్కువ కూరలు పెట్టలేమని.. విద్యార్థులు ఎవరైనా అన్నం సరిపోలేదు మళ్లీ పెట్టండి అంటే అందరికీ ఇదే గతని బెదిరింపులు విద్యార్థినులను చిత్రహింసలకు గురి చేస్తున్న ప్రిన్సిపాల్ ను డిస్మిస్ చేయాలని విద్యార్థి సంఘాల డిమాండ్1
- 100% ఒరిజినల్ మరుగు మందు 🍃 కావాలనుకుంటే ఒకసారి ఈ నెంబర్ కి కాల్ చేయండి 📱𝟵𝟰𝟵𝟰𝟳𝟱𝟳𝟴𝟭𝟵👈 #trending #om#vairalreels🍃#virelreels🍃 #marugumandu 🌿 #trending#reels#boost#boost#trending#goviral#explorepage#explore#facts#om#trending #om #omnamahshivaya #facts #temple #devocional #tirumala #tirumalahills #hindu #hindutempl#🔱☣️#మరుగుమందు#reels#AndhraPradesh#Telangana#Hyderabad Hyderabad1
- *జాతీయ రహదారి 40(కర్నూల్ - కడప) రోడ్డు లో వ్యతిరేక దిశలో వాహనాన్ని నడిపి మనిషి చనిపోవడానికి కారణం అయిన వ్యక్తి అరెస్టు* *మర్డర్ కేసుతో సమానమైన సెక్షన్ వేసి కోర్టు ముందు హాజరు పరచడం అయినది* ముద్దాయి పేరు: షేక్ మస్తాన్, వయసు: 58 సం’’రాలు తండ్రి: లేట్ మౌలాలి, వృత్తి: కూలి, కులం: ముస్లిం, D.No.01/15, అద్దంకి రోడ్డు, St కాలనీ, దర్శి టౌన్ & మండలం, ప్రకాశం జిల్లా. నేరము జరిగిన తేది సమయము మరియు స్థలము: 25.03.2026 వ తేదీన మద్యాహ్నం సుమారు 02.30 గంటల సమయం లో కడప జిల్లా, మైదుకూరు టౌన్, ప్రొద్దుటూరు రోడ్డులో జాతీయ రహదారి- 40 (కర్నూల్ - కడప రోడ్డు)లో నుండి సర్వీసు రోడ్డు కలిసే ప్రదేశం అరెస్ట్ జరిగిన తేది మరియు సమయము: On 30.03.2026 at 11.30 AM కడప - కర్నూల్ రోడ్డులోని శ్రీనగరము గ్రామము దగ్గర. Seizure:- AP39 VE 0499 పాల ట్యాంకర్. Brief facts of the case: పైన తెలిపిన ముద్దాయి AP 39 VE 0499 పాల ట్యాంకర్ లో ధర్మవరము నుండి మైదుకూరు లోని అమృత మిల్క్ డైరీకి పాలు తోలుతూ ఉన్న క్రమములో 25.03.2026 వ తేదిన పాలు అమృత మిల్క్ డైరి నందు దించి మరలా ధర్మవరానికి వెళ్తున్న క్రమములో సుమారు 02.30 PM గంటల సమయములో పైన తెలిపిన ముద్దాయి, పైన తెలిపిన స్థలం వద్దకు పాల ట్యాంకర్ ను నడుపుతూ ఆపోసిట్/ రాంగు రోడ్డులో వెళితే ప్రమాదాలు జరిగి మనుషుల ప్రాణాలు పోతాయి అని తెలిసి కూడా ఆపోసిట్/ రాంగు రోడ్డులో ట్యాంకర్ ను నిర్లక్షంగా నడిపి మోటర్ సైకిల్ పైన వస్తున్న వారికి తగిలించి దువ్వూరు కు చెందిన భాను ప్రకాష్ చనిపోడానికి, గంగా ప్రసాద్ గాయపడటానికి కారణము అయినాడు కాబట్టి అతనిని మైదుకూరు పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ కె. రమణారెడ్డి అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించడమైనది. జాతీయ రహదారి మరియు ఇతర రోడ్డులలో వ్యతిరేక దిశలో వాహనాలను నడిపి ప్రమాదాలకు కారణం అయితే వారిపై మర్డర్ కేసుతో సమానమైన సెక్షన్ను పెట్టి, అరెస్టు చేసి, ప్రమాదాలకు కారణం అయిన వాహనాలను సీజ్ చేయడం జరుగుతుంది. కె.రమణా రెడ్డి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మైదుకూరు అర్బన్ పీఎస్.1
- బద్వేలు :రూరల్ పోలీస్ స్టేషన్ పరిదిలో చంపుతామని కతితో బెదిరించి వృద్దురాలి మెడలో నుండి బంగారు గోలుసు చోరీ చేసిన కేసులో కీలక నిందితుడిని అరెస్ చేసి, చోరీ సొతు, నేరానికి ఉపయోగించిన కారు, 2 బైకులను స్వాధీనం బద్వేలు రూరల్ పోలీసులు చేసుకున్నరు. కేసు వివరాలు: 27.03.2026 శ్రీరామనవమి పండుగ రోజున బద్వేలు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనివాసపురం గ్రామంలో ఒక వృద్దురాలిని కతితో బెదిరించి, ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కొని పారిపోయిన ఘటనపై కేసు (Cr.No.30/2026 U/s 307 r/w 3(5) BNS) బద్వేలు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పర్యవేక్షణలో ఎస్.ఐ ఎం. రంగారావు మరియు వారి సిబ్బంది బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టగా వారికి అందిన నమ్మకమైన సమాచారం మేరకు, 29.03.2026 తేదీన సాయంకాలము గోపవరం మండలం, ద్వారకనగర్ సమీపంలోని గరుడయ్య సత్రము వద్ద అనుమానాస్పదంగా ఉన్న షైక్ ఈసు మీరా వల్లి (23 సం||, మార్కాపురం టౌన్ & జిల్లా) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా, సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నేర చరిత్ర మరియు ముఠా వివరాలు: నిందితుడు మీరా వల్లి గతంలో మార్కాపురంలో దొంగతనం చేసి జైలుకు వెళ్ళాడు. జైలులో ఇతనికి మజీద్, అంజిరెడ్డి, వెంకటేశు అనే కరుడు గట్టిన పాత నేరస్థులతో పరిచయం ఏర్పడి, విరు నలుగురు ఒక గ్యాంగ్ ఏర్పడ్డారు. శ్రీరామనవమి సమయంలో జనసమ్మర్థం ఉన్న చోట, మహిళలు నగలు వేసుకొని వుంటారు కావున అక్కడ దొంగతనాలు చేయాలని, ఎవరైనా అడ్డుకుంటే కత్తులతో చంపడానికైనా సిద్ధపడాలని నిర్ణయించుకొని పథకం వేసుకొని, కత్తులు కొన్నారు. వీరందరూ కలిసి 25.03.2026 తేదీ పొదిలి సమీపంలో ఒక HF Deluxe బైకు, 26.03.2026 తేదీ నరసరావు పేట సమీపంలో ఒక యునికర్న్ బైకు, పామూరు సమీపంలో ఒక పల్సర్ బైకు దొంగిలించారు. ఈ క్రమంలో శ్రీనివాసపురం వద్ద ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని, ఆమె కుమారుడిని కత్తులతో బెదిరించి సుమారు 2.5 లక్షల విలువైన బంగారు దొంగిలించుకొని పారిపోయినారు. స్వాధీనం చేసుకున్న సొత్తు: నిందితుని నుండి ఈ క్రింది వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు: నిందితుని నుండి ఈ క్రింది వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు: 1. బంగారు గొలుసు: సుమారు 18 గ్రాముల బరువున్న తెగిపోయిన బంగారు చైన్. 2. కారు: నేరానికి ఉపయోగించిన వోక్స్ వ్యాగన్ పోలో (Volkswagen Polo) కారు (AP07BT8543). 3. ద్విచక్ర వాహనాలు: నరసరావుపేట మరియు పొదిలి ప్రాంతాల్లో దొంగిలించిన ఒక హోండా యూనికార్న్ మరియు ఒక హెచ్.ఎఫ్ డీలక్స్ మోటార్ సైకిళ్ళు. 4. ఆయుధం: బెదిరింపులకు ఉపయోగించిన పదునైన కత్తి, అభినందనలు: నేరం గురించి తెలిసిన వెంటనే స్పందించి, బద్వేలు రూరల్ SI రంగారావు మరియు బి.. కోడూరు SI సూర్య నారాయణ రెడ్డి ల ఆధ్వర్యంలో రెండు బృందాలను ఏర్పాటు చేసి, తీవ్ర గాలింపు చర్యలు చేసి, జిల్లా దొంగల ముఠా గుట్టురట్టు చేసి, వారి నుండి బద్వేలు రూరల్ పరిధిలో దొంగిలించిన బంగారు చైన్ కాకుండా, ఇతర జిల్లాలో దొంగిలించిన మోటారు సైకిళ్ళను, నేరానికి ఉపయోగించిన కారును కుడా స్వాధీనం చేసుకొని వారి ఆట కట్టించిన బద్వేలు రూరల్ CI నద్యాల క్రిష్నయ్యను మరియు వారి సిబ్బందిని మైదుకూరు DSP రాజేంద్ర ప్రసాద్ అభినిందించారు. పోలీసుల హెచ్చరిక:నిందితుడు మీరా వల్లిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించడం జరిగింది. ఈ కేసులో పరారీలో ఉన్న మిగిలిన ముగ్గురు నిందితుల (మజీద్, అంజిరెడ్డి, వెంకటేశు) కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని ఎస్.ఐ రంగారావు తెలిపారు. నిందితులపై కొత్త చట్టం ప్రకారం (111 BNS) గ్యాంగ్ నేరాలకు సంబంధించిన కఠిన సెక్షన్లు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.1
- ప్రజల భద్రత దృష్టిలో ఉంచుకొని ఆపరేషన్ నైట్ సేఫ్టీ అమలు.రాత్రంతా SP వీధిలోనే. అనంవసరంగా రాత్రి వేళ బయట తిరిగితే చర్యలు తప్పవు, ట్రీట్మెంట్ తప్పదు1
- వచ్చేనెల 1వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వింజమూరు పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కాకర్ల స రేష్ పేర్కొన్నారు. ఉదయగిరిలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి తొలుత సామాజిక పింఛన్లు పంపిణీ చేసి లబ్దిదారులతో ముచ్చటిస్తారన్నారు.. అనంతరం వింజమూరు చెరువుకు జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి అక్కడ నుంచి నేరుగా ప్రజావేదిక కార్యక్రమాన్ని చేరుకొంటారన్నారు. ప్రజావేదిక అనంతరం భోజనం తర్వాత కార్యకర్తలతో సమీక్షా సమావేశం ఉంటుందన్నారు. ఎమ్మెల్యే పర్యటను విజయవంతానికి నియోజకవర్గంలో 13 కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యమంత్రి వస్తున్న సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి 20 అంశాలను ఆయన దృష్టికి తీసుకెళుతున్నట్లు తెలిపారు. ప్రధానంగా సాగు, తాగునీటి కష్టాలు తీర్చడంతోపాటు ఉ పాధి అవకాశాల కల్పనకు పరిశ్రమల స్థాపనకు కృషి చేయాలని కోరనున్నట్లు తెలిపారు. ఆయన పర్యటనతో నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు సీఎం హామీ ఇవ్వన ఉన్నట్లు తెలిపారు. కావున నియోజకవర్గంలోని కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధికసంఖ్యలో పాల్గొని సీఎం పర్యటను విజయవంతం చేయాలని ఆయన కోరారు.1
- గాండ్లపెంట మండల పరిధిలోని కటారిపల్లి గ్రామంలో యోగివేమన ఉత్సవాలు అంబరాన్ని అంటాయి. కటారుపల్లి గ్రామంలో కళాకారులు చేసిన అమ్మవారి నృత్యాలను భక్తులను ఆకట్టుకున్నాయి. రాక్షసుణ్ణి అమ్మవారు వేటాడి చంపినట్లు చేసిన కళారూపాలను వేమన భక్తులు ప్రశంసిస్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి శక్తి పూజ అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకర్షించాయి.1