Shuru
Apke Nagar Ki App…
రేపు గుంటూరు కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా: CPM గుంటూరు:దళితులకు రక్షణ కల్పించలేని కూటమి ప్రభుత్వం సిగ్గుపడాలని CPM రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు. బుధవారం గుంటూరులో ఆయన మాట్లాడారు. 15 రోజుల్లో తాడికొండ నియోజకవర్గ పరిధిలో ఇద్దరు దళిత యువకులు హత్యకు గురయ్యారని తెలిపారు. దళితులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 17న గుంటూరు కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చెబుతున్నట్లు చెప్పారు.
SHOT NEWS
రేపు గుంటూరు కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా: CPM గుంటూరు:దళితులకు రక్షణ కల్పించలేని కూటమి ప్రభుత్వం సిగ్గుపడాలని CPM రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు. బుధవారం గుంటూరులో ఆయన మాట్లాడారు. 15 రోజుల్లో తాడికొండ నియోజకవర్గ పరిధిలో ఇద్దరు దళిత యువకులు హత్యకు గురయ్యారని తెలిపారు. దళితులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 17న గుంటూరు కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చెబుతున్నట్లు చెప్పారు.
More news from Andhra Pradesh and nearby areas
- రేపు గుంటూరు కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా: CPM గుంటూరు:దళితులకు రక్షణ కల్పించలేని కూటమి ప్రభుత్వం సిగ్గుపడాలని CPM రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు. బుధవారం గుంటూరులో ఆయన మాట్లాడారు. 15 రోజుల్లో తాడికొండ నియోజకవర్గ పరిధిలో ఇద్దరు దళిత యువకులు హత్యకు గురయ్యారని తెలిపారు. దళితులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 17న గుంటూరు కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చెబుతున్నట్లు చెప్పారు.1
- బంగారం, డబ్బు కోసం కన్నతల్లిని హతమార్చిన కూతురు, భర్త అరెస్టు పొన్నూరు: బంగారు గొలుసు, నగదు కోసం తల్లి ఈవూరి లక్ష్మి (44)ని కూతురు పుష్పలత, ఆమె భర్త రాకేశ్ కుమార్ కలిసి సెప్టెంబర్ 12న గొంతు నొక్కి హతమార్చారు. మృతురాలి మెడలోని బంగారు గొలుసు, రూ.5000, మొబైల్ ఫోన్లు దోచుకుని పరారయ్యారు. ఘటనను మృతురాలి మనమడు ప్రత్యక్షంగా చూశాడు. పొన్నూరు టౌన్ సీఐ ఆర్.ఎస్. కిషోర్ కుమార్ నేతృత్వంలోని బృందం మూడు రోజుల్లోనే నిందితులను అరెస్టు చేసి, దోచుకున్న సొత్తును పూర్తిగా రికవరీ చేసారు.1
- ధ్యాన బుద్ధ ప్రాజెక్ట్ సమీపంలోని కృష్ణా నది వద్ద కోలాహలంగా వినాయక నిమజ్జనం ధరణికోట : పల్నాడు జిల్లా అమరావతి మండలం లోని ధరణికోట గ్రామంలో గల యానబుద్ధ ప్రాజెక్టు వద్ద కృష్ణా నది ఒడ్డున వినాయక నిమజ్జనం కోలాహలంగా జరుగుతుంది. రెండు రోజుల నుండి సమీప గ్రామాల నుండి వివిధ రూపాల్లో ఉన్న గణనాథుల విగ్రహాలను ప్రత్యేక వాహనాలలో తీసుకువచ్చి కృష్ణా నదిలో నిమజ్జనం చేస్తున్నారు. నిమజ్జన ప్రదేశానికి వచ్చిన వినాయకుడి విగ్రహాలను క్రేన్ల ద్వారా ప్రవళిలోకి ఎక్కించి నది మధ్యలోకి తీసుకువెళ్లి నిమజ్జనఓ చేస్తున్నారు. నిమజ్జన ప్రదేశంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాలు పర్యవేక్షణలో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.1
- సర్దార్ గౌతు లచ్చన్న ప్రధాన రహదారిపై వేంచేసి ఉన్న విగ్నేశ్వరుడు, సర్దార్ గౌతు లచ్చన్న ప్రధాన రహదారిపై వేంచేసి ఉన్న విగ్నేశ్వరుడుకి మహిళలు పూజా కార్యక్రమం చేసి పిల్లలచే ఆటపాటలు చేయించుచున్న కమిటీ వారికి ధన్యవాదాలు.2
- 22 అడుగుల ఎత్తు గల వినాయక విగ్రహం రేపల్లె ఆర్యవైశ్య యువత ఆధ్వర్యంలో ఏర్పడిన గణేష ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రేపల్లె పట్టణంలోని కన్యకాపరమేశ్వరి అమ్మవారి గుడి ప్రాంగణంలో గత 22 సంవత్సరాలుగా గణేష్ ఉత్సవాలు అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈనెల 14 నుండి ప్రారంభమైన గణేష్ మహోత్సవాలు 7 రోజులపాటు నిర్వహిస్తున్నట్లు ఆర్యవైశ్య యువత అధ్యక్షులు గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు మాజీ కౌన్సిలర్ బొలిశెట్టి సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు లలిత సహస్రనామ పారాయణం సంపత్ గణపతి గానామృతం సౌందర్యలహరి పారాయణం పంచ హారతులు తీర్థప్రసాదాలు వినియోగము జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఈనెల 20వ తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు అవుతున్నారని, 20వ తేదీ అన్న ప్రసాద వితరణ స్వామి వారి లడ్డు వేలం పాట సాయంత్రం 4 గంటలకు వినాయక నిమర్జనం ఊరేగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా కేరళ వారిచే అందకాసురుడు, రోబోటిక్ ప్రోగ్రాం, సరస్వతీ నాదస్వర బృందం, పామరు వారిచే క్లాసికల్ సన్నాయి మేళం లతో గణేష్ నిమజ్జనాన్ని రేపల్లె పెనుమూడి కృష్ణ నది వద్ద నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.2
- ఇబ్రహీంపట్నంలో గంజాయి నిర్మూలనకు ఖాకీ నిఘా: సీఐ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో భారీ అవగాహన ఎన్టీఆర్ జిల్లా. ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ సిపి రాజశేఖర్ బాబు ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నంలో మత్తుపదార్థాల రహిత ర్యాలీ. సమాజమే లక్ష్యంగా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్, ఏ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో గంజాయి నివారణకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. గంజాయి మూలాలను పూర్తిగా నిర్మూలించేందుకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే, *ఇబ్రహీంపట్నం సర్కిల్* *ఇన్‌స్పెక్టర్ (సీఐ)* *సుబ్రహ్మణ్యంఆధ్వర్యంలో* పట్టణవ్యాప్తంగా శనివారం ఒక భారీ అవగాహన ర్యాలీని నిర్వహించారు.పట్టణంలోని ముఖ్య కూడళ్ల గుండా సాగిన ఈ ర్యాలీ అనంతరం, ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ వద్ద పోలీసులు ప్రజలను, యువతను ఉద్దేశించి మాట్లాడారు. గంజాయి, డ్రగ్స్ వంటి వ్యసనాలకు బానిస కావడం వల్ల జీవితాలు ఏ విధంగా నాశనమవుతాయో సీఐ సుబ్రహ్మణ్యం క్షేత్రస్థాయి ఉదాహరణలతో వివరించారు.యువతే లక్ష్యంగా అవగాహన:ఈ సందర్భంగా సీఐ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, యువత క్షణికానందం కోసం మత్తు వైపు మళ్లీ తమ బంగారు భవిష్యత్తును పాడుచేసుకోవద్దని హితవు పలికారు. గంజాయి వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక నష్టాలను, చట్టపరమైన దుష్ఫలితాలను యువతకు స్పష్టంగా వివరించారు. విద్యార్థులు, యువత చదువుపై, కెరీర్‌పై దృష్టి పెట్టాలని కోరారు.ప్రజలు సమాచారం అందించాలి:ఇబ్రహీంపట్నం పరిధిలో ఎక్కడైనా గంజాయి విక్రయించినా, రవాణా చేసినా లేదా నిల్వ ఉంచినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సీఐ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా రహస్యంగా ఉంచుతామని ఆయన హామీ ఇచ్చారు. సమాజ సంక్షేమం కోసం ప్రజలందరూ పోలీసులతో చేతులు కలిపి, గంజాయి రహిత ఇబ్రహీంపట్నంగా మార్చడానికి సహకరించాలని కోరారు.1
- రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రయాణికుడిని కాపాడిన అనకాపల్లి జిల్లా హెడ్ కానిస్టేబుల్ తుని రైల్వే స్టేషన్‌లో రైలు కిందపడి తీవ్ర గాయాలపాలైన ఓ ప్రయాణికుడి ప్రాణాలను అనకాపల్లి జిల్లా ఎలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ చంద్రరావు (HC-496) ప్రాణాలకు తెగించి కాపాడి మానవత్వాన్ని చాటుకున్నారు.విశాఖపట్నం నుండి అలప్పీ వెళ్తున్న ధన్‌బాద్ ఎక్స్‌ప్రెస్ తుని రైల్వే స్టేషన్ సమీపంలో నెమ్మదిగా కదులుతున్న సమయంలో ఓ గుర్తు తెలియని ప్రయాణికుడు రైలు ఎక్కేందుకు ప్రయత్నించి అదుపుతప్పి బోగీ కింద పట్టాలపై పడిపోయాడు. ఈ ప్రమాదంలో ఆ ప్రయాణికుడికి తీవ్ర గాయాలయ్యాయి. అక్కడ ఉన్న పలువురు భయంతో వీడియోలు తీస్తూ ఉండిపోగా అదే రైలులో ప్రయాణిస్తున్న హెడ్ కానిస్టేబుల్ చంద్రరావు క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే స్పందించారు.రైలు ఆగిన వెంటనే కిందకు దిగి, ఏమాత్రం సంకోచించకుండా బోగీ కిందకు పాకుతూ వెళ్లి తీవ్ర గాయాలతో పట్టాల మధ్య చిక్కుకున్న ప్రయాణికుడిని ఒడుపుగా బయటకు లాగి రక్షించారు. అనంతరం బాధితుడిని చికిత్స నిమిత్తం అత్యవసరంగా సమీప ఆసుపత్రికి తరలించేలా చర్యలు తీసుకున్నారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ప్రయాణికుడిని రక్షించిన హెడ్ కానిస్టేబుల్ చంద్రరావు సాహసానికి రైల్వే సిబ్బంది, ప్రయాణికులు మరియు ఎలమంచిలి రూరల్ ఎస్సై ఉపేంద్ర ఇతర ఉన్నతాధికారులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. విధి నిర్వహణలోనే కాకుండా ఎల్లవేళలా ప్రజల రక్షణే పోలీసుల ధ్యేయం అని చంద్రరావు నిరూపించారని స్థానికులు కొనియాడారు.1
- ఒడిశా నుంచి గంజాయి తరలిస్తున్న పాత నేరస్థుడి అరెస్టు : రూ. 75 వేల విలువైన 15 కేజీల గంజాయి స్వాధీనం ఒడిశా రాష్ట్రం నుంచి అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఓ పాత నేరస్థుడిని గన్నవరం పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ. 75,000 విలువైన 15 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గన్నవరం పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సబ్ డివిజన్ డీఎస్పీ ధర్మేంద్ర కేసు వివరాలను వెల్లడించారు. పల్నాడు జిల్లా కారంపూడి గ్రామానికి చెందిన కుంచపు సురేశ్ (25) అనే యువకుడు గతంలో విశాఖపట్నంలో గంజాయి కేసులో అరెస్టు అయ్యాడు. జైలులో ఉన్న సమయంలో ఒడిశాకు చెందిన వెంకట్ అనే గంజాయి స్మగ్లర్‌తో అతనికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో ఒడిశాలో కిలో రూ. 5,000 చొప్పున గంజాయి కొనుగోలు చేసి, ఇక్కడికి తరలిస్తున్నాడు. నమ్మదగిన సమాచారం మేరకు గన్నవరం ఎస్ఐ, ఈగల్ టీమ్ సిబ్బంది కలిసి గస్తీ నిర్వహిస్తుండగా... నిందితుడు సురేశ్ అనుమానాస్పదంగా కనిపిస్తూ పట్టుబడ్డాడు. అతని బ్యాగును తనిఖీ చేయగా 15 కేజీల గంజాయి లభ్యమైంది. దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని గంజాయిని సీజ్ చేశారు.నిందితుడు సురేశ్‌పై గతంలోనే విశాఖపట్నంలో రెండు గంజాయి కేసులు ఉన్నాయి. ఈ ఏడాది మార్చి నెలలో కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి రవాణా చేస్తూ పట్టుబడిన అతను, విశాఖపట్నం సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవించాడు. గత జూన్ నెలలోనే కోర్టు నుంచి షరతులతో కూడిన బెయిల్ పొంది జైలు నుంచి విడుదలయ్యాడు. బయటకు వచ్చినప్పటికీ బుద్ధి మార్చుకోకుండా మళ్లీ గంజాయి దందాకు తెరలేపాడు.గన్నవరం సబ్ డివిజన్ పరిధిలో గంజాయి రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపుతున్నామని డీఎస్పీ ధర్మేంద్ర స్పష్టం చేశారు. ఇప్పటివరకు గన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలోనే 140 కేజీల గంజాయిని పట్టుకున్నట్లు తెలిపారు. మొత్తంగా సబ్ డివిజన్ వ్యాప్తంగా ఇప్పటివరకు 632 కేజీల గంజాయిని సీజ్ చేసి, 38 కేసులు నమోదు చేశామని, ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్న 142 మంది ముద్దాయిలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని మీడియాకు వివరించారు. గంజాయి రహిత సమాజం కోసం తనిఖీలు మరింత ముమ్మరం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో గన్నవరం సీఐ శివప్రసాద్, ఎస్సై శ్రీధర్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.1