పదో తరగతి పరీక్ష రాసే విద్యార్థులకు ఆర్టిసి బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం జిల్లా రవాణా అధికారి. శ్రీకాకుళం మార్చి 11,పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపిఎస్ఆర్టిసి) తీపి కబురు అందించింది. పరీక్షల కాలంలో విద్యార్థులు తమ నివాస ప్రాంతాల నుండి పరీక్షా కేంద్రాలకు సురక్షితంగా, ఉచితంగా చేరుకునేందుకు ప్రత్యేక సౌకర్యాన్ని కల్పించింది.10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులు మార్చి 16, 2026 నుండి ఏప్రిల్ 01, 2026 వరకు.పల్లెవెలుగు మరియు అల్ట్రా పల్లెవెలుగు సర్వీసులలో మాత్రమే.విద్యార్థులు తమకు జారీ చేయబడిన హాల్ టికెట్ చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చు. శ్రీకాకుళం జిల్లా ప్రజా రవాణా అధికారి సిహెచ్. అప్పల నారాయణ మాట్లాడుతూ, విద్యార్థులు ఎటువంటి ప్రయాణ ఇబ్బందులు లేకుండా పరీక్షలకు సకాలంలో చేరుకోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రం వరకు వెళ్లేందుకు మరియు తిరిగి వచ్చేందుకు విద్యార్థులు తమ హాల్ టికెట్లను కండక్టర్లకు చూపి ఈ ఉచిత ప్రయాణ సదుపాయాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. పరీక్షలు జరిగే రోజుల్లో మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుంది. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఒత్తిడి లేకుండా పరీక్షలకు హాజరు కావాలని ఆర్టీసీ యాజమాన్యం ఆకాంక్షిస్తోంది.
పదో తరగతి పరీక్ష రాసే విద్యార్థులకు ఆర్టిసి బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం జిల్లా రవాణా అధికారి. శ్రీకాకుళం మార్చి 11,పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపిఎస్ఆర్టిసి) తీపి కబురు అందించింది. పరీక్షల కాలంలో విద్యార్థులు తమ నివాస ప్రాంతాల నుండి పరీక్షా కేంద్రాలకు సురక్షితంగా, ఉచితంగా చేరుకునేందుకు ప్రత్యేక సౌకర్యాన్ని కల్పించింది.10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులు మార్చి 16, 2026 నుండి ఏప్రిల్ 01, 2026 వరకు.పల్లెవెలుగు మరియు అల్ట్రా పల్లెవెలుగు సర్వీసులలో మాత్రమే.విద్యార్థులు తమకు జారీ చేయబడిన హాల్
టికెట్ చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చు. శ్రీకాకుళం జిల్లా ప్రజా రవాణా అధికారి సిహెచ్. అప్పల నారాయణ మాట్లాడుతూ, విద్యార్థులు ఎటువంటి ప్రయాణ ఇబ్బందులు లేకుండా పరీక్షలకు సకాలంలో చేరుకోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రం వరకు వెళ్లేందుకు మరియు తిరిగి వచ్చేందుకు విద్యార్థులు తమ హాల్ టికెట్లను కండక్టర్లకు చూపి ఈ ఉచిత ప్రయాణ సదుపాయాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. పరీక్షలు జరిగే రోజుల్లో మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుంది. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఒత్తిడి లేకుండా పరీక్షలకు హాజరు కావాలని ఆర్టీసీ యాజమాన్యం ఆకాంక్షిస్తోంది.
- విజయనగరం జిల్లా రామభద్రపురంలోని టి.బి.ఆర్ థియేటర్ సమీపంలో బుధవారం బస్సు–లారీ ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులకు చిన్నపాటి గాయాలు అయ్యాయి. ఘటన జరిగిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకుని గాయపడిన వారికి సహాయం చేశారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం కారణంగా కొంతసేపు ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు...2
- అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం రాప పంచాయతీకి చెందిన నలుగురు అక్కాచెల్లెళ్లు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారారు. 2020లో తండ్రి మరణించగా, 2025లో తల్లి కూడా చనిపోవడంతో వారు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఎవరూ ఆదుకునే వారు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గోమంగి అంజలి ఆవేదన వ్యక్తం చేసింది. తమ పరిస్థితిని వివరిస్తూ ఓ వీడియో విడుదల చేసిన అక్కాచెల్లెళ్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి తమను ఆదుకోవాలని వేడుకున్నారు. ప్రభుత్వం తమకు ఆర్థిక సహాయం అందించి జీవనోపాధి కల్పించాలని కోరారు.1
- Post by Shyam1
- పెదబయలు మండలంలోని గల్లెల, గోమంగి, కిముడుపల్లి పంచాయతీల పరిధిలోని గ్రామాలలో ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ నాయకులు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో సమావేశమై షెడ్యూల్డ్ ప్రాంతాల్లో స్థానిక ఆదివాసీలకు ఉద్యోగాల్లో ప్రాధాన్యత కల్పించేలా ప్రత్యేకంగా షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగాల నియామక చట్టాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ అల్లూరి సీతారామరాజు జిల్లా చైర్మన్ రామారావు దొర మాట్లాడుతూ, షెడ్యూల్డ్ ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసీలకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులు ఆదివాసీలకు పూర్తిగా అమలు కావాలని, స్థానికులకు న్యాయం జరిగే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని తెలిపారు1
- తన కళ్ళెదురుగా జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు తన మానవత్వాన్ని చాటుకున్నారు.బుధవారం మండపేట నుండి ద్వారపూడి వైపు వెళుతున్న ఆటో, ద్వారపూడి నుండి మండపేట వస్తున్న మోటార్ సైకిల్ తాపేశ్వరం మలుపులో రెండూ ఒకదానినొకటి ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాద తీవ్రతకు ఆటో పల్టీ కొట్టింది. దీంతో ఆటో లో వెళుతున్న ఆరుగురు, మోటార్ సైకిల్ పై వస్తున్న ఇద్దరూ గాయాలపాలయ్యారు. సరిగ్గా అదే సమయంలో అటుగా వస్తున్న ఎమ్మెల్యే వేగుళ్ళ ఈ ప్రమాదాన్ని చూసి వెంటనే స్పందించారు. మరో ఆలోచన లేకుండా క్షతగాత్రులను తన కార్ లో మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులతో మాట్లాడి బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఎమ్మెల్యే వేగుళ్ళ సేవాభావాన్ని పలువురు ప్రశంసించారు.1
- 🙏😭1
- *50శాతం అపరాధ రుసుము సబ్సిడీ తో మార్చి 31 వరకు రిజిస్ట్రేషన్ కు అవకాశం* *ఏపీ రెరా చైర్మన్ ఆర్. ఎస్.శివారెడ్డి* విజయనగరం, మార్చి 11: రాష్ట్రం లో 500 చదరపు మీటర్లు లేదా 8 అపార్ట్మెంట్ కంటే ఎక్కువగా కలిగిన ప్రతి హోసింగ్ ప్రోజెక్ట్ ఎ పి రెరా అథారిటీ వద్ద తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఏపీ రెరా చైర్మన్ ఆర్. ఎస్.శివారెడ్డి తెలిపారు. రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత, బాధ్యత మరియు వినియోగదారుల హక్కుల పరిరక్షణను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (APRERA) ఆధ్వర్యంలో రెరా చట్టం, 2016 నిబంధనలు, వాటి అమలు విధానం పై అవగాహన కార్యక్రమాన్ని బుధవారం ఉదయం హోటల్ ఎస్‌విఎన్ లేక్ ప్యాలస్ లో నిర్వహించారు. అవగాహన సదస్సు కు విజయనగరం మరియు శ్రీకాకుళం జిల్లాలకు చెందిన రియల్ ఎస్టేట్ రంగ ప్రమోటర్లు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, ఇంజినీర్లు, ఆర్కిటెక్టులు, చార్టర్డ్ అకౌంటెంట్లు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది మరియు గృహ కొనుగోలుదారులు హాజరయ్యారు. ఈ అవగాహన కార్యక్రమంలో ఏపీ రెరా చైర్మన్ ఆర్. ఎస్. శివారెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ రంగం తరువాత అత్యధిక ప్రాధాన్యత కలిగిన ఆర్ధిక రంగం నిర్మాణరంగమని తెలిపారు. నిర్మాణదారులకు, కొనుగోలుదారులకు ఇబ్బందులు రాకుండా, కొనుగోలుదారుల సంక్షేమమే అంతిమలక్ష్యంగా రేరా అథారిటీ ఏర్పాటు చేయడం జరిగిందని అయన తెలిపారు. రేరా చట్టం పై ప్రజలకు, నిర్మాణదారులకు అవగాహన కల్పించే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా 13 పాత జిల్లాలలో అవగాహన కార్యక్రమంలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పురోగతిలో నిర్మాణరంగం కీలకపాత్ర పోషిస్తుందన్నారు. నిర్మాణరంగం అభివృద్ధికి, కొనుగోలుదారుల రక్షణ, సంక్షేమానికి రెరా చట్టం రూపొందించడం జరిగిందని అన్నారు. 500 చదరపు మీటర్లు విస్తీర్ణం లేదా ఎనిమిది అపార్ట్మెంట్లు పైబడిన ప్రతి ప్రాజెక్టు రేరా అథారిటీ వద్ద తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. రేరా వద్ద రిజిస్ట్రేషన్ పొందని ప్రాజెక్టులపై ప్రాజెక్ట్ వ్యయంలో పది శాతం అపరాధం రుసుము విధించనున్నట్లు తెలిపారు. ఇప్పుడు వరకు రిజిస్ట్రేషన్ చేయించుకోని ప్రాజెక్టులకు మార్చి 31 వరకు యాబది శాతం అపరాధ రుసుము సబ్సిడీతో రిజిస్ట్రేషన్ కు అవకాశం కల్పించడం జరిగిందని, కావున ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. నిర్మాణ రంగంలో వచ్చే సమస్యలు, ఫిర్యాదులు రేరా అథారిటీ ద్వారా మాత్రమే పరిష్కారం చేయడం జరుగుతుందన్నారు. నిర్మాణదారులు తాము చేపడుతున్న ప్రాజెక్టులలో వాస్తవంగా కల్పిస్తున్న సౌకర్యాలను మాత్రమే వినియోగదారులకు తెలియజేయాలని, అగ్రిమెంట్లో పొందుపరచుకోవాలని తెలిపారు. అగ్రిమెంట్లో పొందుపరిచిన విధంగా ప్రాజెక్టు పూర్తి చేయకపోయినా, వసతులు కల్పించకపోయిన పోయినా ఫిర్యాదుల మేరకు రేరా చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. రెరా చట్టంపై నిర్మాణదారులు, కొనుగోలుదారులు అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ప్రాజెక్టులు చేపట్టుటకు రిజిస్ట్రేషన్, త్రైమాసిక నివేదికలు సమర్పణ, ప్రాజెక్టు పూర్తయిన పిదప అపార్ట్మెంట్ అసోసియేషన్ ఏర్పాటు చేసి వారికి అప్పగించడం ద్వారా రేరా చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయడం జరుగుతుందన్నారు. అపార్ట్మెంట్ అప్పగించిన ఐదు సంవత్సరాల వరకు ఒప్పందం అమలులో ఉంటుందని తెలిపారు. 10 శాతం మార్టిగేజ్ స్థలం విడిపించుకోవాలన్నా, ప్రాజెక్టుకు బ్యాంకు రుణం పొందాలన్నా రేరా రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్ తో పాటు రెరా అసిస్టెంట్ డైరెక్టర్ జివిజిఎస్ వరప్రసాద్, సభ్యులు రాజశేఖర్ రెడ్డి, కామేశ్వరరావు, శివారెడ్డి, వెంకటరత్నం, శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, జె. కులదీప్ రెరా చట్టం–2016లోని ముఖ్య నిబంధనలు, ప్రాజెక్టుల నమోదు విధానం, సమయపాలన, ఆర్థిక పారదర్శకత, వినియోగదారుల హక్కులు మరియు బాధ్యతలు తదితర అంశాలపై సమగ్రంగా వివరించారు. ప్రతినిధుల సందేహాలకు సమాధానాలు తెలిపారు.1
- Post by Shyam1
- 🙏😭1