logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

హోసింగ్ ప్రోజెక్ట్ లకు రెరా అథారిటీ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలి *50శాతం అపరాధ రుసుము సబ్సిడీ తో మార్చి 31 వరకు రిజిస్ట్రేషన్ కు అవకాశం* *ఏపీ రెరా చైర్మన్ ఆర్. ఎస్.శివారెడ్డి* విజయనగరం, మార్చి 11: రాష్ట్రం లో 500 చదరపు మీటర్లు లేదా 8 అపార్ట్మెంట్ కంటే ఎక్కువగా కలిగిన ప్రతి హోసింగ్ ప్రోజెక్ట్ ఎ పి రెరా అథారిటీ వద్ద తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఏపీ రెరా చైర్మన్ ఆర్. ఎస్.శివారెడ్డి తెలిపారు. రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత, బాధ్యత మరియు వినియోగదారుల హక్కుల పరిరక్షణను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (APRERA) ఆధ్వర్యంలో రెరా చట్టం, 2016 నిబంధనలు, వాటి అమలు విధానం పై అవగాహన కార్యక్రమాన్ని బుధవారం ఉదయం హోటల్ ఎస్‌విఎన్ లేక్ ప్యాలస్ లో నిర్వహించారు. అవగాహన సదస్సు కు విజయనగరం మరియు శ్రీకాకుళం జిల్లాలకు చెందిన రియల్ ఎస్టేట్ రంగ ప్రమోటర్లు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, ఇంజినీర్లు, ఆర్కిటెక్టులు, చార్టర్డ్ అకౌంటెంట్లు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది మరియు గృహ కొనుగోలుదారులు హాజరయ్యారు. ఈ అవగాహన కార్యక్రమంలో ఏపీ రెరా చైర్మన్ ఆర్. ఎస్. శివారెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ రంగం తరువాత అత్యధిక ప్రాధాన్యత కలిగిన ఆర్ధిక రంగం నిర్మాణరంగమని తెలిపారు. నిర్మాణదారులకు, కొనుగోలుదారులకు ఇబ్బందులు రాకుండా, కొనుగోలుదారుల సంక్షేమమే అంతిమలక్ష్యంగా రేరా అథారిటీ ఏర్పాటు చేయడం జరిగిందని అయన తెలిపారు. రేరా చట్టం పై ప్రజలకు, నిర్మాణదారులకు అవగాహన కల్పించే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా 13 పాత జిల్లాలలో అవగాహన కార్యక్రమంలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పురోగతిలో నిర్మాణరంగం కీలకపాత్ర పోషిస్తుందన్నారు. నిర్మాణరంగం అభివృద్ధికి, కొనుగోలుదారుల రక్షణ, సంక్షేమానికి రెరా చట్టం రూపొందించడం జరిగిందని అన్నారు. 500 చదరపు మీటర్లు విస్తీర్ణం లేదా ఎనిమిది అపార్ట్మెంట్లు పైబడిన ప్రతి ప్రాజెక్టు రేరా అథారిటీ వద్ద తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. రేరా వద్ద రిజిస్ట్రేషన్ పొందని ప్రాజెక్టులపై ప్రాజెక్ట్ వ్యయంలో పది శాతం అపరాధం రుసుము విధించనున్నట్లు తెలిపారు. ఇప్పుడు వరకు రిజిస్ట్రేషన్ చేయించుకోని ప్రాజెక్టులకు మార్చి 31 వరకు యాబది శాతం అపరాధ రుసుము సబ్సిడీతో రిజిస్ట్రేషన్ కు అవకాశం కల్పించడం జరిగిందని, కావున ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. నిర్మాణ రంగంలో వచ్చే సమస్యలు, ఫిర్యాదులు రేరా అథారిటీ ద్వారా మాత్రమే పరిష్కారం చేయడం జరుగుతుందన్నారు. నిర్మాణదారులు తాము చేపడుతున్న ప్రాజెక్టులలో వాస్తవంగా కల్పిస్తున్న సౌకర్యాలను మాత్రమే వినియోగదారులకు తెలియజేయాలని, అగ్రిమెంట్లో పొందుపరచుకోవాలని తెలిపారు. అగ్రిమెంట్లో పొందుపరిచిన విధంగా ప్రాజెక్టు పూర్తి చేయకపోయినా, వసతులు కల్పించకపోయిన పోయినా ఫిర్యాదుల మేరకు రేరా చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. రెరా చట్టంపై నిర్మాణదారులు, కొనుగోలుదారులు అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ప్రాజెక్టులు చేపట్టుటకు రిజిస్ట్రేషన్, త్రైమాసిక నివేదికలు సమర్పణ, ప్రాజెక్టు పూర్తయిన పిదప అపార్ట్మెంట్ అసోసియేషన్ ఏర్పాటు చేసి వారికి అప్పగించడం ద్వారా రేరా చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయడం జరుగుతుందన్నారు. అపార్ట్మెంట్ అప్పగించిన ఐదు సంవత్సరాల వరకు ఒప్పందం అమలులో ఉంటుందని తెలిపారు. 10 శాతం మార్టిగేజ్ స్థలం విడిపించుకోవాలన్నా, ప్రాజెక్టుకు బ్యాంకు రుణం పొందాలన్నా రేరా రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్ తో పాటు రెరా అసిస్టెంట్ డైరెక్టర్ జివిజిఎస్ వరప్రసాద్, సభ్యులు రాజశేఖర్ రెడ్డి, కామేశ్వరరావు, శివారెడ్డి, వెంకటరత్నం, శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, జె. కులదీప్ రెరా చట్టం–2016లోని ముఖ్య నిబంధనలు, ప్రాజెక్టుల నమోదు విధానం, సమయపాలన, ఆర్థిక పారదర్శకత, వినియోగదారుల హక్కులు మరియు బాధ్యతలు తదితర అంశాలపై సమగ్రంగా వివరించారు. ప్రతినిధుల సందేహాలకు సమాధానాలు తెలిపారు.

on 11 March
user_Journalist Naidu
Journalist Naidu
Local News Reporter విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • Post by Rai Narendra
    1
    Post by Rai Narendra
    user_Rai Narendra
    Rai Narendra
    Wedding planner విశాఖపట్నం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • పాలకొండ-రాజాం ప్రధాన రహదారిపై యాక్సిడెంట్
    1
    పాలకొండ-రాజాం ప్రధాన రహదారిపై యాక్సిడెంట్
    user_B.RAJESH
    B.RAJESH
    Local Politician బొబ్బిలి, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • హుకుంపేట మండలం గడుగుపల్లి–కొట్నాపల్లి రహదారిలో శుక్రవారం ఉదయం ప్రమాదం జరిగింది. అరకు నుంచి పాడేరు వైపు వస్తున్న పాల వ్యాన్ డ్రైవర్‌కు నిద్ర రావడంతో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వ్యాన్ కింద డ్రైవర్ చేయి ఇరుక్కుపోవడంతో విరిగినట్లు సమాచారం. స్థానికులు వెంటనే స్పందించి వాహనాన్ని పైకి లేపి క్షతగాత్రుడిని బయటకు తీశారు. అనంతరం అతడిని చికిత్స నిమిత్తం పాడేరు ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    1
    హుకుంపేట మండలం గడుగుపల్లి–కొట్నాపల్లి రహదారిలో శుక్రవారం ఉదయం ప్రమాదం జరిగింది. అరకు నుంచి పాడేరు వైపు వస్తున్న పాల వ్యాన్ డ్రైవర్‌కు నిద్ర రావడంతో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
వ్యాన్ కింద డ్రైవర్ చేయి ఇరుక్కుపోవడంతో విరిగినట్లు సమాచారం. స్థానికులు వెంటనే స్పందించి వాహనాన్ని పైకి లేపి క్షతగాత్రుడిని బయటకు తీశారు. అనంతరం అతడిని చికిత్స నిమిత్తం పాడేరు ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    user_Nava surya
    Nava surya
    జర్నలిస్ట్ డుంబ్రిగూడ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • Post by Shyam
    1
    Post by Shyam
    user_Shyam
    Shyam
    Department of Social Services పాడేరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • Joining Avvandi WhatsApp Group lo
    1
    Joining Avvandi WhatsApp Group lo
    user_Siddu
    Siddu
    Business Networking Company పాడేరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • పాతపట్నం మండలం పెద్దసరియాపల్లి గ్రామంలో ఉన్న అంగన్ వాడి శుక్రవారం ఉచి తహోమియో వైద్యశిబిరం నిర్వహించారు. తెంబూరు ప్రభుత్వ హోమియో వైద్యశాల వైద్యాధికారినీ డాక్టర్ ఎస్. ఉమాగౌరీ చిన్న పిల్లలకు, బాలింతలకు, సాధారణ నొప్పులకు తనిఖీలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెంబూరు ప్రభుత్వ హోమియో వైద్య శాల ఫార్మసిస్ట్ దివ్య రెడ్డి, అంగన్ వాడి బి. పద్మ ఉన్నారు.
    3
    పాతపట్నం మండలం పెద్దసరియాపల్లి గ్రామంలో ఉన్న అంగన్ వాడి శుక్రవారం ఉచి తహోమియో వైద్యశిబిరం నిర్వహించారు. తెంబూరు ప్రభుత్వ హోమియో వైద్యశాల వైద్యాధికారినీ డాక్టర్ ఎస్. ఉమాగౌరీ చిన్న పిల్లలకు, బాలింతలకు, సాధారణ నొప్పులకు తనిఖీలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెంబూరు ప్రభుత్వ హోమియో వైద్య శాల ఫార్మసిస్ట్ దివ్య రెడ్డి, అంగన్ వాడి బి. పద్మ ఉన్నారు.
    user_BHEEMARAO BYPALLI
    BHEEMARAO BYPALLI
    కోటబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం నందిగామ మండలం శైలాడ గ్రామంలో ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో గురువారం విశేష పూజలు నిర్వహించారు ఈ పూజల్లో భాగంగా స్వామివారి పంచరాత్రి కళ్యాణం సామ్రాజ్య పట్టాభిషేకం సామూహిక పూజలు నిర్వహించారు విధాత శ్రీ నాగేశ్వర శర్మ ఆధ్వర్యంలో విశేష పూజలు చేసి భక్తులకు ముత్యాల తలంబ్రాలు పంచిపెట్టారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థప్రసాద్ స్వీకరించారు అనంతరం స్వామి వారి శోభాయాత్ర ఊరేగింపు వైభవంగా నిర్వహించారు.
    1
    శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం నందిగామ మండలం శైలాడ గ్రామంలో ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో గురువారం విశేష పూజలు నిర్వహించారు ఈ పూజల్లో భాగంగా స్వామివారి పంచరాత్రి కళ్యాణం సామ్రాజ్య పట్టాభిషేకం సామూహిక పూజలు నిర్వహించారు విధాత శ్రీ నాగేశ్వర శర్మ ఆధ్వర్యంలో విశేష పూజలు చేసి భక్తులకు ముత్యాల తలంబ్రాలు పంచిపెట్టారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థప్రసాద్ స్వీకరించారు అనంతరం స్వామి వారి శోభాయాత్ర ఊరేగింపు వైభవంగా నిర్వహించారు.
    user_Pokala Nagesh Kumar
    Pokala Nagesh Kumar
    జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • Post by Rai Narendra
    1
    Post by Rai Narendra
    user_Rai Narendra
    Rai Narendra
    Wedding planner విశాఖపట్నం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.