పాడేరులో ఘనంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు – ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు కేంద్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి వేడుకలను జరుపుకున్నారు. పార్టీ స్థాపకులు మరియు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సేవలను స్మరించుకుంటూ, పార్టీ అభివృద్ధి కార్యక్రమాలను కొనియాడారు. ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.

- ఆపరేషన్ వజ్రప్రహార్లో భాగంగా మన్యం జిల్లా నగర పంచాయతీ పాలకొండలోని రెల్లివీధిలో శుక్రవారం ఉదయం పోలీసులు కార్డెన్ సెర్చ్ చేపట్టారు. ఈనెల 14న డీఎస్పీ ఆధ్వర్యంలో మెగా కార్డెన్ సెర్చ్ చేపడతున్నట్లు సీఐ ఏ.ప్రసాదరావు తెలిపారు. మాదకద్రవ్యాల నియంత్రణలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. మాదకద్రవ్యాల ముప్పును నిర్మూలించడమే లక్ష్యంగా పేర్కొన్నారు. ఈ కార్య క్రమంలో ఎస్ఐ డి.వెంకన్న, సిబ్బంది పాల్గొన్నారు.1
- ప్రత్తిపాడుకి, పులికి మధ్య విడదీయలేని సంబంధం ఉన్నట్లు కనిపిస్తోంది. 2022లో ఏలేశ్వరం, రౌతులపూడి ప్రాంతాల్లో నెలల తరబడి తిరుగుతూ ముప్పుతిప్పలు పెట్టిన పులి.. అధికారుల ప్రయత్నాలు ఫలించకుండానే దానంతట అదే వెళ్లిపోయింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత ప్రస్తుతం మళ్లీ ఇంకో పులి ప్రత్తిపాడులోనే మకాం వేయడం, పట్టుబడకపోవడంతో అప్పటిలాగే ఇది కూడా అదే వెళ్లిపోతుందా అని అప్పటి జ్ఞపకాలను నెమరువేసుకుంటున్నారు.1
- ysrcp1
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శుక్రవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం సిద్ధాంత పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా సజావుగా ముగిశాయని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ రోజు నిర్వహించిన కెమిస్ట్రీ పేపర్–II మరియు కామర్స్ పేపర్–II పరీక్షలకు జిల్లాలో ఏర్పాటు చేసిన 37 పరీక్షా కేంద్రాలలో మొత్తం 7,885 మంది అభ్యర్థులు కేటాయించగా, అందులో 7,641 మంది పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. 244 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలిపారు . పరీక్షల సందర్భంగా ఎటువంటి మాల్ ప్రాక్టీస్ ఘటనలు నమోదు కాలేదని తెలిపారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు సమగ్రంగా నిర్వహించబడినట్లు చెప్పారు.2
- Post by Naresh Koppula5
- మచిలీపట్నంలో గురువారం రాత్రి రామనాయుడుపేట సెంటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని అక్కడ జెండా దిమ్మ నిర్మించేందుకు జనసేన శ్రేణులు ఏర్పాట్లు చేపట్టాయి. అయితే అదే ప్రాంతంలో జెండా దిమ్మ నిర్మించడాన్ని వైఎస్ఆర్‌సీపీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ అడ్డుకున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుని కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను సమాధానపరిచారు. జెండా దిమ్మ నిర్మాణంపై అనుమతుల విషయాన్ని పరిశీలిస్తామని పోలీసులు తెలిపారు. పోలీసుల జోక్యంతో అక్కడి పరిస్థితి క్రమంగా సద్దుమణిగింది. ఘటనతో కొంతసేపు రామనాయుడుపేట సెంటర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.1
- వచ్చే సంవత్సరం జరిగే గోదావరి పుష్కరాలకు చేపట్టబోయే కార్యాచరణ పై భద్రాచలంలో ప్రత్యేక సమావేశం మరియు గోదావరి కరకట్ట పక్కన ఉన్న డంపింగ్ యార్డ్ మరియు శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం జరిగే మిథిలా స్టేడియం లోని పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్, భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు పాయం వెంకటేశ్వర్లు పినపాక శాసనసభ్యులు ఐటీడీఏ పీవో బి రాహుల్, సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట మరియు ఇతర అధికారులు4
- Post by Naresh Koppula4
- మహబూబాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. కొత్తగూడ మండలం కిష్టాపురం గ్రామంలో ఆదివాసీ గిరిజనుల ఆరాధ్య దైవం, బుర్కా వంశీయుల ఇలవేలుపు అయిన గుంజేడు ముసలమ్మ పెద్ద కుమారుడి జాతర అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ‘చిట్టి పండుగ’గా పిలువబడే ఈ వేడుకల్లో గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడుతున్నాయి. ముఖ్యంగా బుర్కా వంశీయుల ఆచారాల ప్రకారం ఈ జాతర మూడు రోజుల పాటు సాగుతుంది. మొదటి రోజు నుండే భక్తులు భారీ సంఖ్యలో కిష్టాపురం గ్రామానికి చేరుకుంటున్నారు. డప్పు చప్పుళ్లు, కొమ్ము బూరల నాదాల మధ్య ఆదివాసీలు తమ ఇలవేలుపును కొలుస్తున్నారు. ముసలమ్మ పెద్ద కుమారుడిని దర్శించుకుని, తమ కుటుంబాలను చల్లగా చూడాలని వేడుకుంటున్నారు. పూజారులు (వడ్డేలు) అత్యంత నిష్టతో పురాతన పద్ధతుల్లో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కేవలం ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే కాకుండా, చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా ఆదివాసీ గిరిజనులు ఈ వేడుకకు తరలివచ్చారు.గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. భక్తిశ్రద్ధలతో పాటు గిరిజన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా ననిలుస్తున్నాయి అడవి తల్లి ఒడిలో, ప్రకృతి సాక్షిగా జరుగుతున్న ఈ జాతరతో కృష్ణపురం గ్రామం ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్థానిక ఆదివాసీ నాయకులు, గ్రామస్తులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.1