రోడ్డును పగలగొట్టి తవ్వడానికి ప్రైవేట్ కేబుల్ వారికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు సిపిఐ పట్టణ కార్యదర్శి శేషు కుమార్ వెల్లడి.. (కోడుమూరు సూర్ న్యూస్ ప్రతినిధి) పట్టణంలో ఒక ప్రైవేట్ సంస్థకు చెందిన కేబుల్ ఉద్యోగులు దగ్గరుండి వారి పని కొరకు తారు రోడ్డు ఇష్టం వచ్చినట్టు యంత్రాలతో పగలగొట్టడంతో భూమిలో ఉన్న గ్రామపంచాయతీ అందించే మంచి నీటి పైపులు పగలడంతో ప్రజలకు ఒకవైపు పగిలిన పైపుల నుంచి ఎర్రమట్టి నీరు అందుతున్నాయి. మరోవైపు గుంతలు పడి అలానే వదిలేసి వెళుతున్నారు. గుంతలు త్రవ్వడంతో చాలా జనం రాత్రిపూట కాలినడక వెళ్లే బాటసారులు అందులో పడి గాయాల పాలు అవుతున్నారు.ఈ విషయంపై స్థానిక సిపిఐ పట్టణ కార్యదర్శి శేషు కుమార్.సహాయ కార్యదర్శి ధూళ భాస్కర్ సంబంధిత కేబుల్ అధికారులను, గ్రామపంచాయతీ అధికారులను ఎంపీడీవోను మీడియా ద్వారా ప్రశ్నిస్తూ ఉద్యమం చేసి తారు రోడ్డును కోడుమూరు పట్టణంకు వేయించుకున్నాం. ఇలాంటి తారు రోడ్డును ప్రైవేట్ కేబుల్ వారు ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా ఇష్టం వచ్చినట్టు రోడ్డును పగలగొట్టి గుంతలు పడేసి మంచినీటి పైపులను పగలగొట్టి అలానే వదిలి పెట్టి వెళ్తే ఎలా అంటూ వారు ప్రశ్నించారు. పగిలిన నీటి పైపులను మరమ్మతులు చేయించాలి. గుంతలను పూడ్చాలి లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని వారు వాట్సాప్ ద్వారా సందేశాన్ని ఒక ప్రకటనలో తెలియజేశారు.
రోడ్డును పగలగొట్టి తవ్వడానికి ప్రైవేట్ కేబుల్ వారికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు సిపిఐ పట్టణ కార్యదర్శి శేషు కుమార్ వెల్లడి.. (కోడుమూరు సూర్ న్యూస్ ప్రతినిధి) పట్టణంలో ఒక ప్రైవేట్ సంస్థకు చెందిన కేబుల్ ఉద్యోగులు దగ్గరుండి వారి పని కొరకు తారు రోడ్డు ఇష్టం వచ్చినట్టు యంత్రాలతో పగలగొట్టడంతో భూమిలో ఉన్న గ్రామపంచాయతీ అందించే మంచి నీటి పైపులు పగలడంతో ప్రజలకు ఒకవైపు పగిలిన పైపుల నుంచి ఎర్రమట్టి నీరు అందుతున్నాయి. మరోవైపు గుంతలు పడి అలానే వదిలేసి వెళుతున్నారు. గుంతలు త్రవ్వడంతో చాలా జనం రాత్రిపూట కాలినడక వెళ్లే బాటసారులు అందులో పడి గాయాల పాలు అవుతున్నారు.ఈ విషయంపై స్థానిక సిపిఐ పట్టణ కార్యదర్శి శేషు కుమార్.సహాయ కార్యదర్శి ధూళ భాస్కర్ సంబంధిత కేబుల్ అధికారులను, గ్రామపంచాయతీ అధికారులను ఎంపీడీవోను మీడియా ద్వారా ప్రశ్నిస్తూ ఉద్యమం చేసి తారు రోడ్డును కోడుమూరు పట్టణంకు వేయించుకున్నాం. ఇలాంటి తారు రోడ్డును ప్రైవేట్ కేబుల్ వారు ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా ఇష్టం వచ్చినట్టు రోడ్డును పగలగొట్టి గుంతలు పడేసి మంచినీటి పైపులను పగలగొట్టి అలానే వదిలి పెట్టి వెళ్తే ఎలా అంటూ వారు ప్రశ్నించారు. పగిలిన నీటి పైపులను మరమ్మతులు చేయించాలి. గుంతలను పూడ్చాలి లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని వారు వాట్సాప్ ద్వారా సందేశాన్ని ఒక ప్రకటనలో తెలియజేశారు.
- రోడ్డును పగలగొట్టి తవ్వడానికి ప్రైవేట్ కేబుల్ వారికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు సిపిఐ పట్టణ కార్యదర్శి శేషు కుమార్ వెల్లడి.. (కోడుమూరు సూర్ న్యూస్ ప్రతినిధి) పట్టణంలో ఒక ప్రైవేట్ సంస్థకు చెందిన కేబుల్ ఉద్యోగులు దగ్గరుండి వారి పని కొరకు తారు రోడ్డు ఇష్టం వచ్చినట్టు యంత్రాలతో పగలగొట్టడంతో భూమిలో ఉన్న గ్రామపంచాయతీ అందించే మంచి నీటి పైపులు పగలడంతో ప్రజలకు ఒకవైపు పగిలిన పైపుల నుంచి ఎర్రమట్టి నీరు అందుతున్నాయి. మరోవైపు గుంతలు పడి అలానే వదిలేసి వెళుతున్నారు. గుంతలు త్రవ్వడంతో చాలా జనం రాత్రిపూట కాలినడక వెళ్లే బాటసారులు అందులో పడి గాయాల పాలు అవుతున్నారు.ఈ విషయంపై స్థానిక సిపిఐ పట్టణ కార్యదర్శి శేషు కుమార్.సహాయ కార్యదర్శి ధూళ భాస్కర్ సంబంధిత కేబుల్ అధికారులను, గ్రామపంచాయతీ అధికారులను ఎంపీడీవోను మీడియా ద్వారా ప్రశ్నిస్తూ ఉద్యమం చేసి తారు రోడ్డును కోడుమూరు పట్టణంకు వేయించుకున్నాం. ఇలాంటి తారు రోడ్డును ప్రైవేట్ కేబుల్ వారు ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా ఇష్టం వచ్చినట్టు రోడ్డును పగలగొట్టి గుంతలు పడేసి మంచినీటి పైపులను పగలగొట్టి అలానే వదిలి పెట్టి వెళ్తే ఎలా అంటూ వారు ప్రశ్నించారు. పగిలిన నీటి పైపులను మరమ్మతులు చేయించాలి. గుంతలను పూడ్చాలి లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని వారు వాట్సాప్ ద్వారా సందేశాన్ని ఒక ప్రకటనలో తెలియజేశారు.1
- తుంగభద్ర ZPH స్కూల్‌లో మాధవరం పోలీసుల అవగాహన కార్యక్రమం సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన1
- ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టు ఖండించిన పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కాంగటి శ్రీదేవి ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షిని అర్థరాత్రి కరుడుగట్టిన నేరస్థుడిలా పోలీసులు అరెస్ట్ చేయడాన్ని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కాంగటి శ్రీదేవి ఖండించారు. టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన వైసీపీ కార్యకర్తను పరామర్శించేందుకు వెళ్లిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవడం అన్యాయమని ఆమె అన్నారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకుండా బాధితులను పరామర్శించిన నాయకుడిని అరెస్ట్ చేయడం సరికాదని ఆమె విమర్శించారు.1
- మహానంది క్షేత్రం లో ఘనంగా ఆషాఢ మాసపు చీరె సారె వేడుకలు మహానంది క్షేత్రంలో శ్రీ కామేశ్వరీ అమ్మవారికి ఆషాఢ మాసపు చీరె సారె కార్యక్రమాన్ని ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు ధనుంజయ రెడ్డి ఆధ్వర్యంలో వందలాది మంది భక్తుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. గరుడనంది నుంచి ప్రారంభమైన శోభాయాత్రను ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్. శ్రీనివాసరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. మాడవీధుల గుండా సంకీర్తనలు, కోలాటాలు, భజనలతో సాగిన శోభాయాత్ర అనంతరం శ్రీ కామేశ్వరీ అమ్మవారు, మహానందీశ్వర స్వామివారికి పట్టువస్త్రాలు, సౌభాగ్య ద్రవ్యాలను భక్తిశ్రద్ధలతో సమర్పించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా నిర్వాహకులు శివమ్మ, లీలావతమ్మ పర్యవేక్షణలో సామూహిక లలితా సహస్రనామ పారాయణం, శివనామ పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.1
- మహానంది పుణ్యక్షేత్రంలో ఆషాఢ మాసపు చీరె సారె కార్యక్రమము ఆషాఢ మాసపు చీరె సారె కార్యక్రమమును శ్రీ కామేశ్వరీ అమ్మవారకి ఈరోజు వందలాదిమంది భక్తులతో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన శ్రీ బాలాజీ సేవ ట్రస్ట్ వారు వ్యవస్థొపకులు ధనుంజయ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా గరుడనంది నుంచి శోభాయాత్రను ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్ శ్రీనివాసరెడ్డి గారు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మాడవీధులగుండా సంకీర్తనలు,కోలాటాలు, భజనలతో కోలాహలంగా నిర్వహించి అనంతరం శ్రీ కామేశ్వరీ మహానందీశ్వర స్వామివార్లకు పట్టువస్త్రాలు, సౌభాగ్య ద్రవ్యాలను భక్తిశ్రద్ధలతో సమర్పించారు. నంద్యాల జిల్లా నిర్వాహకులు శివమ్మ,లీలావతమ్మ,లు పర్యవేక్షించారు. సామూహిక లలితా సహస్రనామ పారాయణ, శివనామ పూజలు నిర్వహించారు.3
- ఎకరాకు 50 వేల రూపాయలు నష్టపరిహారం అందించండి రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు రామాంజనేయులు (కోడుమూరు షూర్ న్యూస్ ప్రతినిధి) రాష్ట్రంలో వర్షాధారం లేక ఏదో పడిన చిన్న చినుకులకు రైతులు ఆశపడి అప్పు చేసి విత్తనాలను తెచ్చి భూమిలో వితుకున్నారు. వర్షం పూర్తిగా వెనక్కు వెళ్లడంతో భూమిలో విత్తిన విత్తనాలు మొలకెత్తి నాలుగు వేళ ఎత్తు మొక్క పెరిగి నీరు లేక భూమిలో తేమ శాతం ఎండిపోయి చివరకు మొక్కలు ఎండిపోతున్నది. ఈ పరిస్థితిని గమనించిన సిపిఐ పార్టీ అనుబంధ సంస్థ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం కార్యవర్గ సభ్యుడు రామాంజనేయులు జగన్నాథం కోడుమూరు మండల వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి ఈశ్వరయ్య ఆచారి మాజీ వార్డు మెంబర్ జి.రామాంజనేయులు సిపిఐ పట్టణ కార్యదర్శి శేషు కుమార్, బోయ రాజు తదితరులు జీపు జాతను ఏర్పాటు చేసి పట్టణంలో ఉన్న వ్యవసాయ భూమిలోకి వెళ్లి నాయకులు ఎండిన మొక్కలను చూసి రైతుతో కలిసి మీడియా ముందు మాట్లాడుతూ రాష్ట్రంలో కర్నూలు జిల్లా అత్యధికంగా వెనుకబడి ఉన్నది వర్షము లేక రైతులు నెత్తిన బట్ట వేసుకొని కంటతడి పెడుతున్నారు.గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లాకు తొమ్మిది సార్లు పర్యటన చేశారు ఒక్కసారి అయినా రైతు గురించి రైతు పొలాల్లో దిగి పరిశీలించారా.? అని నేను కూటమి ప్రభుత్వం లో పనిచేస్తున్న గౌరవ ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్న. లేదు ఆయనకి ఎంతసేపు ఉన్నా రైతులను ప్రజలను అడ్డం పెట్టుకొని ముసలి కన్నీరు కారుస్తూ ముందుకు సాగిపోతున్నారే తప్ప ఏమీ లేదు. సిపిఐ పార్టీ గా రైతుల పక్షాన నిలబడి కర్నూలు జిల్లాలో ఉన్న ప్రతి రైతుకు కూటమి ప్రభుత్వం ఎకరాకు 50,000 వేల రూపాయలు నష్టపరిహారం అందించాలి. లేదంటే ఉద్యమం పెద్ద ఎత్తున కొనసాగిస్తాం అంటూ మీడియా ముందు పత్రిక విలేకరుల ముందు నాయకులు మాట్లాడరు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం జిల్లా నాయకుడు రంగస్వామి, చేనేత సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బుగుడే మాధవస్వామి,రైతులు పాల్గొన్నారు2
- ప్రపంచంలో 7 నదులు ఒకేచోట కలిసే ఏకైక ప్రదేశం.. నంద్యాల జిల్లాలోని సంగమేశ్వరం. పూర్వం ఈ ప్రాంతంలో దక్షయజ్ఞం జరిగిందని,ఆ సమయంలో దక్షుడు సతీదేవిని అవమానించడంతో ఆమె యజ్ఞ వాటికలో పడి మరణించిందని స్థల పురాణం చెబుతోంది. సతీదేవి శరీర నివృత్తి జరిగిన ప్రాంతం కాబట్టి "నివృత్తి సంగమేశ్వరాలయం" గా ప్రసిద్ధి కెక్కింది. పాండవుల వనవాసం సమయంలో ధర్మరాజు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించగా, ఆయన ఆదేశంతో శివలింగం తీసుకురావడానికి కాశీకి వెళ్లిన భీముడు ప్రతిష్ఠ సమయానికి రాకపోవడంతో,రుషుల సూచన మేరకు వేపమొద్దుని శివలింగంగా మలిచి ప్రతిష్ఠించి పూజలు చేశాడు ధర్మరాజు.దీంతో ఆగ్రహం చెందిన భీముడు తాను తెచ్చిన శివలింగాన్ని నదిలో విసిరేశాడు.భీముడిని శాంతింప జేయడానికి అతను తెచ్చిన శివలింగాన్ని నదీ తీరంలోనే ప్రతిష్ఠించి,భీమలింగంగా దానికి పేరు పెట్టాడు.భక్తులు భీమలింగాన్ని దర్శించుకున్న తర్వాతే సంగమేశ్వరున్ని దర్శించుకోవాలని స్థల పురాణం చెప్తోంది.ఈ ఆలయం శ్రీశైలం డ్యామ్ నిర్మాణం తరువాత సంగమేశ్వరాలయం 23 ఏళ్లపాటు నీటిలోనే మునిగిపోయింది.2003 తరువాత శ్రీశైలం డ్యామ్ లో నీటిమట్టం తగ్గినప్పుడు మాత్రమే ఆలయం నీటి నుంచి బయటపడుతుంది. ఈ ఆలయంలో మరో ప్రత్యేక వేల సంవత్సరాల క్రితం సంగమేశ్వరాలయంలో ప్రతిష్ఠించిన "వేపదారులింగం" ఇప్పటికీ చెక్కుచెదరకపోవడం ఆశ్చర్యం కలిగించక మానదు.ప్రపంచంలో 7 నదులు ఒకేచోట కలిసే ఏకైక ప్రదేశం సంగమేశ్వరం.నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలో తుంగ,భద్ర,కృష్ణ,వేణి,భీమ,మలాపహరిణి,భవనాసి నదులు కలిసే ప్రదేశాన్నే సంగమేశ్వరమని పిలుస్తున్నారు.ఈ నదుల్లో భవనాసి నది మాత్రమే పురుషుడు పేరున్న నది,మిగిలినవన్నీ స్త్రీల పేర్లున్న నదులే.భవనాసి నది తూర్పు నుంచి పశ్చిమానికి ప్రవహిస్తే మిగిలిన నదులన్నీ పశ్చిమం నుంచి తూర్పుకు వెళ్తాయి.ఈ నదులన్నీ కలసి జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠం శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని తాకుతూ ప్రవహించి చివరికి సముద్రంలో కలసిపోతాయి.నంద్యాల జిల్లాలోని నందికోట్కూరు,ఆత్మకూరు మండలాల మీదుగా బస్సులు,ఆటోలు,జీపులలో సంగమేశ్వరానికి చేరుకోవచ్చు.1