UPI చెల్లింపులపై టాక్స్ దోపిడీ సరికాదు. సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రవి... తొర్రూరు మహబూబాబాద్ జిల్లా సెప్టెంబర్ 22... బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అని తెచ్చిన GST, UPI చెల్లింపుల మీద పన్ను ప్రజల పై భారం వేసిన, వేస్తున్న విధానాన్ని ఖండిస్తున్నామని Cpi (ml ) మాస్ లైన్ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రవి* అన్నారు .తొర్రూర్ బస్టాండ్ వద్ద నేడు నిరసన తెలియజేశారు.ఫోన్ పే గూగుల్ పే ద్వారా చెల్లింపు 2000 దాటితే సరికాదని సిపిఐ ఎంల్ మాస్ లైన్ నిరసన కార్యక్రమానికి పిలుపు నిచ్చినది. ఈసందర్బంగా రవి మాట్లాడుతు GST పేరుతో ఇప్పటికే ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్నారు. నేడు సాధారణ ప్రజలనందరిని upi చెల్లింపులకు అలవాటు చేసి నేడు టాక్స్ వేసే యత్నం అత్యంత మోసపూరిత చర్య అని అన్నారు. అమెరికా, వీసా, మాస్టర్ కార్డ్ ల వత్తిడి మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ చర్యకు ఉపక్రమించిందని తమ లావాదేవీలకు ఇవి నష్టం తెస్తున్నాయని అమెరికా ఆగ్రహిస్తున్నదని భయంతో, దాని ప్రభావంతో మోడీ ప్రభుత్వం ఈ చర్యకు ఉపక్రమించిటం అన్యాయం అన్నారు.ఇది ప్రజావ్యతిరేక చర్య దీని పై ప్రజలు ఉద్యమబాట పట్టాలన్నారు. అమెరికా ఒత్తిడికి లాగిపోయి కోట్లాదిమంది upi వినియోగదారులపై కేంద్ర ప్రభుత్వం భారం వేసే విధానాలకు అన్ని వర్గాల ప్రజల పై తీవ్ర ప్రభావం పడుతుందని అన్నారు. దేశ ప్రజల కష్టo వచ్చిన డబ్బులను విదేశీ కంపెనీలకు అప్పచెప్పడం సరికాదన్నారు. దేశభక్తి స్వదేశీ విధానం అంటే మోడీ ప్రభుత్వం ట్రంప్ లొంగిపోవడం ఈ దేశ సార్వభౌమాధికారానికి గుడ్డలు పెట్టు అని అన్నారు. మరిన్ని పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తు చేశారు. సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ తొర్రూరు డివిజన్ నాయకులు ముంజంపల్లి వీరన్న, ఉడుగుల రాములు జక్కుల యాకయ్య ఇరుగు అనిల్ దొడ్డ కేశవులు బిక్షం వెంకన్న తదితరులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
UPI చెల్లింపులపై టాక్స్ దోపిడీ సరికాదు. సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రవి... తొర్రూరు మహబూబాబాద్ జిల్లా సెప్టెంబర్ 22... బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అని తెచ్చిన GST, UPI చెల్లింపుల మీద పన్ను ప్రజల పై భారం వేసిన, వేస్తున్న విధానాన్ని ఖండిస్తున్నామని Cpi (ml ) మాస్ లైన్ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రవి* అన్నారు .తొర్రూర్ బస్టాండ్ వద్ద నేడు నిరసన తెలియజేశారు.ఫోన్ పే గూగుల్ పే ద్వారా చెల్లింపు 2000 దాటితే సరికాదని సిపిఐ ఎంల్ మాస్ లైన్ నిరసన కార్యక్రమానికి పిలుపు నిచ్చినది. ఈసందర్బంగా రవి మాట్లాడుతు GST పేరుతో ఇప్పటికే ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్నారు. నేడు సాధారణ ప్రజలనందరిని upi చెల్లింపులకు అలవాటు చేసి నేడు టాక్స్ వేసే యత్నం అత్యంత మోసపూరిత చర్య అని అన్నారు. అమెరికా, వీసా, మాస్టర్ కార్డ్ ల వత్తిడి మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ చర్యకు ఉపక్రమించిందని తమ లావాదేవీలకు ఇవి నష్టం తెస్తున్నాయని అమెరికా ఆగ్రహిస్తున్నదని భయంతో, దాని ప్రభావంతో మోడీ ప్రభుత్వం ఈ చర్యకు ఉపక్రమించిటం అన్యాయం అన్నారు.ఇది ప్రజావ్యతిరేక చర్య దీని పై ప్రజలు ఉద్యమబాట పట్టాలన్నారు. అమెరికా ఒత్తిడికి లాగిపోయి కోట్లాదిమంది upi వినియోగదారులపై కేంద్ర ప్రభుత్వం భారం వేసే విధానాలకు అన్ని వర్గాల ప్రజల పై తీవ్ర ప్రభావం పడుతుందని అన్నారు. దేశ ప్రజల కష్టo వచ్చిన డబ్బులను విదేశీ కంపెనీలకు అప్పచెప్పడం సరికాదన్నారు. దేశభక్తి స్వదేశీ విధానం అంటే మోడీ ప్రభుత్వం ట్రంప్ లొంగిపోవడం ఈ దేశ సార్వభౌమాధికారానికి గుడ్డలు పెట్టు అని అన్నారు. మరిన్ని పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తు చేశారు. సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ తొర్రూరు డివిజన్ నాయకులు ముంజంపల్లి వీరన్న, ఉడుగుల రాములు జక్కుల యాకయ్య ఇరుగు అనిల్ దొడ్డ కేశవులు బిక్షం వెంకన్న తదితరులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
- * CEIR ద్వారా 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. 77 ఫోన్లు బాధితులకు అప్పగింత.... “మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వెంటనే పోలీసులకు సమాచారం అందించి CEIR సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి” * జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ *మహబూబాబాద్ జిల్లా పోలీస్... *ఇప్పటివరకు CEIR పోర్టల్ ద్వారా 2027 మొబైల్ ఫోన్ల రికవరీ.... * 77 ఫోన్లను గుర్తించి ఈరోజు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్,ఐపీఎస్. చేతులమిదిగా బాధితులకు అందజేత..... * CEIR సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి... * జిల్లా ఎస్పీ డా. శబరీష్. ఐపీఎస్.... పోగొట్టుకున్న, చోరీకి గురైన మొబైల్ ఫోన్లను అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి గుర్తించి రికవరీ చేయడంలో మహబూబాబాద్ జిల్లా పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ CEIR (Central Equipment Identity Register) పోర్టల్‌ను సమర్థవంతంగా వినియోగిస్తూ ఇప్పటివరకు జిల్లా పరిధిలో 2,027 మొబైల్ ఫోన్లను రికవరీ చేశారు. జిల్లా ఎస్పీ డా. శబరీష్. పి, ఐపీఎస్ మార్గదర్శకత్వంలో తాజాగా చేపట్టిన ప్రత్యేక చర్యల్లో 77 మొబైల్ ఫోన్లను గుర్తించి రికవరీ చేశారు. రికవరీ చేసిన మొబైల్ ఫోన్లను ఈరోజు మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ కాన్ఫరెన్స్ హాల్ లో సంబంధిత బాధితులకు జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ చేతులమిదిగా అందించడం జరిగింది. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ.... CEIR పోర్టల్ ద్వారా అందుబాటులోకి వచ్చే సాంకేతిక సమాచారాన్ని విశ్లేషిస్తూ, వివిధ ప్రాంతాల్లో వినియోగంలో ఉన్న పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను గుర్తిస్తున్నామని అన్నారు. ఈ ప్రక్రియలో మహబూబాబాద్ డీఎస్పీ, CCS ఇన్‌స్పెక్టర్ హతీరామ్, ఐటీ సెల్ ఎస్‌ఐ జి.వి. కృష్ణారెడ్డి, పీసీ సుమన్, అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్‌హెచ్‌ఓలు, CEIR ఆపరేటర్లు కీలక పాత్ర పోషించారని అన్నారు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నా లేదా చోరీకి గురైనా ప్రజలు వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫోన్‌కు సంబంధించిన IMEI నంబర్, మొబైల్ నంబర్ తదితర వివరాలను పోలీసులకు అందించాలని తెలిపారు. CEIR పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న లేదా చోరీకి గురైన మొబైల్ ఫోన్‌ను బ్లాక్ చేయడంతో పాటు, అందుబాటులో ఉన్న సాంకేతిక సమాచారాన్ని విశ్లేషించి ఫోన్‌ను గుర్తించే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రజలు మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వెంటనే పోలీసులకు సమాచారం అందించి CEIR సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ కోరారు. ప్రజల ఆస్తి పరిరక్షణలో భాగంగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ పోగొట్టుకున్న, చోరీకి గురైన మొబైల్ ఫోన్లను గుర్తించి బాధితులకు తిరిగి అందజేసేందుకు జిల్లా పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని ఎస్పీ తెలిపారు.....2
- శ్రీ విజ్ఞేశ్వర స్వామి వారి రూపంలో పాలకుర్తి శ్రీ సోమేశ్వర స్వామి జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ప్రసిద్ధిగాంచిన కోరిన కోరికలు తీరుస్తూ భక్తుల పాలిట కొంగు బంగారంలా వెలసిల్లుతు ఎత్తయిన కొండల మధ్య వెలసి యున్న శ్రీ చండికా సమేత సోమేశ్వర వారికి గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా స్వామివారిని అన్న ప్రసాదంతో శ్రీ విఘ్నేశ్వర స్వామి రూపంలో ఆలయ పంచాంగ కర్త వేద పండితులు మత్తంగజం నాగరాజ్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక అలంకరణ నిర్వహించారు.1
- డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల 'డ్రా' రద్దు చేయాలి: రోడ్డుపై రాస్తారోకో జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల కేటాయింపు వివాదం తీవ్ర రూపాన్ని దాల్చింది. అర్హులైన నిరుపేద లబ్ధిదారులకు న్యాయం చేయాలని, కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు నిర్వహించిన డ్రా సిస్టమ్‌ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామానికి చెందిన పలు నిరుపేద కుటుంబాలు మంగళవారం రోడ్డు పై బైఠాయించి భారీ రాస్తారోకో నిర్వహించాయి. గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరిగిందని ఆందోళనకారులు ఆరోపించారు. నిజమైన నిరుపేదలను, ఇండ్లు లేని కూలీలను పక్కనబెట్టి అర్హత లేని వారికి డ్రా పద్ధతి ద్వారా ఇండ్లను కేటాయించారని వారు మండిపడ్డారు. కలెక్టర్ జారీ చేసిన ప్రస్తుత డ్రా విధానం వల్ల అర్హులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్తంభించిన ట్రాఫిక్ – అధికారుల వేచిచూసే ధోరణి: బాధిత కుటుంబాలు రోడ్డుపై ఇండ్ల సామాగ్రి, వంట పాత్రలతో బైఠాయించడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. "న్యాయం జరిగే వరకు కదిలేది లేదు" అంటూ నిరుపేదలు ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అర్హుల జాబితాను పునఃసమీక్షించి, క్షేత్రస్థాయిలో నిజమైన పేదలను గుర్తించిన తర్వాతే ఇండ్ల కేటాయింపు జరపాలని వారు పట్టుబట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు మరియు రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చలు జరుపుతున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని నిరుపేదలు స్పష్టం చేయడంతో గూడూరు గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.1
- బ్రేకింగ్ న్యూస్... పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్చార్జి తంబూరు దయాకర్ రెడ్డి, రామ సహాయం నరేష్ రెడ్డి కార్లపై రాళ్ల దాడి తిరుమలాయపాలెం మండలం సిద్ధండ లో అన్నదాన కార్యక్రమంలో పాల్గొని వస్తుండగా ఘటన తిరుమలయపాలెం :21/09/2026 తిరుమలాయపాలెంలంలోని సుద్దవాగు తండాలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం క్యాంపు కార్యాలయ ఇన్చార్జి తంబూరు దయాకర్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు రామసహాయం నరేష్‌రెడ్డి. తండలో పూజా కార్యక్రమంలో పాల్గొని అన్నదాన కార్యక్రమానికి హాజరైన తిరిగి వస్తున్నసమయంలో వారి కార్లపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడికి పాల్పడినట్లు .అన్నదాన కార్యక్రమం జరుగుతున్న సమయంలో తండాలోని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఆపివేసి, అనంతరం కార్లపై రాళ్లతో దాడికి పాల్పడినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న తిరుమలాయపాలెం ఎస్సై కూచిపూడి జగదీష్ సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ట్రాన్స్‌ఫార్మర్ ఉన్న ప్రాంతాన్ని కూడా పోలీసులు పరిశీలించారు.ఇదిలా ఉండగా, ట్రాన్స్‌ఫార్మర్‌ను ఆపివేసినట్లు ఆనవాళ్లు ఉన్నాయని స్థానికులు పేర్కొంటుండగా, దీనికి సంబంధించి ఎలాంటి ఎల్‌సీ ఇవ్వలేదని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నట్లు సమాచారం. ట్రాన్స్‌ఫార్మర్ ఎలా ఆపివేయబడింది, కార్లపై రాళ్ల దాడికి పాల్పడింది ఎవరు అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడికావాల్సి ఉంది.1
- రావి నారాయణ రెడ్డి 500 ఎకరాలు పంచితే, KCR 440 ఎకరాలు ఎట్లా కొన్నడు - అసలు జాతిపిత ఎవరు?* *రావి నారాయణ రెడ్డి 500 ఎకరాలు పంచితే, KCR 440 ఎకరాలు ఎట్లా కొన్నడు - అసలు జాతిపిత ఎవరు?* 1. తెలంగాణ జాతిపిత మా KCR అని చెప్పుకు తిరిగే ప్రతి చెంచాకి అంకితం ఈ వీడియో. 2. అసలు తెలంగాణ సాయుధ పోరాటం వీరుడు రావి నారాయణ రెడ్డి గురించి వీళ్లకు తెలుసా అని ప్రశ్నిస్తుంది. 3. చండ్రా వంకల అసలు పొగాకు నోట్ల కట్టల సంగతి, నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర గురించి గుర్తు చేస్తుంది. 4. ఒకప్పుడు రావి నారాయణ రెడ్డి పేదల ఆకలి కేకలు చూసి తన సొంత 500 ఎకరాల భూమిని పేదలకు ఉచితంగా పంచిపెట్టిండు. 5. 1951-52 లో నల్గొండ MP గా 75 వేల ఓట్ల మెజార్టీతో గెలిచిన తెలంగాణ జనాల నిజమైన హీరో ఆయన. 6. ఆయనకు నీరాజనాలు పట్టిన ప్రజలు, ఆయన చివరి దశలో కర్ర సాయంతో నడిచినా అదే ఇంట్లోనే 1991 సెప్టెంబర్ 7న కన్నుమూశాడు. 7. ఆయనే నిజమైన తెలంగాణ కోసం త్యాగం చేసిన నాయకుడు. 8. మరి దళిత బంధుకు 10 లక్షలు ఇవ్వని, తెలంగాణ జనాలను దోచుకున్న వ్యక్తి జాతిపిత ఎట్లా అవుతాడు అని వీడియో నిలదీస్తుంది. 9. ఇక అసలు విషయానికి వస్తే, 2023 అఫిడవిట్ లెక్క ప్రకారం KCR కుటుంబ భూముల లెక్కలు బయటపెట్టింది. 10. KTR పేరు మీద 67 ఎకరాలు, కొడుకు KTR పేరు మీద 49 ఎకరాలు ఉన్నాయి. 11. ఆయన భార్య శైలజమ్మ పేరు మీద 17 ఎకరాల భూమి ఉంది. 12. హిమాన్షు రావు పేరు మీద 46 ఎకరాలు, కవిత పేరు మీద 37 ఎకరాలు ఉన్నాయి. 13. వీడియోలో చూపినట్టు ఎర్రవల్లి ఫాం హౌస్ ఒక్కటే 67 ఎకరాల్లో ఉంది. 14. చుట్టూ కాంపౌండ్ వాల్ తో, లోపల విలాసవంతమైన భవనంతో మొత్తం 700 ఎకరాల వరకు ఆక్రమించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 15. అందులో 388 ఎకరాలు సీలింగ్ యాక్ట్ కు విరుద్ధంగా ఆక్రమించుకున్నారనే ఆరోపణ ఉంది. 16. రావి నారాయణ రెడ్డి పంచిన భూమి, KCR కొన్న భూమి - తేడా ఇక్కడే తెలుస్తుంది. 17. ఒకరు ఇచ్చేవాడు, ఒకరు లాక్కునేవాడు. 18. KCR కుటుంబం మొత్తం కోట్ల రూపాయల ఆస్తులతో తెలంగాణ సమాజం ముందు దొంగగా నిలబడిందని వీడియో చెబుతుంది. 19. తెలంగాణ తెచ్చింది KCR కాదు, తెలంగాణ జనాల త్యాగం, రావి నారాయణ రెడ్డి లాంటి వీరుల పోరాటం. 20. కాబట్టి తెలంగాణ జాతిపిత రావి నారాయణ రెడ్డి లాంటి త్యాగధనులే, భూములు దోచుకున్న దొరలు కాదు అనేది ఈ వీడియో సందేశం.1
- స్థానిక నేలకొండపల్లి శ్రీ కోనేరు ఆంజనేయస్వామి దేవాలయంలో నేలకొండపల్లి పట్టణ ఆర్యవైశ్య సంఘం స్థానిక నేలకొండపల్లి శ్రీ కోనేరు ఆంజనేయస్వామి దేవాలయంలో నేలకొండపల్లి పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు రేగూరి హనుమంతరావు ఆధ్వర్యంలో గణేష్ మండపం ఏర్పాటు చేయడం జరిగినది ప్రతిరోజు ధూప దీప నైవేద్యాలతో భక్తులకు ఉదయం సాయంత్రం 300 మంది భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేయడం జరుగుతున్నది నవరాత్రుల్లో భాగంగా 9వ రోజు ఈరోజు రేగూరి వాసవి హనుమంతరావు కుమార్తె అల్లుడు పారేపల్లి తేజ వెంకట సీతారాం సాయి స్నేహిత దంపతులు మరియు దేవరశెట్టి లక్ష్మణరావు ఉదయలక్ష్మి దంపతులు స్వామివార్లకు అభిషేకములు ప్రత్యేక పూజలు నిర్వహించారు నేలకొండపల్లి పట్టణ ఆర్యవైశ్య మహిళలు 108 ప్రసాదాలతో స్వామివారికి నైవేద్యం సమర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పట్టణ అధ్యక్షులు రేగూరి హనుమంతరావు ప్రధాన కార్యదర్శి కొత్త వేణుబాబు, మండల అధ్యక్షులు దోసపాటి చంద్రశేఖర్ ,కమిటీ సభ్యులు అయ్యప్ప శ్రీను, రాయపూడి శ్రీను, కనుమలపూడి శ్రీధర్, బుస శీను, భవనాసి వెంకటేశ్వరరావు, కొత్త క్రాంతి కిరణ్, అత్తులూరి సుబ్బయ్య, రేగూరి వాసవి, దోసపాటి కల్పన, దోసపాటి ఉషారాణి, కొత్త కరుణ, కొత్త భవాని, గెల్లా సువర్ణ, నాగలక్ష్మి, వసంత, సుమారు 100 మంది ఆర్యవైశ్య మహిళలు ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు మరియు భక్తులు పాల్గొని విజయవంతం చేశారు ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పట్టణ అధ్యక్షులు రేగురి హనుమంతరావు ధన్యవాదాలు తెలియజేశారు1
- అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని నిరసన జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని నిరసన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జారీచేసిన డ్రా సిస్టాన్ని రద్దు చేయాలని రోడ్డు పై బైఠాయించి రాస్తా రోకో,ధర్నా చేసిన నిరుపేద కుటుంబాలు.1
- _నిమజ్జనం_చేసే_పద్ధతి ... DJ పెట్టుకుని బట్టలు ఊడిఇదిపోతున్న గెంతులు వేయడం మాత్రం కాదు. _నిమజ్జనం_చేసే_పద్ధతి ... DJ పెట్టుకుని బట్టలు ఊడిఇదిపోతున్న గెంతులు వేయడం మాత్రం కాదు.1
- 🕉️ రాపత్రి నగర్‌లో కొలువుదీరిన శ్రీ సిద్ధి వినాయకుడు.. ఘనంగా పూజలు, అన్నదానం! రాపత్రి నగర్‌లో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక స్వామి పూజలు ఖమ్మం నగరంలోని రాపత్రి నగర్ రోడ్ నెంబర్ 5లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సిద్ధి వినాయక కమిటీ ఆధ్వర్యంలో వినాయక స్వామి పూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం భక్తులు మరియు స్థానికుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కమిటీ సభ్యులు యశ్వంత్, దీపక్, సోయల్, యువరాజు, శ్యాము, విజ్జు, మాలతి, రేణుక, వెన్నెల, రేఖ, కవిత తదితరులు పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన పూజా కార్యక్రమం అనంతరం అన్నదానం చేయడంతో రాపత్రి నగర్‌లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.2