logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

సీనియర్ రాజకీయ నాయకులు, జూలూరుపాడు సొసైటీ మాజీ అధ్యక్షులు చీమలపాటి బిక్షం కన్నుమూశారు. ఆయన మృతితో జూలూరుపాడు ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు, ఇతర నాయకులు ఆయన పార్థివదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

6 hrs ago
user_K.NR
K.NR
Insurance Agent జూలూరుపాడు, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
6 hrs ago

సీనియర్ రాజకీయ నాయకులు, జూలూరుపాడు సొసైటీ మాజీ అధ్యక్షులు చీమలపాటి బిక్షం కన్నుమూశారు. ఆయన మృతితో జూలూరుపాడు ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు, ఇతర నాయకులు ఆయన పార్థివదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

More news from తెలంగాణ and nearby areas
  • అన్నపురెడ్డిపల్లిలో అకాల వర్షం బీభత్సం - డ్రైనేజీ లేక ఇళ్లలోకి చేరిన వరద నీరు అర్ధరాత్రి కురిసిన అకాల వర్షాలకు అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో వర్షపు నీరు నివాస గృహాల్లోకి, చిరు వ్యాపారుల దుకాణాల్లోకి చేరి నిత్యావసర వస్తువులు, సామగ్రి పూర్తిగా తడిసి ముద్దయ్యాయి. ​క్షేత్రస్థాయిలో పర్యటించిన కాంగ్రెస్పార్టీ యువజన అధ్యక్షులు వేముల నరేష్ ​బాధిత కుటుంబాలను స్వయంగా పరామర్శించారు. నీట మునిగిన ఇళ్లను, పాడైపోయిన సామాగ్రిని పరిశీలించి బాధితులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ​ప్రధాన సమస్యలు మరియు విమర్శలు: ​అధికారుల నిర్లక్ష్యం సెంట్రల్ లైటింగ్ మరియు రోడ్డు పనులు చేపట్టిన సమయంలో, ప్రత్యామ్నాయ డ్రైనేజీ మార్గాలను ఏర్పాటు చేయకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని ఆయన మండిపడ్డారు. ​అస్తవ్యస్త అభివృద్ధి "అభివృద్ధి పనులు చేసేటప్పుడు ప్రజలకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సెంట్రల్ లైటింగ్ పేరుతో డ్రైనేజీ నిర్మాణం లేనపుడు రోడ్లు నిర్మించడం సరికాదు" అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ​ప్రభుత్వం వరద వల్ల నష్టపోయిన పేద కుటుంబాలకు, చిరు వ్యాపారులకు ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సహాయం అందించాలి. ​శాశ్వత పరిష్కారం నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజీ వ్యవస్థను వెంటనే పునర్నిర్మించాలి. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలి. ​"కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటుంది. ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు, బాధితులకు న్యాయం జరిగే వరకు మేము పోరాడుతాం." — వేముల నరేష్ ​
    1
    అన్నపురెడ్డిపల్లిలో అకాల వర్షం బీభత్సం - డ్రైనేజీ లేక ఇళ్లలోకి చేరిన వరద నీరు
అర్ధరాత్రి కురిసిన అకాల వర్షాలకు అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో వర్షపు నీరు నివాస గృహాల్లోకి, చిరు వ్యాపారుల దుకాణాల్లోకి చేరి నిత్యావసర వస్తువులు, సామగ్రి పూర్తిగా తడిసి ముద్దయ్యాయి.
​క్షేత్రస్థాయిలో పర్యటించిన కాంగ్రెస్పార్టీ యువజన అధ్యక్షులు వేముల నరేష్
​బాధిత కుటుంబాలను స్వయంగా పరామర్శించారు. నీట మునిగిన ఇళ్లను, పాడైపోయిన సామాగ్రిని పరిశీలించి బాధితులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
​ప్రధాన సమస్యలు మరియు విమర్శలు:
​అధికారుల నిర్లక్ష్యం సెంట్రల్ లైటింగ్ మరియు రోడ్డు పనులు చేపట్టిన సమయంలో, ప్రత్యామ్నాయ డ్రైనేజీ మార్గాలను ఏర్పాటు చేయకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని ఆయన మండిపడ్డారు.
​అస్తవ్యస్త అభివృద్ధి "అభివృద్ధి పనులు చేసేటప్పుడు ప్రజలకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సెంట్రల్ లైటింగ్ పేరుతో డ్రైనేజీ నిర్మాణం లేనపుడు రోడ్లు నిర్మించడం సరికాదు" అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
​ప్రభుత్వం
వరద వల్ల నష్టపోయిన పేద కుటుంబాలకు, చిరు వ్యాపారులకు ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సహాయం అందించాలి.
​శాశ్వత పరిష్కారం నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజీ వ్యవస్థను వెంటనే పునర్నిర్మించాలి.
రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలి.
​"కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటుంది. ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు, బాధితులకు న్యాయం జరిగే వరకు మేము పోరాడుతాం."
— వేముల నరేష్
​
    user_VANAMA SRINIVAS RAO
    VANAMA SRINIVAS RAO
    జర్నలిస్ట్ కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    3 hrs ago
  • తెలంగాణలో తాజాగా జరిగిన సర్వే ఎస్టీ జనాభా గురించి కీలక వివరాలను వెల్లడించింది. రాష్ట్రంలోని నాలుగు ప్రధాన ఎస్టీ తెగలలో లంబాడీలు/బంజారాలు అతిపెద్ద వర్గంగా ఉన్నారని తేలింది. వీరి సంస్కృతి, సంప్రదాయాలు, జానపద నృత్యాలు తెలంగాణలో చాలా ప్రసిద్ధి చెందాయి.
    1
    తెలంగాణలో తాజాగా జరిగిన సర్వే ఎస్టీ జనాభా గురించి కీలక వివరాలను వెల్లడించింది. రాష్ట్రంలోని నాలుగు ప్రధాన ఎస్టీ తెగలలో లంబాడీలు/బంజారాలు అతిపెద్ద వర్గంగా ఉన్నారని తేలింది. వీరి సంస్కృతి, సంప్రదాయాలు, జానపద నృత్యాలు తెలంగాణలో చాలా ప్రసిద్ధి చెందాయి.
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    Industrial Real Estate Agency కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    6 hrs ago
  • చింతకాని లో బస్తాలు ఖాళీ...మండలం వ్యాప్తంగా రైతులు ఆందోళన లు ఖమ్మం జిల్లా చింత కానీ మండలం దాదాపు గా 22లక్షల బస్తాలు రావలిసిన వి కేవలం 5లక్షలు రావడం పట్ల రైతగాం మoడిపాడుతుంది వెంటనే బస్తాలు తెపించాలని రైతులు కోరుతున్నారు.... అయితే అధికారులు వస్తున్నాయి అని చెప్తున్నారు... కానీ కాంట్రక్టర్ ల నెమది వైఖరి వల్ల బస్తాలు రావడం లేదని.. రైతులు వాపోతున్నారు
    1
    చింతకాని లో బస్తాలు ఖాళీ...మండలం వ్యాప్తంగా రైతులు ఆందోళన లు 
ఖమ్మం జిల్లా చింత కానీ మండలం దాదాపు గా 22లక్షల బస్తాలు రావలిసిన వి కేవలం 5లక్షలు రావడం పట్ల రైతగాం మoడిపాడుతుంది  వెంటనే బస్తాలు తెపించాలని రైతులు కోరుతున్నారు....
అయితే అధికారులు వస్తున్నాయి అని చెప్తున్నారు... కానీ కాంట్రక్టర్ ల నెమది వైఖరి వల్ల బస్తాలు రావడం లేదని.. రైతులు వాపోతున్నారు
    user_CHARANKANTH MANDA
    CHARANKANTH MANDA
    చింతకాని, ఖమ్మం, తెలంగాణ•
    5 hrs ago
  • టీవీకే అధినేత విజయ్ తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌తో లోక్ భవన్‌లో భేటీ అయ్యారు. కాంగ్రెస్, సీపీఐ, సీపీఐ(ఎం), వీసీకే, ఐయూఎంఎల్ మద్దతుతో టీవీకే 121 మంది ఎమ్మెల్యేల బలంతో తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.
    1
    టీవీకే అధినేత విజయ్ తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌తో లోక్ భవన్‌లో భేటీ అయ్యారు. కాంగ్రెస్, సీపీఐ, సీపీఐ(ఎం), వీసీకే, ఐయూఎంఎల్ మద్దతుతో టీవీకే 121 మంది ఎమ్మెల్యేల బలంతో తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.
    user_Ravi Reporter
    Ravi Reporter
    Local News Reporter తిరువూరు, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • తెలంగాణ మహిళా కాంగ్రెస్ నాయకురాలు అద్దంకి నాగమణి బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, కవితలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీతక్క, అద్దంకి దయాకర్ వంటి ప్రజా నాయకులపై మాట్లాడే నైతిక హక్కు కవితకు లేదని ఆమె ఘాటుగా విమర్శించారు. కేవలం తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చిన కవితకు కష్టపడి పైకి వచ్చిన వారి విలువ తెలియదని నాగమణి ఎద్దేవా చేశారు.
    1
    తెలంగాణ మహిళా కాంగ్రెస్ నాయకురాలు అద్దంకి నాగమణి బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, కవితలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీతక్క, అద్దంకి దయాకర్ వంటి ప్రజా నాయకులపై మాట్లాడే నైతిక హక్కు కవితకు లేదని ఆమె ఘాటుగా విమర్శించారు. కేవలం తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చిన కవితకు కష్టపడి పైకి వచ్చిన వారి విలువ తెలియదని నాగమణి ఎద్దేవా చేశారు.
    user_JADI RAJU
    JADI RAJU
    Financial Analyst ఖానాపూర్, వరంగల్, తెలంగాణ•
    22 hrs ago
  • రాష్ట్రంలో గన్, డ్రగ్స్, గంజాయి కల్చర్ పెరిగింది : మాజీమంత్రి సత్యవతి రాథోడ్ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మాజీ ఎంపీ, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు కవిత క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో గన్ కల్చర్, డ్రగ్స్, గంజాయి, మహిళలపై దాడులు పెరిగిపోయాయని, ప్రజలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. కేసీఆర్ హయాంలో మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇచ్చారని పేర్కొన్నారు. బండి సంజయ్ కుమారుడిపై నమోదైన పోక్సో కేసు వ్యవహారంలో పోలీసులు ఆలస్యంగా స్పందించారని ఆరోపించారు. రాష్ట్రంలో క్రైమ్ రేటు పెరిగినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, సోషల్ మీడియా పోస్టులపై కేసులు పెట్టడంలో చూపుతున్న శ్రద్ధ శాంతిభద్రతలపై లేదని విమర్శించారు.
    1
    రాష్ట్రంలో గన్, డ్రగ్స్, గంజాయి కల్చర్ పెరిగింది : మాజీమంత్రి సత్యవతి రాథోడ్
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మాజీ ఎంపీ, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు కవిత క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో గన్ కల్చర్, డ్రగ్స్, గంజాయి, మహిళలపై దాడులు పెరిగిపోయాయని, ప్రజలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. కేసీఆర్ హయాంలో మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇచ్చారని పేర్కొన్నారు.
బండి సంజయ్ కుమారుడిపై నమోదైన పోక్సో కేసు వ్యవహారంలో పోలీసులు ఆలస్యంగా స్పందించారని ఆరోపించారు. రాష్ట్రంలో క్రైమ్ రేటు పెరిగినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, సోషల్ మీడియా పోస్టులపై కేసులు పెట్టడంలో చూపుతున్న శ్రద్ధ శాంతిభద్రతలపై లేదని విమర్శించారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    3 hrs ago
  • రాష్ట్రం దివాలా తీసింది: బొల్లా జగన్ ను విమర్శించడం తప్ప చేసింది ఏమీ లేదు. ప్రభుత్వాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధిని గాలికి వదిలేసిందని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు విమర్శించారు. వినుకొండలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. కేవలం జగన్ను విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని, వైసీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించడం తప్ప రాష్ట్రానికి చేసింది శూన్యమని మండిపడ్డారు. పాలనలో విఫలమై రాష్ట్రాన్ని దివాలా తీయించారని ఆయన ఆరోపించారు.
    1
    రాష్ట్రం దివాలా తీసింది: బొల్లా 
జగన్ ను విమర్శించడం తప్ప చేసింది ఏమీ లేదు. 
ప్రభుత్వాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధిని గాలికి వదిలేసిందని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు విమర్శించారు. వినుకొండలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. కేవలం జగన్ను విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని, వైసీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించడం తప్ప రాష్ట్రానికి చేసింది శూన్యమని మండిపడ్డారు. పాలనలో విఫలమై రాష్ట్రాన్ని దివాలా తీయించారని ఆయన ఆరోపించారు.
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • పాల్వంచలో గాలి భీభత్సం: శ్రీ. కనకదుర్గమ్మ ఆలయంలో నేలకొరిగిన 62 ఏళ్ల నాటి పవిత్ర వృక్షం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో గతరాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురు గాలుల ధాటికి స్థానిక ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానంలో దశాబ్దాల చరిత్ర కలిగిన భారీ వృక్షం నేలకొరిగింది. సుమారు 62 సంవత్సరాల క్రితం నాటి రావి, వేప చెట్లు కలిసి ఉన్న ఈ భారీ వృక్షానికి ఆలయ చరిత్రలో ఎంతో విశిష్టత ఉంది. సంతానం లేని దంపతులు ఈ పవిత్ర వృక్షానికి ప్రత్యేక పూజలు చేస్తే ఫలితం ఉంటుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఎంతో కాలంగా భక్తులు ఈ చెట్టును దైవస్వరూపంగా భావించి ఆరాధిస్తున్నారు. అటువంటి వృక్షం గాలివానకు కూలిపోవడంతో భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గాలి ధుమారానికి ఈ భారీ వృక్షం ఒక్కసారిగా దేవస్థానం ప్రాంగణంలోని **రేకుల షేడ్‌పై** కుప్పకూలింది. ఈ ప్రమాదంలో షేడ్ పాక్షికంగా ధ్వంసమైంది. అయితే, ఈ సంఘటన రాత్రి సమయంలో జరగడం, ఆ సమయంలో అక్కడ భక్తులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రాణనష్టం జరగకపోవడంతో ఆలయ అధికారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఆలయ సిబ్బంది కూలిన వృక్షాన్ని తొలగించే పనుల్లో నిమగ్నమయ్యారు.
    4
    పాల్వంచలో గాలి భీభత్సం: శ్రీ. కనకదుర్గమ్మ ఆలయంలో నేలకొరిగిన 62 ఏళ్ల నాటి పవిత్ర వృక్షం..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో గతరాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురు గాలుల ధాటికి స్థానిక ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానంలో దశాబ్దాల చరిత్ర కలిగిన భారీ వృక్షం నేలకొరిగింది.
సుమారు 62 సంవత్సరాల క్రితం నాటి రావి, వేప చెట్లు కలిసి ఉన్న ఈ భారీ వృక్షానికి ఆలయ చరిత్రలో ఎంతో విశిష్టత ఉంది. సంతానం లేని దంపతులు ఈ పవిత్ర వృక్షానికి ప్రత్యేక పూజలు చేస్తే ఫలితం ఉంటుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఎంతో కాలంగా భక్తులు ఈ చెట్టును దైవస్వరూపంగా భావించి ఆరాధిస్తున్నారు. అటువంటి వృక్షం గాలివానకు కూలిపోవడంతో భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గాలి ధుమారానికి ఈ భారీ వృక్షం ఒక్కసారిగా దేవస్థానం ప్రాంగణంలోని **రేకుల షేడ్‌పై** కుప్పకూలింది. ఈ ప్రమాదంలో షేడ్ పాక్షికంగా ధ్వంసమైంది. అయితే, ఈ సంఘటన రాత్రి సమయంలో జరగడం, ఆ సమయంలో అక్కడ భక్తులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రాణనష్టం జరగకపోవడంతో ఆలయ అధికారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఆలయ సిబ్బంది కూలిన వృక్షాన్ని తొలగించే పనుల్లో నిమగ్నమయ్యారు.
    user_VANAMA SRINIVAS RAO
    VANAMA SRINIVAS RAO
    జర్నలిస్ట్ కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.