Shuru
Apke Nagar Ki App…
చిన్నారి చెస్ ఛాంపియన్ సాత్వికకి అభినందనలు జనగాం జిల్లా దేవరుప్పుల మండలం పెద్దమడూరు గ్రామానికి చెందిన బండారి సాత్విక రాష్ట్ర స్థాయి చెస్ పోటీలకు ఎంపికై విజయం సాధించిన సందర్భంగా గురువారం ఆమెను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభినందించారు.మాజీ మంత్రి సాత్విక మరిన్ని ఉన్నత శిఖరాలను చేరాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బబ్బురి శ్రీకాంత్ గౌడ్, పెద్దమడూరు సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.
M D Azizuddin
చిన్నారి చెస్ ఛాంపియన్ సాత్వికకి అభినందనలు జనగాం జిల్లా దేవరుప్పుల మండలం పెద్దమడూరు గ్రామానికి చెందిన బండారి సాత్విక రాష్ట్ర స్థాయి చెస్ పోటీలకు ఎంపికై విజయం సాధించిన సందర్భంగా గురువారం ఆమెను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభినందించారు.మాజీ మంత్రి సాత్విక మరిన్ని ఉన్నత శిఖరాలను చేరాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బబ్బురి శ్రీకాంత్ గౌడ్, పెద్దమడూరు సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- ఫిబ్రవరి 19న చత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని హిందూ వాహిని ఆధ్వర్యంలో వరంగల్ కాజీపేట హనుమకొండలో భారీ శోభాయాత్ర, బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈసారి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ మేరకు బుధవారం గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రముఖ సూర్య ప్రకాష్ రెడ్డి, వరంగల్ సంయోజాక్ చత్రపతి శివాజీ, రామ్ శర్మ, ప్రవీణ్ దాదా, సాగర్ పాల్గొన్నారు.1
- అధికారుల్లో జవాబుదారి తనం పెంచేందుకు ఆర్టిఐ చట్టం దోహదం చేస్తుందని, దరఖాస్తుదారుకు సమాచారం ఇప్పించడమే కమిషన్ అంతిమ లక్ష్యమని రాష్ట్ర సమాచార కమిషనర్లు తెలిపారు. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో రాష్ట్ర సమాచార కమిషనర్లు పి.వి.శ్రీనివాసరావు, భోరెడ్డి అయోధ్య రెడ్డి, మోసినా పర్వీన్, దేశాల భోపాల్ ఆర్టీఐ పై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2025 మే 14న రాష్ట్ర సమాచార కమిషనర్లుగా తాము బాధ్యత తీసుకునే నాటికి 17 వేలా 808 రెండవ అప్పిళ్లు రాష్ట్ర కమిషన్లో పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. 8 నెలల్లో ఇప్పటివరకు 15 జిల్లాలలో పర్యటించి అక్కడే వాదనలు విన్నామని తెలిపారు. ఇలా సుమారు 9 వేల అప్పిళ్లను పరిష్కరించామన్నారు. ఇంత త్వరగా అప్పిళ్లను పరిష్కరించడం దేశంలోనే మొదటిసారిగా పేర్కొన్నారు. 13 శాఖల్లో కేసుల సంఖ్య జీరోకి తెచ్చామని తెలిపారు. సగటున నెలకు 643 కేసులు పరిష్కరిస్తున్నామని వెల్లడించారు. వీలైనంత త్వరగా మిగిలిన జిల్లాల్లో పర్యటించి పెండింగ్ కేసులన్నీ పరిష్కరిస్తామని తెలిపారు. అర్జీదారుకు సమాచారం ఇప్పించడమే కమిషన్ అంతిమ లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమం ప్రజల ప్రయోజనం కోసమేనని రాష్ట్ర సమాచార కమిషనర్లు తెలిపారు. ప్రజా సమాచార అధికారి, సహాయ ప్రజా సమాచార అధికారి, అప్పిలేట్ అధికారులతో సమాచార హక్కు చట్టం అవగాహన కార్యక్రమం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించారు. దరఖాస్తులు, ఫిర్యాదులు, పరిష్కారం, పెండింగ్ దరఖాస్తులు, పరిష్కారం కోసం తీసుకునే చర్యలపై పిఐఓలతో కమిషనర్లు చర్చించారు.1
- వేమలపల్లి మండలం శేట్టిపాలెం గ్రామంలో యూరియా ఆన్లైన్ విధానాన్ని తీసివేయాలని, రైతాంగానే ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ శ్రేణులు మరియు గ్రామ రైతులు పెద్ద ఎత్తున శేట్టిపాలెం గ్రామ కో-ఆపరేటివ్ బ్యాంక్ ను ముట్టడి చేశారు మరియు యూరియా పంపిణి అడ్డుకున్నారు. పోలీసులు బిజెపి శ్రేణులతో వాగ్వాదం జరగడంతో రైతులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా బిజెపి మండల పార్టీ అధ్యక్షులు పెదమాం భరత్ మాట్లాడుతూ యూరియా ఆన్లైన్ విధానం వల్ల రైతులు గోసపడుతున్నారని,, బుకింగ్ సమయం లో రెండు మూడు నిమిషాల్లోనే యూరియా పూర్తిగా అయిపోతుందని, అన్ని గ్రామాలకు సంబంధించిన కో-ఆపరేటివ్ బ్యాంకులలో ఆ గ్రామానికి సంబంధించిన రైతులకు యూరియా అందించాలని పక్క ఊరి రైతులకు ఇవ్వడం వల్ల ఇక్కడి గ్రామ రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆన్లైన్ విధానం వల్ల పాస్ పుస్తకాలు పట్టుకొని రైతులు రోడ్ల వెంట తిరుగుతున్నారని ఆన్లైన్ విధానం తెలియని రైతులు ఒక్క దశలోనూ యూరియా అందలేదని వరి పొలాలకు ఇప్పుడు యూరియా అత్యవసరమని యూరియా అందకపోతే రైతులు తీవ్ర నష్టపోతారని నిరక్షరాశులయిన రైతులు,మహిళా రైతులు,ఆన్లైన్ విధానం వల్ల తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారని, శెట్టిపాలెం గ్రామానికి సంబంధించిన రైతాంగానికి యూరియా దొరకడం లేదు అని ప్రతిరోజు టన్నుల కొద్దీ యూరియా వస్తున్న యూరియా కొరత గ్రామంలో తీవ్రంగా ఉంది, కోపరేట్ సొసైటీ ఉన్నప్పటికీ యూరియా దొరకపోవడం బాధాకరమని తక్షణమే ప్రత్యేకంగా శెట్టిపాలెం గ్రామ రైతులకు యూరియా తీసుకురావాలని AEO కిషన్ నాయక్ వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమం కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జవ్వాజి సత్యనారాయణ యాదవ్, బీజేపీ జిల్లా నాయకులు బోల్లేదు లవయ్య,బీజేపీ గ్రామ వార్డు సభ్యులు పెదమాం ప్రసాద్, ఇరుగుదిండ్ల జ్యోతి నవీన్, బిజెపి నాయకులు ఇరుగుదిండ్ల నరేష్, పేరం విలేకర్, కోల చంద్రయ్య, ఆలకుంట్ల మధు, ఈట మహేష్,జగినాల రమేష్ దుండిగల రేణుక, బోగారి సైదులు, పాలడుగు శంకర్, సతీష్, శీను, మహేష్, రామకృష్ణ, ప్రశాంత్, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.1
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఫిబ్రవరి 19 ప్రజా తెలంగాణ న్యూస్/ సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో Bharatiya Janata Party ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు భైరి శంకర్ ముదిరాజ్ బిఆర్ఎస్ నేతలపై ఘాటు విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఉద్యమకారులను అణగదొక్కడం, పార్టీ లోపలే విభేదాలు రెచ్చగొట్టడం, స్వార్థ ఎజెండాతో వ్యవహరించడం బిఆర్ఎస్ నేతల లక్ష్యమైందని ఆయన ఆరోపించారు. Bharat Rashtra Samithi లో పనిచేస్తూ నియోజకవర్గంలో ఉద్యమకారులకు, నిజమైన కేడర్‌కు పదవులు రాకుండా అడ్డుపడుతున్నారని, తన అనుచరులకు మాత్రమే పదవులు కట్టబెట్టే రాజకీయాలు నడుపుతున్నారని ప్రతాప్ రెడ్డిపై మండిపడ్డారు. “పార్టీ పతనం కోసం లోపలే కుయుక్తులు పన్నేవాడు నాయకుడా?” అని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో మచ్చలేని నాయకుడు Raghunandan Rao కోటి రూపాయలు తీసుకుని వేరే పార్టీకి మద్దతిచ్చారనే ఆరోపణలు చేసిన వారు గజ్వేల్ కోట మైసమ్మ దేవాలయం వద్ద వాటిని రుజువు చేయాలని సవాల్ విసిరారు. “నిజం ఉంటే దేవాలయం వద్ద ప్రమాణం చేయి… లేకపోతే ప్రజలకు క్షమాపణ చెప్పి రాజకీయాల నుంచి తప్పుకో” అని ఘాటుగా హెచ్చరించారు. గతంలో K. Chandrashekar Rao ను ఓడించాలని T. Harish Rao ఫోన్ చేశారని ప్రచారం చేసి, బిఆర్ఎస్ నేతల వద్ద ఎంత డబ్బులు దోచుకున్నావో గజ్వేల్ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. “ఇతరులపై ఆరోపణలు చేసి డబ్బులు సంపాదించడం నీ రాజకీయ జీవన విధానమా?” అంటూ తీవ్ర విమర్శలు చేశారు.సర్పంచ్ ఎన్నికల సమయంలో పార్టీ ఫండ్ పంపకాలపై జరిగిన వివాదాన్ని ప్రస్తావిస్తూ, ఎమ్మెల్సీ యాదవ రెడ్డితో జరిగిన రచ్చను ప్రజలు మర్చిపోలేదన్నారు. “బ్లాక్మెయిల్ రాజకీయాలతో జీవితం గడిపేవాడిని ప్రజలు ఇక నమ్మరు” అని భైరి శంకర్ ముదిరాజ్ ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు మనోహర్ యాదవ్, నాయిని సందీప్, ఎల్కంటి సురేష్, టెలికం బోర్డు మెంబర్ కమ్మరి శ్రీనివాస్, నత్తి శివకుమార్ తదితర నాయకులు పాల్గొన్నారు.4
- హైదరాబాద్లో బయోఏషియా-2026 సదస్సును ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి CM Revanth Reddy Inaugurates BioAsia 2026 in Hyderabad1
- ఓయూ కు చేరుకున్న గవర్నర్ ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ (ఏఐయూ) సెంట్రల్ జోన్ వైస్ చాన్సలర్ల సదస్సు నేడు, రేపు జరగనున్న సదస్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్వాంటం సాంకేతికతతో కూడిన ఉన్నత విద్యా సంస్థల రూపకల్పన" అంశంపై సదస్సు సదస్సును ప్రారంభించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ సదస్సు లో తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్, ఉత్తర ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన సుమారు 40 మందికి పైగా పాల్గొననున్న వీసీలు ఉన్నత విద్యా నిర్వాహకులు2
- జనగాం జిల్లా దేవరుప్పుల మండలం పెద్దమడూరు గ్రామానికి చెందిన బండారి సాత్విక రాష్ట్ర స్థాయి చెస్ పోటీలకు ఎంపికై విజయం సాధించిన సందర్భంగా గురువారం ఆమెను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభినందించారు.మాజీ మంత్రి సాత్విక మరిన్ని ఉన్నత శిఖరాలను చేరాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బబ్బురి శ్రీకాంత్ గౌడ్, పెద్దమడూరు సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.1
- కెసిఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో సాంగ్స్...1
- శివరాత్రి రోజున జగిత్యాలలో యువకుడి హత్య కేసును పోలీసులు చేదించారు. ఇద్దరిని అరెస్టు చేశారు. జగిత్యాలలో డిఎస్పి రఘు చందర్ సమక్షంలో అరెస్ట్ అయిన ఇద్దరిని చూపించి హత్యకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. జగిత్యాల మండలం పోరండ్లకు చెందిన విశ్వనాధ్ పెళ్ళైన అంతర్గాం కు చెందిన మహిళతో సహజీవనం చేస్తున్నారు. ఆ మహిళ కు భర్త ఇద్దరు పిల్లలు ఉండగా వారిని వదిలేసిన విశ్వనాథ్ తో సహజీవనం చేస్తుంది. దీంతో పిల్లలను వదిలేసి పరాయి మగాడి తో ఉంటున్న భార్యపై కక్షగట్టిన భర్త గంగాధర ఇద్దరిని లేపేయాలని పథకం పన్నాడు. అతని బావమరిది బోదసు తిరుపతితో కలిసి మహాశివరాత్రి గుడికి వెళ్తున్న విశ్వనాథ్ పై దాడి చేసి హత్య చేశారు. తృటిలో మహిళ తప్పించుకుని ప్రాణాలతో బయటపడిందని డిఎస్పీ తెలిపారు. మృతుడి తండ్రి పిర్యాదు మేరకు మహిళ మొదటి భర్త గంగాధర్, సొదరుడు తిరుపతిని అరెస్టు చేసి జైలుకు పంపామని డిఎస్పీ రఘుచందర్ తెలిపారు.4