logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మంగనూరు గ్రామంలో కార్తీక శోభ.. మల్లికార్జునునికి ప్రత్యేక పూజలు బిజినపల్లి: మంగనూరు గ్రామంలో కార్తీక సోమవార వేడుకలు కన్నులపండువగా సాగాయి. స్థానిక శివాలయంలో వెలసిన శ్రీ భ్రమరాంభ సమేత మల్లికార్జున స్వామికి మంగళి కృష్ణయ్య దంపతుల ఆధ్వర్యంలో సాయంత్రం విశేష అభిషేకం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కార్తీక మాసం పూర్తయ్యే వరకు ప్రతి సోమవారం ఉదయం, సాయంత్రం క్రమం తప్పకుండా అభిషేకాలు నిర్వహిస్తామని నీళ్ల మల్లికార్జున్ ఈ సందర్భంగా తెలియజేశారు.

17 hrs ago
user_NAVADEEP
NAVADEEP
బిజినపల్లె, నాగర్‌కర్నూల్, తెలంగాణ•
17 hrs ago

మంగనూరు గ్రామంలో కార్తీక శోభ.. మల్లికార్జునునికి ప్రత్యేక పూజలు బిజినపల్లి: మంగనూరు గ్రామంలో కార్తీక సోమవార వేడుకలు కన్నులపండువగా సాగాయి. స్థానిక శివాలయంలో వెలసిన శ్రీ భ్రమరాంభ సమేత మల్లికార్జున స్వామికి మంగళి కృష్ణయ్య దంపతుల ఆధ్వర్యంలో సాయంత్రం విశేష అభిషేకం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కార్తీక మాసం పూర్తయ్యే వరకు ప్రతి సోమవారం ఉదయం, సాయంత్రం క్రమం తప్పకుండా అభిషేకాలు నిర్వహిస్తామని నీళ్ల మల్లికార్జున్ ఈ సందర్భంగా తెలియజేశారు.

More news from తెలంగాణ and nearby areas
  • మంగనూరు గ్రామంలో కార్తీక శోభ.. మల్లికార్జునునికి ప్రత్యేక పూజలు బిజినపల్లి: మంగనూరు గ్రామంలో కార్తీక సోమవార వేడుకలు కన్నులపండువగా సాగాయి. స్థానిక శివాలయంలో వెలసిన శ్రీ భ్రమరాంభ సమేత మల్లికార్జున స్వామికి మంగళి కృష్ణయ్య దంపతుల ఆధ్వర్యంలో సాయంత్రం విశేష అభిషేకం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కార్తీక మాసం పూర్తయ్యే వరకు ప్రతి సోమవారం ఉదయం, సాయంత్రం క్రమం తప్పకుండా అభిషేకాలు నిర్వహిస్తామని నీళ్ల మల్లికార్జున్ ఈ సందర్భంగా తెలియజేశారు.
    1
    మంగనూరు గ్రామంలో కార్తీక శోభ.. మల్లికార్జునునికి ప్రత్యేక పూజలు
బిజినపల్లి: మంగనూరు గ్రామంలో కార్తీక సోమవార వేడుకలు కన్నులపండువగా సాగాయి. స్థానిక శివాలయంలో వెలసిన శ్రీ భ్రమరాంభ సమేత మల్లికార్జున స్వామికి మంగళి కృష్ణయ్య దంపతుల ఆధ్వర్యంలో సాయంత్రం విశేష అభిషేకం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కార్తీక మాసం పూర్తయ్యే వరకు ప్రతి సోమవారం ఉదయం, సాయంత్రం క్రమం తప్పకుండా అభిషేకాలు నిర్వహిస్తామని నీళ్ల మల్లికార్జున్ ఈ సందర్భంగా తెలియజేశారు.
    user_NAVADEEP
    NAVADEEP
    బిజినపల్లె, నాగర్‌కర్నూల్, తెలంగాణ•
    17 hrs ago
  • ప్రజా పాలన తెచ్చిన వెలుగు... పేదలకు సొంతమైన 'ఇందిరమ్మ ఇల్లు' | Diwali in Indiramma Illu ప్రజా పాలన తెచ్చిన వెలుగు... పేదలకు సొంతమైన 'ఇందిరమ్మ ఇల్లు'. ఇందిరమ్మ ఇళ్లు కేవలం నాలుగు గోడలు కావు. ఎన్నో ఏళ్లుగా సొంతింటి కోసం ఎదురుచూసిన నిరుపేదల కలలకు ప్రతిరూపం, వారి ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనం. తమ సొంతింట్లో తొలిసారిగా దీపావళి జరుపుకుంటున్న కుటుంబాల ఆనందాన్ని చూస్తుంటే మనసు ఎంతో సంతృప్తితో నిండిపోతోంది. ఈ దీపావళి సందర్భంగా ప్రజా ప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులతో కలిసి 'మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి' జరుపుకోవాలని కోరుకుంటున్నాను. #IndirammaIllu #PrajaPalana
    1
    ప్రజా పాలన తెచ్చిన వెలుగు... పేదలకు సొంతమైన 'ఇందిరమ్మ ఇల్లు' | Diwali in Indiramma Illu
ప్రజా పాలన తెచ్చిన వెలుగు... పేదలకు సొంతమైన 'ఇందిరమ్మ ఇల్లు'.
ఇందిరమ్మ ఇళ్లు కేవలం నాలుగు గోడలు కావు. ఎన్నో ఏళ్లుగా సొంతింటి కోసం ఎదురుచూసిన నిరుపేదల కలలకు ప్రతిరూపం, వారి ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనం.
తమ సొంతింట్లో తొలిసారిగా దీపావళి జరుపుకుంటున్న కుటుంబాల ఆనందాన్ని చూస్తుంటే మనసు ఎంతో సంతృప్తితో నిండిపోతోంది.
ఈ దీపావళి సందర్భంగా ప్రజా ప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులతో కలిసి 'మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి' జరుపుకోవాలని కోరుకుంటున్నాను.
#IndirammaIllu #PrajaPalana
    user_Md.Shamsuddin
    Md.Shamsuddin
    Photographer పెద్దపల్లె, పెద్దపల్లి, తెలంగాణ•
    21 hrs ago
  • Writing కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలకు అమరచింత పద్మశాలీల భక్తి కానుక మగ్గంపై భక్తిశ్రద్ధలతో జోడు పంచెలు నేస్తున్న ఒగ్గు వెంకటేష్ జోగులాంబ గద్వాల / వనపర్తి జిల్లా: శ్రీ కురుమూర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అమరచింత పద్మశాలి చేనేత కార్మికులు ప్రతి సంవత్సరం భక్తిశ్రద్ధలతో స్వామివారికి జోడు పంచెలు నేయడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ ఏడాది కూడా ప్రత్యేక మగ్గంపై జోడు పంచెలను నేస్తున్నారు. ఈ సందర్భంగా అమరచింతకు చెందిన, గద్వాలలో గద్వాల చీరల ప్రముఖ వ్యాపారిగా గుర్తింపు పొందిన ఒగ్గు వెంకటేష్ స్వయంగా మగ్గంపై కూర్చొని ఎంతో భక్తిశ్రద్ధలతో స్వామివారికి సమర్పించనున్న జోడు పంచెలను నేస్తూ తన భక్తిని చాటుకున్నారు. చేనేత వృత్తిపై మమకారంతో పాటు శ్రీ కురుమూర్తి స్వామివారిపై ఉన్న అపారమైన భక్తిని తన చేతల ద్వారా చాటుకోవడం విశేషంగా నిలిచింది. అమరచింత పద్మశాలి చేనేత కార్మికులు ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారికి సమర్పించేందుకు ప్రత్యేకంగా జోడు పంచెలను నేసి ఆలయ నిర్వాహకులకు అందజేయడం విశేషం. తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయం చేనేత కళా వైభవానికి, భక్తి భావానికి ప్రతీకగా నిలుస్తోంది. చేనేత వృత్తిని గౌరవిస్తూ, భక్తి సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న ఒగ్గు వెంకటేష్‌తో పాటు అమరచింత పద్మశాలి చేనేత కార్మికుల సేవలు అభినందనీయం. భక్తి, సంప్రదాయం, చేనేత కళ కలగలిసిన ఈ విశిష్ట కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంటోంది. కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలకు అమరచింత పద్మశాలీల భక్తి కానుక మగ్గంపై భక్తిశ్రద్ధలతో జోడు పంచెలు నేస్తున్న ఒగ్గు వెంకటేష్ జోగులాంబ గద్వాల / వనపర్తి జిల్లా: శ్రీ కురుమూర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అమరచింత పద్మశాలి చేనేత కార్మికులు ప్రతి సంవత్సరం భక్తిశ్రద్ధలతో స్వామివారికి జోడు పంచెలు నేయడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ ఏడాది కూడా ప్రత్యేక మగ్గంపై జోడు పంచెలను నేస్తున్నారు. ఈ సందర్భంగా అమరచింతకు చెందిన, గద్వాలలో గద్వాల చీరల ప్రముఖ వ్యాపారిగా గుర్తింపు పొందిన ఒగ్గు వెంకటేష్ స్వయంగా మగ్గంపై కూర్చొని ఎంతో భక్తిశ్రద్ధలతో స్వామివారికి సమర్పించనున్న జోడు పంచెలను నేస్తూ తన భక్తిని చాటుకున్నారు. చేనేత వృత్తిపై మమకారంతో పాటు శ్రీ కురుమూర్తి స్వామివారిపై ఉన్న అపారమైన భక్తిని తన చేతల ద్వారా చాటుకోవడం విశేషంగా నిలిచింది. అమరచింత పద్మశాలి చేనేత కార్మికులు ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారికి సమర్పించేందుకు ప్రత్యేకంగా జోడు పంచెలను నేసి ఆలయ నిర్వాహకులకు అందజేయడం విశేషం. తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయం చేనేత కళా వైభవానికి, భక్తి భావానికి ప్రతీకగా నిలుస్తోంది. చేనేత వృత్తిని గౌరవిస్తూ, భక్తి సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న ఒగ్గు వెంకటేష్‌తో పాటు అమరచింత పద్మశాలి చేనేత కార్మికుల సేవలు అభినందనీయం. భక్తి, సంప్రదాయం, చేనేత కళ కలగలిసిన ఈ విశిష్ట కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంటోంది.
    2
    Writing
కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలకు అమరచింత పద్మశాలీల భక్తి కానుక
మగ్గంపై భక్తిశ్రద్ధలతో జోడు పంచెలు నేస్తున్న ఒగ్గు వెంకటేష్
జోగులాంబ గద్వాల / వనపర్తి జిల్లా:
శ్రీ కురుమూర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అమరచింత పద్మశాలి చేనేత కార్మికులు ప్రతి సంవత్సరం భక్తిశ్రద్ధలతో స్వామివారికి జోడు పంచెలు నేయడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ ఏడాది కూడా ప్రత్యేక మగ్గంపై జోడు పంచెలను నేస్తున్నారు.
ఈ సందర్భంగా అమరచింతకు చెందిన, గద్వాలలో గద్వాల చీరల ప్రముఖ వ్యాపారిగా గుర్తింపు పొందిన ఒగ్గు వెంకటేష్ స్వయంగా మగ్గంపై కూర్చొని ఎంతో భక్తిశ్రద్ధలతో స్వామివారికి సమర్పించనున్న జోడు పంచెలను నేస్తూ తన భక్తిని చాటుకున్నారు. చేనేత వృత్తిపై మమకారంతో పాటు శ్రీ కురుమూర్తి స్వామివారిపై ఉన్న అపారమైన భక్తిని తన చేతల ద్వారా చాటుకోవడం విశేషంగా నిలిచింది.
అమరచింత పద్మశాలి చేనేత కార్మికులు ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారికి సమర్పించేందుకు ప్రత్యేకంగా జోడు పంచెలను నేసి ఆలయ నిర్వాహకులకు అందజేయడం విశేషం. తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయం చేనేత కళా వైభవానికి, భక్తి భావానికి ప్రతీకగా నిలుస్తోంది.
చేనేత వృత్తిని గౌరవిస్తూ, భక్తి సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న ఒగ్గు వెంకటేష్‌తో పాటు అమరచింత పద్మశాలి చేనేత కార్మికుల సేవలు అభినందనీయం. భక్తి, సంప్రదాయం, చేనేత కళ కలగలిసిన ఈ విశిష్ట కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంటోంది.
కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలకు అమరచింత పద్మశాలీల భక్తి కానుక
మగ్గంపై భక్తిశ్రద్ధలతో జోడు పంచెలు నేస్తున్న ఒగ్గు వెంకటేష్
జోగులాంబ గద్వాల / వనపర్తి జిల్లా:
శ్రీ కురుమూర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అమరచింత పద్మశాలి చేనేత కార్మికులు ప్రతి సంవత్సరం భక్తిశ్రద్ధలతో స్వామివారికి జోడు పంచెలు నేయడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ ఏడాది కూడా ప్రత్యేక మగ్గంపై జోడు పంచెలను నేస్తున్నారు.
ఈ సందర్భంగా అమరచింతకు చెందిన, గద్వాలలో గద్వాల చీరల ప్రముఖ వ్యాపారిగా గుర్తింపు పొందిన ఒగ్గు వెంకటేష్ స్వయంగా మగ్గంపై కూర్చొని ఎంతో భక్తిశ్రద్ధలతో స్వామివారికి సమర్పించనున్న జోడు పంచెలను నేస్తూ తన భక్తిని చాటుకున్నారు. చేనేత వృత్తిపై మమకారంతో పాటు శ్రీ కురుమూర్తి స్వామివారిపై ఉన్న అపారమైన భక్తిని తన చేతల ద్వారా చాటుకోవడం విశేషంగా నిలిచింది.
అమరచింత పద్మశాలి చేనేత కార్మికులు ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారికి సమర్పించేందుకు ప్రత్యేకంగా జోడు పంచెలను నేసి ఆలయ నిర్వాహకులకు అందజేయడం విశేషం. తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయం చేనేత కళా వైభవానికి, భక్తి భావానికి ప్రతీకగా నిలుస్తోంది.
చేనేత వృత్తిని గౌరవిస్తూ, భక్తి సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న ఒగ్గు వెంకటేష్‌తో పాటు అమరచింత పద్మశాలి చేనేత కార్మికుల సేవలు అభినందనీయం. భక్తి, సంప్రదాయం, చేనేత కళ కలగలిసిన ఈ విశిష్ట కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంటోంది.
    user_T.balaram
    T.balaram
    గద్వాల్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    3 hrs ago
  • కొండారెడ్డిపల్లిలో హరినామ సంకీర్తనతో మార్మోగిన పురవీధులు.. భక్తుల ఆధ్యాత్మిక సందడి కేశంపేట మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో కార్తీకమాసం సందర్భంగా హరే రామ హరే కృష్ణ నామసంకీర్తన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ప్రారంభమైంది. మొదటి రోజు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గ్రామ పురవీధుల్లో హరే రామ హరే కృష్ణ నామస్మరణ చేస్తూ భక్తి పారవశ్యంలో ముందుకు సాగారు. భజనలు, సంకీర్తనలతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కార్తీకమాసంలో హరినామ సంకీర్తన చేయడం వల్ల గ్రామ ప్రజలకు సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తులు ఆకాంక్షించారు. ఈ పవిత్ర కార్యక్రమాన్ని గ్రామంలోని ప్రతి ఒక్కరూ తమ కార్యక్రమంగా భావించి పాల్గొనాలని నిర్వాహకులు కోరారు. భక్తులందరూ కలిసి నామసంకీర్తనలో భాగస్వాములై ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందాలని పిలుపునిచ్చారు.
    1
    కొండారెడ్డిపల్లిలో హరినామ సంకీర్తనతో మార్మోగిన పురవీధులు.. భక్తుల ఆధ్యాత్మిక సందడి
కేశంపేట మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో కార్తీకమాసం సందర్భంగా హరే రామ హరే కృష్ణ నామసంకీర్తన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ప్రారంభమైంది. మొదటి రోజు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గ్రామ పురవీధుల్లో హరే రామ హరే కృష్ణ నామస్మరణ చేస్తూ భక్తి పారవశ్యంలో ముందుకు సాగారు. భజనలు, సంకీర్తనలతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కార్తీకమాసంలో హరినామ సంకీర్తన చేయడం వల్ల గ్రామ ప్రజలకు సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తులు ఆకాంక్షించారు. ఈ పవిత్ర కార్యక్రమాన్ని గ్రామంలోని ప్రతి ఒక్కరూ తమ కార్యక్రమంగా భావించి పాల్గొనాలని నిర్వాహకులు కోరారు. భక్తులందరూ కలిసి నామసంకీర్తనలో భాగస్వాములై ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందాలని పిలుపునిచ్చారు.
    user_S M S
    S M S
    Graphic designer కేశంపేట్, రంగారెడ్డి, తెలంగాణ•
    8 hrs ago
  • #JaiDeshParty * నారాయణపేటజిల్లా నియోజకవర్గం #మక్తల్ #నారాయణపేట మార్గంలో ఇసుకఅక్రమ రవాణా ఆరోపణలు.గట్టు మండలంలో అధ్వానంగా రోడ్లు #PoliticalAdvocacyGroup #OurVoicePeopleVoice #Telangana #Brs #Kcr #revanthreddy #JanaSena #ncbn #naralokesh #Narayanpet #pawankalyan #trs #kavitha #nda #JaiDeshParty * నారాయణపేటజిల్లా నియోజకవర్గం #మక్తల్ #నారాయణపేట మార్గంలో ఇసుకఅక్రమ రవాణా ఆరోపణలు.గట్టు మండలంలో అధ్వానంగా రోడ్లు #PoliticalAdvocacyGroup #OurVoicePeopleVoice #Telangana #Brs #Kcr #revanthreddy #JanaSena #ncbn #naralokesh #Narayanpet #pawankalyan #trs #kavitha #nda
    1
    #JaiDeshParty

* నారాయణపేటజిల్లా నియోజకవర్గం #మక్తల్ #నారాయణపేట మార్గంలో ఇసుకఅక్రమ రవాణా ఆరోపణలు.గట్టు మండలంలో అధ్వానంగా రోడ్లు

#PoliticalAdvocacyGroup
#OurVoicePeopleVoice #Telangana #Brs #Kcr #revanthreddy #JanaSena #ncbn #naralokesh #Narayanpet #pawankalyan #trs #kavitha #nda
#JaiDeshParty
* నారాయణపేటజిల్లా నియోజకవర్గం #మక్తల్ #నారాయణపేట మార్గంలో ఇసుకఅక్రమ రవాణా ఆరోపణలు.గట్టు మండలంలో అధ్వానంగా రోడ్లు
#PoliticalAdvocacyGroup
#OurVoicePeopleVoice #Telangana #Brs #Kcr #revanthreddy #JanaSena #ncbn #naralokesh #Narayanpet #pawankalyan #trs #kavitha #nda
    user_JaiDesh Party
    JaiDesh Party
    Makthal, Narayanpet•
    19 hrs ago
  • అక్రమంగా అండాల సేకరణ: ఐదు ప్రముఖ ఫెర్టిలిటీ సెంటర్లకు తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు! హైదరాబాద్, నవంబర్ 10: నిబంధనలకు విరుద్ధంగా మహిళల నుంచి అక్రమంగా అండాలు (Eggs) సేకరిస్తున్నారన్న తీవ్ర ఆరోపణలపై తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఉక్కుపాదం మోపింది. నగరంలోని ఐదు ప్రముఖ సంతాన సాఫల్య కేంద్రాలకు (Fertility Centres) కమిషన్ అధికారికంగా నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న కేంద్రాల మేనేజింగ్ డైరెక్టర్లు, మెడికల్ సూపరింటెండెంట్లు, సెంటర్ హెడ్స్ సోమవారం బుద్ధభవన్‌లోని కమిషన్ కార్యాలయంలో స్వయంగా హాజరయ్యారు. ​ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే... ఇందిరా ఐవీఎఫ్ సెంటర్ (Indira IVF Centre), నర్మదా ఫెర్టిలిటీ సెంటర్ (Narmada Fertility Centre), ఒయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ (Oasis Fertility Centre), సద్గురు ఏఆర్టీ సెంటర్ (Sadguru ART Centre), పద్మజా ఫెర్టిలిటీ సెంటర్ (Padmaja Fertility Centre) లపై నిబంధనల ఉల్లంఘన ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో మహిళా కమిషన్ చైర్‌పర్సన్ శారద నెరేళ్ల ఎదుట హాజరైన ఆయా ఆసుపత్రుల యాజమాన్యాలు తమ వివరణలను లిఖితపూర్వకంగా సమర్పించాల్సి ఉంది. ​అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ (రెగ్యులేషన్) చట్టం, 2021 (ART Act) ప్రకారం అండ దాతల నుంచి తప్పనిసరిగా లిఖితపూర్వక అనుమతి తీసుకోవడం, తగిన వైద్య రక్షణలు కల్పించడం, అండాల సేకరణపై నిర్దేశించిన పరిమితులను పాటించడం తప్పనిసరి. అయితే ఈ ఐదు కేంద్రాలు సదరు నిబంధనలను ఉల్లంఘించాయా లేదా అన్న కోణంలో కమిషన్ సమగ్ర విచారణ జరుపుతోంది. మహిళల ఆరోగ్యం, వారి ఆత్మగౌరవం, పునరుత్పత్తి హక్కులకు భంగం వాటిల్లిందా అనే అంశాన్ని నిర్ధారించేందుకు ఆసుపత్రులు ఇచ్చే వివరణలు, సాక్ష్యాలను పరిశీలించి బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయనున్నట్లు కమిషన్ వెల్లడించింది. ​కీలక ముఖ్యాంశాలు: - ​మహిళల నుంచి అక్రమంగా అండాల సేకరణ ఆరోపణలపై ఐదు ఫెర్టిలిటీ కేంద్రాలకు మహిళా కమిషన్ నోటీసులు - ​ఇందిరా ఐవీఎఫ్, నర్మదా, ఒయాసిస్, సద్గురు, పద్మజా ఫెర్టిలిటీ కేంద్రాలకు చెందిన ప్రతినిధులు హాజరు - ​బుద్ధభవన్‌లో మహిళా కమిషన్ చైర్‌పర్సన్ శారద నెరేళ్ల ఎదుట హాజరై లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశం - ​ఏఆర్టీ (రెగ్యులేషన్) చట్టం-2021 నిబంధనల ఉల్లంఘనలపై సమగ్ర విచారణ - ​వివరణలు, ఆధారాలను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు కమిషన్ స్పష్టీకరణ
    1
    అక్రమంగా అండాల సేకరణ: ఐదు ప్రముఖ ఫెర్టిలిటీ సెంటర్లకు తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు!
హైదరాబాద్, నవంబర్ 10:
నిబంధనలకు విరుద్ధంగా మహిళల నుంచి అక్రమంగా అండాలు (Eggs) సేకరిస్తున్నారన్న తీవ్ర ఆరోపణలపై తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఉక్కుపాదం మోపింది. నగరంలోని ఐదు ప్రముఖ సంతాన సాఫల్య కేంద్రాలకు (Fertility Centres) కమిషన్ అధికారికంగా నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న కేంద్రాల మేనేజింగ్ డైరెక్టర్లు, మెడికల్ సూపరింటెండెంట్లు, సెంటర్ హెడ్స్ సోమవారం బుద్ధభవన్‌లోని కమిషన్ కార్యాలయంలో స్వయంగా హాజరయ్యారు.
​ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే... ఇందిరా ఐవీఎఫ్ సెంటర్ (Indira IVF Centre), నర్మదా ఫెర్టిలిటీ సెంటర్ (Narmada Fertility Centre), ఒయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ (Oasis Fertility Centre), సద్గురు ఏఆర్టీ సెంటర్ (Sadguru ART Centre), పద్మజా ఫెర్టిలిటీ సెంటర్ (Padmaja Fertility Centre) లపై నిబంధనల ఉల్లంఘన ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో మహిళా కమిషన్ చైర్‌పర్సన్ శారద నెరేళ్ల ఎదుట హాజరైన ఆయా ఆసుపత్రుల యాజమాన్యాలు తమ వివరణలను లిఖితపూర్వకంగా సమర్పించాల్సి ఉంది.
​అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ (రెగ్యులేషన్) చట్టం, 2021 (ART Act) ప్రకారం అండ దాతల నుంచి తప్పనిసరిగా లిఖితపూర్వక అనుమతి తీసుకోవడం, తగిన వైద్య రక్షణలు కల్పించడం, అండాల సేకరణపై నిర్దేశించిన పరిమితులను పాటించడం తప్పనిసరి. అయితే ఈ ఐదు కేంద్రాలు సదరు నిబంధనలను ఉల్లంఘించాయా లేదా అన్న కోణంలో కమిషన్ సమగ్ర విచారణ జరుపుతోంది. మహిళల ఆరోగ్యం, వారి ఆత్మగౌరవం, పునరుత్పత్తి హక్కులకు భంగం వాటిల్లిందా అనే అంశాన్ని నిర్ధారించేందుకు ఆసుపత్రులు ఇచ్చే వివరణలు, సాక్ష్యాలను పరిశీలించి బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయనున్నట్లు కమిషన్ వెల్లడించింది.
​కీలక ముఖ్యాంశాలు:
- ​మహిళల నుంచి అక్రమంగా అండాల సేకరణ ఆరోపణలపై ఐదు ఫెర్టిలిటీ కేంద్రాలకు మహిళా కమిషన్ నోటీసులు
- ​ఇందిరా ఐవీఎఫ్, నర్మదా, ఒయాసిస్, సద్గురు, పద్మజా ఫెర్టిలిటీ కేంద్రాలకు చెందిన ప్రతినిధులు హాజరు
- ​బుద్ధభవన్‌లో మహిళా కమిషన్ చైర్‌పర్సన్ శారద నెరేళ్ల ఎదుట హాజరై లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశం
- ​ఏఆర్టీ (రెగ్యులేషన్) చట్టం-2021 నిబంధనల ఉల్లంఘనలపై సమగ్ర విచారణ
- ​వివరణలు, ఆధారాలను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు కమిషన్ స్పష్టీకరణ
    user_NAINI SHARATH REDDY
    NAINI SHARATH REDDY
    Local News Reporter Balapur, Ranga Reddy•
    4 hrs ago
  • అట్లాస్ జానయ్య వేధింపులు అరికట్టాలని అతనిపై చర్యలు తీసుకోవాలని నిరసన ర్యాలీ వైస్ ఛాన్సలర్‌ అల్డాస్ జానయ్య వేధింపులు తట్టుకోలేక కంటతడి పెట్టుకున్న మరో మహిళా ప్రొఫెసర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో కొనసాగుతున్న వైస్ ఛాన్సలర్‌ అల్డాస్ జానయ్య మహిళా ప్రొఫెసర్, మరో ప్రొఫెసర్‌ను పట్టుకొని మీరిద్దరూ మొగుడు పెళ్లాం లాగా యూనివర్సిటీలో తిరుగుతున్నారని వేధించిన అల్డాస్ జానయ్య డీజీపీ స్థాయిలో ఫిర్యాదు చేసినా మాకు న్యాయం దక్కడం లేదు - బాధిత మహిళా ప్రొఫెసర్
    1
    అట్లాస్ జానయ్య వేధింపులు అరికట్టాలని అతనిపై చర్యలు తీసుకోవాలని నిరసన ర్యాలీ 
వైస్ ఛాన్సలర్‌ అల్డాస్ జానయ్య వేధింపులు తట్టుకోలేక కంటతడి పెట్టుకున్న మరో మహిళా ప్రొఫెసర్
అగ్రికల్చర్ యూనివర్సిటీలో కొనసాగుతున్న వైస్ ఛాన్సలర్‌ అల్డాస్ జానయ్య 
మహిళా ప్రొఫెసర్, మరో ప్రొఫెసర్‌ను పట్టుకొని మీరిద్దరూ మొగుడు పెళ్లాం లాగా యూనివర్సిటీలో తిరుగుతున్నారని వేధించిన అల్డాస్ జానయ్య
డీజీపీ స్థాయిలో ఫిర్యాదు చేసినా మాకు న్యాయం దక్కడం లేదు
- బాధిత మహిళా ప్రొఫెసర్
    user_Sangareddy News
    Sangareddy News
    Local News Reporter Saidabad, Hyderabad•
    17 hrs ago
  • కార్తీకమాసం సందర్భంగా నంద్యాలలో అన్న ప్రసాద వితరణ కేంద్రం ప్రారంభం కార్తీకమాసం సందర్భంగా మంగళవారం నంద్యాలలోని శ్రీ ప్రధమ నందీశ్వరస్వామి దేవస్థానం ప్రాంగణంలో కేదారేశ్వరి దేవి అన్న ప్రసాద వితరణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా ప్రారంభించారు. ప్రారంభానికి ముందు కలెక్టర్ స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం కలెక్టర్కు వేద పండితులు ఆశీర్వచనం చేయడం జరిగింది. అన్న ప్రసాద వితరణ కేంద్రంలో నిర్వహించిన చండీ హోమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, అర్చకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    1
    కార్తీకమాసం సందర్భంగా నంద్యాలలో అన్న ప్రసాద వితరణ కేంద్రం ప్రారంభం

కార్తీకమాసం సందర్భంగా మంగళవారం నంద్యాలలోని శ్రీ ప్రధమ నందీశ్వరస్వామి దేవస్థానం ప్రాంగణంలో కేదారేశ్వరి దేవి అన్న ప్రసాద వితరణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్  రాజకుమారి గనియా  ప్రారంభించారు.
ప్రారంభానికి ముందు కలెక్టర్ స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం కలెక్టర్కు వేద పండితులు ఆశీర్వచనం చేయడం జరిగింది. అన్న ప్రసాద వితరణ కేంద్రంలో నిర్వహించిన చండీ హోమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, అర్చకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.