logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

బాసర లో అక్క తమ్ముళ్ల ప్రేమకు ఆదర్శంగా నిలిచిన రాఖీ పండగ.. బాసర లో రాఖీ పండగ అందరికి ఆదర్శంగా నిలిచింది. బాసర లోని ప్రాథమిక ప్రభుత్వ ఆసుపత్రి లో విధులు నిర్వర్తించే స్వీపర్ రిజ్వాణ అటెండర్ గైని సాయికి రాఖీ కట్టి దీవించి ఒకరినొకరు స్వీట్ తినిపించుకున్నారు. అక్క తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచారు. ప్రస్తుతం సోషల్ మీడియా లో ఈ వీడియో వైరల్ అవుతుంది. పండగలకు కుల మతాలు అడ్డు రావని, అందరు కుల మతాలకు అతీతంగా ఉండి పండగలను శాంతి యుతంగా జరుపుకోవాలని అన్నారు.

11 hrs ago
user_RP
RP
Academy బాసర, నిర్మల్, తెలంగాణ•
11 hrs ago

బాసర లో అక్క తమ్ముళ్ల ప్రేమకు ఆదర్శంగా నిలిచిన రాఖీ పండగ.. బాసర లో రాఖీ పండగ అందరికి ఆదర్శంగా నిలిచింది. బాసర లోని ప్రాథమిక ప్రభుత్వ ఆసుపత్రి లో విధులు నిర్వర్తించే స్వీపర్ రిజ్వాణ అటెండర్ గైని సాయికి రాఖీ కట్టి దీవించి ఒకరినొకరు స్వీట్ తినిపించుకున్నారు. అక్క తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచారు. ప్రస్తుతం సోషల్ మీడియా లో ఈ వీడియో వైరల్ అవుతుంది. పండగలకు కుల మతాలు అడ్డు రావని, అందరు కుల మతాలకు అతీతంగా ఉండి పండగలను శాంతి యుతంగా జరుపుకోవాలని అన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • బాసర లో అక్క తమ్ముళ్ల ప్రేమకు ఆదర్శంగా నిలిచిన రాఖీ పండగ.. బాసర లో రాఖీ పండగ అందరికి ఆదర్శంగా నిలిచింది. బాసర లోని ప్రాథమిక ప్రభుత్వ ఆసుపత్రి లో విధులు నిర్వర్తించే స్వీపర్ రిజ్వాణ అటెండర్ గైని సాయికి రాఖీ కట్టి దీవించి ఒకరినొకరు స్వీట్ తినిపించుకున్నారు. అక్క తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచారు. ప్రస్తుతం సోషల్ మీడియా లో ఈ వీడియో వైరల్ అవుతుంది. పండగలకు కుల మతాలు అడ్డు రావని, అందరు కుల మతాలకు అతీతంగా ఉండి పండగలను శాంతి యుతంగా జరుపుకోవాలని అన్నారు.
    1
    బాసర లో అక్క తమ్ముళ్ల ప్రేమకు ఆదర్శంగా నిలిచిన రాఖీ పండగ.. 
బాసర లో రాఖీ పండగ అందరికి ఆదర్శంగా నిలిచింది. బాసర లోని ప్రాథమిక ప్రభుత్వ ఆసుపత్రి లో విధులు నిర్వర్తించే స్వీపర్ రిజ్వాణ అటెండర్ గైని సాయికి రాఖీ కట్టి దీవించి ఒకరినొకరు స్వీట్ తినిపించుకున్నారు. అక్క తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచారు. ప్రస్తుతం సోషల్ మీడియా లో ఈ వీడియో వైరల్ అవుతుంది. పండగలకు కుల మతాలు అడ్డు రావని, అందరు కుల మతాలకు అతీతంగా ఉండి పండగలను శాంతి యుతంగా జరుపుకోవాలని అన్నారు.
    user_RP
    RP
    Academy బాసర, నిర్మల్, తెలంగాణ•
    11 hrs ago
  • నందిపేట్ కేజీవీపీ విద్యాలయంలో రాఖీ వేడుకలు.. అనాథ చిన్నారులకు వస్త్రాల పంపిణీ చేసిన సర్పంచ్ ఎర్రం లింగం నందిపేట్ కేజీవీపీ విద్యాలయంలో రాఖీ వేడుకలు.. అనాథ చిన్నారులకు వస్త్రాల పంపిణీ చేసిన సర్పంచ్ ఎర్రం లింగం నందిపేట్: మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ పాఠశాలలో రాఖీ పౌర్ణమి పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో చదువుతున్న అనాథ, నిరుపేద చిన్నారులు నందిపేట్ సర్పంచ్ సిలిండర్ లింగంకు రాఖీలు కట్టి, ఆయనతో కలిసి పండుగను ఆత్మీయంగా జరుపుకున్నారు. అనంతరం తల్లిదండ్రులు లేని 20 మంది అనాథ అమ్మాయిలకు కొత్త దుస్తులను పంపిణీ చేశారు. అనంతరం సర్పంచ్ విద్యార్థినులతో కలిసి భోజనం చేసి, వారితో ఆత్మీయంగా గడిపారు. దీంతో పండుగ సందర్భంగా చిన్నారుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులు, ఉపాధ్యాయినులు సర్పంచ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నందిపేట్ సర్పంచ్ ఎర్రం (సిలిండర్) లింగం మాట్లాడుతూ.. అనాథ చిన్నారుల విద్యాభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. తల్లిదండ్రులు లేకపోయినా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని, కష్టపడి చదివి పాఠశాల పేరు ప్రఖ్యాతులు పెంచేలా తమ భవిష్యత్తును మెరుగుపరుచుకోవాలని చిన్నారులకు సూచించారు. చిన్నారుల సంక్షేమం కోసం తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని, భవిష్యత్తులో కూడా వారికి అవసరమైన సహకారం అందిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శాంతా కుమారి, ఉపాధ్యాయినులు, సిబ్బంది పాల్గొన్నారు.
    1
    నందిపేట్ కేజీవీపీ విద్యాలయంలో రాఖీ వేడుకలు.. అనాథ చిన్నారులకు వస్త్రాల పంపిణీ చేసిన సర్పంచ్ ఎర్రం లింగం
నందిపేట్ కేజీవీపీ విద్యాలయంలో రాఖీ వేడుకలు.. అనాథ చిన్నారులకు వస్త్రాల పంపిణీ చేసిన సర్పంచ్ ఎర్రం లింగం
నందిపేట్: మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ పాఠశాలలో రాఖీ పౌర్ణమి పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో చదువుతున్న అనాథ, నిరుపేద చిన్నారులు నందిపేట్ సర్పంచ్ సిలిండర్ లింగంకు రాఖీలు కట్టి, ఆయనతో కలిసి పండుగను ఆత్మీయంగా జరుపుకున్నారు. అనంతరం తల్లిదండ్రులు లేని 20 మంది అనాథ అమ్మాయిలకు కొత్త దుస్తులను పంపిణీ చేశారు. అనంతరం సర్పంచ్ విద్యార్థినులతో కలిసి భోజనం చేసి, వారితో ఆత్మీయంగా గడిపారు. దీంతో పండుగ సందర్భంగా చిన్నారుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులు, ఉపాధ్యాయినులు సర్పంచ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా నందిపేట్ సర్పంచ్ ఎర్రం (సిలిండర్) లింగం మాట్లాడుతూ.. అనాథ చిన్నారుల విద్యాభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. తల్లిదండ్రులు లేకపోయినా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని, కష్టపడి చదివి పాఠశాల పేరు ప్రఖ్యాతులు పెంచేలా తమ భవిష్యత్తును మెరుగుపరుచుకోవాలని చిన్నారులకు సూచించారు. చిన్నారుల సంక్షేమం కోసం తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని, భవిష్యత్తులో కూడా వారికి అవసరమైన సహకారం అందిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శాంతా కుమారి, ఉపాధ్యాయినులు, సిబ్బంది పాల్గొన్నారు.
    user_Shaikg journalist
    Shaikg journalist
    Graphic designer నందిపేట్, నిజామాబాద్, తెలంగాణ•
    1 hr ago
  • బోధన్ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్.. కాంగ్రెస్, మజ్లిస్ మధ్య రాజకీయ విభేదాలపై చర్చ బోధన్ రాజకీయాల్లో మరోసారి రాజకీయ వేడి కనిపిస్తోంది. ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) తరఫున కాంగ్రెస్‌కు గట్టి రాజకీయ సందేశం రావడంతో బోధన్‌లో రాజకీయ వాతావరణంపై చర్చ మొదలైంది. మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ బ్యారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్ పార్టీకి బుల్డోజర్ చర్యల విషయంలో హెచ్చరిక చేసిన నేపథ్యంలో బోధన్ రాజకీయ పరిస్థితి మరోసారి చర్చనీయాంశంగా మారింది. రానున్న 2028 ఎన్నికల్లో ఈ రాజకీయ విభేదాల ప్రభావం ఎవరిపై పడుతుంది? ప్రజలు ఈ వ్యవహారంపై ఎలాంటి తీర్పు ఇస్తారు? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు తెలంగాణలో కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల మధ్య పలు అంశాల్లో సహకారం, రాజకీయ సమన్వయం కనిపిస్తూ వచ్చింది. అయితే బోధన్‌లో కాంగ్రెస్, మజ్లిస్ స్థానిక నాయకుల మధ్య ఏర్పడుతున్న రాజకీయ ఉద్రిక్తతలు పలు ప్రశ్నలకు దారితీస్తున్నాయి. బోధన్ ప్రజల్లో ఇప్పుడు ఒక చర్చ కొనసాగుతోంది. ఈ రాజకీయ వివాదం తర్వాత బోధన్ రాజకీయ వాతావరణం మారుతుందా? రానున్న ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఈ రాజకీయ పరిణామాలపై సమాధానం ఇస్తారా? బోధన్ కాంగ్రెస్ నాయకులు, మజ్లిస్ నాయకుల మధ్య ఇదే విధమైన రాజకీయ పోరు కొనసాగుతుందా? అన్నింటికంటే ముఖ్యమైన ప్రశ్న... ఈ రాజకీయ విభేదాల కారణంగా బోధన్ అభివృద్ధి ప్రభావితమవుతుందా? గతంలో కూడా రాజకీయ విభేదాలు, రాజకీయ ఆధిపత్య పోరు కారణంగా బోధన్ అభివృద్ధి దెబ్బతిన్నదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు మరోసారి రాజకీయ వివాదాల కారణంగా బోధన్ అభివృద్ధి పనులు ప్రభావితమవుతాయా? అనే ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది. అలాగే ప్రజల్లో మరో ప్రశ్న కూడా వినిపిస్తోంది... అసలు బోధన్‌లో కాంగ్రెస్ పార్టీ ఏం కోరుకుంటోంది? తెలంగాణ స్థాయిలో రాష్ట్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మజ్లిస్‌తో కలిసి పనిచేయగలిగినప్పుడు, బోధన్‌లో మాత్రం కాంగ్రెస్, మజ్లిస్ స్థానిక నాయకుల మధ్య రాజకీయ విభేదాలు ఎందుకు ఏర్పడుతున్నాయి? బోధన్ అభివృద్ధే లక్ష్యమైతే, రెండు పార్టీల స్థానిక నాయకులు రాజకీయ విభేదాలను పక్కనపెట్టి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కలిసి పనిచేయకూడదా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బుల్డోజర్ చర్యలు, రాజకీయ వివాదాల విషయంలో కూడా ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రాజకీయ విభేదాలు ఎవరి మధ్య ఉన్నా, వాటి ప్రభావం బోధన్ అభివృద్ధిపై పడకూడదని ప్రజలు కోరుతున్నారు. బోధన్ ప్రజల డిమాండ్ ఏమిటంటే.. అన్ని రాజకీయ పార్టీలు రాజకీయ విభేదాలకు అతీతంగా పట్టణ అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. మౌలిక సదుపాయాలు, రోడ్లు, ఆరోగ్యం, విద్య, ఉపాధి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పుడు చూడాల్సింది ఏమిటంటే... బోధన్‌లో కొనసాగుతున్న ఈ రాజకీయ వివాదం రానున్న రోజుల్లో ఎలాంటి మలుపు తిరుగుతుంది? కాంగ్రెస్, మజ్లిస్ స్థానిక నాయకుల మధ్య విభేదాలు మరింత తీవ్రతరం అవుతాయా?** లేక బోధన్ ప్రజా ప్రయోజనాలు, పట్టణ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రాజకీయ విభేదాలను పక్కనపెట్టి ఇరు వర్గాలు కలిసి పనిచేస్తాయా? బోధన్ రాజకీయ పరిణామాలపై ఇప్పుడు ప్రజల దృష్టి అంతా ఉంది. రానున్న ఎన్నికల్లో ప్రజల ఓటే ఈ రాజకీయ పరిస్థితికి అసలైన సమాధానం కానుంది.
    1
    బోధన్ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్.. కాంగ్రెస్, మజ్లిస్ మధ్య రాజకీయ విభేదాలపై చర్చ
బోధన్ రాజకీయాల్లో మరోసారి రాజకీయ వేడి కనిపిస్తోంది. ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) తరఫున కాంగ్రెస్‌కు గట్టి రాజకీయ సందేశం రావడంతో బోధన్‌లో రాజకీయ వాతావరణంపై చర్చ మొదలైంది.
మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ బ్యారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్ పార్టీకి బుల్డోజర్ చర్యల విషయంలో హెచ్చరిక చేసిన నేపథ్యంలో బోధన్ రాజకీయ పరిస్థితి మరోసారి చర్చనీయాంశంగా మారింది. రానున్న 2028 ఎన్నికల్లో ఈ రాజకీయ విభేదాల ప్రభావం ఎవరిపై పడుతుంది? ప్రజలు ఈ వ్యవహారంపై ఎలాంటి తీర్పు ఇస్తారు? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
ఇప్పటివరకు తెలంగాణలో కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల మధ్య పలు అంశాల్లో సహకారం, రాజకీయ సమన్వయం కనిపిస్తూ వచ్చింది. అయితే బోధన్‌లో కాంగ్రెస్, మజ్లిస్ స్థానిక నాయకుల మధ్య ఏర్పడుతున్న రాజకీయ ఉద్రిక్తతలు పలు ప్రశ్నలకు దారితీస్తున్నాయి.
బోధన్ ప్రజల్లో ఇప్పుడు ఒక చర్చ కొనసాగుతోంది.
ఈ రాజకీయ వివాదం తర్వాత బోధన్ రాజకీయ వాతావరణం మారుతుందా?
రానున్న ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఈ రాజకీయ పరిణామాలపై సమాధానం ఇస్తారా?
బోధన్ కాంగ్రెస్ నాయకులు, మజ్లిస్ నాయకుల మధ్య ఇదే విధమైన రాజకీయ పోరు కొనసాగుతుందా?
అన్నింటికంటే ముఖ్యమైన ప్రశ్న...
ఈ రాజకీయ విభేదాల కారణంగా బోధన్ అభివృద్ధి ప్రభావితమవుతుందా?
గతంలో కూడా రాజకీయ విభేదాలు, రాజకీయ ఆధిపత్య పోరు కారణంగా బోధన్ అభివృద్ధి దెబ్బతిన్నదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు మరోసారి రాజకీయ వివాదాల కారణంగా బోధన్ అభివృద్ధి పనులు ప్రభావితమవుతాయా? అనే ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది.
అలాగే ప్రజల్లో మరో ప్రశ్న కూడా వినిపిస్తోంది...
అసలు బోధన్‌లో కాంగ్రెస్ పార్టీ ఏం కోరుకుంటోంది?
తెలంగాణ స్థాయిలో రాష్ట్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మజ్లిస్‌తో కలిసి పనిచేయగలిగినప్పుడు, బోధన్‌లో మాత్రం కాంగ్రెస్, మజ్లిస్ స్థానిక నాయకుల మధ్య రాజకీయ విభేదాలు ఎందుకు ఏర్పడుతున్నాయి?
బోధన్ అభివృద్ధే లక్ష్యమైతే, రెండు పార్టీల స్థానిక నాయకులు రాజకీయ విభేదాలను పక్కనపెట్టి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కలిసి పనిచేయకూడదా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
బుల్డోజర్ చర్యలు, రాజకీయ వివాదాల విషయంలో కూడా ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రాజకీయ విభేదాలు ఎవరి మధ్య ఉన్నా, వాటి ప్రభావం బోధన్ అభివృద్ధిపై పడకూడదని ప్రజలు కోరుతున్నారు.
బోధన్ ప్రజల డిమాండ్ ఏమిటంటే.. అన్ని రాజకీయ పార్టీలు రాజకీయ విభేదాలకు అతీతంగా పట్టణ అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. మౌలిక సదుపాయాలు, రోడ్లు, ఆరోగ్యం, విద్య, ఉపాధి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు.
ఇప్పుడు చూడాల్సింది ఏమిటంటే...
బోధన్‌లో కొనసాగుతున్న ఈ రాజకీయ వివాదం రానున్న రోజుల్లో ఎలాంటి మలుపు తిరుగుతుంది?
కాంగ్రెస్, మజ్లిస్ స్థానిక నాయకుల మధ్య విభేదాలు మరింత తీవ్రతరం అవుతాయా?**
లేక బోధన్ ప్రజా ప్రయోజనాలు, పట్టణ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రాజకీయ విభేదాలను పక్కనపెట్టి ఇరు వర్గాలు కలిసి పనిచేస్తాయా?
బోధన్ రాజకీయ పరిణామాలపై ఇప్పుడు ప్రజల దృష్టి అంతా ఉంది. రానున్న ఎన్నికల్లో ప్రజల ఓటే ఈ రాజకీయ పరిస్థితికి అసలైన సమాధానం కానుంది.
    user_Mirza Hassan Baig
    Mirza Hassan Baig
    Photographer బోధన్, నిజామాబాద్, తెలంగాణ•
    1 hr ago
  • వరదల వినాశనానికి BRS అశాస్త్రీయ పాలనే కారణం:-కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఇప్ప శ్రీనివాస్... వరదల వినాశనానికి BRS అశాస్త్రీయ పాలనే కారణం:-కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఇప్ప శ్రీనివాస్... పిండ ప్రదానాల నాటకాలకు కామారెడ్డి ప్రజలే బుద్ధి చెబుతారు! కామారెడ్డి అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ... ముందస్తు చూపు లేకుండా, ఎలాంటి శాస్త్రీయ పద్ధతులు పాటించకుండా పదేళ్ల పాలనలో ఇష్టారీతిన డివైడర్లు నిర్మించి కామారెడ్డిలో వరద వినాశనానికి BRS పార్టీయే ప్రధాన కారణమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఇప్ప శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు BRS నాయకులకు లేదని ఆయన ఖండించారు. ఈ సందర్భంగా ఇప్ప శ్రీనివాస్ మాట్లాడుతూ... గతంలో వచ్చిన వరదల వల్ల ప్రజలు పడిన అపారమైన ఇబ్బందులకు BRS నాయకులు తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తమ పాలనలో చేసిన చారిత్రక తప్పులను, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు 'పిండ ప్రదానాలు' అంటూ చౌకబారు రాజకీయాలు, నాటకాలు ఆడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. శాశ్వత పరిష్కారం దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం:- BRS చేసిన తప్పులను సరిదిద్ది, కామారెడ్డి ప్రజలకు వరద ముప్పు నుండి శాశ్వత ఉపశమనం కలిగించేందుకు అవసరమైన చర్యలపై ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి దృష్టికి ప్రభుత్వ సలహాదారు శ్రీ షబ్బీర్ అలీ గారు ఇప్పటికే తీసుకెళ్లారని తెలిపారు. కామారెడ్డి అభివృద్ధి, ప్రజల భద్రతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందని స్పష్టం చేశారు. అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ షబ్బీర్ అలీ:- కామారెడ్డి నియోజకవర్గంలో షబ్బీర్ అలీ కృషి వల్లే ప్రతీ ఊరికి సబ్ స్టేషన్లు, మల్లన్న గుట్ట వద్ద ఫిల్టర్ బెడ్ నిర్మాణం సాధ్యమయ్యాయని గుర్తుచేశారు. ఈ వేసవి కాలంలో నీటి సమస్య లేకుండా పోవడం ఆయన దూరదృష్టికి నిదర్శనమన్నారు. "గతంలో పట్టణానికి 7 MLD నీరు మాత్రమే వస్తే, ఇప్పుడు అది 11 MLD కి పెరిగింది. అది షబ్బీర్ అలీ సామర్థ్యానికి తార్కాణం. ఇందిరా గాంధీ స్టేడియం నిర్మాణం, ఫ్లడ్ లైట్లు, ప్రధాన రహదారుల అభివృద్ధి అంతా ఆయన హయాంలోనే జరిగింది" అని పేర్కొన్నారు. BRS కు సవాల్:- ప్రజలను మభ్యపెట్టి, కేవలం రాజకీయ లబ్ధి పొందడం కోసం ధర్నాలు, నాటకాలు చేయడం BRS నాయకులు మానుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యకమంలో పట్టణ అధ్యక్షులు సందీప్,రాజగౌడ్,గూడెం శ్రీనివాస్,పండ్లరాజు,గోనె శ్రీనివాస్ గొడుగుల,శ్రీనివాస్,కౌన్సిలర్స్ అంజాద్,జావీద్,నిట్టూ గంగాధర్,కాళ్ళ గణేష్,లడ్డు,కన్నయ్య కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
    1
    వరదల వినాశనానికి BRS అశాస్త్రీయ పాలనే కారణం:-కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఇప్ప శ్రీనివాస్...
వరదల వినాశనానికి BRS అశాస్త్రీయ పాలనే కారణం:-కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఇప్ప శ్రీనివాస్...
పిండ ప్రదానాల నాటకాలకు కామారెడ్డి ప్రజలే బుద్ధి చెబుతారు!
కామారెడ్డి అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ...
ముందస్తు చూపు లేకుండా, ఎలాంటి శాస్త్రీయ పద్ధతులు పాటించకుండా పదేళ్ల పాలనలో ఇష్టారీతిన డివైడర్లు నిర్మించి కామారెడ్డిలో వరద వినాశనానికి BRS పార్టీయే ప్రధాన కారణమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఇప్ప శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు BRS నాయకులకు లేదని ఆయన ఖండించారు.
ఈ సందర్భంగా ఇప్ప శ్రీనివాస్ మాట్లాడుతూ... గతంలో వచ్చిన వరదల వల్ల ప్రజలు పడిన అపారమైన ఇబ్బందులకు BRS నాయకులు తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తమ పాలనలో చేసిన చారిత్రక తప్పులను, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు 'పిండ ప్రదానాలు' అంటూ చౌకబారు రాజకీయాలు, నాటకాలు ఆడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.
శాశ్వత పరిష్కారం దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం:-
BRS చేసిన తప్పులను సరిదిద్ది, కామారెడ్డి ప్రజలకు వరద ముప్పు నుండి శాశ్వత ఉపశమనం కలిగించేందుకు అవసరమైన చర్యలపై ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి దృష్టికి ప్రభుత్వ సలహాదారు శ్రీ షబ్బీర్ అలీ గారు ఇప్పటికే తీసుకెళ్లారని తెలిపారు. కామారెడ్డి అభివృద్ధి, ప్రజల భద్రతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందని స్పష్టం చేశారు.
అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ షబ్బీర్ అలీ:-
కామారెడ్డి నియోజకవర్గంలో షబ్బీర్ అలీ  కృషి వల్లే ప్రతీ ఊరికి సబ్ స్టేషన్లు, మల్లన్న గుట్ట వద్ద ఫిల్టర్ బెడ్ నిర్మాణం సాధ్యమయ్యాయని గుర్తుచేశారు. ఈ వేసవి కాలంలో నీటి సమస్య లేకుండా పోవడం ఆయన దూరదృష్టికి నిదర్శనమన్నారు. "గతంలో పట్టణానికి 7 MLD నీరు మాత్రమే వస్తే, ఇప్పుడు అది 11 MLD కి పెరిగింది. అది షబ్బీర్ అలీ  సామర్థ్యానికి తార్కాణం. ఇందిరా గాంధీ స్టేడియం నిర్మాణం, ఫ్లడ్ లైట్లు, ప్రధాన రహదారుల అభివృద్ధి అంతా ఆయన హయాంలోనే జరిగింది" అని పేర్కొన్నారు.
BRS కు సవాల్:-
ప్రజలను మభ్యపెట్టి, కేవలం రాజకీయ లబ్ధి పొందడం కోసం ధర్నాలు, నాటకాలు చేయడం BRS నాయకులు మానుకోవాలని హెచ్చరించారు.
ఈ కార్యకమంలో పట్టణ  అధ్యక్షులు సందీప్,రాజగౌడ్,గూడెం శ్రీనివాస్,పండ్లరాజు,గోనె శ్రీనివాస్ గొడుగుల,శ్రీనివాస్,కౌన్సిలర్స్ అంజాద్,జావీద్,నిట్టూ గంగాధర్,కాళ్ళ గణేష్,లడ్డు,కన్నయ్య కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
    user_Routhu srikanth
    Routhu srikanth
    నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    4 hrs ago
  • రక్షాబంధన్ ఎఫెక్ట్... రద్దీగా బస్సులు........( వీడియో) బిక్కనూర్ రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఉదయం నుండి మండల కేంద్రంలో ఆర్టీసీ బస్సులలో మహిళా ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు తరలి వెళ్లడంతో బస్సులు రద్దీగా మారాయి. దీనికి తోడు బస్సుల సంఖ్యను తగ్గించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బస్సులో చోటు కోసం మహిళల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. కొందరు చేసేది ఏమీ లేక ఆటోలలో ప్రయాణాలు కొనసాగించారు.
    1
    రక్షాబంధన్ ఎఫెక్ట్... రద్దీగా బస్సులు........( వీడియో)
బిక్కనూర్ రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఉదయం నుండి మండల కేంద్రంలో ఆర్టీసీ బస్సులలో మహిళా ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు తరలి వెళ్లడంతో బస్సులు రద్దీగా మారాయి. దీనికి తోడు బస్సుల సంఖ్యను తగ్గించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
బస్సులో చోటు కోసం మహిళల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. కొందరు చేసేది ఏమీ లేక ఆటోలలో ప్రయాణాలు కొనసాగించారు.
    user_Mahesh Nakka
    Mahesh Nakka
    Kamareddy, Hyderabad•
    11 hrs ago
  • అనుబంధాలకు ప్రతీక.. రాఖీ పౌర్ణమి అన్నాచెల్లెళ్లు.. అక్కాతమ్ముళ్ల ఆత్మీయ బంధానికి వేడుక
    1
    అనుబంధాలకు ప్రతీక.. రాఖీ పౌర్ణమి
అన్నాచెల్లెళ్లు.. అక్కాతమ్ముళ్ల ఆత్మీయ బంధానికి వేడుక
    user_MD. YOUSUF ALI KHAN
    MD. YOUSUF ALI KHAN
    కోరుట్ల, జగిత్యాల, తెలంగాణ•
    15 hrs ago
  • వేములవాడ శ్రీ మహాలక్ష్మి ఆలయంలో శ్రావణ మూడో శుక్రవారం వైభవంగా ప్రత్యేక పూజలు మేళతాళాలతో ఊరేగింపుగా తరలివచ్చిన అర్చకులు రాఖీ పౌర్ణమి వేళ ఛాయానక్త పూజలు దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ మహాలక్ష్మి దేవాలయంలో శ్రావణ మాసం మూడవ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు అత్యంత వైభవంగా జరిగాయి. పూర్వం సంస్కృత పాఠశాలగా విరాజిల్లిన ఈ పవిత్ర ప్రాంగణంలో శ్రావణ శుక్రవారం, రాఖీ పౌర్ణమి (జంధ్యాల పౌర్ణమి) కలసిరావడంతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభతో వెల్లివిరిశాయి.సాయంత్రం 4 గంటలకు శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ప్రధాన ఆలయం నుంచి ఆలయ అర్చకులు, వేద పండితులు మంగళ వాయిద్యాలు, మేళతాళాల నడుమ సంప్రదాయబద్ధంగా ఊరేగింపుగా శ్రీ మహాలక్ష్మి ఆలయానికి చేరుకున్నారు. లోక కల్యాణార్థం విశేష సంకల్పం – జంద్యాల ధారణ ఈ పర్వదినం సందర్భంగా వేద పండితులు, అర్చకులు నూతన యజ్ఞోపవీత (జంద్యాల) ధారణ గావించి, "లోకా సమస్తా సుఖినోభవంతు" అంటూ సర్వజనుల శ్రేయస్సు కొరకు విశేష సంకల్పం చేపట్టారు. లోకంలోని ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, ధనధాన్యాలతో వర్ధిల్లాలని ప్రార్థిస్తూ మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక అర్చనలు నిర్వహించారునిత్య చతుష్షష్టి పూజలు – విశేష సేవలు శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం శ్రీ రాజరాజేశ్వరీ దేవి అమ్మవారికి చతుష్షష్టి (64) ఉపచారములతో విశేష పూజలు నిర్వహిస్తున్నారు. అలాగే ప్రతి శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి షోడశోపచార పూజలు, అర్చనలు, కుంకుమార్చనలు భక్తిశ్రద్ధలతో చేపడుతున్నారు. ఈ సందర్భంగా భక్తులు "యా దేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా" అనే శ్లోకాలను పఠిస్తూ అమ్మవారిని ఆరాధించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఒడిబియ్యం సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఛాయానక్త పూజ విశిష్టత శ్రావణ శుక్రవారం సూర్యాస్తమయ వేళ నిర్వహించే 'ఛాయానక్త పూజ'కు శాస్త్రాలలో విశేష ప్రాధాన్యం ఉందని అర్చకులు తెలిపారు. ఈ పూజలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవడం వల్ల దారిద్ర్య బాధలు తొలగి ఆర్థికాభివృద్ధి, సంతాన సౌభాగ్యం, వంశాభివృద్ధి చేకూరుతాయని పండితులు పేర్కొన్నారు.
    1
    వేములవాడ శ్రీ మహాలక్ష్మి ఆలయంలో శ్రావణ మూడో శుక్రవారం వైభవంగా ప్రత్యేక పూజలు
మేళతాళాలతో ఊరేగింపుగా తరలివచ్చిన అర్చకులు రాఖీ పౌర్ణమి వేళ ఛాయానక్త పూజలు

దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ మహాలక్ష్మి దేవాలయంలో శ్రావణ మాసం మూడవ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు అత్యంత వైభవంగా జరిగాయి. పూర్వం సంస్కృత పాఠశాలగా విరాజిల్లిన ఈ పవిత్ర ప్రాంగణంలో శ్రావణ శుక్రవారం, రాఖీ పౌర్ణమి (జంధ్యాల పౌర్ణమి) కలసిరావడంతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభతో వెల్లివిరిశాయి.సాయంత్రం 4 గంటలకు శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ప్రధాన ఆలయం నుంచి ఆలయ అర్చకులు, వేద పండితులు మంగళ వాయిద్యాలు, మేళతాళాల నడుమ సంప్రదాయబద్ధంగా ఊరేగింపుగా శ్రీ మహాలక్ష్మి ఆలయానికి చేరుకున్నారు.
లోక కల్యాణార్థం విశేష సంకల్పం – జంద్యాల ధారణ
ఈ పర్వదినం సందర్భంగా వేద పండితులు, అర్చకులు నూతన యజ్ఞోపవీత (జంద్యాల) ధారణ గావించి, "లోకా సమస్తా సుఖినోభవంతు" అంటూ సర్వజనుల శ్రేయస్సు కొరకు విశేష సంకల్పం చేపట్టారు. లోకంలోని ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, ధనధాన్యాలతో వర్ధిల్లాలని ప్రార్థిస్తూ మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక అర్చనలు నిర్వహించారునిత్య చతుష్షష్టి పూజలు – విశేష సేవలు
శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం శ్రీ రాజరాజేశ్వరీ దేవి అమ్మవారికి చతుష్షష్టి (64) ఉపచారములతో విశేష పూజలు నిర్వహిస్తున్నారు. అలాగే ప్రతి శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి షోడశోపచార పూజలు, అర్చనలు, కుంకుమార్చనలు భక్తిశ్రద్ధలతో చేపడుతున్నారు. ఈ సందర్భంగా భక్తులు "యా దేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా" అనే శ్లోకాలను పఠిస్తూ అమ్మవారిని ఆరాధించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఒడిబియ్యం సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు.
ఛాయానక్త పూజ విశిష్టత
శ్రావణ శుక్రవారం సూర్యాస్తమయ వేళ నిర్వహించే 'ఛాయానక్త పూజ'కు శాస్త్రాలలో విశేష ప్రాధాన్యం ఉందని అర్చకులు తెలిపారు. ఈ పూజలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవడం వల్ల దారిద్ర్య బాధలు తొలగి ఆర్థికాభివృద్ధి, సంతాన సౌభాగ్యం, వంశాభివృద్ధి చేకూరుతాయని పండితులు పేర్కొన్నారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    33 min ago
  • *SIR ప్రక్రియపై ( డ్రప్ట్ ఓటర్ లిస్టు పై ) అవగాహన కోసం 46 & 47వ పరిదిలోని భారత్ రోడ్డులో వార్డు సభ* *కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక 46 & 47వ వార్డు కౌన్సిలర్లు గెరిగంటి స్వప్న - లక్ష్మినారాయణ ఆధ్వర్యంలో 46 & 47వ వార్డు పరిధిలోని భారత్ రోడ్ లో SIR ప్రక్రియపై ఈ రోజు వార్డు సభ నిర్వహించడం జరిగింది. వార్డులో నిర్వహించిన సమావేశంలో ఓటర్ జాబితా చదివి వినిపించారు. ఓటర్లకు పలు అనుమానాలపై అవగాహన కల్పించారు. జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా బీఎల్ఓలు ఓటర్లకు పలు విషయాలపై వివరించారు. ఇట్టి వార్డు సభ కార్యక్రమంలో మున్సిపల్ RO రవి గోపాల్ రెడ్డి, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రసన్న, మున్సిపల్ అధికారి భాగ్యలక్ష్మీ, 46, 47 వార్డు అధికారి కిశోర్, BLO లు కాశీరాం, పిట్ల రేఖ, వేంకట లక్ష్మి, బాబిత మరియు స్థానిక 46 & 47వ వార్డు ఓటర్లు తదితరులు పాల్గొన్నారు
    1
    *SIR ప్రక్రియపై ( డ్రప్ట్ ఓటర్ లిస్టు పై ) అవగాహన కోసం 46 & 47వ పరిదిలోని భారత్ రోడ్డులో వార్డు సభ*
*కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక 46 & 47వ వార్డు కౌన్సిలర్లు గెరిగంటి స్వప్న - లక్ష్మినారాయణ ఆధ్వర్యంలో 46 & 47వ వార్డు పరిధిలోని భారత్ రోడ్ లో SIR ప్రక్రియపై ఈ రోజు వార్డు సభ నిర్వహించడం జరిగింది. వార్డులో నిర్వహించిన సమావేశంలో ఓటర్ జాబితా చదివి వినిపించారు. ఓటర్లకు పలు అనుమానాలపై అవగాహన కల్పించారు. జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా బీఎల్ఓలు ఓటర్లకు పలు విషయాలపై వివరించారు.
ఇట్టి వార్డు సభ కార్యక్రమంలో మున్సిపల్ RO రవి గోపాల్ రెడ్డి, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రసన్న, మున్సిపల్ అధికారి భాగ్యలక్ష్మీ, 46, 47 వార్డు అధికారి కిశోర్, BLO లు కాశీరాం, పిట్ల రేఖ, వేంకట లక్ష్మి, బాబిత మరియు స్థానిక 46 & 47వ వార్డు ఓటర్లు తదితరులు పాల్గొన్నారు
    user_Routhu srikanth
    Routhu srikanth
    నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    15 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.