Shuru
Apke Nagar Ki App…
కాళువాడలో బీజేపీ యువకులు కాంగ్రెస్‌లో చేరిక............. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలం కాళువాడ గ్రామానికి చెందిన బీజేపీ యువ నాయకుడు నరేష్‌తో పాటు పలువురు యువకులు ఎమ్మెల్సీ దండే విఠల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. గ్రామాభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు ఆకర్షితులై కాంగ్రెస్‌లో చేరినట్లు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధికి కృషి చేస్తామని నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Krishna
కాళువాడలో బీజేపీ యువకులు కాంగ్రెస్‌లో చేరిక............. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలం కాళువాడ గ్రామానికి చెందిన బీజేపీ యువ నాయకుడు నరేష్‌తో పాటు పలువురు యువకులు ఎమ్మెల్సీ దండే విఠల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. గ్రామాభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు ఆకర్షితులై కాంగ్రెస్‌లో చేరినట్లు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధికి కృషి చేస్తామని నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- అది ఒక ప్రశాంతమైన గ్రామం.. కానీ ఇప్పుడు అక్కడ అడుగు తీసి అడుగు బయట పెట్టాలంటే మరణం వెంటాడుతోంది. జన్నారం మండలంలోని చింతలపల్లి, పోన్కల్, కిష్టాపూర్ గ్రామాల్లో ప్రస్తుతం "కుక్కల రాజ్యమే" నడుస్తోంది. ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి పడుతున్న పాట్లు వర్ణనాతీతం. రక్తసిక్తమైన గ్రామాలు: బాధితుల ఆర్తనాదాలు గర్భిణీ అని కూడా చూడకుండా మెట్టుపల్లి గంగజలపై కుక్క దాడి చేయడం స్థానికులను కలిచివేస్తోంది. ఇంటి ముందు ఊడుస్తున్న జయవ్వ, తన మనవడిని కాపాడబోయిన వృద్ధుడు రాజన్న, అలాగే శ్రీరామ్, పుష్పలత.. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు, వరుస దాడులతో ఆసుపత్రుల పాలవుతున్నారు. మూగజీవాలైన ఆవులు, బర్రెలపై కూడా దాడులు జరగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. "మమ్మల్ని చంపేయండి.. కానీ కుక్కను మాత్రం ఏమీ అనకండి" ప్రస్తుతం జన్నారంలో వినిపిస్తున్న వ్యంగ్యాస్త్రం ఇది. గ్రామంలోని సర్పంచ్ పంజాల సురేష్, ఇతర వార్డ్ మెంబర్లు, సెక్రెటరీల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ప్రజలేమో "మమ్మల్ని కాపాడండి" అని వారిని వేడుకుంటున్నారు. కానీ పాలకవర్గం మాత్రం "మేమేం చేయాలి?" అని నిస్సహాయంగా తలలు పట్టుకుంటున్నారు.3
- అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకొని జగిత్యాల జిల్లా కేంద్రంలో రక్తదాన శిబిరం కార్యక్రమం నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 నుండి 20 వరకు వారం రోజులపాటు అగ్నిమాపక అమరవీరుల స్మారక వారోత్సవాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలోని అగ్నిమాపక కేంద్రం ఆవరణలో జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి సైదులు ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ సహకారంతో గురువారం ఉదయం 11గంటల ప్రాంతంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీమతి బి ఎస్ లత హాజరై, ఈ రక్తదాన శిభిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి ఎస్. లత, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి సైదులు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కార్యదర్శి మంచాల కృష్ణ, సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్, కొమురవెల్లి వేణుగోపాల్, జగిత్యాల, ధర్మపురి అగ్నిమాపక కేంద్రం అధికారులు కృష్ణ కాంత్, శ్రీకాంత్ సంబంధిత శాఖ ఉద్యోగులు, సిబ్బంది, బ్లడ్ బ్యాంకు మెడికల్ ఆఫీసర్ డా. రాణి, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీమతి బిఎస్లతో మాట్లాడుతూ...రక్తదానం పట్ల ఇలాంటి అపోహలు అనుమానాలు అక్కరలేదని ప్రతి ఒక్కరూ ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయడం వల్ల ఆరోగ్యవంతులుగా ఉంటారని అన్నారు. అలాగే, అగ్నిప్రమాదాలు మరియు ఇతర విపత్తులు సంభావించిన సందర్భంలో క్షణాల్లో ఘటనా స్థలానికి చేరుకొని ఆస్తులు, ప్రాణాలు కాపాడడంలో ముందుండేది అగ్నిమాపక సిబ్బందిదే ప్రధానపాత్ర అనీ, వారిని ముందుకు నడిపించే అధికారులే అసలైన రియల్ హీరోస్ అన్నారు. అనంతరం, అగ్నిమాపక శాఖలో అమరులైన వారికి రెండు నిమిషాలు మౌనం పాటించి, నివాళులు అర్పించారు. కాగా ఈ రక్తదాన శిభిరంలో జిల్లా అధికారి సైదులుతో పాటుగా 30 మంది అగ్నిమాపక అధికారులు, సిబ్బంది రక్తదానం చేశారు.4
- రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ కు చెందిన కూన లక్ష్మీ అనే మహిళ ఈ నెల 13వ తేదీన హత్యకు గురికాగా పోలీసులు హత్య కేసును ఛేదించి నిందితుడి వివరాలను సిరిసిల్ల డిఎస్పి కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి వెల్లడించారు. ఈ సందర్భంగా నాగేంద్ర చారి మాట్లాడుతూ.. ఒంటరిగా ఉంటున్న కూనలక్ష్మిని గమనించిన గడీల రాజు అనే వ్యక్తి మద్యానికి బానిసై జల్సాలకు డబ్బులు సరిపోనందున ఎలా అయినా డబ్బులు సంపాదించాలనుకుని కొంత కాలం నుండి రాజీవ్ నగర్ లో ఇంటిలో లక్ష్మీ ఒక్కతే ఉండడాన్ని గమనించి ఇంట్లోకి వెళ్లి కత్తెరతో హత్య చేసి 2000 రూపాయలు నగదు, రెండు చీరలు, బ్యాంకు పాసుబుక్కులు, రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డు, హ్యాండీక్యాప్డ్ సర్టిఫికెట్ లు తీసుకెళ్లినట్లు చెవులకు ఉన్న బంగారు పుల్లలు తీయడానికి ప్రయత్నించగా అవి రాకపోవడంతో తన వద్ద ఉన్న కత్తెరతో రెండు చెవులను కత్తిరించి ఇంటికి తీసుకుపోయి అవి కడిగే ప్రయత్నం చేయగా ఆ బంగారు పోగులు పడిపోయాయని తెలిపారు. సాంకేతికత ఆధారంగా నిందితుని పట్టుకోవడం జరిగిందని అతని వద్ద నుండి హత్యకు ఉపయోగించిన కత్తెర రెండు చీరలు బ్యాంకు పాసుబుక్కులు రాజీవ్ ఆరోగ్యశ్రీ హ్యాండీక్యాప్డ్ సర్టిఫికెట్లు 2000 రూపాయలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు.1
- మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఎఫెక్ట్ జగిత్యాల జిల్లాలో చూపుతుంది. కొడిమ్యాల మండలంలో పలువురు కాంగ్రెస్ నాయకులు మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ రాజీనామా చేశారు. కొడిమ్యాల మండల కాంగ్రెస్ నాయకులు మాజీ సర్పంచ్ పిడుగు ప్రభాకర్ రెడ్డి తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు సుమారు 100 మందికి పైగా అనుచరులు రాజీనామా చేసినట్లు తెలిపారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వైఖరిని నిరసిస్తూ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోవడంతో కాంగ్రెస్కు గుడ్ బై చెప్పినట్లు ప్రకటించారు. ఎమ్మెల్యేగా గెలిపించేందుకు తాము స్వంత ఖర్చులతో పనిచేశామని, కానీ గెలిచిన తరువాత ఇచ్చిన వాగ్దానాలను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. ఎప్పుడూ వ్యక్తిగత ప్రయోజనాల కోసం అడగలేదని, ప్రజల కోసం, పార్టీ బలోపేతం కోసం కృషి చేసిన కార్యకర్తల కోసం మాత్రమే న్యాయం కోరినట్లు తెలిపారు. అయినప్పటికీ, పార్టీలో కష్టపడ్డ వారిని పక్కనపెట్టి, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. పూడూరు ఖాదీ భూమి వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ, చేనేత కార్మికులకు న్యాయం చేస్తానని అప్పట్లో గెలవక ముందు ఇచ్చిన హామీని ఎమ్మెల్యే నిలబెట్టుకోలేదని, ప్రస్తుతం అదే వ్యక్తిని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. అధికారాన్ని అనుసరించి మారే వారికి ప్రాధాన్యత ఇవ్వడంతో పనిచేసిన కార్యకర్తలకు గుర్తింపు లేదని కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఏ పార్టీలో చేరాలనే విషయంపై త్వరలోనే అనుచరులతో చర్చించి నిర్ణయం తీసుకుని వెల్లడించారు. ఈనెల 20న జగిత్యాలలో జరిగే కెసిఆర్ సభలో జీవన్ రెడ్డి తో కలిసి బిఆర్ఎస్ లో చేరే అవకాశం ఉందాని స్థానికులు తెలిపారు.2
- Post by Boke saikumar Boke saikumar1
- బెజ్జంకి మండలంలోని రైతు వేదికలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన మండల సభ గురువారం ముగిసింది. సమావేశం ప్రారంభానికి ముందు తెలంగాణ గేయాన్ని ఆలపించగా, అనంతరం మండల ప్రత్యేక అధికారి ప్రవీణ్ సీఎం సందేశాన్ని చదివి వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, మహాలక్ష్మి, గృహ జ్యోతి, భువన చేయూత, పెన్షన్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ తదితర పథకాల అమలు తీరును అధికారులు వివరించారు. గ్రామ స్థాయిలో సమస్యలు, పరిష్కారాలపై సర్పంచులు, అధికారులు చర్చించారు. అంగన్వాడి ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారి భావన నాగరాణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్ ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పులి కృష్ణ, ఎంపీడీవో కడవెర్గు ప్రవీణ్, తహసిల్దార్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం లో గురువారం మాస శివరాత్రి సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ సందర్భంగా ఉదయం స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం పరివార దేవతలకు ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. సాయంత్రం మహా లింగార్చన కార్యక్రమంలో భాగంగా 365 జ్యోతులను వెలిగించి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఈ కార్యక్రమాలను ఆలయ ప్రధాన అర్చకులు ఈశ్వర్ గారు, సురేష్ గారి ఆధ్వర్యంలో అర్చకులు, వేద పండితులు ఏకాంతంగా నిర్వహించారు.1
- కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం లంబాడిపల్లి గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. వరి కోసి పొలం నుండి వడ్లు జార గోడుతుండగా ట్రాక్టర్ ప్రమాదవశాత్తూ రోడ్డు క్రిందకు పొదల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. దీంతో ట్రాక్టర్ కింద పడి డ్రైవర్ సీట్లో ఉన్న యువరైతు కాటం కిషన్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకొని అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు జెసిబి సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పంట చేతికందిన సమయంలో సంతోషించాల్సిన రైతు, ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.2
- హుస్నాబాద్ సబ్ స్టేషన్ సమీపంలో కరీంనగర్ రహదారి పై ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు బైఠాయించి రాస్తారోకో చేపట్టారు.500 రూపాయల ట్యూషన్ ఫీజు కడితేనే హల్ టిక్కెట్లు ఇస్తానని కళాశాల ప్రిన్సిపాల్ బెదిరించినట్లు ఆరోపిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకొని హాల్ టిక్కెట్లు ఇప్పించాలని డిమాండ్ చేశారు.ఆందోళన చేస్తున్న విద్యార్థులకు పోలీసులు నచ్చ చెప్పడంతో ఆందోళన విరమించారు.1