ముస్లిం మైనారిటీ సోదరిమనులకు కుట్టు మిషన్ పంపిణి విషయం లో అన్యాయం.... ఖానాపురం, ఏప్రిల్ 03, ఖానాపురం మండలం, గత ప్రభుత్వం పెద్ది సుదర్శన్ రెడ్డి పేద మైనారిటీ మహిళలకు కుట్టు మిషన్లు అధికారులచే ఎంక్వయిరీ చేసి లబ్ధిదారుల లిస్ట్ ప్రిపేర్ చేసి గత ప్రభుత్వ ఆయాంలోనే తీసుకొని వచ్చిన ఇట్టి మిషిన్లు అప్పుడు ఎలక్షన్ కోడ్ ఉండడం వలన లేటు కాగా, ప్రస్తుత ప్రభుత్వ ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి గత లబ్ధిదారుల లిస్టును పూర్తిగా విస్మరించి నర్సంపేట కాన్స్టెన్సీ లో కేవలం వారి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల కుటుంబాలకు ఎలాంటి ఎంక్వయిరీ లేకుండా వీరు అర్హుల అనర్హులా చూడకుండా గత ప్రభుత్వం తీసుకువచ్చిన కుట్టు మిషన్లు ఏకధాటిగా వారి పార్టీకి సంబంధించిన వాళ్లకు మాత్రమే ఇవ్వడం హేయమైనది, ముస్లింల పట్ల చిత్తశుద్ధి లేకుండా జరిగిన నష్టాన్ని ఖానాపురం మండలం మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ బి ఆర్ ఎస్ మహమ్మద్ అజార్, మండల టిఆర్ఎస్ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ నాగుల్ మీరా, మైనార్టీ సెల్ పూర్తి కమిటీ ఇట్టి ప్రభుత్వ పద్దతిని తీవ్రంగా ఖండిస్తున్నాము అన్నారు.కావున నియోజకవర్గస్థాయి అధికారులు వెంటనే నిరుపేద మైనార్టీ మహిళలకు గత ప్రభుత్వం ఇచ్చిన లిస్టులో డిలీట్ అయిన మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ జరపాలని టిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అన్నారు.
ముస్లిం మైనారిటీ సోదరిమనులకు కుట్టు మిషన్ పంపిణి విషయం లో అన్యాయం.... ఖానాపురం, ఏప్రిల్ 03, ఖానాపురం మండలం, గత ప్రభుత్వం పెద్ది సుదర్శన్ రెడ్డి పేద మైనారిటీ మహిళలకు కుట్టు మిషన్లు అధికారులచే ఎంక్వయిరీ చేసి లబ్ధిదారుల లిస్ట్ ప్రిపేర్ చేసి గత ప్రభుత్వ ఆయాంలోనే తీసుకొని వచ్చిన ఇట్టి మిషిన్లు అప్పుడు ఎలక్షన్ కోడ్ ఉండడం వలన లేటు కాగా, ప్రస్తుత ప్రభుత్వ ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి గత లబ్ధిదారుల లిస్టును పూర్తిగా విస్మరించి నర్సంపేట కాన్స్టెన్సీ లో కేవలం వారి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల కుటుంబాలకు ఎలాంటి ఎంక్వయిరీ లేకుండా వీరు అర్హుల అనర్హులా చూడకుండా గత ప్రభుత్వం తీసుకువచ్చిన కుట్టు మిషన్లు ఏకధాటిగా వారి పార్టీకి సంబంధించిన వాళ్లకు మాత్రమే ఇవ్వడం హేయమైనది, ముస్లింల పట్ల చిత్తశుద్ధి లేకుండా జరిగిన నష్టాన్ని ఖానాపురం మండలం మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ బి ఆర్ ఎస్ మహమ్మద్ అజార్, మండల టిఆర్ఎస్ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ నాగుల్ మీరా, మైనార్టీ సెల్ పూర్తి కమిటీ ఇట్టి ప్రభుత్వ పద్దతిని తీవ్రంగా ఖండిస్తున్నాము అన్నారు.కావున నియోజకవర్గస్థాయి అధికారులు వెంటనే నిరుపేద మైనార్టీ మహిళలకు గత ప్రభుత్వం ఇచ్చిన లిస్టులో డిలీట్ అయిన మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ జరపాలని టిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అన్నారు.
- కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి వారం పది రోజుల్లో ఏ పార్టీలో చేరేది క్లారిటీ ఇస్తానని చెప్పారు. రేవంత్ రెడ్డి సర్కార్ ను ఓడించే సత్తా గల పార్టీలో చేరతానని స్పష్టం చేశారు. జగిత్యాలలో విలేకరుల సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు తమపై అభిమానాన్ని చూపుతున్నాయని అందుకు ఆయా పార్టీల నేతలకు కృతజ్ఞతలు చెబుతున్నట్లు తెలిపారు. ఏ పార్టీలో చేరాలనేది అభిమానుల ఆలోచనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని త్వరలోనే ఫైనల్ నిర్ణయం ప్రకటిస్తానని తెలిపారు. గతంలో మార్పు రావాలని....కెసిఆర్ పోవాలని కోరుకున్నామని, పదేళ్ల తర్వాత ప్రజల్లో మార్పు వస్తే, ఇప్పుడు పరిస్థితి మారి, రెండేళ్లలో మార్పు రావాలి రేవంత్ రెడ్డి పోవాలి అనే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రాణహిత నదీ జలాలను వినియోగించుకోకవడం, కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులు చేయడంలో రేవంత్ రెడ్డి సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వీడి, వెంటనే కాళేశ్వరం ప్రాజెక్ట్ మరమ్మత్తు పనులు చేపట్టాలని, ప్రాణహిత నది జలాల వినియోగానికి తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజి నిర్మాణం చేపట్టాలని జీవన్ రెడ్డి చేశారు.1
- Post by Arjunpandey1
- తెలంగాణ జాగృతి ఆవిర్భావ సభపై కవిత సమీక్ష సమావేశం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న తెలంగాణ జాగృతి కార్యాలయంలో గురువారం కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాజరై, ఈ నెల 25న మునీరాబాద్‌లోని అద్వయ కన్వెన్షన్‌లో నిర్వహించనున్న పార్టీ ఆవిర్భావ సభ ఏర్పాట్లపై నాయకులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలివచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని, వారికి అవసరమైన వసతులు, రవాణా ఏర్పాట్లు, భద్రతా చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని కవిత సూచించారు. సభకు ముందు, తర్వాత నిర్వహించాల్సిన కార్యక్రమాలపై కూడా నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ ఆవిర్భావ సభను విజయవంతం చేయడానికి సమన్వయంతో పని చేయాలని, ప్రతి నాయకుడు తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాలని కవిత పిలుపునిచ్చారు.1
- ములకలకాలువ గ్రామ సభ1
- Post by Ramprasad islavath1
- పత్రిక ప్రకటన తేది 02.04.202.6. కామారెడ్డి జిల్లా గురువారం ... మొదటి రోజు విజయవంతంగా ప్రారంభమైన గ్రామసభ. .....కామారెడ్డి జిల్లా రామిరెడ్డి మండలం రంగం పేట గ్రామం లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక, 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక లో భాగంగా గురువారం ఉదయం నుండి ప్రారంభమైన గ్రామసభ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. .. ముందుగా జయజయ హే తెలంగాణ రాష్ట్ర గీతంతో గ్రామసభ ను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కింద రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి , సంక్షేమ పథకాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి సందేశాన్ని సర్పంచ్ వినిపించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో “ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక”లో భాగంగా గ్రామ స్థాయిలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు గ్రామ సభ నిర్వహించడం జరుగుతుందని ఈ గ్రామ సభలో ప్రభుత్వ సంక్షేమ పథకాల పై చర్చలు జరపడం, లబ్ధిదారుల అభిప్రాయాలను సేకరించడం, గ్రామ అభివృద్ధి అవసరాలను గుర్తించడం, గ్రామ సమస్యలను చర్చించి పరిష్కార మార్గాలను నిర్ణయించడం ప్రధాన ఉద్దేశ్యం అని అన్నారు. ఈ సమావేశంలో రైతు భరోసా పథకం, ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి పథకం, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, రూ. 500/-కి గ్యాస్ సిలిండర్, గృహ జ్యోతి (200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్), కళ్యాణలక్ష్మి / షాదీ ముబారక్ వంటి ప్రధాన సంక్షేమ పథకాల పై అవగాహన కల్పించబడుతుందని అదేవిధంగా, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం, ఇంటర్మీడియట్ వరకు అల్పాహార పథకం, మధ్యాహ్న భోజన పథకం, దివ్యాంగ విద్యార్థులకు మోటరైజ్డ్ వాహనాల పంపిణీ, కొత్త రేషన్ కార్డులు, వడ్ల కొనుగోలు బోనస్, పెన్షన్లు వంటి కొత్త పథకాల పై కూడా వివరాలు అందించబడతాయని గ్రామ సభలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, వివిధ శాఖల అధికారులు, గ్రామ పెద్దలు, మహిళలు, రైతులు, యువత, స్వయం సహాయక సంఘాల సభ్యులు ,పథకాల లబ్ధిదారులు అందరూ భాగస్వాములు కావాలని, గ్రామ సమస్యలను గుర్తించి వాటికి ప్రాధాన్యత కేటాయించి, సంబంధిత రిజిస్టర్ లో నమోదు చేసి పరిష్కార చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు చేరేలా చేయడం లక్ష్యంగా ప్రభుత్వం కట్టుబడి ఉందని, గ్రామ ప్రజలందరూ ఈ గ్రామ సభలో తప్పనిసరిగా పాల్గొని ప్రభుత్వ పథకాల పై పూర్తి సమాచారం తెలుసుకొని తమ అభిప్రాయాలను తెలియజేయాలని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా ప్రజలను కోరారు.1
- హన్మకొండ జిల్లా:ఎల్కతుర్తి మండల కేంద్రంలో గత నెల 31వ తేదీన జరిగిన చోరీ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు సిఐ పులి రమేష్ తెలిపారు. మండల కేంద్రానికి చెందిన నరిగె సంధ్య ఇంటికి తాళం వేసి బ్యాంకుకు వెళ్లి తిరిగి వచ్చేసరికి తాళం పగలగొట్టి ఉండగా పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంట్లో బంగారం, వెండి, నగదు కలిపి సుమారు రూ.95 వేల విలువైన వస్తువులు చోరీకి గురైనట్లు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.1
- కరీంనగర్ సమీపంలోని బొమ్మకల్ ఫ్లై ఓవర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. బొమ్మకల్ ఫ్లైఓవర్ సమీపంలో ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. కారు నచ్చు నచ్చాయి కార్ల ప్రయాణిస్తున్న సయ్యద్ అబ్దుల్ రెహమాన్, సయ్యద్ అతియాబ్ హుస్సేన్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలుకాగ ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. స్వల్ప గాయాలతో మరొకరు మాత్రమే బయటపడ్డారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. కారు పూర్తిగా నుజ్జునుజ్జుకావడం చూస్తే ఎంత స్పీడులో ఉన్నారో అర్థం అవుతుంది. సంఘటన స్థలాన్ని పోలీసులు చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు ప్రమాదం పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.3
- రెండు వేల మంది పోలీసు సిబ్బందితో పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు. హైదరాబాద్ ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్‌ల కోసం 2000 మంది పోలీసు సిబ్బందితో పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉప్పల్ డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు. ఈ నెల 5, మే 22 తేదీల్లో జరగబోయే మ్యాచ్‌ల కోసం భద్రతా ఏర్పాట్లపై హెచ్‌సీఏ కోశాధికారి అనిల్ కుమార్, జాయింట్ సెక్రటరీ బస్వరాజు, బీసీసీఐ అసిస్టెంట్ వెన్యూ మేనేజర్ వైభవ్, సన్‌రైజర్స్ ప్రతినిధి శర్వానన్‌లతో కలిసి ఆయన ఈ వివరాలు వెల్లడించారు. మల్కాజిగిరి ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసులు కూడా ఈ ప్రెస్ మీట్‌లో పాల్గొన్నారు.1