logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఇరాన్ పై ఇజ్రాయిల్ అమెరికా సామ్రాజ్యవాద యుద్ధాన్ని ఆపాలి: ఏఐఎస్ఎఫ్ -యుద్ధం వద్దు.. శాంతి ముద్దు...! ఏఐఎస్ఎఫ్ ఓయు ఆధ్వర్యంలో ఓయు అధ్యక్షులు ఉదయ్ కుమార్ ఉప్పల అధ్యక్షతన జరిగిన కార్యక్రమం లో మాట్లాడుతూ...ఇరాన్ పై సామ్రాజ్యవాద దేశాలు ఇజ్రాయిల్ ,అమెరికా చేస్తున్నటువంటి దాడుల నేపథ్యంలో అక్కడున్న పిల్లలు, పెద్దలు, ఆస్తులు, ప్రాణ నష్టం వాటిల్లుతున్న సందర్భంలో ఆ దేశం భయాందోళనలకు గురవుతున్న సందర్భం. ఈ ఘటనలను ఐక్యరాజ్యసమితి, తోపాటు ప్రపంచ దేశాలన్నీ కూడా ఖండిస్తున్నాయి. అయినా అమెరికాకు ఇజ్రాయిల్ కు చీమకుట్టినట్లైనా లేదు. లెనిన్ మహాశయుడు చెప్పినట్లుగా పెట్టుబడి దారి అత్యున్నత దశ సామ్రాజ్యవాదం అని ఇప్పుడు ప్రస్తుత కాలంలో అమెరికా, ఇజ్రాయిల్ చేస్తున్న సామ్రాజ్యవాద ఆధిపత్య యుద్దామని ప్రకటిస్తూ ఈ యుద్ధానికి వ్యతిరేకంగా ఓయూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మెట్టెల చైతన్య పాల్గొని మాట్లాడుతూ యుద్ధం వద్దు శాంతి ముద్దు. అంటూ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రగతిశీల ఆలోచనపరులందరూ కూడా యుద్ధాన్ని వ్యతిరేకించి ఇరాన్లో శాంతిని నెలకొల్పాలని ప్రకటించారు. అలాగే అక్కడ 108 మంది విద్యార్థినీలు చనిపోవడం అత్యంత బాధాకరమని యుద్ధం ఆకలి, బాధలను, మరణాలను తెచ్చి పెడుతూ ఒక విచ్చలవిడితనంతో సమాజాన్ని నాశనం చేస్తుంది . కావున ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు అనిల్ మాట్లాడుతూ సామ్రాజ్యవాద దేశాలు ఆధిపత్యాన్ని చూపిస్తూ పిల్లలతో పాటు ప్రజలపై కూడా విచక్షణారహితంగా ఏకపక్ష మారణకాండకు పాల్పడుతున్నాయి .ముస్లిం దేశాల వాళ్ళు ఈ పని చేస్తే ఉగ్రవాదులుగా ముద్ర వేసి ఇంకా గోల చేసేవారు. కావున ఇరాన్ పై ఈ రెండు దేశాలు యుద్ధాన్ని ఆపి ఇరాన్లో ప్రజాస్వామ్య వాతావరణాన్ని నెలకొల్పాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు జిల్లా సహాయ కార్యదర్శి భాను, జిల్లా ఉపాధ్యక్షులు అరుణ్ ,సుమన్ ప్రశాంత్ జెఆర్ఎఫ్ స్కాలర్ శ్రీను, సతీష్ తదితర విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.

on 2 March
user_Sagaboina Paparao
Sagaboina Paparao
సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ•
on 2 March
52e0915d-adcc-4fee-9cfe-05e548567a6c

ఇరాన్ పై ఇజ్రాయిల్ అమెరికా సామ్రాజ్యవాద యుద్ధాన్ని ఆపాలి: ఏఐఎస్ఎఫ్ -యుద్ధం వద్దు.. శాంతి ముద్దు...! ఏఐఎస్ఎఫ్ ఓయు ఆధ్వర్యంలో ఓయు అధ్యక్షులు ఉదయ్ కుమార్ ఉప్పల అధ్యక్షతన జరిగిన కార్యక్రమం లో మాట్లాడుతూ...ఇరాన్ పై సామ్రాజ్యవాద దేశాలు ఇజ్రాయిల్ ,అమెరికా చేస్తున్నటువంటి దాడుల నేపథ్యంలో అక్కడున్న పిల్లలు, పెద్దలు, ఆస్తులు, ప్రాణ నష్టం వాటిల్లుతున్న సందర్భంలో ఆ దేశం భయాందోళనలకు గురవుతున్న సందర్భం. ఈ ఘటనలను ఐక్యరాజ్యసమితి, తోపాటు ప్రపంచ దేశాలన్నీ కూడా ఖండిస్తున్నాయి. అయినా అమెరికాకు ఇజ్రాయిల్ కు చీమకుట్టినట్లైనా లేదు. లెనిన్ మహాశయుడు చెప్పినట్లుగా పెట్టుబడి దారి అత్యున్నత దశ సామ్రాజ్యవాదం అని ఇప్పుడు ప్రస్తుత కాలంలో అమెరికా, ఇజ్రాయిల్ చేస్తున్న సామ్రాజ్యవాద ఆధిపత్య యుద్దామని ప్రకటిస్తూ ఈ యుద్ధానికి వ్యతిరేకంగా ఓయూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మెట్టెల చైతన్య పాల్గొని మాట్లాడుతూ యుద్ధం వద్దు శాంతి ముద్దు. అంటూ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రగతిశీల ఆలోచనపరులందరూ కూడా యుద్ధాన్ని వ్యతిరేకించి ఇరాన్లో శాంతిని నెలకొల్పాలని ప్రకటించారు. అలాగే అక్కడ 108 మంది విద్యార్థినీలు చనిపోవడం అత్యంత బాధాకరమని యుద్ధం ఆకలి, బాధలను, మరణాలను తెచ్చి పెడుతూ ఒక విచ్చలవిడితనంతో సమాజాన్ని నాశనం చేస్తుంది . కావున ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు అనిల్ మాట్లాడుతూ సామ్రాజ్యవాద దేశాలు ఆధిపత్యాన్ని చూపిస్తూ పిల్లలతో పాటు ప్రజలపై కూడా విచక్షణారహితంగా ఏకపక్ష మారణకాండకు పాల్పడుతున్నాయి .ముస్లిం దేశాల వాళ్ళు ఈ పని చేస్తే ఉగ్రవాదులుగా ముద్ర వేసి ఇంకా గోల చేసేవారు. కావున ఇరాన్ పై ఈ రెండు దేశాలు యుద్ధాన్ని ఆపి ఇరాన్లో ప్రజాస్వామ్య వాతావరణాన్ని నెలకొల్పాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు జిల్లా సహాయ కార్యదర్శి భాను, జిల్లా ఉపాధ్యక్షులు అరుణ్ ,సుమన్ ప్రశాంత్ జెఆర్ఎఫ్ స్కాలర్ శ్రీను, సతీష్ తదితర విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • గుడ్ ఫ్రైడే పర్వదినాన్ని పురస్కరించుకొని మెదక్ సిఎస్ఐ చర్చ్ మహాదేవాలయంలో ప్రెస్ బీటర్ ఇంచార్జీ శాంతయ్య ఆధ్వర్యంలో మొదట సిలువ ఊరేగింపు తో ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభించారు. ఈ సందర్భంగా బిషప్ ఎమెరిటస్ ఆర్.టి. రెవ. టి.ఎస్. కనక ప్రసాద్ భక్తులకు దైవ సందేశాన్ని అందజేశారు. సకల మానవాళి రక్షణ కోసం యేసు సిలువ లో మరణించిన దినాన్ని గుడ్ ఫ్రైడే అన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్య లో పాల్గొన్నారు.
    1
    గుడ్ ఫ్రైడే పర్వదినాన్ని పురస్కరించుకొని మెదక్ సిఎస్ఐ చర్చ్ మహాదేవాలయంలో ప్రెస్ బీటర్ ఇంచార్జీ శాంతయ్య ఆధ్వర్యంలో మొదట సిలువ ఊరేగింపు తో ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభించారు.  ఈ సందర్భంగా బిషప్ ఎమెరిటస్ ఆర్.టి. రెవ. టి.ఎస్. కనక ప్రసాద్ భక్తులకు దైవ సందేశాన్ని అందజేశారు. సకల మానవాళి రక్షణ కోసం యేసు సిలువ లో మరణించిన దినాన్ని గుడ్ ఫ్రైడే అన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్య లో పాల్గొన్నారు.
    user_MERCY
    MERCY
    Local News Reporter మెదక్, మెదక్, తెలంగాణ•
    21 hrs ago
  • కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. రవీందర్ గౌడ్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక వైద్య శిబిరం తాలూకు రికార్డులు, రిజిస్టర్లు పరిశీలించారు. ఎంతమందిని మెరుగైన వైద్యానికి సిఫార్సు చేశారో M.O డా.ఆదర్శ్ న్ను అడిగి ఆరా తీశారు. సిబ్బంది సమయపాలన పాటించాలని ఆదేశించారు. ఆయనతో పాటు సిబ్బంది వేణు గోపాల్ ఉన్నారు.
    1
    కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. రవీందర్ గౌడ్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక వైద్య శిబిరం తాలూకు రికార్డులు, రిజిస్టర్లు పరిశీలించారు. ఎంతమందిని మెరుగైన వైద్యానికి సిఫార్సు చేశారో M.O డా.ఆదర్శ్ న్ను అడిగి ఆరా తీశారు. సిబ్బంది సమయపాలన పాటించాలని ఆదేశించారు. ఆయనతో పాటు సిబ్బంది వేణు గోపాల్ ఉన్నారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    4 hrs ago
  • నల్లగొండ బ్రేకింగ్: నల్లగొండ బస్టాండ్ సమీపంలో అత్యాధునిక సదుపాయాలతో *సాయి నైసా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం..* ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన రాష్ట్రమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి... మంత్రి మాట్లాడుతూ.. నల్లగొండ పట్టణం వైద్యరంగంలో ముందంజలో నిలవాలని ఆకాంక్ష... లాభాపేక్ష కాకుండా మానవతా దృక్పథంతో సేవలు అందించాలి... పేదలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన వైద్యం అందించాలి... డబ్బు కోసం కాకుండా మనశ్శాంతి కోసం వైద్యం చేయాలి.. అంటూ డాక్టర్లకు సూచన... అత్యాధునిక సదుపాయాలతో ఆస్పత్రి ఏర్పాటుపై హర్షం వ్యక్తం... అత్యవసర వైద్యం 24 గంటలు హాస్పిటల్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి... గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కూడా సేవలు విస్తరించాలి... ప్రభుత్వం కూడా వైద్య రంగ అభివృద్ధికి పూర్తి మద్దతు ఇస్తుంది... కార్యక్రమంలో మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి,కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి,మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి,కార్పొరేటర్ అబ్బగోని కవిత రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు..
    1
    నల్లగొండ బ్రేకింగ్:
నల్లగొండ బస్టాండ్ సమీపంలో అత్యాధునిక సదుపాయాలతో *సాయి నైసా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం..*
ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన రాష్ట్రమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి...
మంత్రి మాట్లాడుతూ..
నల్లగొండ పట్టణం వైద్యరంగంలో ముందంజలో నిలవాలని ఆకాంక్ష...
లాభాపేక్ష కాకుండా మానవతా దృక్పథంతో సేవలు అందించాలి...
పేదలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన వైద్యం అందించాలి...
డబ్బు కోసం కాకుండా మనశ్శాంతి కోసం వైద్యం చేయాలి.. అంటూ డాక్టర్లకు సూచన...
అత్యాధునిక సదుపాయాలతో ఆస్పత్రి ఏర్పాటుపై హర్షం వ్యక్తం...
అత్యవసర వైద్యం 24 గంటలు హాస్పిటల్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి...
గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కూడా సేవలు విస్తరించాలి...
ప్రభుత్వం కూడా వైద్య రంగ అభివృద్ధికి పూర్తి మద్దతు ఇస్తుంది...
కార్యక్రమంలో మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి,కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి,మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి,కార్పొరేటర్ అబ్బగోని కవిత రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు..
    user_Journalist pk
    Journalist pk
    Journalist గుండ్ల పల్లె, నల్గొండ, తెలంగాణ•
    18 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం లో తెలంగాణ ప్రభుత్వము చేపట్టిన “ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 2026” లో భాగంగా 99 రోజుల కార్యచరణ ప్రణాళిక కింద శనివారం (04-04-2026) అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రజారక్షణ (ఫైర్) శాఖ ఆధ్వర్యంలో వేములవాడ ఫైర్ స్టేషన్ సిబ్బంది నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఫైర్ సేఫ్టీ డ్రిల్ (Fire Safety Drill) ద్వారా అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు ఎలా స్పందించాలి, అగ్నిప్రమాదాలను ఎలా నివారించాలి అనే విషయాలను ప్రాక్టికల్‌గా వివరించారు.ఆలయ ఈవో ఎల్. రమాదేవి కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF) సిబ్బందికి అగ్నిప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫైర్ ఎక్స్టింగ్విషర్ వినియోగ విధానం వంటి అంశాలను వివరించారు. ఫైర్ సిబ్బంది ఎస్పీఎఫ్ సిబ్బందితో కలిసి ప్రాక్టికల్‌గా ఫైర్ సేఫ్టీ పరికరాల వినియోగంపై ప్రదర్శన నిర్వహించారు.దేవస్థానానికి వచ్చే భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో ఉపయోగకరమని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం లో తెలంగాణ ప్రభుత్వము చేపట్టిన “ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 2026” లో భాగంగా 99 రోజుల కార్యచరణ ప్రణాళిక కింద శనివారం (04-04-2026) అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రజారక్షణ (ఫైర్) శాఖ ఆధ్వర్యంలో వేములవాడ ఫైర్ స్టేషన్ సిబ్బంది నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఫైర్ సేఫ్టీ డ్రిల్ (Fire Safety Drill) ద్వారా అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు ఎలా స్పందించాలి, అగ్నిప్రమాదాలను ఎలా నివారించాలి అనే విషయాలను ప్రాక్టికల్‌గా వివరించారు.ఆలయ ఈవో ఎల్. రమాదేవి కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF) సిబ్బందికి అగ్నిప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫైర్ ఎక్స్టింగ్విషర్ వినియోగ విధానం వంటి అంశాలను వివరించారు. ఫైర్ సిబ్బంది ఎస్పీఎఫ్ సిబ్బందితో కలిసి ప్రాక్టికల్‌గా ఫైర్ సేఫ్టీ పరికరాల వినియోగంపై ప్రదర్శన నిర్వహించారు.దేవస్థానానికి వచ్చే భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో ఉపయోగకరమని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    1 hr ago
  • మంచిర్యాల జిల్లా క్యాతన్ పల్లి మున్సిపల్ ఎన్నిక ఉత్కంఠ రేపింది. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ లేకపోవడంతో ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడ్డ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ముచ్చటగా మూడోసారి ఈ రోజు నిర్వహించారు. 51 రోజులుగా క్యాంపులో ఉన్న బిఆర్ఎస్, సీపీఐ కౌన్సిలర్లు కరీంనగర్ నుంచి క్యాతన్ పల్లికి బయలుదేరారు. చైర్మన్ వైస్ చైర్మన్ పదవులను కైవసం చేసుకునేలా బిఆర్ఎస్ అధిష్టానం కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాజీ ఎంపీ బాల్క సుమన్ కు బాధ్యతలు అప్పగించడంతో బిఆర్ఎస్ కు చెందిన 10 మంది, సీపీఐకి చెందిన 4 గురు కౌన్సిలర్లతో కరీంనగర్ నుంచి క్యాతన్ పల్లికి బయలుదేరారు. ఈసందర్భంగా మీడియాతో బాల్క సుమన్ మాట్లాడుతూ ప్రజా తీర్పు తమకు అనుకూలంగా ఉందని, పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని హత్య చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆరోపించారు. రావణకాష్టంలా, పోలీస్ రాజ్యంలా సీఎం రేవంత్ రెడ్డి మంత్రి వివేక్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నిజమైన ప్రజాతీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా లేదని స్పష్టం చేశారు. ప్రజాపాలన కాదు, పాపపుపాలన దోపిడీ దొంగల పాలన సాగుతుందని ఆరోపించారు. విచ్చలవిడి అవినీతి, దోపిడి జరుగుతుందని, దుర్మార్గాలు, అరాచకాలు బంద్ చేయాలని కోరుతున్నామని తెలిపారు. ఎన్నిక సజావుగా జరిగేలా చూడకుంటే ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ప్రజలు ఉరివేయక తప్పదని బాల్క సుమన్ హెచ్చరించారు.
    2
    మంచిర్యాల జిల్లా క్యాతన్ పల్లి మున్సిపల్ ఎన్నిక ఉత్కంఠ రేపింది. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ లేకపోవడంతో ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడ్డ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ముచ్చటగా మూడోసారి ఈ రోజు నిర్వహించారు. 51 రోజులుగా క్యాంపులో ఉన్న బిఆర్ఎస్, సీపీఐ కౌన్సిలర్లు కరీంనగర్ నుంచి క్యాతన్ పల్లికి బయలుదేరారు. చైర్మన్ వైస్ చైర్మన్ పదవులను కైవసం చేసుకునేలా బిఆర్ఎస్ అధిష్టానం కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాజీ ఎంపీ బాల్క సుమన్ కు బాధ్యతలు అప్పగించడంతో బిఆర్ఎస్ కు చెందిన 10 మంది, సీపీఐకి చెందిన 4 గురు కౌన్సిలర్లతో కరీంనగర్ నుంచి క్యాతన్ పల్లికి బయలుదేరారు. ఈసందర్భంగా మీడియాతో బాల్క సుమన్ మాట్లాడుతూ ప్రజా తీర్పు తమకు అనుకూలంగా ఉందని, పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని హత్య చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆరోపించారు. రావణకాష్టంలా, పోలీస్ రాజ్యంలా సీఎం రేవంత్ రెడ్డి మంత్రి వివేక్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నిజమైన ప్రజాతీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా లేదని స్పష్టం చేశారు. ప్రజాపాలన కాదు, పాపపుపాలన దోపిడీ దొంగల పాలన సాగుతుందని ఆరోపించారు. విచ్చలవిడి అవినీతి, దోపిడి జరుగుతుందని, దుర్మార్గాలు, అరాచకాలు బంద్ చేయాలని కోరుతున్నామని తెలిపారు. ఎన్నిక సజావుగా జరిగేలా చూడకుంటే ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ప్రజలు ఉరివేయక తప్పదని బాల్క సుమన్ హెచ్చరించారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    5 hrs ago
  • హన్మకొండ జిల్లా:పేదల సొంతింటి కలను నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. ఆత్మకూరు మండలం మల్కాపేట గ్రామంలో శనివారం నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. పేదలకు గృహ సౌకర్యం కల్పించడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
    1
    హన్మకొండ జిల్లా:పేదల సొంతింటి కలను నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. ఆత్మకూరు మండలం మల్కాపేట గ్రామంలో శనివారం నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. పేదలకు గృహ సౌకర్యం కల్పించడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    1 hr ago
  • Post by Tagore
    1
    Post by Tagore
    user_Tagore
    Tagore
    Newspaper publisher యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    7 hrs ago
  • కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలం వేసవి కాలం ప్రారంభం కాకముందే పలు గ్రామాల్లో తాగునీటి ఎద్దడి మొదలైంది. శనివారం బీర్కూర్ మండలం అన్నారం గ్రామానికి చెందిన పలువురు పంట పొలాల నుంచి తాగునీటిని తెచ్చుకుంటున్నారు. 2 రోజులుగా నీరు సరఫరా కాకపోవడంతో పొలాల నుంచి నీటిని తీసుకెళ్తున్నామని ప్రజలు తెలిపారు. ఈ విషయమై గ్రామ సర్పంచ్ కవిత, ఉప సర్పంచ్ సాయిలు మాట్లాడుతూ.. బోరు మోటర్లు కాలిపోయాయని, వెంటనే సమస్యను పరిష్కరిస్తామన్నారు.
    1
    కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలం వేసవి కాలం ప్రారంభం కాకముందే పలు గ్రామాల్లో తాగునీటి ఎద్దడి మొదలైంది. శనివారం బీర్కూర్ మండలం అన్నారం గ్రామానికి చెందిన పలువురు పంట పొలాల నుంచి తాగునీటిని తెచ్చుకుంటున్నారు.
2 రోజులుగా నీరు సరఫరా కాకపోవడంతో పొలాల నుంచి నీటిని తీసుకెళ్తున్నామని ప్రజలు తెలిపారు. ఈ విషయమై గ్రామ సర్పంచ్ కవిత, ఉప సర్పంచ్ సాయిలు మాట్లాడుతూ.. బోరు మోటర్లు కాలిపోయాయని, వెంటనే సమస్యను పరిష్కరిస్తామన్నారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    4 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం లో ఆలయ ఈవో ఎల్. రమాదేవి శుక్రవారం ఆలయాన్ని సందర్శించి పర్యవేక్షణ నిర్వహించారు. హాలిడేస్ సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులతో మాట్లాడి వారికి ఇంకా ఎలాంటి సౌకర్యాలు అవసరమో అడిగి తెలుసుకున్నారు. వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకుని చిన్నపిల్లలు ఎండలో ఎక్కువసేపు తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. అలాగే ఆలయంలో తాగునీరు, విశ్రాంతి ఏర్పాట్లు, క్యూలైన్ నిర్వహణ వంటి అంశాలను పరిశీలించి భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించాలని సంబంధిత సిబ్బందికి ఈవో సూచించా
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం లో ఆలయ ఈవో ఎల్. రమాదేవి శుక్రవారం ఆలయాన్ని సందర్శించి పర్యవేక్షణ నిర్వహించారు. హాలిడేస్ సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులతో మాట్లాడి వారికి ఇంకా ఎలాంటి సౌకర్యాలు అవసరమో అడిగి తెలుసుకున్నారు. వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకుని చిన్నపిల్లలు ఎండలో ఎక్కువసేపు తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు.
అలాగే ఆలయంలో తాగునీరు, విశ్రాంతి ఏర్పాట్లు, క్యూలైన్ నిర్వహణ వంటి అంశాలను పరిశీలించి భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించాలని సంబంధిత సిబ్బందికి ఈవో సూచించా
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    20 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.