Shuru
Apke Nagar Ki App…
కొత్తపేటలో వన మహోత్సవం మొక్కలు నాటిన సర్పంచ్ దినేష్ నాయక్ జన్నారం మండలం కేంద్రంలోని కొత్తపేట గ్రామంలో వన ఉత్సవం కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో వివిధ రకాల మొక్కలను నాటి పచ్చదనాన్ని పెంపొందించేందుకు కృషి చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ దినేష్ నాయక్ తో పాటు పలువురు వార్డు సభ్యులు,గ్రామస్తులు,పెద్దలు యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మొక్కలను నాటడం వల్ల పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని సర్పంచ్ దినేష్ నాయక్ తెలిపారు.
Naveen journalist
కొత్తపేటలో వన మహోత్సవం మొక్కలు నాటిన సర్పంచ్ దినేష్ నాయక్ జన్నారం మండలం కేంద్రంలోని కొత్తపేట గ్రామంలో వన ఉత్సవం కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో వివిధ రకాల మొక్కలను నాటి పచ్చదనాన్ని పెంపొందించేందుకు కృషి చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ దినేష్ నాయక్ తో పాటు పలువురు వార్డు సభ్యులు,గ్రామస్తులు,పెద్దలు యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మొక్కలను నాటడం వల్ల పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని సర్పంచ్ దినేష్ నాయక్ తెలిపారు.
More news from తెలంగాణ and nearby areas
- ఆంక్షలతో మేకలను గొర్రెలను అమ్ముకుంటున్నామని ఆవేదన....... కవ్వాల్ అభయారణ్యంలో అమలు చేస్తున్న ఆంక్షలతో తమ వద్ద ఉన్న మేకలను, గొర్రెలను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని జన్నారం మండలంలోని అక్కపల్లి గూడా గ్రామ పెద్ద చిన్నన్న ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం మధ్యాహ్నం జన్నారంలో ఆయన మాట్లాడుతూ గొర్రెలు, మేకల మందతో ఒకప్పుడు తాము అడవికి వెళ్లే వాళ్ళమని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని ఆయన వాపోయారు. అటవీ ఆంక్షలు తమ ఉపాధిని పూర్తిగా దెబ్బతీశాయని ఆవేదన వ్యక్తం చేశారు.1
- పొలంలోకి అడుగుపెట్టిన చిన్నారులు.. రైతు కష్టాన్ని తెలుసుకున్న విద్యార్థులు పొనకల్: తరగతి గదిలో పుస్తకాల్లో చదివిన వ్యవసాయ పాఠాలను ప్రత్యక్ష అనుభవంగా మార్చుకున్నారు పొనకల్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు. ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో పొనకల్ శివారులోని వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన చిన్నారులు వరి సాగు విధానాన్ని ఆసక్తిగా పరిశీలించారు. విత్తనం నుంచి పంట చేతికొచ్చే వరకు రైతులు పడే శ్రమను తెలుసుకున్న విద్యార్థులు.. నారుమడి, నీటి వినియోగం, నేల స్వభావం, నాట్ల ప్రక్రియ తదితర అంశాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పొలంలోకి దిగి స్వయంగా నారు మోసి, నాట్లు వేసి వ్యవసాయ పనుల్లో భాగస్వాములయ్యారు. దీంతో విద్యార్థుల్లో ఉత్సాహం నెలకొంది. క్షేత్రస్థాయి అనుభవం విద్యార్థుల్లో ఆసక్తిని పెంచడంతో పాటు పరిశీలన, ప్రశ్నించే తత్వాన్ని అభివృద్ధి చేస్తుందని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. పుస్తక జ్ఞానానికి ఆచరణాత్మక అనుభవం తోడైతే అభ్యసనం మరింత ఫలప్రదంగా ఉంటుందని హెచ్‌ఎం కే. రాజేశం తెలిపారు. రైతుల శ్రమ, వ్యవసాయం ప్రాధాన్యతను చిన్నారులు అర్థం చేసుకునేలా కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీకాంత్, వనిత, సుజాత, పలువురు రైతులు పాల్గొన్నారు.1
- బీసీల హక్కుల సాధనకు ఐక్యంగా పనిచేయాలి: జాతీయ బీసీ చైతన్య సమితి జాతీయ అధ్యక్షుడు, వ్యవస్థాపకుడు బీసీ రమణ జాతీయ బీసీ చైతన్య సమితి జగిత్యాల జిల్లా కమిటీలలో నూతనంగా నియమితులైన నాయకులకు జాతీయ బీసీ చైతన్య సమితి జాతీయ అధ్యక్షుడు, వ్యవస్థాపకుడు బీసీ రమణ హైదరాబాద్ లో నియామక పత్రాలు అందజేశారు. నూతన బాధ్యతలు స్వీకరించిన నాయకులు బీసీల హక్కుల సాధనకు క్రమశిక్షణతో, ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. బీసీల సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లి సామాజిక న్యాయం కోసం కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో సాంబారి కళావతి, కస్తూరి నరేష్, ఆడెపు సత్యం, అల్లే సుదర్శన్, సిరికొండ చంద్రన్న, ఎనుగుర్తి శ్రవణ్, రాజేష్, రాజ శేఖర్, చెట్పెల్లి సురేష్, గుండేటి మారుతి పాల్గొన్నారు.4
- *జాతీయ బీసీ సంక్షేమ సంఘం* *రాష్ట్ర ఉపాధ్యక్షలు అమరవేణి నర్సాగౌడ్ కు ఆత్మీయ సన్మానం* *జాతీయ బీసీ సంక్షేమ సంఘం* *రాష్ట్ర ఉపాధ్యక్షలు అమరవేణి నర్సాగౌడ్ కు ఆత్మీయ సన్మానం* . ఈరోజు నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం నిర్మల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలోఇటీవల రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమితులు ఐన అమరవేణి నర్సాగౌడ్ గారికి పూల మాలలు శాలువాలతో ఆత్మీయ సన్మానం చేశారు నిర్వహించారు. అమరవేణి నర్సాగౌడ్ హనుముల భాస్కర్ మాట్లాడుతూ :- ఈ దేశంలో 85% పైనున్న ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలకు రాజ్యాధికారం రాకుండా కేవలం పిడికెడు మంది ఉన్న అగ్రకులాలు రాజ్యాంగపరమైన పదవులను అనుభవిస్తూ బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారంలో వాటా దక్కకుండా చేస్తున్న వారి విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రాజ్యాధికారం లభించే వరకు ఐక్యంగా పోరాడుతామని తెలియజేశారు బీసీల జనాభా ప్రాతిపదికన న్యాయమైన వాటా, హక్కులు సాధించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలిపారు. . ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం నిర్మల్ జిల్లా అధ్యక్షులు అనుముల భాస్కర్ , సోన్ మండల అధ్యక్షులు మ్యాక ప్రేమ్ కుమార్ నాయకులు రమేష్, సత్యనారాయణ, రాజేష్, లక్ష్మీనారాయణ, కిషోర్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతకు అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలి : జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష పెద్దపల్లి జిల్లాలో ఓదెల, కాల్వశ్రీరాంపూర్, రామగుండం, మంథని, పెద్దపల్లి ప్రాంతాల్లో నిర్మించిన 2బీహెచ్‌కే ఇళ్లను పూర్తిస్థాయిలో అర్హులైన లబ్ధిదారులకు కేటాయించేలా అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలి అని *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* తెలిపారు. జిల్లాలో గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పనులు, నిర్మాణం పూర్తయిన 2బీహెచ్‌కే ఇళ్ల కేటాయింపు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పట్టణ) పథకం, ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో *స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె. అరుణశ్రీతో* కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ,* జిల్లాలో నిర్మాణం పూర్తయి ఇంకా కేటాయించని 2బీహెచ్‌కే ఇళ్లను వెంటనే అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి కేటాయించాలని అధికారులను ఆదేశించారు. ఓదెల, కాల్వశ్రీరాంపూర్, రామగుండం, మంథని, పెద్దపల్లి ప్రాంతాల్లో నిర్మించిన 2బీహెచ్‌కే ఇళ్లను పూర్తిస్థాయిలో లబ్ధిదారులకు కేటాయించేలా తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. నిర్మాణం పూర్తయిన ఇళ్లు ఖాళీగా ఉండకుండా అర్హులైన లబ్ధిదారులను గుర్తించి, వారికి ఇళ్లను కేటాయించే ప్రక్రియను ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇందుకోసం సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో అవసరమైన పరిశీలన, ధ్రువీకరణ ప్రక్రియలను వేగవంతం చేయాలని సూచించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పట్టణ) పథకం కింద కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు పొందేందుకు అవసరమైన లబ్ధిదారుల వివరాలన్నింటినీ సెప్టెంబర్ 5, 2026లోగా ఎంఐఎస్ పోర్టల్‌లో తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. లబ్ధిదారుల వివరాల నమోదు, డేటా అప్‌లోడ్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు లేకుండా సంబంధిత అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతకు సంబంధించి అర్హులైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ పథకం ద్వారా ప్రయోజనం అందేలా క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించి, అర్హులైన వారిని పారదర్శకంగా ఎంపిక చేయాలని సూచించారు. గృహ నిర్మాణ శాఖకు సంబంధించిన పథకాల పురోగతిని అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు త్వరితగతిన అందేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో పీడీ హౌసింగ్ పి. పవన్ కుమార్, గృహ నిర్మాణ శాఖ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.1
- ఆదిలాబాద్ లో కురిసిన భారీ వర్షం.. రోడ్డు మార్గాలన్నీ జలమయం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై చల్లని గాలులు వీచాయి. జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల మండలాల్లో సైతం వర్షం కురవడంతో వాతావరణం పూర్తిగా చల్లబడింది. దీంతో పట్టణంలోని ప్రధాన రోడ్డు మార్గాలన్నీ జలమయంగా మారాయి. మార్కెట్ కు వచ్చిన ప్రజలు కాస్తంత ఇబ్బందులకు గురయ్యారు.1
- మున్నూరుకాపు సంఘ భవనంలో గురువారం గ్రంథాలయ ప్రారంభోత్సవం ఆదిలాబాద్: తాలూకా మున్నూరుకాపు సంఘ భవనంలో గురువారం ఉదయం 9.30 గంటలకు గ్రంథాలయాన్ని ప్రారంభించనున్నట్లు అధ్యక్షుడు తోట శివ్వన్న, ప్రధాన కార్యదర్శి కలమర్గుల సంతోష్ తెలిపారు. మల్లెపూల నర్సయ్య, మాజీ మంత్రి జోగు రామన్న, బండారి అనూష సతీష్ తదితరులు హాజరవుతారని పేర్కొన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.1
- *ముదిరాజ్ సంప్రదాయం ప్రకారం ఆడబిడ్డగా వివాహం జరిపించిన కవిత* తెలంగాణ రక్షణ సేన నాయకుడు తన వివాహం పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత చేతుల *ముదిరాజ్ సంప్రదాయం ప్రకారం ఆడబిడ్డగా వివాహం జరిపించిన కవిత* తెలంగాణ రక్షణ సేన నాయకుడు తన వివాహం పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత చేతుల మీదుగా జరగాలని ఆకాంక్షించాడు. తన ఇంటి ఆడబిడ్డ హోదాలో ఉండి పెళ్లి చేయాలని కోరాడు. ముదిరాజ్ సంప్రదాయం ప్రకారం పెళ్లికూతురు మెడలో తాళి కట్టాలని కోరాడు. పార్టీ నాయకుడి ఆకాంక్షను గౌరవించి ముదిరాజ్ ఇంటి ఆడబిడ్డగా మారి ఆ నాయకుడి ఆకాంక్షను నెరవేర్చారు కల్వకుంట్ల కవిత. ఈ వేడుకకు ఈసీఐఎల్ - కీసర క్రాస్ రోడ్డులో ఆరాధ్య కన్వేషన్ వేదికగా నిలిచింది. యాదాద్రి భువనగిరి జిల్లా గూడూరు గ్రామానికి చెందిన బాషబోయిన బాలప్రసాద్ తెలంగాణ రక్షణ సేన నాయకుడు. తెలంగాణ జాగృతిలోనూ క్రియాశీలంగా పని చేశాడు. బాలప్రసాద్ కు సీతాఫల్ మండికి చెందిన శివానితో వివాహం నిశ్చయం అయింది. బుధవారం ఉదయం బాలప్రసాద్ - శివాని వివాహ ముహూర్తం కాగా తనకు అక్కాచెల్లెళ్లు లేకపోవడంతో బాలప్రసాద్ కోరిక మేరకు వారి ఇంటి ఆడబిడ్డగా కవిత వ్యవహరించారు. ముదిరాజ్ కులాచారం ప్రకారం వరుడు వధువుకు తాళి కట్టే ముందు ఆడపడుచుతో పసుపు కొమ్ముతో మూడు ముళ్ళు వేయిస్తారు. వారి సంప్రదాయం ప్రకారం కవిత గౌరీ పూజలో పాల్గొని వధువు శివాని మెడలో పసుపు కొమ్ముదారంతో మూడుముళ్లు వేశారు. ఉంగరపు వేలుకు ప్రదానపు ఉంగరం తొడిగారు. ఒడిబియ్యం పోసి పెళ్లి కుమార్తెను ఆశీర్వదించారు. అనంతరం బాలప్రసాద్ శివాని మెడలో మంగళసూత్ర ధారణ చేశారు. ఈ వేడుకలో బాలప్రసాద్ తల్లిదండ్రులు స్వరూప - బాలకృష్ణ, సోదరుడు నాగరాజు, తెలంగాణ రక్షణ సేన నాయకులు పాల్గొన్నారు.1