//గంజాయి కేసులో 14 మంది నిందితులను అరెస్ట్ చేసిన నల్లపాడు పోలీసులు,.// 🚩గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చే దిశగా జిల్లా పోలీస్ అధికారులు పటిష్ట చర్యలు చేపడుతున్నారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అనుమానాస్పద ప్రదేశాలు, పాత నేరస్తులు మరియు అనుమానితులపై విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. 📍ఈ చర్యలలో భాగంగా సౌత్ పోలీస్ సబ్ డివిజన్ ఇన్‌చార్జ్ డిఎస్పీ శ్రీ బి. మధుసూదన్ రావు గారి పర్యవేక్షణలో నల్లపాడు సీఐ కె. వంశీధర్ గారు నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి కార్యకలాపాలను అరికట్టేందుకు ఎస్సై పి. మహేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు. 📍ఈ క్రమంలో 11.03.2026 తేదీన నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని చోడవరం గ్రామంలో గంజాయి కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం అందడంతో, నల్లపాడు పోలీసులు మరియు CCS పోలీస్ బృందం సంయుక్తంగా దాడులు నిర్వహించి, గంజాయి కార్యకలాపాలలో పాల్గొంటున్న 14 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 📍వారిపై Cr.No.195/2026, U/Sec 8(C) r/w 20(b)(ii)(B)(A) NDPS Act కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 👉గంజాయి సరఫరాదారులు: 1. తోట గోపాలకృష్ణ @ సాయి (32), చౌడవరం, గుంటూరు రూరల్ (ఇతనిపై పాత గుంటూరు పోలీస్ స్టేషన్‌లో గంజాయి కేసు ఉంది) 2. కొల్లూరి నంధీశ్వర్ @ వరికూటి గౌరి శంకర్ (32), నూతలపాడు గ్రామం, పర్చూరు మండలం, బాపట్ల జిల్లా. 👉 గంజాయి కొనుగోలు చేసి విక్రయించే వారు / మత్తు బిళ్ళలు విక్రయించే వారు: 3. షేక్ ఉస్మాన్ (23), పాత గుంటూరు 4. షేక్ సనావుల్లా @ ఇర్ఫాన్ (24), కొత్తపేట, గుంటూరు 5. పటాన్ జానీ బాషా (30), వెంకటరావుపేట, పాత గుంటూరు 6. పోతార్లంక శ్యామ్ (26), అల్లీనగర్, పాత గుంటూరు 👉 గంజాయి వినియోగదారులు: 7. బత్తుల నాగరాజు (32), లాలాపేట్ 8. చల్లా వెంకటేశ్వర్లు (32), సాయిబాబా కాలనీ 9. నక్కా సాంబశివరావు (25), సాయిబాబా కాలనీ 10. కొడవటి హనోక్ (24), అల్లీనగర్. 11. షేక్ జబ్బార్ (25), చంద్రబాబు నాయుడు కాలనీ 12. బజంత్రీ దుర్గాప్రసాద్ @ అమ్ము (29), ఆనందపేట 13. చల్లా వెంకటేష్ @ చాపా (19), లాలాపేట్ 14. కనిగిరి నాగరాజు @ పిల్లి (26), లాలాపేట్ 👉 కేసు వివరాలు: 📍దర్యాప్తులో A1 మరియు A2 నిందితులు రైల్వే స్టేషన్ పరిసరాల్లో తినుబండారాలు విక్రయిస్తూ ఎవరికీ అనుమానం రాకుండా ఒడిశా రాష్ట్రం నుండి గంజాయి కొనుగోలు చేసి గుంటూరుకు తరలించి, నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని చోడవరం గ్రామంలో A1 ఇంటివద్ద నిల్వ ఉంచి, గుంటూరు నగరంలో గంజాయి విక్రయించే వారికి (A3–A6) మరియు వినియోగదారులకు (A7–A14) విక్రయిస్తున్నట్లు తేలింది. 📍 ది.06.03.2026 తేదీన నిందితులు ఒడిశాకు వెళ్లి 8 కిలోల గంజాయి కొనుగోలు చేసి గుంటూరుకు తీసుకువచ్చినట్లు విచారణలో వెల్లడైంది. 📍 ది.11.03.2026 తేదీన చోడవరం గ్రామంలో A1 ఇంటి వద్ద గంజాయి విక్రయం జరుగుతుండగా నల్లపాడు మరియు CCS పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి మొత్తం 7600 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 📍దర్యాప్తులో A3 నుండి A6 నిందితులు ఎటువంటి అనుమతులు లేకుండా గుంటూరు నగరంలోని అమాయక ప్రజలకు మత్తు బిళ్ళలు విక్రయిస్తున్నట్లు కూడా గుర్తించారు. 📍గంజాయి సరఫరా, విక్రయం, వినియోగం మరియు అనధికారికంగా మత్తు బిళ్ళలు విక్రయించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ గారు తెలిపారు. ఇప్పటివరకు గత అక్టోబర్ నుండి గుంటూరు జిల్లాలో 34 కార్డెన్ సెర్చ్ లు 120 సంకల్పం ప్రోగ్రామ్స్ 8 మంది పై పీ డి యాక్ట్ కేసులు 51 NDPS కేసుల్లో 300 మందిని అరెస్టు చేసి రిమాండ్ పంపడమైనది గంజాయి కార్యకలాపాలపై నిఘా పెట్టేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి నిరంతరం చర్యలు తీసుకుంటున్నామని, గుంటూరు జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు విశేష కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. 👉ఈ కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేయడంలో మార్గనిర్దేశం చేసిన ఇన్‌చార్జ్ SDPO సౌత్ శ్రీ బి. మధుసూదన్ రావు గారిని, నిందితులను అరెస్ట్ చేయడంలో కృషి చేసిన SHO/CI కె. వంశీధర్ గారు, SI పి. మహేష్ కుమార్ గారు, నల్లపాడు పోలీస్ సిబ్బంది మరియు CCS సిబ్బందిని గౌరవ ఎస్పీ గారు అభినందించారు.
//గంజాయి కేసులో 14 మంది నిందితులను అరెస్ట్ చేసిన నల్లపాడు పోలీసులు,.// 🚩గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చే దిశగా జిల్లా పోలీస్ అధికారులు పటిష్ట చర్యలు చేపడుతున్నారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అనుమానాస్పద ప్రదేశాలు, పాత నేరస్తులు మరియు అనుమానితులపై విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. 📍ఈ చర్యలలో భాగంగా సౌత్ పోలీస్ సబ్ డివిజన్ ఇన్‌చార్జ్ డిఎస్పీ శ్రీ బి. మధుసూదన్ రావు గారి పర్యవేక్షణలో నల్లపాడు సీఐ కె. వంశీధర్ గారు నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి కార్యకలాపాలను అరికట్టేందుకు ఎస్సై పి. మహేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు. 📍ఈ క్రమంలో 11.03.2026 తేదీన నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని చోడవరం గ్రామంలో గంజాయి కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం అందడంతో, నల్లపాడు పోలీసులు మరియు CCS పోలీస్ బృందం సంయుక్తంగా దాడులు నిర్వహించి, గంజాయి కార్యకలాపాలలో పాల్గొంటున్న 14 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 📍వారిపై Cr.No.195/2026, U/Sec 8(C) r/w 20(b)(ii)(B)(A) NDPS Act కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 👉గంజాయి సరఫరాదారులు: 1. తోట గోపాలకృష్ణ @ సాయి (32), చౌడవరం, గుంటూరు రూరల్ (ఇతనిపై పాత గుంటూరు పోలీస్ స్టేషన్‌లో గంజాయి కేసు ఉంది) 2. కొల్లూరి నంధీశ్వర్ @ వరికూటి గౌరి శంకర్ (32), నూతలపాడు గ్రామం, పర్చూరు మండలం, బాపట్ల జిల్లా. 👉 గంజాయి కొనుగోలు చేసి విక్రయించే వారు / మత్తు బిళ్ళలు విక్రయించే వారు: 3. షేక్ ఉస్మాన్ (23), పాత గుంటూరు 4. షేక్ సనావుల్లా @ ఇర్ఫాన్ (24), కొత్తపేట, గుంటూరు 5. పటాన్ జానీ బాషా (30), వెంకటరావుపేట, పాత గుంటూరు 6. పోతార్లంక శ్యామ్ (26), అల్లీనగర్, పాత గుంటూరు 👉 గంజాయి వినియోగదారులు: 7. బత్తుల నాగరాజు (32), లాలాపేట్ 8. చల్లా వెంకటేశ్వర్లు (32), సాయిబాబా కాలనీ 9. నక్కా సాంబశివరావు (25), సాయిబాబా కాలనీ 10. కొడవటి హనోక్ (24), అల్లీనగర్. 11. షేక్ జబ్బార్ (25), చంద్రబాబు నాయుడు కాలనీ 12. బజంత్రీ దుర్గాప్రసాద్ @ అమ్ము
(29), ఆనందపేట 13. చల్లా వెంకటేష్ @ చాపా (19), లాలాపేట్ 14. కనిగిరి నాగరాజు @ పిల్లి (26), లాలాపేట్ 👉 కేసు వివరాలు: 📍దర్యాప్తులో A1 మరియు A2 నిందితులు రైల్వే స్టేషన్ పరిసరాల్లో తినుబండారాలు విక్రయిస్తూ ఎవరికీ అనుమానం రాకుండా ఒడిశా రాష్ట్రం నుండి గంజాయి కొనుగోలు చేసి గుంటూరుకు తరలించి, నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని చోడవరం గ్రామంలో A1 ఇంటివద్ద నిల్వ ఉంచి, గుంటూరు నగరంలో గంజాయి విక్రయించే వారికి (A3–A6) మరియు వినియోగదారులకు (A7–A14) విక్రయిస్తున్నట్లు తేలింది. 📍 ది.06.03.2026 తేదీన నిందితులు ఒడిశాకు వెళ్లి 8 కిలోల గంజాయి కొనుగోలు చేసి గుంటూరుకు తీసుకువచ్చినట్లు విచారణలో వెల్లడైంది. 📍 ది.11.03.2026 తేదీన చోడవరం గ్రామంలో A1 ఇంటి వద్ద గంజాయి విక్రయం జరుగుతుండగా నల్లపాడు మరియు CCS పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి మొత్తం 7600 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 📍దర్యాప్తులో A3 నుండి A6 నిందితులు ఎటువంటి అనుమతులు లేకుండా గుంటూరు నగరంలోని అమాయక ప్రజలకు మత్తు బిళ్ళలు విక్రయిస్తున్నట్లు కూడా గుర్తించారు. 📍గంజాయి సరఫరా, విక్రయం, వినియోగం మరియు అనధికారికంగా మత్తు బిళ్ళలు విక్రయించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ గారు తెలిపారు. ఇప్పటివరకు గత అక్టోబర్ నుండి గుంటూరు జిల్లాలో 34 కార్డెన్ సెర్చ్ లు 120 సంకల్పం ప్రోగ్రామ్స్ 8 మంది పై పీ డి యాక్ట్ కేసులు 51 NDPS కేసుల్లో 300 మందిని అరెస్టు చేసి రిమాండ్ పంపడమైనది గంజాయి కార్యకలాపాలపై నిఘా పెట్టేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి నిరంతరం చర్యలు తీసుకుంటున్నామని, గుంటూరు జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు విశేష కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. 👉ఈ కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేయడంలో మార్గనిర్దేశం చేసిన ఇన్‌చార్జ్ SDPO సౌత్ శ్రీ బి. మధుసూదన్ రావు గారిని, నిందితులను అరెస్ట్ చేయడంలో కృషి చేసిన SHO/CI కె. వంశీధర్ గారు, SI పి. మహేష్ కుమార్ గారు, నల్లపాడు పోలీస్ సిబ్బంది మరియు CCS సిబ్బందిని గౌరవ ఎస్పీ గారు అభినందించారు.
- నకిరేకల్: నియోజకవర్గంలో అధికారుల ఏకపక్ష వైఖరి, వడ్ల కొనుగోలు కేంద్రాల్లో సాగుతున్న అడ్డగోలు దోపిడీపై నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం నకిరేకల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు కష్టాలు మొదలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ ఏజెంట్లతో రైతులకు ఉరితాడు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఐకేపీ, పీఏసీఎస్ మరియు మహిళా సంఘాల ద్వారా ఎంతో పారదర్శకంగా కొనుగోళ్లు జరిగేవని చిరుమర్తి లింగయ్య గుర్తు చేశారు. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం తన పార్టీ కార్యకర్తలను ఏజెంట్లుగా నియమించి, రైతుల రక్తాన్ని తాగుతోందని విమర్శించారు. వారి స్వార్థం కోసం రైతుల కష్టార్జితాన్ని దోచిపెడుతున్నారని మండిపడ్డారు. అంకెల్లో దోపిడీ.. క్వింటాకు 7 కేజీల నష్టం! ధాన్యం తూకాల్లో జరుగుతున్న మోసాలను ఆయన లెక్కలతో సహా వివరించారు: అదనపు తూకం: గతంలో బస్తాకు 40 కేజీలు ఉంటే, ఇప్పుడు బలవంతంగా 42 కేజీలు తూకం వేయిస్తూ క్వింటాకు 5 కేజీల పంటను అదనంగా లాగేసుకుంటున్నారు. రిజిస్టర్ల మాయాజాలం: కొన్ని చోట్ల బస్తాకు 37 కేజీలు తూకం వేసి, రికార్డుల్లో మాత్రం 35 కేజీలే రాస్తున్నారని.. ఇలా క్వింటాకు మరో కేజీ, అంటే మొత్తంగా 7 కేజీల వరకు రైతులు నష్టపోతున్నారని ధ్వజమెత్తారు. అధికారులకు హెచ్చరిక: "చట్టం తన పని తాను చేస్తుంది" ప్రభుత్వ కార్యక్రమాల్లో కనీస ప్రొటోకాల్ పాటించడం లేదని అధికారులపై లింగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులను పక్కన పెట్టి, కాంగ్రెస్ కార్యకర్తలతో శంకుస్థాపనలు చేయడంపై మండిపడ్డారు. "అధికారులు కాంగ్రెస్ తొత్తులుగా మారకండి, ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు. నిబంధనలు ఉల్లంఘిస్తే భవిష్యత్తులో కఠిన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది" అని హెచ్చరించారు. పోలీసుల వేధింపులు.. కలెక్టరేట్ ముట్టడికి పిలుపు చిన్న చిన్న కారణాలతో బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, పోలీసు వ్యవస్థను రాజకీయ కక్షలకు వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు నిధులు రాక, కరెంటు లేక రైతులు అల్లాడుతున్నారని.. తక్షణమే అదనపు తూకాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలతో కలిసి కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని స్పష్టం చేశారు. పాల్గొన్న నాయకులు: ఈ సమావేశంలో మాజీ మార్కెట్ చైర్మన్ కొప్పుల ప్రదీప్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, నకిరేకల్ మరియు కేతపల్లి మండల పార్టీ అధ్యక్షులు ప్రగడపు నవీన్ రావు, మారం వెంకట్ రెడ్డి, సర్పంచ్ గొర్ల వీరు, మాజీ కౌన్సిలర్లు పల్లె విజయ్ గుర్రం గణేష్ మరియు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- *జగన్ పార్టీ కి ప్లాన్ బి కింద గొడ్డలి, కోడికత్తి,గులకరాయి గుర్తుతో కొత్త జెండా నమూనా విడుదల..నవతరం పార్టీ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం.* :చిలకలూరిపేట::16-04-2026.* *ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు ముక్కల జగన్ పార్టీ జెండా లేమితో బాధగా ఉండటం చూసి చలించిపోయిన నవతరం పార్టీ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం తనవంతు సాయంగా కొత్త జెండా నమూనా తయారు చేసి మీడియా ద్వారా వారికి బుధవారం నవతరం పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు.స్వంతంగా పార్టీ పెట్టుకోలేక శివకుమార్ వద్ద పార్టీని అరువు తెచ్చుకున్న జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు మావిగన్ పేరుతో ప్రజల్లోకి వచ్చేందుకు చేస్తున్న ప్రయత్నంకి తన వంతు మద్దతుగా జెండా నమూనా ప్లాన్ బి కింద ఉపయోగించుకునేందుకు ఆయనకు అందిస్తున్నట్లు రావు సుబ్రహ్మణ్యం తెలిపారు. మూడు రంగులు కలిగిన జెండా పైన రక్తం రంగు వృత్తకారంలో గొడ్డలి,కోడికత్తి,గులకరాయి గుర్తులు ఉండేలా రూప కల్పన చేసినట్లు తెలిపారు. ఈ జెండా ప్లాన్ బి కింద ఉపయోగించుకునే వీలుందేమో పరిశీలన చేయాలని మావిగన్ మామయ్య జగన్ మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.మూడు ముక్కలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చేయాలని చేసిన ప్రయత్నం వల్ల ఆయన ఎన్నికల గుర్తు సీలింగ్ ఫ్యాన్ ముక్కలు,11 చెక్కలుగా విడిపోవడం జరిగిందని, కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేక ఇబ్బందుల్లో పడ్డ ఆయనకు ఇప్పుడే ఇటువంటి జెండా అవసరం ఉందని ఇటువంటి జెండా రూపొందించామని రావు సుబ్రహ్మణ్యం తెలిపారు.అన్యదా భావించకుండా రానున్న ఎన్నికల్లో ఎజెండాగా రాజధాని మావిగన్, ఎన్నికల్లో గొడ్డలి, కోడికత్తి, గులకరాయి గల జెండా తో మావయ్య జగన్ ముందుకు రావాలని అన్నారు.వారు అధికారం చేపడితే వాళ్ళ చేతుల్లో ఏముంటాయో వారి జెండాలో తెలిసేలా ఏర్పాట్లు జరుగుచున్నాయని ప్రజలు గమనించాలని నవతరం పార్టీ విజ్ఞప్తి చేస్తుందని తెలిపారు.రాజధాని అమరావతి కి ప్లాన్ బి జగన్ ఇవ్వాల్సిన అవసరం లేదని, కూటమి తరపున నవతరం పార్టీ నుండి తామే ప్లాన్ బి జగన్ కి ఇస్తున్నామని రావు సుబ్రహ్మణ్యం మీడియా ద్వారా జగన్ మోహన్ రెడ్డికి తెలిపారు*1
- వరంగల్ కమిషనరేట్ పరిధిలోని సుబేదారి పోలీస్ స్టేషన్‌లో ఎస్సై శ్రీకాంత్‌పై అత్యాచారం కేసు నమోదైంది. కరీంనగర్ కమిషనరేట్‌లో పనిచేస్తున్న ఆయన, 2025లో ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన మహిళతో చాటింగ్ కొనసాగించాడు. ఆమె ఒంటరిగా ఉంటుందని తెలుసుకుని ఇటీవల వరంగల్‌కు వచ్చి లొకేషన్ తీసుకుని ఇంటికి వెళ్లి అత్యాచారం చేసినట్లు బాధితురాలి ఫిర్యాదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.1
- Post by Bondhu Suresh1
- 🙏😭1
- Post by N సూరి4
- వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొత్తూరు శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో పర్వతగిరి మండలం రావూరుకు చెందిన దామెర శ్రీనివాస్(34) అక్కడికక్కడే మృతి చెందాడు. కొత్తూరులోని మీసేవా కేంద్రంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న ఆయన విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి భార్య స్వర్ణలత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాస్‌కు భార్యతో పాటు కుమారుడు, కుమార్తె ఉండగా, ఆయన అకాల మరణంతో గ్రామంలో విషాదం నెలకొంది.1
- Post by Bondhu Suresh1
- 🙏😭1