आरटीसी हड़ताल के बीच ड्राइवर की आत्महत्या का प्रयास वरंगल जिला, राज्यव्यापी आरटीसी हड़ताल की तनावपूर्ण स्थिति के बीच वरंगल जिले में सनसनीखेज घटना हुई। नरसंपेट आरटीसी डिपो में कार्यरत ड्राइवर शंकर गौड़ ने अपनी समस्याओं का समाधान करने की मांग करते हुए आत्महत्या का प्रयास किया। सूत्रों के अनुसार, हड़ताल के दौरान कर्मचारियों की मांगों पर सरकार से प्रतिक्रिया की अपील करते हुए उन्होंने अपने ऊपर पेट्रोल डालकर आत्महत्या करने की कोशिश की। घटना को देखकर सहकर्मियों और स्थानीय लोगों ने तुरंत हस्तक्षेप कर उन्हें बचा लिया। गंभीर रूप से घायल शंकर गौड़ को तत्काल इलाज के लिए वरंगल के अस्पताल में भर्ती कराया गया है, जहां डॉक्टर उनका उपचार कर रहे हैं। इस घटना से आरटीसी कर्मचारियों में आक्रोश और चिंता और बढ़ गई है। हड़ताल जारी रहने के बीच यह घटना विशेष महत्व रखती है। मामले की पूरी जानकारी अभी आना बाकी है। तेलंगाना से न्यूज़ फर्स्ट के लिए रमेश सोलंकी की रिपोर्ट
आरटीसी हड़ताल के बीच ड्राइवर की आत्महत्या का प्रयास वरंगल जिला, राज्यव्यापी आरटीसी हड़ताल की तनावपूर्ण स्थिति के बीच वरंगल जिले में सनसनीखेज घटना हुई। नरसंपेट आरटीसी डिपो में कार्यरत ड्राइवर शंकर गौड़ ने अपनी समस्याओं का समाधान करने की मांग करते हुए आत्महत्या का प्रयास किया। सूत्रों के अनुसार, हड़ताल के दौरान कर्मचारियों की मांगों पर सरकार से प्रतिक्रिया की अपील करते हुए उन्होंने अपने ऊपर पेट्रोल डालकर आत्महत्या करने की कोशिश की। घटना को देखकर सहकर्मियों और स्थानीय लोगों ने तुरंत हस्तक्षेप कर उन्हें बचा लिया। गंभीर रूप से घायल शंकर गौड़ को तत्काल इलाज के लिए वरंगल के अस्पताल में भर्ती कराया गया है, जहां डॉक्टर उनका उपचार कर रहे हैं। इस घटना से आरटीसी कर्मचारियों में आक्रोश और चिंता और बढ़ गई है। हड़ताल जारी रहने के बीच यह घटना विशेष महत्व रखती है। मामले की पूरी जानकारी अभी आना बाकी है। तेलंगाना से न्यूज़ फर्स्ट के लिए रमेश सोलंकी की रिपोर्ट
- జన్నారం మండల కేంద్రంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక ప్రజలు వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. జన్నారం 4 జిల్లాలకు వెళ్లే ప్రధాన సరిహద్దులు ఉండటంతో నిత్యం రద్దీగా ఉంటుంది. వర్తక, వాణిజ్యపరంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న జన్నారం మండల కేంద్రంలో వ్యాపార సముదాయాలకు ఇరువైపులా సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదు. ప్రతి వర్షాకాలంలో వరద నీరు రోడ్డుపై ప్రవహిస్తుంది. వర్షాకాలంలో మళ్లీ కష్టాలు తప్పవని ప్రజలు వాపోతున్నారు. వర్షాకాలంలోపు ప్రధాన రహదారికి ఇరువైపులా డ్రైనేజీ వ్యవస్థను పూర్తిచేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరారు.1
- వరంగల్ జిల్లాలో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న ఆర్టీసీ డ్రైవర్ తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకుండా కాలయాపన చేయడాన్ని నిరసిస్తూ నర్సంపేట బస్టాండ్ ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఆర్టీసీ డ్రైవర్ కోలా శంకర్ గౌడ్ పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం వరంగల్ తరలింపు1
- ప్రభుత్వం తో చర్చలు విఫలం కావడంతో మనస్తాపానికి గురైన శంకర్ గౌడ్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న శంకర్ గౌడ్ మంటల్లో తీవ్రంగా గాయపడ్డ శంకర్ గౌడ్ ను ఎంజీఎం ఆసుపత్రికి తరలింపు ధర్నాకు దిగుతున్న ఆర్టీసీ కార్మికులు. పరిస్థితి ఉద్రిక్తం..!1
- ఆదిలాబాద్ అర్బన్ :తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం RTC కార్మికులు చేపట్టిన సమ్మెకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు తాళ్ల రవీందర్ పూర్తిస్థాయిలో మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,కార్మికుల కష్టాలను ప్రభుత్వం గాలికొదిలేయడం సరికాదని,వారి డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే స్పందించి సానుకూల నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేసి,కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యంగా సమ్మెలో ఉన్న కండక్టర్ల పేరు మీద టికెట్లు ఇష్యూ చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఇలాంటి అక్రమ చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని, ఇది కార్మికులను మోసం చేయడమేనని మండిపడ్డారు,అలాగే కార్మికులు చేస్తున్న పోరాటం కేవలం వారి హక్కుల కోసమే కాదని,ఆర్టీసీ మనుగడ కోసమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎల్లప్పుడూ కార్మికుల పక్షాన ఉంటుందని,వారి పోరాటం విజయవంతం అయ్యే వరకు తమ మద్దతు కొనసాగుతుందని హామీ ఇచ్చారు. తాళ్ల రవీందర్ ప్రకటనతో సమ్మెలో ఉన్న ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తూ, తమకు అండగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేశారు.1
- నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలంలోని సుంకేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గురువారం ఒక అద్భుతమైన వేడుకకు వేదికైంది. అటు విద్యార్థుల ప్రతిభకు గుర్తింపు, ఇటు పాఠశాల భద్రతకు యువత తోడ్పాటు కలగడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. విద్యార్థులను, దాతలను ఒకే వేదికపై సత్కరించడం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ప్రతిభకు పట్టాభిషేకం పాఠశాలలో 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు విద్యా సంవత్సరంలో మొదటి మూడు ర్యాంకులు సాధించిన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం ప్రత్యేకంగా సత్కరించింది. కేవలం విద్యార్థులనే కాకుండా, వారిని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులను కూడా శాలువాలు కప్పి, జ్ఞాపికలతో గౌరవించడం ఈ కార్యక్రమం యొక్క ప్రత్యేకత. ఈ గుర్తింపు విద్యార్థుల్లో మరింత పోటీ తత్వాన్ని, ఉత్సాహాన్ని నింపుతుందని ఉపాధ్యాయులు ఆకాంక్షించారు. మన ఊరి బడి - మన బాధ్యత' గ్రామ యువత తమ సామాజిక బాధ్యతను చాటుకుంటూ పాఠశాల భద్రత కోసం ముందుకొచ్చారు. "మన ఊరి బడిని మనమే కాపాడుకుందాం" అనే నినాదంతో సుమారు 50 వేల రూపాయల వ్యయంతో 11 సీసీ కెమెరాలను పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. యువకులు జక్కుల నరేష్, బండి కిషన్, ఓడపల్లి నవీన్ ఈ కెమెరాలను ప్రారంభించారు. ఈ నిఘా నేత్రాలు పాఠశాల ఆస్తుల రక్షణకు విద్యార్థుల క్రమశిక్షణ పర్యవేక్షణకు ఎంతగానో దోహదపడతాయని వారు తెలిపారు. హర్షం వ్యక్తం చేసిన గ్రామస్థులు ప్రభుత్వ పాఠశాల అభివృద్ధిలో యువత పోషిస్తున్న క్రియాశీలక పాత్రను గ్రామ పెద్దలు, ఉపాధ్యాయ బృందం కొనియాడారు. నాణ్యమైన విద్యతో పాటు ఇలాంటి ప్రోత్సాహక కార్యక్రమాలు నిర్వహించడం పట్ల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.4
- మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన శ్రీ హనుమాన్ హిందూ సమ్మేళనం ఘనంగా, ఉత్సాహభరిత వాతావరణంలో విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మండలంలోని వివిధ హిందూ సంఘాల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో భక్తులు, యువత పాల్గొని కార్యక్రమానికి ప్రత్యేక శోభను తీసుకువచ్చారు. కార్యక్రమం భక్తి, ఆధ్యాత్మికత, ఐక్యత సందేశాలతో నిండి సాగింది. ప్రారంభంలో హనుమాన్ స్వామి ఆశీర్వాదాలతో ప్రారంభమైంది.1
- 🔔 Alert! This is your final reminder—No Excuses! 🤙🏻😌🔥1
- కాళేశ్వరంపై కాంగ్రెస్, బీజేపీల దుష్ప్రచారాన్ని తిప్పికొడతం ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే కేసీఆర్ గారిపై అసత్య ఆరోపణలు. కాళేశ్వరం ప్రాజెక్టుకు క్లీన్ చిట్ - తెలంగాణ రైతాంగం సాధించిన విజయమిది. కాళేశ్వరం రివర్స్ పంపింగ్ (SRSP పునరుజీవం ) లేకపోతే వరద కాలువలు నీళ్లు వచ్చేవా? రైతుల పక్షాన పోరాటం ఆపేది లేదు, తప్పుడు ప్రచారాలు మానుకోకపోతే గుణపాఠం తప్పదు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎటువంటి అవినీతి జరగలేదని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. హరీష్ రావు. పై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి గట్టి చెంపపెట్టులాంటిదని బీఆర్ఎస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు.వేల్పూర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో నాగంపేట్ శేఖర్ రెడ్డి మాజీ డీసీసీబీ డైరెక్టర్, రాజా పూర్ణనందం మండల పార్టీ అధ్యక్షులు మాట్లాడారు. గత రెండున్నర సంవత్సరాలుగా కాళేశ్వరం ప్రాజెక్టుపై లక్ష కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారాలను ఈ తీర్పు పూర్తిగా ఖండించిందన్నారు. ఈ తీర్పుతో తెలంగాణ ప్రజలకు, రైతులకు అసలు నిజం తెలిసిందని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇప్పటి వరకు మొత్తం అయినా ఖర్చు సుమారు రూ. 94 వేల కోట్లు అయితే , లక్ష కోట్ల అవినీతి జరిగిందని దుష్ప్రచారం చేయడం కాంగ్రెస్ నాయకుల అజ్ఞానానికి నిదర్శనమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక్క మెడిగడ్డ బ్యారేజ్ మాత్రమే కాదు అని అందులో 21 పంపు హౌజ్ లు, 15 సబ్ స్టేషన్ లు, రూజర్వాయర్లు, వందల కి. మీ సొరంగాలు, వేల కి. మీ కేనాల్స్, పిల్లకాలువలు, విజయవంతంగా KCR నిర్మించారని గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగంగానే SRSP పునరుజీవం (కాళేశ్వరం రివర్స్ పంపింగ్ ) ప్రాజెక్ట్ నిర్మించారాని అన్నారు. ఈ ప్రాజెక్టు వల్లనే ఇటీవల జనవరి, ఫిబ్రవరి నెలల్లో కాకతీయ కాలువ, వరద కాలువల ద్వారా నీటి సరఫరా నిలిచిపోయిన సందర్భంలో బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల ప్రాంతాల్లో పంటలు ఎండిపోకుండా కాపాడగలిగామని తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి చొరవతో రివర్స్ పంపింగ్ ద్వారా రైతులకు నీరు అందించగలిగామని చెప్పారు.కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగమైన రివర్స్ పంపింగ్ లేకుంటే వరద కాలువకు నీళ్లు ఎక్కడ నుండి వచ్చేవో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పగలిగుతారా అని ప్రశ్నించారు. కేవలం కేసీఆర్ ని బద్నాం చేయడానికే కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా కాళేశ్వరం ప్రాజెక్టును నిరుపయోగం చేస్తోందని విమర్శించారు. మేడిగడ్డ వద్ద 84 పిల్లర్లలో కేవలం రెండు పిల్లర్లు మాత్రమే కుంగిపోయినప్పటికీ, వాటిని మరమ్మతు చేయకుండా రాజకీయ లబ్ధి కోసం ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు. రైతుల సంక్షేమాన్ని పక్కన పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించడం కాంగ్రెస్, బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్నాయని విమర్శించారు. ఘోష్ కమిషన్ నివేదికను కోర్టు తిరస్కరించడంతో, కేసీఆర్ కి, బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టమైందని తెలిపారు. ఈ తీర్పును తెలంగాణ రైతాంగ విజయంగా స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారాలను మానుకుని, కాళేశ్వరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో ప్రజలు మళ్లీ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కల్లెడ ఏలీయా, రేగుల్లా రాములు, సత్యం,దయాకర్,రవి,సుంకరి రాములు,మోహన్ దాస్ ,అశోక్, పాల్గొన్నారు.1
- కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర రైతులు సన్నరకం వడ్లు సాగు చేయాలి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లెలో ఐకేపీ కొనుగోలు కేంద్రంలో పరిశీలన ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర అందుతుందని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లె గ్రామంలో ఐకేపీ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని గురువారం జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో కల్పించిన వసతులను పరిశీలించారు. ఎంత ధాన్యం వస్తుందని, గన్ని బ్యాగ్స్ పై నిర్వాహకులను ఆరా తీశారు. ధాన్యం తేమ శాతం పరిశీలించారు. హమాలీలు ఎందరు ఉన్నారో అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రంలో అన్ని వివరాలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ధాన్యాన్ని ప్యాడీ క్లీనర్ తో శుభ్రం చేయించాలని సూచించారు. టార్పాలిన్లు అందుబాటులో ఉండాలని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. నిబంధనల ప్రకారం అన్ని వసతులు కల్పించాలని సూచించారు. కేటాయించిన మిల్లులకు ధాన్యం తరలించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. రానున్న సీజన్ లో రైతులు సన్నరకం వడ్లు సాగు చేయాలని పిలుపు నిచ్చారు. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు.పరిశీలనలో జిల్లా పౌర సరఫరాల అధికారి బుచ్చిబాబు, మేనేజర్ నరసింహ, తహసీల్దార్ విజయ్ ప్రకాశ్ రావు, ఏపీఎం, ఏవో తదితరులు పాల్గొన్నారు.1