విజయవంతంగా జాబ్ మేళా బాన్సువాడ ఏప్రిల్ 15 కామారెడ్డి జిల్లాలోని నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనలో తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఉత్తర తెలంగాణ జోన్ సెక్రెటరీ చెల్లాపురం శ్రీకాంత్ చేస్తున్న కృషి గొప్పదని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి అన్నారు. వారు మాట్లాడుతూ స్కిల్ ఉంటేనే జాబ్ లో ఏదైనా సాధించవచ్చునని ఉద్యోగాలలో మంచి స్థాయిలో ఎదగవచ్చునని తెలిపారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన జాబ్ మేళా విజయవంతం అయిందని జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు. తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ వారి సహకారంతో నిర్వహించిన జాబ్ మేళా లో నిరుద్యోగులకు (41)మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారని తెలిపారు. శ్రీ అక్షయ్ HR సర్వీసెస్ హైదరాబాద్ MSN ఫార్మా కంపెనీ, డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్ (Tech Jobs) ద్వారా టెన్త్ ఇంటర్ డిగ్రీ ఎంబీఏ బి.టెక్, బీఎస్సీ అగ్రికల్చర్ హోటల్ మేనేజ్ మెంట్, Mlt పూర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించారని తెలిపారు. వయస్సు 18 నుండి 30 సంవత్సరాలు కలిగిన యువతి, యువకులకు IT కంపెనీలలో (AI/ML)రంగంలో 7,MSN ఫార్మా లో 8 విజయ బయో అగ్రికల్చర్ 22, బ్యాంకింగ్ 4 వంటి తదితర విభాగాల్లో భాగంగా అన్ని రకాల సౌకర్యాలతో కూడిన ఉద్యోగాలకు ఎంపిక కావడం గొప్ప విషయం అన్నారు. ఈకార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ధి కమిటీ సెక్రెటరీ మహమ్మద్ ఎజాస్, సభ్యులు పిట్ల శ్రీధర్, దాసరి శ్రీనివాస్, ముదిరెడ్డి విఠల్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ నాయకుడు యండి. దావూద్, వివిధ కంపెనీ ల HR మేనేజర్లు బ్రహ్మానందరెడ్డి, శర్మ, కమలాకర్, నరేష్, తదితరులు పాల్గొన్నారు.
విజయవంతంగా జాబ్ మేళా బాన్సువాడ ఏప్రిల్ 15 కామారెడ్డి జిల్లాలోని నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనలో తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఉత్తర తెలంగాణ జోన్ సెక్రెటరీ చెల్లాపురం శ్రీకాంత్ చేస్తున్న కృషి గొప్పదని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి అన్నారు. వారు మాట్లాడుతూ స్కిల్ ఉంటేనే జాబ్ లో ఏదైనా సాధించవచ్చునని ఉద్యోగాలలో మంచి స్థాయిలో ఎదగవచ్చునని తెలిపారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన జాబ్ మేళా విజయవంతం అయిందని జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు. తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ వారి సహకారంతో నిర్వహించిన జాబ్ మేళా లో నిరుద్యోగులకు (41)మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారని తెలిపారు. శ్రీ అక్షయ్ HR సర్వీసెస్ హైదరాబాద్ MSN ఫార్మా కంపెనీ, డాక్టర్ రెడ్డిస్
ఫౌండేషన్ (Tech Jobs) ద్వారా టెన్త్ ఇంటర్ డిగ్రీ ఎంబీఏ బి.టెక్, బీఎస్సీ అగ్రికల్చర్ హోటల్ మేనేజ్ మెంట్, Mlt పూర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించారని తెలిపారు. వయస్సు 18 నుండి 30 సంవత్సరాలు కలిగిన యువతి, యువకులకు IT కంపెనీలలో (AI/ML)రంగంలో 7,MSN ఫార్మా లో 8 విజయ బయో అగ్రికల్చర్ 22, బ్యాంకింగ్ 4 వంటి తదితర విభాగాల్లో భాగంగా అన్ని రకాల సౌకర్యాలతో కూడిన ఉద్యోగాలకు ఎంపిక కావడం గొప్ప విషయం అన్నారు. ఈకార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ధి కమిటీ సెక్రెటరీ మహమ్మద్ ఎజాస్, సభ్యులు పిట్ల శ్రీధర్, దాసరి శ్రీనివాస్, ముదిరెడ్డి విఠల్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ నాయకుడు యండి. దావూద్, వివిధ కంపెనీ ల HR మేనేజర్లు బ్రహ్మానందరెడ్డి, శర్మ, కమలాకర్, నరేష్, తదితరులు పాల్గొన్నారు.
- కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో బుధవారం సాయంత్రం 4 గంటలకు ఉద్రిక్తత బీసీ వెల్ఫేర్ హాస్టల్ లో మృతి చెందిన శ్రావణి మృతి పై అనుమానాలు వ్యక్తం చేస్తూ... బీసీ హాస్టల్లో మృతి చెందిన బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బాలిక కుటుంబ సభ్యులతో కలిసి బాన్సువాడ కామారెడ్డి వెళ్లే రహదారిపై ధర్నాకు దిగిన మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్. ప్రధాన రహదారిపై భారీగా నిలిచిపోయిన వాహనాలు. హాస్టల్లో మృతి చెందిన బాలిక మృతి పట్ల అనుమానాలు ఉన్నాయని సమగ్ర విచారణ జరిపించాలని మాజీ ఎమ్మెల్యే సురేందర్ బాలిక కుటుంబ సభ్యుల డిమాండ్. ధర్నాకు దిగిన సురేందర్ తో పాటు శ్రావణి కుటుంబ సభ్యులను, బీఆర్ఎస్ శ్రేణులను, అరెస్టు చేసి బిక్కనూరు పోలీస్ స్టేషన్కు తరలించారు.1
- Indiramma Indlu Meeting Protocol Issue :స్థానిక ఎమ్మెల్యే వర్గీయులు, జిల్లా సర్పంచుల పోరం ఉపాధ్యక్షులు చంద్రం కృష్ణ గౌడ్ మధ్యల ప్రోటోకాల్ పై రగడ జరిగింది. బుధవారం నాడు కౌడిపల్లి రైతు వేదిక వద్ద ఎమ్మెల్యే కోటా కింద మంజూరైన ఇందిరమైండ్ల పత్రాల పంపిణీ సమావేశానికి స్థానిక ఎంపీడీవో అధ్యక్షత వహిస్తూ జిల్లా సర్పంచ్ల ఫోరం ఉపాధ్యక్షులు గ్రామ సర్పంచ్ చంద్రం కృష్ణ గౌడ్ ని వేదిక నల్లంకరించాలని ప్రసంగించగానే బి ఆర్ ఎస్ నాయకులు మిగతా సర్పంచ్ వేదిక పైకి పిలవాలంటూ నినాదాలు చేశారు. దీంతో స్థానిక సర్పంచ్ చంద్రం కృష్ణ గౌడ్ బీఆర్ఎస్ నాయకుడు దుర్గా రెడ్డి మధ్య మాటల యుద్ధం మొదలైంది. సర్పంచ్ వర్సెస్ బీఆర్ఎస్ నాయకులు స్థానిక సర్పంచికి సమాచారం ఇవ్వకుండా హుటాహుటిన ప్రభుత్వ కర్యక్రమాలు ఎలానిర్వహిస్తారని కృష్ణా గౌడ్ మండిపాటు. ఒక్కసారిగా వేడెక్కిన సమావేశం. ఇరు వర్గాల వాదనలతో సభ ప్రాంగణం నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత రెడ్డి కలగజేసుకొని ఇరువర్గాలను శాంతింప చేసింది.ఈ కార్యక్రమానికి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి హాజరయ్యారు కౌడిపల్లి గ్రామానికి చెందిన దుర్గా రెడ్డి,సర్పంచ్ కృష్ణ గౌడ్ ని వేదిక పైకి ఎలా ఆహ్వానిస్తారని ప్రశ్నించగా నీవు ఏ ప్రోటోకాల్ ప్రకారం ఏ హోదాలో అడుగుతున్నావని దుర్గారెడ్డిని సర్పంచ్ కృష్ణ గౌడ్ గట్టిగా నిలదీశారు. దీంతో ఒక్కసారిగా రైతు వేదిక రస బసాగా మారింది.స్థానిక సర్పంచికి ప్రోగ్రాం గురించి ఆలస్యంగా సమాచారం అందించడం సరికాదన్నారు ఇరు వర్గాల వాదనలతో రైతు వేదిక దద్దరిల్లింది స్థానిక ఎమ్మెల్యే సునీత రెడ్డి కలగజేసుకొని ఇరువురిని శాంతింప చేసింది ఇవి రాజకీయ సమావేశం కాదని సభా సాంప్రదాయాలను అందరూ గౌరవించాలని సూచించారు. ప్రతి ప్రభుత్వ కార్యక్రమానికి ప్రోటోకాల్ ఉంటుందని అది అందరూ పాటించాలని అన్నారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను ఎమ్మెల్యే ఆయా గ్రామాల సర్పంచుల చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్ డిఎల్ పి ఓ సాయి బాబా హౌసింగ్ డిఇ ప్రభు ఏఈ అభిషేక్ ఎస్సై అమర్ ఆయా గ్రామాల సర్పంచులు ఉప సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు నాయకులు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు4
- నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం బాబాపూర్ గ్రామంలో భానుడి భగభగలకు కేవలం మనుషులే కాదు అడవిలోని మూగజీవాలు సైతం విలవిలలాడుతున్నాయి. ఉష్ణోగ్రతలు అమాంతం పెరగడంతో అల్లాడిపోతున్న జీవాలు చల్లదనం కోసం నానా తంటాలు పడుతున్నాయి. ఈ క్రమంలో బాబాపూర్ గ్రామంలో చోటుచేసుకున్న ఒక ఆసక్తికర ఘటన అందరినీ ఆకట్టుకుంటోంది. గ్రామానికి చెందిన శివరామ్ అనే వ్యక్తి ఇంటి ఆవరణలో పెద్ద చెట్టు ఉంది. ఎండ వేడి నుంచి తప్పించుకోవడానికి ఒక కోతి ఆ చెట్టు నీడకు వచ్చింది. అక్కడ చెట్టుకు కట్టిన ఊయలను చూసిన వానరం ఏమాత్రం తడబడకుండా అందులోకి దూరింది. కాసేపు హాయిగా ఊగుతూ అలసటను మర్చిపోయి ఆటలాడింది. పెరుగుతున్న ఎండలకు మూగజీవాలు పడుతున్న అవస్థలు ఒకవైపు ఆవేదన కలిగిస్తుంటే మరోవైపు ఈ కోతి చేసిన పని ప్రకృతి ప్రేమికులను ఆలోచింపజేస్తోంది. మండుతున్న వేసవిలో పక్షులు జంతువుల కోసం నీటి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.1
- కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న డీ లిమిటేషన్‌ను అడ్డుకోవడం సీఎం రేవంత్ రెడ్డికి సాధ్యం కాదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. కందిలో ఆయన మీడియాతో మాట్లాడారు. డీలిమిటేషన్‌ను ఎలా అడ్డుకుంటారో సీఎం చెప్పాలని పేర్కొన్నారు. గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు మోదీని విమర్శించి ఎక్కడున్నారో అందరికీ తెలుసని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డికి కూడా భవిష్యత్‌లో అదే పరిస్థితి పడుతుందని పేర్కొన్నారు.1
- స్వీయ క్రమశిక్షణతో రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చు సిరిసిల్ల డిఎస్పీ నాగేంద్రచారి. జిల్లా కేంద్రంలో నేతన్న చౌరస్తాలో పోలీస్, రవాణా శాఖ ఆధ్వర్యంలో రహదారి భద్రతపై ప్రతిజ్ఞ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక Arrive Alive కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు పోలీస్,రవాణా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని నేతన్న చౌరస్తా వద్ద వాహనదారులతో రహదారి భద్రతా ప్రతిజ్ఞ చేయడం జరిగింది.ఈసందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ....ప్రతి ఒక్కరు స్వీయక్రమశిక్షణతో రోడ్డు ప్రమాదాలను అరికట్టవచన్నారు. రోడ్డు పై ప్రయాణం చేసే సమయాల్లో మనం చేసే చిన్న చిన్న తప్పిదాలు మనతో పాటు ఎదుటివారిని కుటుంబాలని రోడ్డుపై పడేయచ్చని,ట్రాఫిక్ నింబంధనలు ఉన్నది మీ రక్షణ కోసమే అని ట్రాఫిక్ రోడ్డు భద్రత నిబంధనలు పాటిస్తూ క్షేమంగా గమ్యం చేరాలని తెలిపారు.వాహనాలు నడిపే సమయంలో సీట్ బెల్ట్ తప్పని సరిగా ధరించాలని,మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, స్వీయారక్షణార్ధం హెల్మెట్ తప్పక ధరించాలని,వాహనాలు నడిపే సమయాల్లో మొబైల్ ఫోన్ వడాద్దని,తల్లిదండ్రులు మైనర్ పిల్లలు వాహనాలు ఇవ్వవద్దని మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.ప్రమాదం జరిగిన తొలి గంటను “గోల్డెన్ అవర్”గా పరిగణిస్తారని ఈ సమయంలో బాధితులకు సమయానికి వైద్య సహాయం అందితే అనేక ప్రాణాలు రక్షించవచ్చని పేర్కొన్నారు.జిల్లాలో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వస్తున్నామని ప్రజలు వాహనదారులు ట్రాఫిక్, రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ పోలీస్ వారికి సహకరించాలని విజ్ఞప్తి చేసారు.జిల్లా రవాణా అధికారి లక్ష్మణ్ మాట్లాడుతూ...రక్షిత ప్రయాణమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత సూచనలు పాటించాలన్నారు. ప్రాణాలు అమూల్యమైనవని, ప్రమాదాల నివారణను సామాజిక బాధ్యతగా స్వీకరించాలన్నారు. ఎవరికివారు జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలు జరగవని, మద్యం తాగి వాహనాలను నడపవద్దని ఆయన సూచించారు. ఈకార్యక్రమంలో సిరిసిల్ల పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ట్రాఫిక్ ఆర్.ఐ సురేష్, ఎస్.ఐ శ్రీకాంత్, ఆర్.ఎస్.ఐ శ్రీనివాస్,amvi పృథ్విధర్ పోలీస్ సిబ్బంది వాహనదారులు పాల్గొన్నారు.3
- మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గిర్మాపూర్ మల్లన్న గుట్ట వద్ద ఉన్న క్వారీలో మంగళవారం ఈతకు వెళ్లి గల్లంతైన బీకాం రెండో సంవత్సరం విద్యార్థి సూరజ్ (22) మృతదేహాన్ని డీఆర్ఎఫ్ బృందం వెలికితీసింది. మహారాష్ట్రకు చెందిన సూరజ్, తన నలుగురు స్నేహితులతో కలిసి క్వారీలో ఈతకు వెళ్లగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. సమాచారం అందుకున్న మేడ్చల్ పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు.1
- వికారాబాద్ : వికారాబాద్ జిల్లా కేంద్రంలో స్థానిక ఆర్డిఓ కార్యాలయంలో బుధవారం పరిగి మండల పరిధిలోని కాలాపూర్ రాపోలు గ్రామ రైతులు తమ భూములను ఇండస్ట్రియల్ కారిడార్ పేరిట ప్రభుత్వం లాక్కుంటుందని ధర్నాకు దిగడంతో దీనికి మద్దతుగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు విశారదన్ మహారాజు మద్దతు తెలిపి ధర్నాలో పాల్గొనగా భారీ స్థాయిలో ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు చేసేదిలేక కల్వకుంట్ల కవితను అరెస్టు చేసి దారుర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ రైతులకు మద్దతు తెలుపుతున్న వారిని అరెస్ట్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా జైలు బరో కార్యక్రమం నిర్వహిస్తామని, ప్రభుత్వం వెంటనే భూసేకరణ ఆపాలని హెచ్చరించారు1
- కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం రామేశ్వర్పల్లిలో ఇందిరమ్మ ఇళ్లను పీసీసీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. సొంత ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఒక గొప్ప వరమని పేర్కొన్నారు. నిరుపేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం గృహవసతి కల్పిస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాణి, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.1