వేములవాడ పట్టణం తిప్పాపూర్ లోని శ్రీ రాజరాజేశ్వర స్వామి గోశాలలో రైతులకు ఉచితంగా కోడెల పంపిణీ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి గోశాల కోడెలను అర్హులైన రైతులకు పారదర్శకంగా పంపిణీ చేస్తున్నామని, కోడెలను సంరక్షించి.. సాగు పనులకు వినియోగించుకోవాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పిలుపు నిచ్చారు. వేములవాడ పట్టణం తిప్పాపూర్ లోని శ్రీ రాజరాజేశ్వర స్వామి గోశాలలో రైతులకు మంగళవారం కోడెల ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించగా, ముఖ్య అతిథిగా హాజరై రైతులకు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరిమ అగ్రవాల్ అందజేశారు. ప్రభుత్వ విప్, కలెక్టర్ కు శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఇంచార్జి ఈఓ అంజనారెడ్డి పుష్పగుచ్చం అందజేసి, స్వాగతం పలికారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారి పత్రాలను అధికారులు తనిఖీ చేస్తుండగా, ప్రభుత్వ విప్, కలెక్టర్ పరిశీలించి రైతులతో మాట్లాడారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి కోడెను కట్టే సంస్కృతి వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి సన్నిధిలో ఉందని గుర్తు చేశారు. భక్తుల విశ్వాసానికి ప్రతీక కోడె మొక్కు చెల్లింపు అని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రైతులకు తిప్పాపూర్ గోశాలలో ఉచితంగా స్వామివారి కోడెలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. పంపిణీ చేసిన కోడెలను తనిఖీ చేయిస్తామని స్పష్టం చేశారు. కోడెలను పక్కదారి పట్టించి ఇతర అవసరాలకు ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.రాష్ట్ర ప్రభుత్వం వేములవాడ పరిధిలో అధునాతన సౌకర్యాలతో సువిశాల స్థలంలో గోశాల నిర్మాణానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. రూ.150 కోట్లతో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. కోడెలను రైతులు సంరక్షించాలని సూచించారు. అర్హులైన రైతులకు మాత్రమే పంపిణీ కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. ఆన్లైన్ లో అన్ని పత్రాలతో దరఖాస్తు చేసుకున్న రైతులకు కోడెలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. రైతులు ఆన్లైన్ లో దరఖాస్తులను వ్యవసాయ, పశు సంవర్ధక శాఖ, రెవెన్యూ, దేవాదాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో తనిఖీ చేసిన తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా, పరిసర జిల్లాలకు చెందిన 1.5 నుంచి 5 ఎకరాల వరకు సాగు భూమి ఉన్న సన్నకారు, చిన్నకారు అర్హులైన రైతులకు మాత్రమే పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. అర్హులైన రైతులకు కోడెల పంపిణీ నిరంతరం చేస్తామని తెలిపారు.కోడెలు, వెబ్సైట్ లో రైతుల వివరాలు నమోదు చేయడంతో జీవాలు పక్కదారి పట్టే అవకాశం ఉండదని, భవిష్యత్తులో వాటి సంరక్షణను పరిశీలించవచ్చని కలెక్టర్ స్పష్టం చేశారు.కోడెలను తీసుకువెళ్లే రైతులు వాటి సంరక్షణ బాధ్యతను సక్రమంగా పక్కాగా చూసుకోవాలని సూచించారు. వాటిని ఎల్లప్పుడూ అధికారులతో తనిఖీ చేయిస్తామని స్పష్టం చేశారు. గోశాలలో కోడెల సంరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటు న్నామని, గడ్డి, నీరు, అందిస్తున్నామని, దాదాపు 8 కూలర్లు ఏర్పాటు చేయించామని పేర్కొన్నారు. అలాగే జిల్లా పశు వైద్యాధికారి, వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్నారని కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు.కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్ చైర్మన్ రాకేష్, ఆర్డీఓ రాధాభాయ్, ఆలయ ఇంచార్జి ఈఓ అంజనారెడ్డి, డీఎస్పీ శ్రీనివాసులు, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి రవీందర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, తహసీల్దార్ జయంత్ కుమార్, వ్యవసాయ, రెవెన్యూ, ఆలయ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
వేములవాడ పట్టణం తిప్పాపూర్ లోని శ్రీ రాజరాజేశ్వర స్వామి గోశాలలో రైతులకు ఉచితంగా కోడెల పంపిణీ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి గోశాల కోడెలను అర్హులైన రైతులకు పారదర్శకంగా పంపిణీ చేస్తున్నామని, కోడెలను సంరక్షించి.. సాగు పనులకు వినియోగించుకోవాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పిలుపు నిచ్చారు. వేములవాడ పట్టణం తిప్పాపూర్ లోని శ్రీ రాజరాజేశ్వర స్వామి గోశాలలో రైతులకు మంగళవారం కోడెల ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించగా, ముఖ్య అతిథిగా హాజరై రైతులకు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరిమ అగ్రవాల్ అందజేశారు. ప్రభుత్వ విప్, కలెక్టర్ కు శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఇంచార్జి ఈఓ అంజనారెడ్డి పుష్పగుచ్చం అందజేసి, స్వాగతం పలికారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారి పత్రాలను అధికారులు తనిఖీ చేస్తుండగా, ప్రభుత్వ విప్, కలెక్టర్ పరిశీలించి రైతులతో మాట్లాడారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి కోడెను కట్టే సంస్కృతి వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి సన్నిధిలో ఉందని గుర్తు చేశారు. భక్తుల విశ్వాసానికి ప్రతీక కోడె మొక్కు చెల్లింపు అని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రైతులకు తిప్పాపూర్ గోశాలలో ఉచితంగా స్వామివారి కోడెలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. పంపిణీ చేసిన కోడెలను తనిఖీ చేయిస్తామని స్పష్టం చేశారు. కోడెలను పక్కదారి పట్టించి ఇతర అవసరాలకు ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.రాష్ట్ర ప్రభుత్వం వేములవాడ పరిధిలో అధునాతన సౌకర్యాలతో సువిశాల స్థలంలో గోశాల నిర్మాణానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. రూ.150 కోట్లతో వేములవాడ
శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. కోడెలను రైతులు సంరక్షించాలని సూచించారు. అర్హులైన రైతులకు మాత్రమే పంపిణీ కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. ఆన్లైన్ లో అన్ని పత్రాలతో దరఖాస్తు చేసుకున్న రైతులకు కోడెలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. రైతులు ఆన్లైన్ లో దరఖాస్తులను వ్యవసాయ, పశు సంవర్ధక శాఖ, రెవెన్యూ, దేవాదాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో తనిఖీ చేసిన తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా, పరిసర జిల్లాలకు చెందిన 1.5 నుంచి 5 ఎకరాల వరకు సాగు భూమి ఉన్న సన్నకారు, చిన్నకారు అర్హులైన రైతులకు మాత్రమే పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. అర్హులైన రైతులకు కోడెల పంపిణీ నిరంతరం చేస్తామని తెలిపారు.కోడెలు, వెబ్సైట్ లో రైతుల వివరాలు నమోదు చేయడంతో జీవాలు పక్కదారి పట్టే అవకాశం ఉండదని, భవిష్యత్తులో వాటి సంరక్షణను పరిశీలించవచ్చని కలెక్టర్ స్పష్టం చేశారు.కోడెలను తీసుకువెళ్లే రైతులు వాటి సంరక్షణ బాధ్యతను సక్రమంగా పక్కాగా చూసుకోవాలని సూచించారు. వాటిని ఎల్లప్పుడూ అధికారులతో తనిఖీ చేయిస్తామని స్పష్టం చేశారు. గోశాలలో కోడెల సంరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటు న్నామని, గడ్డి, నీరు, అందిస్తున్నామని, దాదాపు 8 కూలర్లు ఏర్పాటు చేయించామని పేర్కొన్నారు. అలాగే జిల్లా పశు వైద్యాధికారి, వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్నారని కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు.కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్ చైర్మన్ రాకేష్, ఆర్డీఓ రాధాభాయ్, ఆలయ ఇంచార్జి ఈఓ అంజనారెడ్డి, డీఎస్పీ శ్రీనివాసులు, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి రవీందర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, తహసీల్దార్ జయంత్ కుమార్, వ్యవసాయ, రెవెన్యూ, ఆలయ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- జగిత్యాల : వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ను ,రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డిని జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ మరియు కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ జువ్వాడి నరసింగరావు లు మంగళవారం ఉదయం11-30 గంటలప్రాంతంలో హైదరాబాద్ లో కలిశారు. వారితోపాటుగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గాజంగి నందయ్య,మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం,జగిత్యాల AMC ఛైర్మెన్ గడ్డం నారాయణరెడ్డి,సేవాదళ్ నాయకులు ముకేష్ ఖన్నా లు కలిసి రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డిని శాలువాకప్పి సన్మానించారు.1
- కరీంనగర్ జిల్లాలో డంపింగ్ యార్డ్ సమస్య రాజకీయంగా దుమారం రేపుతుంది. ప్రజా ఆందోళన ఉధృతం అవుతుంది. హుజురాబాద్ మండలం సిర్సపల్లి శివారులో ప్రభుత్వం డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తుండడంతో అఖిలపక్షం ఆధ్వర్యంలో జేఎసి గా ఏర్పడి డంపింగ్ యార్డ్ ను వ్యతిరేకిస్తూ 16 రోజులుగా నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. దీక్షలకు సంఘీభావంగా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి 24 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. డంపింగ్ యార్డ్ హఠావో, హుజురాబాద్ బచావో అంటూ నినాదాలు చేశారు. నిన్న బీజేపీ, ఈరోజు బిఆర్ఎస్ నిరాహార దీక్షలు చేయగా జేఏసీ ఆధ్వర్యంలో బంద్ పాటించారు. డంపింగ్ యార్డ్ తో మానవాళి మనుగడకు పర్యావరణానికి పెనుముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని, ప్రభుత్వం వెంటనే డంపింగ్ యార్డ్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిచో ప్రజా ఆందోళన ఉధృతం చేసి డంపింగ్ యార్డ్ రద్దయ్యే వరకు పోరాడుతామని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే డంపింగ్ యార్డ్ ను రద్దు చేయకుంటే ప్రజా ఆందోళన తోపాటు న్యాయం పోరాటం చేస్తామన్నారు. డంపింగ్ యార్డ్ రద్దయ్యే వరకు అన్ని పార్టీలను కలుపుకుని పోరాడుతామని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, జేఏసీ సంఘాల ప్రతినిధి రామారావు తెలిపారు.2
- కామారెడ్డి జిల్లా క్రైం : జూదం అనేది కేవలం ఒక ఆట కాదని, అది జీవితాలను చిన్నాభిన్నం చేసే ఒక మహమ్మారని, క్షణికమైన ఆశతో, కష్టపడకుండా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే దురాశతో జూదం వైపు అడుగులు వేసే వారు తమ బంగారు భవిష్యత్తును అంధకారంలోకి నెట్టుకుంటున్నారు. ఒక్క రూపాయి గెలిస్తే వంద రూపాయిలు పోగొట్టుకునే ఈ వ్యసనం వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. సమాజంలో గౌరవాన్ని కోల్పోవడమే కాకుండా, మానసిక ప్రశాంతతను, ఆర్థిక స్థిరత్వాన్ని జూదం దూరం చేస్తుంది. ముఖ్యంగా యువత ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండి, కష్టార్జితాన్ని నమ్ముకున్నప్పుడే గౌరవప్రదమైన మరియు సుఖమయమైన జీవితం సాధ్యమవుతుంది. వివరాల్లోకి వెళ్తే కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు దేవునిపల్లి పోలీసులు జూదరులపై ఉక్కుపాదం మోపారు. విశ్వసనీయ సమాచారం మేరకు కల్కి నగర్ ప్రాంతంలో జూదం స్థావరంపై స్పెషల్ టీమ్, దేవునిపల్లి పోలీసులు సంయుక్తంగా మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడుల్లో జూదం ఆడుతున్న 9 మంది వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో నిందితుల నుండి భారీగా నగదు,వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారి వద్ద నుండి రూ. 26,770 నగదుతో పాటు, 9 మొబైల్ ఫోన్లు, 6 స్కూటీలు, 2 కార్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. నిందితులందరినీ దేవునిపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించి, వారిపై కేసులు నమోదు చేశారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో ఏ రూపంలోనైనా సరే చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని తెలిపారు. జూదం, పేకాట, బెట్టింగ్ వంటి అసాంఘిక పనులు ఎన్నో కుటుంబాలను ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తీయడమే కాకుండా సామాజిక అశాంతికి కారణమవుతున్నాయని జిల్లా ఎస్పీ అన్నారు. ముఖ్యంగా యువత తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆలోచనలతో తప్పుదారులను ఎంచుకుని తమ విలువైన భవిష్యత్తును పాడుచేసుకోవద్దని, కష్టపడకుండా ఏదీ సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. అక్రమ కార్యకలాపాలపై పోలీసు యంత్రాంగం నిరంతరం నిఘా ఉంచి ఉంటుందని ఎస్పీ తెలిపారు. ఎక్కడైనా ఇలాంటి పనులు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 100కు కాల్ చేయాలని లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని, బాధ్యతాయుతమైన సమాజ నిర్మాణంలో ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.1
- తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం స్వయంభుగా వెలసిన సీ ఏడుపాయల వన దుర్గ భవాని మాత ఆలయంలో మంగళవారం తెల్లవారుజామున ఆలయ పూజారులు అమ్మవారికి గరుడ గంగా నది జిల్లాలతో అభిషేకం పంచ అంతా అభిషేకం నిర్వహించారు అనంతరం అమ్మవారికి పట్టు వస్త్రులంకరణ చేసి పసుపు కుంకుమతో అలంకరించారు అనంతరం పుష్పాలంకరణ నిమ్మకాయల హారం అలంకరణ చేశారు సహస్రనామారచన కుంకుమార్చన ప్రత్యేక పూజలు చేశారు అనంతరం భక్తులకు దివ్యదర్శన భాగ్యం కలిగించారు ఆలయ ఈవో వీరేశమ ఆధ్వర్యంలో భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పించారు1
- “ప్రతాప్ రెడ్డి… నీవొక రాజకీయ అజ్ఞానివి” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన ఆయన… అధికార ఆశతో ఎన్ని పార్టీలు మారతావని ప్రశ్నించారు.హరీష్ రావు బండారం బయటపెడతానన్న మాటలేమయ్యాయని నిలదీస్తూ…కేసీఆర్‌కు ఎంతకు అమ్ముడుపోయావని సూటిగా ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో చెప్పిన మాటలనుమరిచిపోయి… ఇప్పుడు అదే నేతలతో కలిసి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఇక బీఆర్ఎస్ ఇచ్చిన బంద్ పిలుపు పూర్తిగా విఫలమైందని…ఉదయం 10 గంటలకే ప్రైవేట్, ప్రభుత్వ, వాణిజ్య సంస్థలు తెరుచుకున్నాయని తెలిపారు.కాంగ్రెస్ నేతలు శాంతియుతంగా సీఎం ఫోటోను క్యాంపు కార్యాలయంలో ఉంచగా… దానిని తొలగించే హక్కు నీకు ఎవరు ఇచ్చారని ప్రతాప్ రెడ్డిని ప్రశ్నించారు.ప్రజల సమస్యలు వినడానికి కేసీఆర్ బయటకు రావాలని డిమాండ్ చేస్తూ…ప్రతాప్ రెడ్డి వంటి నేతల విమర్శలకు కాంగ్రెస్ నేతలు భయపడరని నాయిని యాదగిరి స్పష్టం చేశారు.గజ్వేల్‌లో ఈ రాజకీయ ఆరోపణలు…ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.4
- లక్షేట్టిపేట్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని పునరుద్ధరించాలని కోరుతూ సాధన కమిటీ నాయకులు సంతకాల సేకరణను ప్రారంభించారు. మంగళవారం వారు లక్షెట్టిపేట పట్టణంలోని ఉత్కూర్ చౌరస్తా వద్ద హమాలీ కార్మికులు, తదితరుల నుండి సంతకాలు సేకరించారు.ఈ కార్యక్రమంలో లక్షేటీపేట్ నియోజకవర్గం సాధన సమితి సభ్యులు బిరుదుల సంతోష్, గడుసు సత్యనారాయణ, గంధం సత్యం, హమాలీ కార్మికుల అధ్యక్షులు గడికొప్పుల. చంద్రయ్య, కమాటం.రమేష్, కొట్టె బానేష్, కండ్రపు సత్తయ్య, ఎగ్గడి నరేష్, దర్శనాల శంకర్, చుక్క తిరుపతి, దండ్రే కిషన్, తదితరులు పాల్గొన్నారు.3
- రాజన్న సిరిసిల్ల జిల్లా లోని యువతను క్రీడల్లో ప్రోత్సహించేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ లోగో పోస్టర్ ను సిరిసిల్ల తెలంగాణ భవన్ లో ఆవిష్కరించిన మాజీ ఎంపీ వినోద్ కుమార్ . ఈ సందర్భంగా మీడియాతో వినోద్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో రెండు మున్సిపాలిటీల నుండి 157 జట్లు 175 మ్యాచులు 2512 మంది క్రీడాకారులతో కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ ను ఈ నెల 15 నుండి 25 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.జిల్లాలో ఉన్న క్రికెట్ క్రీడాకారులు సద్వినియోగం చేసుకుని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.క్రీడాకారులను ప్రోత్సహించాలన్న సంకల్పం తో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామాలలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసుకుని ముందుకు పోతున్న తరుణం లో ఎన్నికల్లో తమ ప్రభుత్వం రాలేదని అన్నారు.గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించాలని ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు నిరుపయోగంగా మారాయని అన్నారు.యువత చెడు వ్యసనాలకు గురికాకుండా క్రీడల వైపు ప్రస్తహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ ఆడిన ఘటనను గుర్తు చేస్తూ కేసీఆర్ ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు సద్వినియోగం చేసుకునేలా చూడాలని అన్నారు.1
- జగిత్యాల : రాష్ట్ర కార్యవర్గసభ్యులుగా పార్టీ తనకు 2వసారి బాధ్యతలు అప్పగించిననందున మంత్రి జి.కిషన్ రెడ్డి , బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావుకు సురభి నవీన్ కృతజ్ఞతలు బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా పార్టీ రెండవసారి బాధ్యతలు అప్పగించిన సంగతితెలిసిందే. ఈ సందర్బంగా కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డిని మరియు బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు ను బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోరుట్ల నియోజకవర్గ నాయకులు సురభి నవీన్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.1
- జగిత్యాలలో మద్యం మత్తులో కానిస్టేబుల్ హల్ చల్ చేశాడు. స్క్రూటిపై వెళ్తున్న మహిళను బైక్ తో ఢీకొట్టి దురుసుగా ప్రవర్తించాడు. జగిత్యాల శ్రీరామ థియేటర్ చౌరస్తా వద్ద స్క్రూటీపై వెళ్తున్న మహిళను, మద్యం మత్తులో ఉన్న కానిస్టేబుల్ వెంకటేష్ ఢీ కొట్టాడు. ప్రమాదం జరిగిన వెంటనే బాధ్యతగా స్పందించాల్సింది పోయి నేను పోలీస్ అంటు దురుసుగా ప్రవర్తించాడు. కానిస్టేబుల్ తీరును చూసిన స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తు పోలీస్ అయితే మీకేమైనా ప్రత్యేక చట్టం ఉందా అని నిలదీశారు. నీ బైక్ కు నెంబర్ ప్లేట్ ఎందుకు లేదని ప్రశ్నించారు. పరిస్థితి కాస్త ఉద్రిక్తతకు దారి తీయడంతో టౌన్ పోలీసులు అక్కడికి చేరుకొని సముదాయించి మద్యం మత్తులో ఉన్న కానిస్టేబుల్ ను అదుపులోకి తీసుకున్నారు. గాయపడ్డ మహిళను ఆసుపత్రికి తరలించారు. తాగిన మైకంలో హంగామా సృష్టించిన కానిస్టేబుల్ హెడ్ క్వార్టర్ లో పనిచేస్తారని గుర్తించి చర్యలు తీసుకునే పనిలో పోలీస్ అధికారులు నిమగ్నమయ్యారు.1