Shuru
Apke Nagar Ki App…
నియోజకవర్గాన్ని పునరుద్ధరించాలని సంతకాల సేకరణ ప్రారంభం లక్షేట్టిపేట్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని పునరుద్ధరించాలని కోరుతూ సాధన కమిటీ నాయకులు సంతకాల సేకరణను ప్రారంభించారు. మంగళవారం వారు లక్షెట్టిపేట పట్టణంలోని ఉత్కూర్ చౌరస్తా వద్ద హమాలీ కార్మికులు, తదితరుల నుండి సంతకాలు సేకరించారు.ఈ కార్యక్రమంలో లక్షేటీపేట్ నియోజకవర్గం సాధన సమితి సభ్యులు బిరుదుల సంతోష్, గడుసు సత్యనారాయణ, గంధం సత్యం, హమాలీ కార్మికుల అధ్యక్షులు గడికొప్పుల. చంద్రయ్య, కమాటం.రమేష్, కొట్టె బానేష్, కండ్రపు సత్తయ్య, ఎగ్గడి నరేష్, దర్శనాల శంకర్, చుక్క తిరుపతి, దండ్రే కిషన్, తదితరులు పాల్గొన్నారు.
P.G. Murthy
నియోజకవర్గాన్ని పునరుద్ధరించాలని సంతకాల సేకరణ ప్రారంభం లక్షేట్టిపేట్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని పునరుద్ధరించాలని కోరుతూ సాధన కమిటీ నాయకులు సంతకాల సేకరణను ప్రారంభించారు. మంగళవారం వారు లక్షెట్టిపేట పట్టణంలోని ఉత్కూర్ చౌరస్తా వద్ద హమాలీ కార్మికులు, తదితరుల నుండి సంతకాలు సేకరించారు.ఈ కార్యక్రమంలో లక్షేటీపేట్ నియోజకవర్గం సాధన సమితి సభ్యులు బిరుదుల సంతోష్, గడుసు సత్యనారాయణ, గంధం సత్యం, హమాలీ కార్మికుల అధ్యక్షులు గడికొప్పుల. చంద్రయ్య, కమాటం.రమేష్, కొట్టె బానేష్, కండ్రపు సత్తయ్య, ఎగ్గడి నరేష్, దర్శనాల శంకర్, చుక్క తిరుపతి, దండ్రే కిషన్, తదితరులు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- జగిత్యాల : వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ను ,రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డిని జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ మరియు కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ జువ్వాడి నరసింగరావు లు మంగళవారం ఉదయం11-30 గంటలప్రాంతంలో హైదరాబాద్ లో కలిశారు. వారితోపాటుగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గాజంగి నందయ్య,మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం,జగిత్యాల AMC ఛైర్మెన్ గడ్డం నారాయణరెడ్డి,సేవాదళ్ నాయకులు ముకేష్ ఖన్నా లు కలిసి రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డిని శాలువాకప్పి సన్మానించారు.1
- వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి గోశాల కోడెలను అర్హులైన రైతులకు పారదర్శకంగా పంపిణీ చేస్తున్నామని, కోడెలను సంరక్షించి.. సాగు పనులకు వినియోగించుకోవాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పిలుపు నిచ్చారు. వేములవాడ పట్టణం తిప్పాపూర్ లోని శ్రీ రాజరాజేశ్వర స్వామి గోశాలలో రైతులకు మంగళవారం కోడెల ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించగా, ముఖ్య అతిథిగా హాజరై రైతులకు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరిమ అగ్రవాల్ అందజేశారు. ప్రభుత్వ విప్, కలెక్టర్ కు శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఇంచార్జి ఈఓ అంజనారెడ్డి పుష్పగుచ్చం అందజేసి, స్వాగతం పలికారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారి పత్రాలను అధికారులు తనిఖీ చేస్తుండగా, ప్రభుత్వ విప్, కలెక్టర్ పరిశీలించి రైతులతో మాట్లాడారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి కోడెను కట్టే సంస్కృతి వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి సన్నిధిలో ఉందని గుర్తు చేశారు. భక్తుల విశ్వాసానికి ప్రతీక కోడె మొక్కు చెల్లింపు అని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రైతులకు తిప్పాపూర్ గోశాలలో ఉచితంగా స్వామివారి కోడెలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. పంపిణీ చేసిన కోడెలను తనిఖీ చేయిస్తామని స్పష్టం చేశారు. కోడెలను పక్కదారి పట్టించి ఇతర అవసరాలకు ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.రాష్ట్ర ప్రభుత్వం వేములవాడ పరిధిలో అధునాతన సౌకర్యాలతో సువిశాల స్థలంలో గోశాల నిర్మాణానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. రూ.150 కోట్లతో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. కోడెలను రైతులు సంరక్షించాలని సూచించారు. అర్హులైన రైతులకు మాత్రమే పంపిణీ కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. ఆన్లైన్ లో అన్ని పత్రాలతో దరఖాస్తు చేసుకున్న రైతులకు కోడెలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. రైతులు ఆన్లైన్ లో దరఖాస్తులను వ్యవసాయ, పశు సంవర్ధక శాఖ, రెవెన్యూ, దేవాదాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో తనిఖీ చేసిన తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా, పరిసర జిల్లాలకు చెందిన 1.5 నుంచి 5 ఎకరాల వరకు సాగు భూమి ఉన్న సన్నకారు, చిన్నకారు అర్హులైన రైతులకు మాత్రమే పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. అర్హులైన రైతులకు కోడెల పంపిణీ నిరంతరం చేస్తామని తెలిపారు.కోడెలు, వెబ్సైట్ లో రైతుల వివరాలు నమోదు చేయడంతో జీవాలు పక్కదారి పట్టే అవకాశం ఉండదని, భవిష్యత్తులో వాటి సంరక్షణను పరిశీలించవచ్చని కలెక్టర్ స్పష్టం చేశారు.కోడెలను తీసుకువెళ్లే రైతులు వాటి సంరక్షణ బాధ్యతను సక్రమంగా పక్కాగా చూసుకోవాలని సూచించారు. వాటిని ఎల్లప్పుడూ అధికారులతో తనిఖీ చేయిస్తామని స్పష్టం చేశారు. గోశాలలో కోడెల సంరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటు న్నామని, గడ్డి, నీరు, అందిస్తున్నామని, దాదాపు 8 కూలర్లు ఏర్పాటు చేయించామని పేర్కొన్నారు. అలాగే జిల్లా పశు వైద్యాధికారి, వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్నారని కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు.కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్ చైర్మన్ రాకేష్, ఆర్డీఓ రాధాభాయ్, ఆలయ ఇంచార్జి ఈఓ అంజనారెడ్డి, డీఎస్పీ శ్రీనివాసులు, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి రవీందర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, తహసీల్దార్ జయంత్ కుమార్, వ్యవసాయ, రెవెన్యూ, ఆలయ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.2
- కరీంనగర్ లో డివిజన్ల మ్యాపింగ్ పేరుతో అన్ని డివిజన్లలో చేపడుతున్న సర్వే లోపభూయిష్టంగా ఉందని, దానికి ప్రధాన కారణం సంబంధిత అధికారుల నిర్లక్ష్యంతోనే ఓట్ల గల్లంతు జరిగిందని జనసేన పార్టీ పార్లమెంట్ కో-ఆర్డినేటర్ బేతి మహేందర్ రెడ్డి ఆరోపించారు. కరీంనగర్ లోని బూత్ లెవెల్ ఆఫీసర్స్ చేపట్టిన మ్యాపింగ్ సర్వేను పరిశీలించి లోపాలను ఎత్తి చూపారు. పలు డివిజన్లలో బూత్ లెవెల్ ఆఫీసర్ (బి.ఎల్.ఓ) లు పని చేస్తున్నట్టు కనిపించడం, కానీ బి.ఎల్.ఓ లు డివిజన్ లో గడప గడపకు తిరగకుండా స్థానిక కార్పొరేటర్ కనుసన్నుల్లో ఒకే స్థానంలో కూర్చుని ఓట్ల మ్యాపింగ్ చేస్తున్నట్టు తప్పుడు నివేదికలు తయారు చేయడంతోనే డివిజన్లలోని ఓట్లు గల్లంతు అవుతున్నాయని తెలిపారు. ఓట్ల గల్లంతు విషయంలో మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల ముందు వందల సంఖ్యలో పిర్యాదులు వచ్చిన వాటిని పరిష్కరించకపోవడంతోనే నేడు భారీగా పోలింగ్ శాతం తగ్గిందని, దీనికి ప్రధాన కారణం బి.ఎల్.ఓ లు వారి పై ఆధారపడుతున్న జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ లే భాద్యులని బేతి మహేందర్ రెడ్డి ఆరోపించారు. ఓటరు జాబితాలో మరణించినవారి ఓట్లు యధాతథంగా ఉండడం, బ్రతికున్నవారి ఓట్లు తొలగించడం ఎంత పెద్ద నేరమో జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ గమనించాలని పేర్కొంటూ, అలాగే డివిజన్ లో ఒక ఇంటిలో ఉన్న నాలుగు ఓట్లు నలుదిక్కుల నాలుగు ఇతర డివిజన్లలో బదిలీ కావడం, ఇతర గ్రామాలలోని ఓట్లు డివిజన్లలో దొంగ ఓట్లు నమోదు చేయించడం, డబుల్ ఓట్లు రావడం, అలాగే ఓటరు జాబితాలో పేరు ఒకటి, ఫోటో మరొకటి ఉండటం లాంటి ఎన్నో తప్పులు దొర్లాయని తెలిపారు. తప్పులకు ప్రధాన కారకులుగా జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, సంబంధిత శాఖల సిబ్బంది సమన్వయ లోపంతో జరిగిందని బేతి మహేందర్ రెడ్డి ఆరోపించారు. అందుకే రాష్ట్రంలో ఆధార్ కార్డు ఓటరు కార్డుతో లింక్ పెట్టే స్పెషల్ఇంటెన్సివ్ రివిజన్ “సర్” నిబంధన కఠినతరం చేయాలని, అప్పుడే దొంగ ఓట్లకు, డబుల్ ఓట్లకు చెక్ పడే అవకాశం ఉంటుందని, లేనిపక్షంలో తెలంగాణలో సర్ నిబంధనను అమలు చేసే విధంగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు.2
- పత్రికా ప్రకటన తేదీ: 07-04-2026 కామారెడ్డి జిల్లా మంగళవారం ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద కామారెడ్డి జిల్లాకు జనరల్ కేటగిరీ కింద (08), ఎస్సీ కేటగిరీ కింద (02), ఎస్టీ కేటగిరీ కింద (01) మరియు మహిళా కేటగిరీ కింద (02) మొత్తం 13 వాహనాలను మంజూరు చేయడం జరిగినది. ఈ వాహనాల మంజూరుకు గాను జనరల్ కేటగిరీ కింద (109), ఎస్సీ కేటగిరీ కింద (02), ఎస్టీ కేటగిరీ కింద (01) మరియు మహిళా కేటగిరీ కింద (01) మొత్తం 113 దరఖాస్తులను స్వీకరించడం జరిగినది. జనరల్ కేటగిరీలో 08 వాహనాలకు 109 దరఖాస్తులు అందిన నేపథ్యంలో, జిల్లా కలెక్టర్, ఆశిష్ సాంగ్వాన్ ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గానికి 02 వాహనాల చొప్పున మంగళవారం కలెక్టరేట్ సమావేశం మందిరం లో లాటరీ విధానం ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది. ఈ కార్యక్రమం జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) మధు మెహన్ గ సమక్షంలో, జిల్లా స్థాయి కమిటీ సభ్యులు, మత్స్య శాఖ అధికారులు దరఖాస్తుదారుల సమక్షంలో పారదర్శకంగా నిర్వహించబడింది. లాటరీ ద్వారా ఎంపికైన 08 మంది లబ్ధిదారులకు డిమాండ్ డ్రాఫ్ట్ (DD) సమర్పించుటకు ఒక వారం గడువు ఇవ్వబడింది.1
- గిరిజన గురుకుల పాఠశాలలో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు దిగారు. పాఠశాల ఇంచార్జ్ ప్రిన్సిపల్ ఫణి కుమార్ మరియు సోషల్ ఉపాధ్యాయుడు ఉదయ్ కుమార్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు హైదరాబాద్–మెదక్ జాతీయ రహదారిపైగిరిజనవిధ్యార్థులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. గత వారం రోజులుగా సోషల్ ఉపాధ్యాయుడు ఉదయ్ కుమార్‌పై విద్యార్థులను దూషిస్తున్నాడనిఆరోపణలు వెలువడుతున్నప్పటికీ, సంబంధిత అధికారుల నుండి ఎలాంటి చర్యలు తీసుకోలేదని విద్యార్థులు ఆరోపించారు. జిల్లా గురుకుల అధికారి ఆర్‌సీవో గంగారం నాయక్ ఇప్పటివరకు స్పందించలేదని వారు విమర్శించారు. ఇదే సమయంలో, ఇంచార్జ్ ప్రిన్సిపల్ ఫణి కుమార్ విద్యార్థులతో అనుచితంగా ప్రవర్తిస్తూ, కులం పేరుతో దూషణలు చేస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. “మీరు ఉదయ్ దగ్గర డబ్బులు తీసుకుని నా మీద ఇలా ఆరోపణలు చేస్తున్నారా?” అంటూ అవమానకరంగా మాట్లాడినట్లు తెలిపారు. ఈ ఘటనపై వెంటనే విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది.1
- సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో నిర్వహించిన మైనార్టీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మైనార్టీ నాయకుడు సయ్యద్ మతిన్ మాట్లాడారు.బిఆర్ఎస్ పార్టీ అనవసర ఆరోపణలు చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తోందని ఆయన విమర్శించారు. టిఆర్ఎస్ హయాంలో మైనార్టీలకు ఎలాంటి ప్రయోజనం కలగలేదని, మైనార్టీ చెక్కులు, కుట్టు మిషన్లు వచ్చినప్పటికీ వాటిని కొంతమంది మాత్రమే పొందారని ఆరోపించారు. ముస్లింలకు 12% రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ ఆ వాగ్దానాన్ని అమలు చేయలేదని, ఈ విషయంలో ప్రతాప్ రెడ్డి స్పందించలేదని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతాప్ రెడ్డి, 2018లో టిఆర్ఎస్‌కు మద్దతు ఇచ్చి పదవులు పొందారని అన్నారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టినందుకు విమర్శలు చేయడం, పోలీస్ కేసులు నమోదు చేయడం తగదని, కేసుల్లో సంబంధం లేని వారిని కూడా ఇరికిస్తున్నారని ఆరోపించారు. అలాగే తమ నాయకుడు నరసన్నపై అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలను మానుకోవాలని, ప్రజల్లో శాంతి భద్రతలను కాపాడాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు సయ్యద్ మతిన్ మాజీ కౌన్సిలర్ సమీర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ డాక్టర్ వహీద్, మహమ్మద్ జలాల్, మహమ్మద్ జహీర్, సమీర్ ఇర్షాద్, అత ఉల్లా బేగ్, షకీల్ పటేల్, మొహమ్మద్ జుబేర్, భారీ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.4
- జగిత్యాల : రాష్ట్ర కార్యవర్గసభ్యులుగా పార్టీ తనకు 2వసారి బాధ్యతలు అప్పగించిననందున మంత్రి జి.కిషన్ రెడ్డి , బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావుకు సురభి నవీన్ కృతజ్ఞతలు బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా పార్టీ రెండవసారి బాధ్యతలు అప్పగించిన సంగతితెలిసిందే. ఈ సందర్బంగా కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డిని మరియు బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు ను బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోరుట్ల నియోజకవర్గ నాయకులు సురభి నవీన్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా లోని యువతను క్రీడల్లో ప్రోత్సహించేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ లోగో పోస్టర్ ను సిరిసిల్ల తెలంగాణ భవన్ లో ఆవిష్కరించిన మాజీ ఎంపీ వినోద్ కుమార్ . ఈ సందర్భంగా మీడియాతో వినోద్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో రెండు మున్సిపాలిటీల నుండి 157 జట్లు 175 మ్యాచులు 2512 మంది క్రీడాకారులతో కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ ను ఈ నెల 15 నుండి 25 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.జిల్లాలో ఉన్న క్రికెట్ క్రీడాకారులు సద్వినియోగం చేసుకుని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.క్రీడాకారులను ప్రోత్సహించాలన్న సంకల్పం తో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామాలలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసుకుని ముందుకు పోతున్న తరుణం లో ఎన్నికల్లో తమ ప్రభుత్వం రాలేదని అన్నారు.గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించాలని ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు నిరుపయోగంగా మారాయని అన్నారు.యువత చెడు వ్యసనాలకు గురికాకుండా క్రీడల వైపు ప్రస్తహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ ఆడిన ఘటనను గుర్తు చేస్తూ కేసీఆర్ ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు సద్వినియోగం చేసుకునేలా చూడాలని అన్నారు.1
- కోరిన కోర్కెలు తీర్చే కోడే మొక్కుల వేములవాడ రాజరాజేశ్వర స్వామి గోశాలకు చెందిన 300 కోడెలను రైతులకు ఉచితంగా పంపిణీ చేశారు. తిప్పాపురం గోశాలలో కలెక్టర్ గరిమా అగ్రవాల్ పర్యవేక్షణలో కోడెల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అర్హులైన 150 మంది రైతులకు రెండు కోడెల చొప్పున పంపిణీ చేశారు. భక్తి భావంతో భక్తులు రాజన్నకు సమర్పించే కోడెల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో పరిమితికి మించి ఉన్న కోడెలను రైతులకు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. రైతుల ముసుగులో ఇతరులు కోడెలు పొందే అవకాశం లేదని, ప్రస్తుతం రాజన్న కోడెలు పొందిన రైతులు అక్రమంగా విక్రయించినా వ్యవసాయేతర పనులకు వినియోగించినా చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించారు. రాజన్న కోడెలను జియో ట్యాగింగ్ ద్వారా నిరంతర పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు. గోశాలలో ఉన్న కోడెల ఆరోగ్య పరిస్థితి, సంరక్షణ విధానం పై వెటర్నరీ వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కోడెల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. 150 కోట్లతో విశాలమైన గోశాల నిర్మించబోతున్నామని తెలిపారు. రైతులు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పంపిణీ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.2