కౌడిపల్లి ఎస్టి గురుకుల పాఠశాలలో కులం పేరు దూషిస్తున్న ఇన్చార్జి ప్రిన్సిపాల్ సోషల్ టీచర్ సస్పెండ్ చేయాలని జాతీయ రహదారిపై రాస్తారోకో ధర్నా చేసిన విద్యార్థులు గిరిజన గురుకుల పాఠశాలలో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు దిగారు. పాఠశాల ఇంచార్జ్ ప్రిన్సిపల్ ఫణి కుమార్ మరియు సోషల్ ఉపాధ్యాయుడు ఉదయ్ కుమార్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు హైదరాబాద్–మెదక్ జాతీయ రహదారిపైగిరిజనవిధ్యార్థులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. గత వారం రోజులుగా సోషల్ ఉపాధ్యాయుడు ఉదయ్ కుమార్‌పై విద్యార్థులను దూషిస్తున్నాడనిఆరోపణలు వెలువడుతున్నప్పటికీ, సంబంధిత అధికారుల నుండి ఎలాంటి చర్యలు తీసుకోలేదని విద్యార్థులు ఆరోపించారు. జిల్లా గురుకుల అధికారి ఆర్‌సీవో గంగారం నాయక్ ఇప్పటివరకు స్పందించలేదని వారు విమర్శించారు. ఇదే సమయంలో, ఇంచార్జ్ ప్రిన్సిపల్ ఫణి కుమార్ విద్యార్థులతో అనుచితంగా ప్రవర్తిస్తూ, కులం పేరుతో దూషణలు చేస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. “మీరు ఉదయ్ దగ్గర డబ్బులు తీసుకుని నా మీద ఇలా ఆరోపణలు చేస్తున్నారా?” అంటూ అవమానకరంగా మాట్లాడినట్లు తెలిపారు. ఈ ఘటనపై వెంటనే విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది.
కౌడిపల్లి ఎస్టి గురుకుల పాఠశాలలో కులం పేరు దూషిస్తున్న ఇన్చార్జి ప్రిన్సిపాల్ సోషల్ టీచర్ సస్పెండ్ చేయాలని జాతీయ రహదారిపై రాస్తారోకో ధర్నా చేసిన విద్యార్థులు గిరిజన గురుకుల పాఠశాలలో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు దిగారు. పాఠశాల ఇంచార్జ్ ప్రిన్సిపల్ ఫణి కుమార్ మరియు సోషల్ ఉపాధ్యాయుడు ఉదయ్ కుమార్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు హైదరాబాద్–మెదక్ జాతీయ రహదారిపైగిరిజనవిధ్యార్థులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. గత వారం రోజులుగా సోషల్ ఉపాధ్యాయుడు ఉదయ్ కుమార్‌పై విద్యార్థులను దూషిస్తున్నాడనిఆరోపణలు వెలువడుతున్నప్పటికీ, సంబంధిత అధికారుల నుండి ఎలాంటి చర్యలు తీసుకోలేదని విద్యార్థులు ఆరోపించారు. జిల్లా గురుకుల అధికారి ఆర్‌సీవో గంగారం నాయక్ ఇప్పటివరకు స్పందించలేదని వారు విమర్శించారు. ఇదే సమయంలో, ఇంచార్జ్ ప్రిన్సిపల్ ఫణి కుమార్ విద్యార్థులతో అనుచితంగా ప్రవర్తిస్తూ, కులం పేరుతో దూషణలు చేస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. “మీరు ఉదయ్ దగ్గర డబ్బులు తీసుకుని నా మీద ఇలా ఆరోపణలు చేస్తున్నారా?” అంటూ అవమానకరంగా మాట్లాడినట్లు తెలిపారు. ఈ ఘటనపై వెంటనే విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది.
- పత్రిక ప్రకటన తేది: 07.04.2026 కామారెడ్డి జిల్లా, మంగళవారం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ (GGH), కమారెడ్డి లో హాస్పిటల్ డెవలప్‌మెంట్ సొసైటీ (HDS) సమావేశం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధ్యక్షతన, ఎమ్మెల్యే వెంకట రమణ రెడ్డి సమక్షంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం నిర్వహించబడింది. సమావేశం ప్రారంభంలో సభ్య కార్యదర్శి/సూపరింటెండెంట్ హాజరైన సభ్యులను ఆహ్వానించారు. సమావేశంలో చర్చించిన ముఖ్యాంశాలు: గత సమావేశపు నిమిషాలను పరిశీలించి, తీసుకున్న చర్యలపై సమీక్ష నిర్వహించారు. చేపట్టిన పనుల్లో సుమారు 99% పూర్తయ్యాయని వెల్లడించారు. హెచ్‌డీఎస్ నిధుల ఆర్థిక స్థితిపై వివరాలు అందించారు. సుమారు ₹18 లక్షలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. అందులో ₹10 లక్షలు క్యాన్సర్ కేర్ మరియు పాలియేటివ్ సేవలకు కేటాయించగా, ₹2 లక్షలు హాస్పిటల్ క్యాంటీన్ కాషన్ డిపాజిట్‌గా వినియోగించినట్లు తెలిపారు. మిగిలిన నిధులను పెండింగ్ పనుల కోసం పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ ద్వారా వినియోగించనున్నట్లు వివరించారు. ఎమ్మెల్యే కేసీఆర్ కిట్ అమలు తర్వాత ప్రసూతి కేసుల పెరుగుదలపై వివరాలు కోరడంతో పాటు ట్రామా కేసుల గణాంకాలను సమర్పించాలని సూచించారు. హాస్పిటల్‌లో సీటీ స్కాన్ సౌకర్యం లేకపోవడం వల్ల ట్రామా రోగులను ఇతర ఆసుపత్రులకు తరలించాల్సి వస్తోందని చర్చించారు. ప్రస్తుత టి-హబ్ భవనంలో సీటీ స్కాన్ యంత్రాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. రెడ్ క్రాస్ సొసైటీ సభ్యుడు రాజన్న సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ (SDP) అందుబాటులో లేకపోవడంపై ప్రస్తావించారు. యంత్రం ఉన్నప్పటికీ ప్రతి యూనిట్‌కు సుమారు ₹8000 వ్యయం అవుతున్నందున ఆర్థిక పరిమితులు ఉన్నట్లు తెలిపారు. దీనిపై ఎమ్మెల్యే ఇండెంట్ పంపించాలని, అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్య తీర్మానంగా జీజీహెచ్ ఆసుపత్రిని కొత్త భవనానికి మార్చే అంశంపై చర్చించారు. మెడికల్ కాలేజ్ భవనం జూన్ నాటికి పూర్తయ్యే అవకాశముందని తెలిపారు. కాలేజ్ అక్కడికి మారిన అనంతరం ప్రస్తుత ఎంసిహెచ్ భవనాన్ని ఆసుపత్రి వినియోగంలోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఈ మార్పు ప్రక్రియ పర్యవేక్షణ కోసం TSMIDC, R&B ఇంజినీర్లు, సూపరింటెండెంట్, ప్రిన్సిపాల్, అదనపు కలెక్టర్, DMHO, RDO RMOలతో కమిటీ ఏర్పాటు చేశారు. రెడ్ క్రాస్ సొసైటీ తరఫున రాజన్న హాస్పిటల్‌కు ఒక వెంటిలేటర్ అందజేస్తామని తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ, ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగిస్తూ, పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా అత్యవసర సేవల విభాగాన్ని బలోపేతం చేయడం, అవసరమైన వైద్య పరికరాలను సమకూర్చడం పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఈ సమావేశం లో aclb మధుమెహన్, మున్సిపల్ చైర్మన్ ఉమారాణి, సుపేరేండెంట్ వెంకటేశ్వర్, ప్రిన్సిపాల్ వాల్యా, rdo NV గిరి, ee ఆర్ అండ్ బి, ee pr, సంబంధిత అధికారులు, తదితరులు, పాల్గొన్నారు.1
- 📅 తేదీ: 07-04-2026 (మంగళవారం) ⏰ సమయం: ఉదయం 9:30 గంటలకు సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ప్రతి మంగళవారం నిర్వహించే పులిహోర పంపిణీ కార్యక్రమం ఈ మంగళవారం దాతలు: 🙏 మానమ్మ భూపాతిరావు లక్ష్మి దంపతులు 👨👩👧👦 మరియు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం స్థానిక అంగడిపేట్ హనుమాన్ దేవాలయం వద్ద నిర్వహించబడును. 👉 కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో కొమరవెల్లి దేవస్థానం డైరెక్టర్ నంగునూరు సత్యనారాయణ, కైలాస ప్రశాంత్, గందె సంతోష్, మురికి విజయ్, రాములు, ఆర్యవైశ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు4
- వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి గోశాల కోడెలను అర్హులైన రైతులకు పారదర్శకంగా పంపిణీ చేస్తున్నామని, కోడెలను సంరక్షించి.. సాగు పనులకు వినియోగించుకోవాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పిలుపు నిచ్చారు. వేములవాడ పట్టణం తిప్పాపూర్ లోని శ్రీ రాజరాజేశ్వర స్వామి గోశాలలో రైతులకు మంగళవారం కోడెల ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించగా, ముఖ్య అతిథిగా హాజరై రైతులకు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరిమ అగ్రవాల్ అందజేశారు. ప్రభుత్వ విప్, కలెక్టర్ కు శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఇంచార్జి ఈఓ అంజనారెడ్డి పుష్పగుచ్చం అందజేసి, స్వాగతం పలికారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారి పత్రాలను అధికారులు తనిఖీ చేస్తుండగా, ప్రభుత్వ విప్, కలెక్టర్ పరిశీలించి రైతులతో మాట్లాడారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి కోడెను కట్టే సంస్కృతి వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి సన్నిధిలో ఉందని గుర్తు చేశారు. భక్తుల విశ్వాసానికి ప్రతీక కోడె మొక్కు చెల్లింపు అని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రైతులకు తిప్పాపూర్ గోశాలలో ఉచితంగా స్వామివారి కోడెలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. పంపిణీ చేసిన కోడెలను తనిఖీ చేయిస్తామని స్పష్టం చేశారు. కోడెలను పక్కదారి పట్టించి ఇతర అవసరాలకు ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.రాష్ట్ర ప్రభుత్వం వేములవాడ పరిధిలో అధునాతన సౌకర్యాలతో సువిశాల స్థలంలో గోశాల నిర్మాణానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. రూ.150 కోట్లతో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. కోడెలను రైతులు సంరక్షించాలని సూచించారు. అర్హులైన రైతులకు మాత్రమే పంపిణీ కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. ఆన్లైన్ లో అన్ని పత్రాలతో దరఖాస్తు చేసుకున్న రైతులకు కోడెలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. రైతులు ఆన్లైన్ లో దరఖాస్తులను వ్యవసాయ, పశు సంవర్ధక శాఖ, రెవెన్యూ, దేవాదాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో తనిఖీ చేసిన తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా, పరిసర జిల్లాలకు చెందిన 1.5 నుంచి 5 ఎకరాల వరకు సాగు భూమి ఉన్న సన్నకారు, చిన్నకారు అర్హులైన రైతులకు మాత్రమే పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. అర్హులైన రైతులకు కోడెల పంపిణీ నిరంతరం చేస్తామని తెలిపారు.కోడెలు, వెబ్సైట్ లో రైతుల వివరాలు నమోదు చేయడంతో జీవాలు పక్కదారి పట్టే అవకాశం ఉండదని, భవిష్యత్తులో వాటి సంరక్షణను పరిశీలించవచ్చని కలెక్టర్ స్పష్టం చేశారు.కోడెలను తీసుకువెళ్లే రైతులు వాటి సంరక్షణ బాధ్యతను సక్రమంగా పక్కాగా చూసుకోవాలని సూచించారు. వాటిని ఎల్లప్పుడూ అధికారులతో తనిఖీ చేయిస్తామని స్పష్టం చేశారు. గోశాలలో కోడెల సంరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటు న్నామని, గడ్డి, నీరు, అందిస్తున్నామని, దాదాపు 8 కూలర్లు ఏర్పాటు చేయించామని పేర్కొన్నారు. అలాగే జిల్లా పశు వైద్యాధికారి, వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్నారని కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు.కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్ చైర్మన్ రాకేష్, ఆర్డీఓ రాధాభాయ్, ఆలయ ఇంచార్జి ఈఓ అంజనారెడ్డి, డీఎస్పీ శ్రీనివాసులు, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి రవీందర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, తహసీల్దార్ జయంత్ కుమార్, వ్యవసాయ, రెవెన్యూ, ఆలయ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.2
- Post by Tagore1
- గన్నేరువరం మండలం చాకలివానిపల్లి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) నిధులతో రూ.5 లక్షల వ్యయంతో కూనవాణిపల్లి పరిధిలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఈరోజు ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ రేపాక బానవ్వ గారు వాటర్ ట్యాంక్ నుండి పెద్దమ్మ గుడి వరకు ఈ రోడ్డు పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... గ్రామ ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా కోసం ఈ రోడ్డు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు బోయిని బాలయ్య, బామండ్ల మల్లేష్, కూన శ్రవంతి, MRPS మండల అధ్యక్షులు రేపాక బాబు, కూన చంద్రశేఖర్, కూన రవి, కూన రాజు, కూన సతీష్, కూన శ్రీనివాస్, జెరిపోతుల అనిల్ తదితరులు పాల్గొన్నారు.1
- గన్నేరువరం మండల కేంద్రంలో బి ఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గంప వెంకన్న ఆధ్వర్యంలో మాజీ సుడ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణారావు జన్మదిన వేడుకలు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పుల్లెల లక్ష్మణ్, నేత సుధాకర్, మీసాల ప్రభాకర్, కొట్టే భూమయ్య, బొడ్డు శ్రీనివాస్ అధిక సంఖ్యలో బి ఆర్ ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు1
- పత్రిక ప్రకటన తేది: 07.04.2026 కామారెడ్డి జిల్లా మంగళవారం డ్రింకింగ్ వాటర్ మానిటరింగ్ సెల్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ టోల్ ఫ్రీ నంబర్ 9908712421 మంగళవారం జిల్లా కలెక్టరేట్‌లోని రూమ్ నెం. 25లో ఏర్పాటు చేసిన డ్రింకింగ్ వాటర్ మానిటరింగ్ సెల్ ను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో త్రాగునీటి సమస్యలు తలెత్తిన పక్షంలో ప్రజలు వెంటనే స్పందించేందుకు ఈ మానిటరింగ్ సెల్‌ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సెల్‌కు సంబంధించిన టోల్ ఫ్రీ నంబర్ 9908712421 ను ప్రజలకు అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఎక్కడైనా త్రాగునీటి సమస్యలు ఉన్న యెడల ప్రజలు ఈ నంబర్‌కు సంప్రదించి తమ సమస్యలను తెలియజేయవచ్చని తెలిపారు. ఈ మానిటరింగ్ సెల్ తేది :07.04.2026 నుండి తేది : 30.06.2026 వరకు పని చేస్తుందని, ప్రతి రోజు ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రజలు ఈ సదుపాయాన్ని వినియోగించుకొని త్రాగునీటి సమస్యలను త్వరితగతిన పరిష్కరించుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఇందులో ఇండస్ట్రీ ఆఫీసర్ లాలు, sc కార్పొరేషన్ వెంకటశ్వర్లు, dlpo శ్రీనివాస్, మెప్మా శ్రీధర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.1
- “ప్రతాప్ రెడ్డి… నీవొక రాజకీయ అజ్ఞానివి” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన ఆయన… అధికార ఆశతో ఎన్ని పార్టీలు మారతావని ప్రశ్నించారు.హరీష్ రావు బండారం బయటపెడతానన్న మాటలేమయ్యాయని నిలదీస్తూ…కేసీఆర్‌కు ఎంతకు అమ్ముడుపోయావని సూటిగా ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో చెప్పిన మాటలనుమరిచిపోయి… ఇప్పుడు అదే నేతలతో కలిసి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఇక బీఆర్ఎస్ ఇచ్చిన బంద్ పిలుపు పూర్తిగా విఫలమైందని…ఉదయం 10 గంటలకే ప్రైవేట్, ప్రభుత్వ, వాణిజ్య సంస్థలు తెరుచుకున్నాయని తెలిపారు.కాంగ్రెస్ నేతలు శాంతియుతంగా సీఎం ఫోటోను క్యాంపు కార్యాలయంలో ఉంచగా… దానిని తొలగించే హక్కు నీకు ఎవరు ఇచ్చారని ప్రతాప్ రెడ్డిని ప్రశ్నించారు.ప్రజల సమస్యలు వినడానికి కేసీఆర్ బయటకు రావాలని డిమాండ్ చేస్తూ…ప్రతాప్ రెడ్డి వంటి నేతల విమర్శలకు కాంగ్రెస్ నేతలు భయపడరని నాయిని యాదగిరి స్పష్టం చేశారు.గజ్వేల్‌లో ఈ రాజకీయ ఆరోపణలు…ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.4
- రాజన్న సిరిసిల్ల జిల్లా లోని యువతను క్రీడల్లో ప్రోత్సహించేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ లోగో పోస్టర్ ను సిరిసిల్ల తెలంగాణ భవన్ లో ఆవిష్కరించిన మాజీ ఎంపీ వినోద్ కుమార్ . ఈ సందర్భంగా మీడియాతో వినోద్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో రెండు మున్సిపాలిటీల నుండి 157 జట్లు 175 మ్యాచులు 2512 మంది క్రీడాకారులతో కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ ను ఈ నెల 15 నుండి 25 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.జిల్లాలో ఉన్న క్రికెట్ క్రీడాకారులు సద్వినియోగం చేసుకుని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.క్రీడాకారులను ప్రోత్సహించాలన్న సంకల్పం తో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామాలలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసుకుని ముందుకు పోతున్న తరుణం లో ఎన్నికల్లో తమ ప్రభుత్వం రాలేదని అన్నారు.గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించాలని ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు నిరుపయోగంగా మారాయని అన్నారు.యువత చెడు వ్యసనాలకు గురికాకుండా క్రీడల వైపు ప్రస్తహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ ఆడిన ఘటనను గుర్తు చేస్తూ కేసీఆర్ ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు సద్వినియోగం చేసుకునేలా చూడాలని అన్నారు.1