Shuru
Apke Nagar Ki App…
ఫ్రీ బస్సులో కండక్టర్ చెంప పగలగొట్టిన మహిళ బస్ కండక్టర్ ఏమే అంటూ దురుసుగా ప్రవర్తించి తిట్టాడని ఆరోపిస్తున్న మహిళ విజయవాడ నుండి వీసన్నపేటకు వెళ్తున్న బస్సులో ఎక్కి, మూడు ఆధార కార్డులు చూపించి రెండు టిక్కెట్లు ఇవ్వమని అడిగిన మహిళలు దీంతో కండక్టర్, మహిళలకు మధ్య వివాదం జరిగి, కండక్టర్‌ను చెంప మీద కొట్టిన మహిళ బస్సును పోలీస్ స్టేషన్‌కు తరలించి, కేసు నమోదు చేసిన కండక్టర్
Tagore
ఫ్రీ బస్సులో కండక్టర్ చెంప పగలగొట్టిన మహిళ బస్ కండక్టర్ ఏమే అంటూ దురుసుగా ప్రవర్తించి తిట్టాడని ఆరోపిస్తున్న మహిళ విజయవాడ నుండి వీసన్నపేటకు వెళ్తున్న బస్సులో ఎక్కి, మూడు ఆధార కార్డులు చూపించి రెండు టిక్కెట్లు ఇవ్వమని అడిగిన మహిళలు దీంతో కండక్టర్, మహిళలకు మధ్య వివాదం జరిగి, కండక్టర్‌ను చెంప మీద కొట్టిన మహిళ బస్సును పోలీస్ స్టేషన్‌కు తరలించి, కేసు నమోదు చేసిన కండక్టర్
More news from తెలంగాణ and nearby areas
- Post by Tagore1
- సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో నిర్వహించిన మైనార్టీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మైనార్టీ నాయకుడు సయ్యద్ మతిన్ మాట్లాడారు.బిఆర్ఎస్ పార్టీ అనవసర ఆరోపణలు చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తోందని ఆయన విమర్శించారు. టిఆర్ఎస్ హయాంలో మైనార్టీలకు ఎలాంటి ప్రయోజనం కలగలేదని, మైనార్టీ చెక్కులు, కుట్టు మిషన్లు వచ్చినప్పటికీ వాటిని కొంతమంది మాత్రమే పొందారని ఆరోపించారు. ముస్లింలకు 12% రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ ఆ వాగ్దానాన్ని అమలు చేయలేదని, ఈ విషయంలో ప్రతాప్ రెడ్డి స్పందించలేదని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతాప్ రెడ్డి, 2018లో టిఆర్ఎస్‌కు మద్దతు ఇచ్చి పదవులు పొందారని అన్నారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టినందుకు విమర్శలు చేయడం, పోలీస్ కేసులు నమోదు చేయడం తగదని, కేసుల్లో సంబంధం లేని వారిని కూడా ఇరికిస్తున్నారని ఆరోపించారు. అలాగే తమ నాయకుడు నరసన్నపై అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలను మానుకోవాలని, ప్రజల్లో శాంతి భద్రతలను కాపాడాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు సయ్యద్ మతిన్ మాజీ కౌన్సిలర్ సమీర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ డాక్టర్ వహీద్, మహమ్మద్ జలాల్, మహమ్మద్ జహీర్, సమీర్ ఇర్షాద్, అత ఉల్లా బేగ్, షకీల్ పటేల్, మొహమ్మద్ జుబేర్, భారీ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.4
- Mallepally Mein Saj Gayi Adab Ki Mehfil | Nawab Shah Alam Khan Memorial Mushaira 2026 #HyderabadMushaira #LataHaya #HimanshiBabra #AllIndiaMushaira #Mushaira2026 #UrduShayari #ShayariLovers #AdabiMehfil #PoetryEvent #LiveMushaira #EmotionalShayari #IndianPoets #HyderabadEvents #ViralShayari #YouTubeIndia #ShortsViral #ReelsIndia #Hindustan1
- ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యాలయాల్లో ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సిరిసిల్ల కలెక్టర్ గరిమా అగ్రవాల్ సూచించారు. వేములవాడలోని మహాత్మాజ్యోతి బాపూలే బాలికల రెసిడెన్షియల్ విద్యాలయంలో కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యాలయం ఆవరణ, తరగతి గదులు, కిచెన్ లో ఆహార పదార్థాలను పరిశీలించారు. మెనూ చార్ట్ పరిశీలించి.. ఏ ఏ వంటకాలు సిద్ధం చేస్తున్నారో తనిఖీ చేశారు. ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, తమ కుటుంబంలో పిల్లలకు ఆహార పదార్థాలు ఎలా సిద్ధం చేస్తారో అలాగే ఇక్కడ విద్యార్థుల కోసం వండాలని ఆదేశించారు. అనంతరం 9వ తరగతి విద్యార్థులతో కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడారు. అన్ని పరీక్షలకు సంబంధించిన టైమ్ టేబుల్ సిద్ధం చేసుకోవాలని, ఏ రోజు ఏ సబ్జెక్ట్ చదవాలో ముందే రాసుకోవాలని, దానికి అనుగుణంగా అన్ని సబ్జెక్టులు చదవడం, రాయడం పూర్తి చేయాలని తెలిపారు. రైటింగ్ కూడా సాధన చేయాలని, వార్షిక పరీక్షల సమయానికి అనుగుణంగా ఇప్పుడు అదే సమయంలో అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాసేలా సాధన చేయాలని పేర్కొన్నారు. ఇప్పటి మార్కులు మీరు తర్వాత చదివే ఉన్నత తరగతులకు ఎంతో కీలకమని స్పష్టం చేశారు. విద్యార్థులం దరూ రానున్న పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థులు ఏ నేపథ్యం నుంచి వచ్చినా.. ఇప్పుడు ఇష్టపడి సాధన చేయడం.. అన్ని సబ్జెక్టుల్లో రాణించడంతో వారి భవిష్యత్తు ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతి విద్యార్థి వివిధ ఉద్యోగాలు, వృత్తుల్లో స్థిరపడాలని, ఉన్నత స్థానాల్లో నిలవాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకాంక్షించారు.1
- వరంగల్ జిల్లా: పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఎంజీఎం ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. వైద్యులు సమయపాలన పాటించాలని, సూపర్డెంట్, ఆర్‌ఎంఓలు క్షేత్రస్థాయి పర్యవేక్షణ బలోపేతం చేయాలని తెలిపారు. ఆస్పత్రిలో ఔషధాల కొరత లేకుండా టెండర్ ప్రక్రియ చేపట్టాలని, పారిశుద్ధ్యాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని వైద్యులు, సిబ్బందిని హెచ్చరించారు.1
- గన్నేరువరం మండలం చాకలివానిపల్లి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) నిధులతో రూ.5 లక్షల వ్యయంతో కూనవాణిపల్లి పరిధిలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఈరోజు ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ రేపాక బానవ్వ గారు వాటర్ ట్యాంక్ నుండి పెద్దమ్మ గుడి వరకు ఈ రోడ్డు పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... గ్రామ ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా కోసం ఈ రోడ్డు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు బోయిని బాలయ్య, బామండ్ల మల్లేష్, కూన శ్రవంతి, MRPS మండల అధ్యక్షులు రేపాక బాబు, కూన చంద్రశేఖర్, కూన రవి, కూన రాజు, కూన సతీష్, కూన శ్రీనివాస్, జెరిపోతుల అనిల్ తదితరులు పాల్గొన్నారు.1
- గిరిజన గురుకుల పాఠశాలలో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు దిగారు. పాఠశాల ఇంచార్జ్ ప్రిన్సిపల్ ఫణి కుమార్ మరియు సోషల్ ఉపాధ్యాయుడు ఉదయ్ కుమార్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు హైదరాబాద్–మెదక్ జాతీయ రహదారిపైగిరిజనవిధ్యార్థులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. గత వారం రోజులుగా సోషల్ ఉపాధ్యాయుడు ఉదయ్ కుమార్‌పై విద్యార్థులను దూషిస్తున్నాడనిఆరోపణలు వెలువడుతున్నప్పటికీ, సంబంధిత అధికారుల నుండి ఎలాంటి చర్యలు తీసుకోలేదని విద్యార్థులు ఆరోపించారు. జిల్లా గురుకుల అధికారి ఆర్‌సీవో గంగారం నాయక్ ఇప్పటివరకు స్పందించలేదని వారు విమర్శించారు. ఇదే సమయంలో, ఇంచార్జ్ ప్రిన్సిపల్ ఫణి కుమార్ విద్యార్థులతో అనుచితంగా ప్రవర్తిస్తూ, కులం పేరుతో దూషణలు చేస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. “మీరు ఉదయ్ దగ్గర డబ్బులు తీసుకుని నా మీద ఇలా ఆరోపణలు చేస్తున్నారా?” అంటూ అవమానకరంగా మాట్లాడినట్లు తెలిపారు. ఈ ఘటనపై వెంటనే విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది.1
- 📅 తేదీ: 07-04-2026 (మంగళవారం) ⏰ సమయం: ఉదయం 9:30 గంటలకు సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ప్రతి మంగళవారం నిర్వహించే పులిహోర పంపిణీ కార్యక్రమం ఈ మంగళవారం దాతలు: 🙏 మానమ్మ భూపాతిరావు లక్ష్మి దంపతులు 👨👩👧👦 మరియు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం స్థానిక అంగడిపేట్ హనుమాన్ దేవాలయం వద్ద నిర్వహించబడును. 👉 కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో కొమరవెల్లి దేవస్థానం డైరెక్టర్ నంగునూరు సత్యనారాయణ, కైలాస ప్రశాంత్, గందె సంతోష్, మురికి విజయ్, రాములు, ఆర్యవైశ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు4