logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కరీంనగర్ లో ఓట్ల గల్లంతుకు అధికారులే కారణమని జనసేన ఆరోపణ...భాద్యత లేని బి.ఎల్.ఓ లపై అధికారులు ఆధారపడుతున్నారని విమర్శ కరీంనగర్ లో డివిజన్ల మ్యాపింగ్ పేరుతో అన్ని డివిజన్లలో చేపడుతున్న సర్వే లోపభూయిష్టంగా ఉందని, దానికి ప్రధాన కారణం సంబంధిత అధికారుల నిర్లక్ష్యంతోనే ఓట్ల గల్లంతు జరిగిందని జనసేన పార్టీ పార్లమెంట్ కో-ఆర్డినేటర్ బేతి మహేందర్ రెడ్డి ఆరోపించారు. కరీంనగర్ లోని బూత్ లెవెల్ ఆఫీసర్స్ చేపట్టిన మ్యాపింగ్ సర్వేను పరిశీలించి లోపాలను ఎత్తి చూపారు. పలు డివిజన్లలో బూత్ లెవెల్ ఆఫీసర్ (బి.ఎల్.ఓ) లు పని చేస్తున్నట్టు కనిపించడం, కానీ బి.ఎల్.ఓ లు డివిజన్ లో గడప గడపకు తిరగకుండా స్థానిక కార్పొరేటర్ కనుసన్నుల్లో ఒకే స్థానంలో కూర్చుని ఓట్ల మ్యాపింగ్ చేస్తున్నట్టు తప్పుడు నివేదికలు తయారు చేయడంతోనే డివిజన్లలోని ఓట్లు గల్లంతు అవుతున్నాయని తెలిపారు. ఓట్ల గల్లంతు విషయంలో మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల ముందు వందల సంఖ్యలో పిర్యాదులు వచ్చిన వాటిని పరిష్కరించకపోవడంతోనే నేడు భారీగా పోలింగ్ శాతం తగ్గిందని, దీనికి ప్రధాన కారణం బి.ఎల్.ఓ లు వారి పై ఆధారపడుతున్న జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ లే భాద్యులని బేతి మహేందర్ రెడ్డి ఆరోపించారు. ఓటరు జాబితాలో మరణించినవారి ఓట్లు యధాతథంగా ఉండడం, బ్రతికున్నవారి ఓట్లు తొలగించడం ఎంత పెద్ద నేరమో జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ గమనించాలని పేర్కొంటూ, అలాగే డివిజన్ లో ఒక ఇంటిలో ఉన్న నాలుగు ఓట్లు నలుదిక్కుల నాలుగు ఇతర డివిజన్లలో బదిలీ కావడం, ఇతర గ్రామాలలోని ఓట్లు డివిజన్లలో దొంగ ఓట్లు నమోదు చేయించడం, డబుల్ ఓట్లు రావడం, అలాగే ఓటరు జాబితాలో పేరు ఒకటి, ఫోటో మరొకటి ఉండటం లాంటి ఎన్నో తప్పులు దొర్లాయని తెలిపారు. తప్పులకు ప్రధాన కారకులుగా జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, సంబంధిత శాఖల సిబ్బంది సమన్వయ లోపంతో జరిగిందని బేతి మహేందర్ రెడ్డి ఆరోపించారు. అందుకే రాష్ట్రంలో ఆధార్ కార్డు ఓటరు కార్డుతో లింక్ పెట్టే స్పెషల్ఇంటెన్సివ్ రివిజన్ “సర్” నిబంధన కఠినతరం చేయాలని, అప్పుడే దొంగ ఓట్లకు, డబుల్ ఓట్లకు చెక్ పడే అవకాశం ఉంటుందని, లేనిపక్షంలో తెలంగాణలో సర్ నిబంధనను అమలు చేసే విధంగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు.

2 hrs ago
user_K.V.REDDY
K.V.REDDY
చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
2 hrs ago

కరీంనగర్ లో ఓట్ల గల్లంతుకు అధికారులే కారణమని జనసేన ఆరోపణ...భాద్యత లేని బి.ఎల్.ఓ లపై అధికారులు ఆధారపడుతున్నారని విమర్శ కరీంనగర్ లో డివిజన్ల మ్యాపింగ్ పేరుతో అన్ని డివిజన్లలో చేపడుతున్న సర్వే లోపభూయిష్టంగా ఉందని, దానికి ప్రధాన కారణం సంబంధిత అధికారుల నిర్లక్ష్యంతోనే ఓట్ల గల్లంతు జరిగిందని జనసేన పార్టీ పార్లమెంట్ కో-ఆర్డినేటర్ బేతి మహేందర్ రెడ్డి ఆరోపించారు. కరీంనగర్ లోని బూత్ లెవెల్ ఆఫీసర్స్ చేపట్టిన మ్యాపింగ్ సర్వేను పరిశీలించి లోపాలను ఎత్తి చూపారు. పలు డివిజన్లలో బూత్ లెవెల్ ఆఫీసర్ (బి.ఎల్.ఓ) లు పని చేస్తున్నట్టు కనిపించడం, కానీ బి.ఎల్.ఓ లు డివిజన్ లో గడప గడపకు తిరగకుండా స్థానిక కార్పొరేటర్ కనుసన్నుల్లో ఒకే స్థానంలో కూర్చుని ఓట్ల మ్యాపింగ్ చేస్తున్నట్టు తప్పుడు నివేదికలు తయారు చేయడంతోనే డివిజన్లలోని ఓట్లు గల్లంతు అవుతున్నాయని తెలిపారు. ఓట్ల గల్లంతు విషయంలో మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల ముందు వందల సంఖ్యలో పిర్యాదులు వచ్చిన వాటిని పరిష్కరించకపోవడంతోనే నేడు భారీగా పోలింగ్ శాతం తగ్గిందని, దీనికి ప్రధాన కారణం బి.ఎల్.ఓ లు వారి పై ఆధారపడుతున్న

జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ లే భాద్యులని బేతి మహేందర్ రెడ్డి ఆరోపించారు. ఓటరు జాబితాలో మరణించినవారి ఓట్లు యధాతథంగా ఉండడం, బ్రతికున్నవారి ఓట్లు తొలగించడం ఎంత పెద్ద నేరమో జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ గమనించాలని పేర్కొంటూ, అలాగే డివిజన్ లో ఒక ఇంటిలో ఉన్న నాలుగు ఓట్లు నలుదిక్కుల నాలుగు ఇతర డివిజన్లలో బదిలీ కావడం, ఇతర గ్రామాలలోని ఓట్లు డివిజన్లలో దొంగ ఓట్లు నమోదు చేయించడం, డబుల్ ఓట్లు రావడం, అలాగే ఓటరు జాబితాలో పేరు ఒకటి, ఫోటో మరొకటి ఉండటం లాంటి ఎన్నో తప్పులు దొర్లాయని తెలిపారు. తప్పులకు ప్రధాన కారకులుగా జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, సంబంధిత శాఖల సిబ్బంది సమన్వయ లోపంతో జరిగిందని బేతి మహేందర్ రెడ్డి ఆరోపించారు. అందుకే రాష్ట్రంలో ఆధార్ కార్డు ఓటరు కార్డుతో లింక్ పెట్టే స్పెషల్ఇంటెన్సివ్ రివిజన్ “సర్” నిబంధన కఠినతరం చేయాలని, అప్పుడే దొంగ ఓట్లకు, డబుల్ ఓట్లకు చెక్ పడే అవకాశం ఉంటుందని, లేనిపక్షంలో తెలంగాణలో సర్ నిబంధనను అమలు చేసే విధంగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు.

More news from తెలంగాణ and nearby areas
  • ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యాలయాల్లో ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. వేములవాడ పట్టణంలోని మహాత్మాజ్యోతి బాపూలే బాలికల రెసిడెన్షియల్ విద్యాలయంలో కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా విద్యాలయం ఆవరణ, తరగతి గదులు, కిచెన్ లో ఆహార పదార్థాలను పరిశీలించారు. మెనూ చార్ట్ పరిశీలించి.. ఏ ఏ వంటకాలు సిద్ధం చేస్తున్నారో తనిఖీ చేశారు. ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, తమ కుటుంబంలో పిల్లలకు ఆహార పదార్థాలు ఎలా సిద్ధం చేస్తారో అలాగే ఇక్కడ విద్యార్థుల కోసం వండాలని ఆదేశించారు.అనంతరం 9వ తరగతి విద్యార్థులతో కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడారు. అన్ని పరీక్షలకు సంబంధించిన టైమ్ టేబుల్ సిద్ధం చేసుకోవాలని, ఏ రోజు ఏ సబ్జెక్ట్ చదవాలో ముందే రాసుకోవాలని, దానికి అనుగుణంగా అన్ని సబ్జెక్టులు చదవడం, రాయడం పూర్తి చేయాలని తెలిపారు. రైటింగ్ కూడా సాధన చేయాలని, వార్షిక పరీక్షల సమయానికి అనుగుణంగా ఇప్పుడు అదే సమయంలో అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాసేలా సాధన చేయాలని పేర్కొన్నారు. ఇప్పటి మార్కులు మీరు తర్వాత చదివే ఉన్నత తరగతులకు ఎంతో కీలకమని స్పష్టం చేశారు. విద్యార్థులం దరూ రానున్న పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థులు ఏ నేపథ్యం నుంచి వచ్చినా.. ఇప్పుడు ఇష్టపడి సాధన చేయడం.. అన్ని సబ్జెక్టుల్లో రాణించడంతో వారి భవిష్యత్తు ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతి విద్యార్థి వివిధ ఉద్యోగాలు, వృత్తుల్లో స్థిరపడాలని, ఉన్నత స్థానాల్లో నిలవాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకాంక్షించారు.
    1
    ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యాలయాల్లో ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని 
కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు.
వేములవాడ పట్టణంలోని మహాత్మాజ్యోతి బాపూలే బాలికల రెసిడెన్షియల్ విద్యాలయంలో కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా విద్యాలయం ఆవరణ, తరగతి గదులు, కిచెన్ లో ఆహార పదార్థాలను పరిశీలించారు. మెనూ చార్ట్ పరిశీలించి.. ఏ ఏ వంటకాలు సిద్ధం చేస్తున్నారో తనిఖీ చేశారు. ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, తమ కుటుంబంలో పిల్లలకు ఆహార పదార్థాలు ఎలా సిద్ధం చేస్తారో అలాగే ఇక్కడ విద్యార్థుల కోసం వండాలని ఆదేశించారు.అనంతరం 9వ తరగతి విద్యార్థులతో కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడారు. అన్ని పరీక్షలకు సంబంధించిన టైమ్ టేబుల్ సిద్ధం చేసుకోవాలని, ఏ రోజు ఏ సబ్జెక్ట్ చదవాలో ముందే రాసుకోవాలని, దానికి అనుగుణంగా అన్ని సబ్జెక్టులు చదవడం, రాయడం పూర్తి చేయాలని తెలిపారు. రైటింగ్ కూడా సాధన చేయాలని, వార్షిక పరీక్షల సమయానికి అనుగుణంగా ఇప్పుడు అదే సమయంలో అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాసేలా సాధన చేయాలని పేర్కొన్నారు. ఇప్పటి మార్కులు మీరు తర్వాత చదివే ఉన్నత తరగతులకు ఎంతో కీలకమని స్పష్టం చేశారు. విద్యార్థులం దరూ రానున్న పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థులు ఏ నేపథ్యం నుంచి వచ్చినా.. ఇప్పుడు ఇష్టపడి సాధన చేయడం.. అన్ని సబ్జెక్టుల్లో రాణించడంతో వారి భవిష్యత్తు ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతి విద్యార్థి వివిధ ఉద్యోగాలు, వృత్తుల్లో స్థిరపడాలని, ఉన్నత స్థానాల్లో నిలవాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకాంక్షించారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    4 hrs ago
  • జగిత్యాల : వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ను ,రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డిని జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ మరియు   కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ జువ్వాడి నరసింగరావు లు మంగళవారం ఉదయం11-30 గంటలప్రాంతంలో హైదరాబాద్ లో కలిశారు. వారితోపాటుగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గాజంగి నందయ్య,మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం,జగిత్యాల AMC ఛైర్మెన్ గడ్డం నారాయణరెడ్డి,సేవాదళ్ నాయకులు ముకేష్ ఖన్నా లు కలిసి రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డిని శాలువాకప్పి సన్మానించారు.
    1
    జగిత్యాల :
వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ను ,రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డిని జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ మరియు  
కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ జువ్వాడి నరసింగరావు లు మంగళవారం ఉదయం11-30 గంటలప్రాంతంలో హైదరాబాద్ లో కలిశారు. వారితోపాటుగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గాజంగి నందయ్య,మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం,జగిత్యాల AMC ఛైర్మెన్ గడ్డం నారాయణరెడ్డి,సేవాదళ్ నాయకులు ముకేష్ ఖన్నా లు కలిసి రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డిని శాలువాకప్పి సన్మానించారు.
    user_Sk chaitanya
    Sk chaitanya
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    4 hrs ago
  • మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం దుబ్బగూడెం గ్రామ సమీపంలో పాలేరు లింకు కెనాల్ సర్వే ఉద్రిక్తతకు దారి తీసింది. మున్నేరు జలసాధన కమిటీ సభ్యులను తెల్లవారుజామున పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. సర్వేను అడ్డుకోవాలని అఖిలపక్ష నాయకులు పిలుపునిచ్చారు. భారీ బందోబస్తు మధ్య అధికారులు సర్వే కొనసాగించగా, తమ భూములు ఎడారిగా మారుతాయని అఖిలపక్ష నాయకులు ఆరోపించారు. అనంతరం గార్ల పట్టణంలో రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
    1
    మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం దుబ్బగూడెం గ్రామ సమీపంలో పాలేరు లింకు కెనాల్ సర్వే ఉద్రిక్తతకు దారి తీసింది. మున్నేరు జలసాధన కమిటీ సభ్యులను తెల్లవారుజామున పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. సర్వేను అడ్డుకోవాలని అఖిలపక్ష నాయకులు పిలుపునిచ్చారు.
భారీ బందోబస్తు మధ్య అధికారులు సర్వే కొనసాగించగా, తమ భూములు ఎడారిగా మారుతాయని అఖిలపక్ష నాయకులు ఆరోపించారు. అనంతరం గార్ల పట్టణంలో రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    6 hrs ago
  • 📅 తేదీ: 07-04-2026 (మంగళవారం) ⏰ సమయం: ఉదయం 9:30 గంటలకు సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ప్రతి మంగళవారం నిర్వహించే పులిహోర పంపిణీ కార్యక్రమం ఈ మంగళవారం దాతలు: 🙏 మానమ్మ భూపాతిరావు లక్ష్మి దంపతులు 👨‍👩‍👧‍👦 మరియు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం స్థానిక అంగడిపేట్ హనుమాన్ దేవాలయం వద్ద నిర్వహించబడును. 👉 కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో కొమరవెల్లి దేవస్థానం డైరెక్టర్ నంగునూరు సత్యనారాయణ, కైలాస ప్రశాంత్, గందె సంతోష్, మురికి విజయ్, రాములు, ఆర్యవైశ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు
    4
    📅 తేదీ: 07-04-2026 (మంగళవారం)
⏰ సమయం: ఉదయం 9:30 గంటలకు
సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ప్రతి మంగళవారం నిర్వహించే పులిహోర పంపిణీ కార్యక్రమం ఈ మంగళవారం
దాతలు:
🙏 మానమ్మ భూపాతిరావు లక్ష్మి దంపతులు
👨‍👩‍👧‍👦 మరియు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో
ఈ కార్యక్రమం స్థానిక అంగడిపేట్ హనుమాన్ దేవాలయం వద్ద నిర్వహించబడును.
👉 కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో కొమరవెల్లి దేవస్థానం డైరెక్టర్ నంగునూరు సత్యనారాయణ, కైలాస ప్రశాంత్, గందె సంతోష్, మురికి విజయ్, రాములు, ఆర్యవైశ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు
    user_GOUSE BEURO REPORTER
    GOUSE BEURO REPORTER
    రిపోర్టర్ వర్గల్, సిద్దిపేట, తెలంగాణ•
    5 hrs ago
  • Post by Tagore
    1
    Post by Tagore
    user_Tagore
    Tagore
    Newspaper publisher యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    12 hrs ago
  • గోపాలపురం ప్రాంతంలో భవిష్యత్తులో ముంపు, వరద సమస్యలు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు తెలిపారు. చెరువు గట్టు వద్ద బలమైన రిటైనింగ్ వాల్ నిర్మాణం ద్వారా కాలనీల్లోకి వరద నీరు చేరకుండా నివారిస్తామని చెప్పారు. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ముంపు ప్రభావిత ప్రాంతాల్లో మౌలిక వసతులను బలోపేతం చేసి ప్రజలకు భద్రత కల్పిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అలాగే చెరువు అక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకుంటూ, అక్కడ వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేసేలా కృషి చేస్తామని అన్నారు. రాబోయే రోజుల్లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన జరగనుందని, తాగునీటి సమస్య పరిష్కారం కోసం రూ. 512 కోట్ల నిధులు మంజూరు అయినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.
    1
    గోపాలపురం ప్రాంతంలో భవిష్యత్తులో ముంపు, వరద సమస్యలు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు తెలిపారు. చెరువు గట్టు వద్ద బలమైన రిటైనింగ్ వాల్ నిర్మాణం ద్వారా కాలనీల్లోకి వరద నీరు చేరకుండా నివారిస్తామని చెప్పారు.
ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ముంపు ప్రభావిత ప్రాంతాల్లో మౌలిక వసతులను బలోపేతం చేసి ప్రజలకు భద్రత కల్పిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అలాగే చెరువు అక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకుంటూ, అక్కడ వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేసేలా కృషి చేస్తామని అన్నారు.
రాబోయే రోజుల్లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన జరగనుందని, తాగునీటి సమస్య పరిష్కారం కోసం రూ. 512 కోట్ల నిధులు మంజూరు అయినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.
    user_Mediya wgl medical wgl
    Mediya wgl medical wgl
    Doctor నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    26 min ago
  • కోరిన కోర్కెలు తీర్చే కోడే మొక్కుల వేములవాడ రాజరాజేశ్వర స్వామి గోశాలకు చెందిన 300 కోడెలను రైతులకు ఉచితంగా పంపిణీ చేశారు. తిప్పాపురం గోశాలలో కలెక్టర్ గరిమా అగ్రవాల్ పర్యవేక్షణలో కోడెల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అర్హులైన 150 మంది రైతులకు రెండు కోడెల చొప్పున పంపిణీ చేశారు. భక్తి భావంతో భక్తులు రాజన్నకు సమర్పించే కోడెల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో పరిమితికి మించి ఉన్న కోడెలను రైతులకు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. రైతుల ముసుగులో ఇతరులు కోడెలు పొందే అవకాశం లేదని, ప్రస్తుతం రాజన్న కోడెలు పొందిన రైతులు అక్రమంగా విక్రయించినా వ్యవసాయేతర పనులకు వినియోగించినా చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించారు. రాజన్న కోడెలను జియో ట్యాగింగ్ ద్వారా నిరంతర పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు. గోశాలలో ఉన్న కోడెల ఆరోగ్య పరిస్థితి, సంరక్షణ విధానం పై వెటర్నరీ వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కోడెల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. 150 కోట్లతో విశాలమైన గోశాల నిర్మించబోతున్నామని తెలిపారు. రైతులు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పంపిణీ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.
    2
    కోరిన కోర్కెలు తీర్చే కోడే మొక్కుల వేములవాడ రాజరాజేశ్వర స్వామి గోశాలకు చెందిన 300 కోడెలను రైతులకు ఉచితంగా పంపిణీ చేశారు. తిప్పాపురం గోశాలలో కలెక్టర్ గరిమా అగ్రవాల్ పర్యవేక్షణలో కోడెల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అర్హులైన 150 మంది రైతులకు రెండు కోడెల చొప్పున పంపిణీ చేశారు. భక్తి భావంతో భక్తులు రాజన్నకు సమర్పించే కోడెల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో పరిమితికి మించి ఉన్న కోడెలను రైతులకు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. రైతుల ముసుగులో ఇతరులు కోడెలు పొందే అవకాశం లేదని, ప్రస్తుతం రాజన్న కోడెలు పొందిన రైతులు అక్రమంగా విక్రయించినా వ్యవసాయేతర పనులకు వినియోగించినా చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించారు. రాజన్న కోడెలను జియో ట్యాగింగ్ ద్వారా నిరంతర పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు. గోశాలలో ఉన్న కోడెల ఆరోగ్య పరిస్థితి, సంరక్షణ విధానం పై వెటర్నరీ వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కోడెల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. 150 కోట్లతో విశాలమైన గోశాల నిర్మించబోతున్నామని తెలిపారు. రైతులు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పంపిణీ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    4 hrs ago
  • వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి గోశాల కోడెలను అర్హులైన రైతులకు పారదర్శకంగా పంపిణీ చేస్తున్నామని, కోడెలను సంరక్షించి.. సాగు పనులకు వినియోగించుకోవాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పిలుపు నిచ్చారు. వేములవాడ పట్టణం తిప్పాపూర్ లోని శ్రీ రాజరాజేశ్వర స్వామి గోశాలలో రైతులకు మంగళవారం కోడెల ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించగా, ముఖ్య అతిథిగా హాజరై రైతులకు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరిమ అగ్రవాల్ అందజేశారు. ప్రభుత్వ విప్, కలెక్టర్ కు శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఇంచార్జి ఈఓ అంజనారెడ్డి పుష్పగుచ్చం అందజేసి, స్వాగతం పలికారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారి పత్రాలను అధికారులు తనిఖీ చేస్తుండగా, ప్రభుత్వ విప్, కలెక్టర్ పరిశీలించి రైతులతో మాట్లాడారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి కోడెను కట్టే సంస్కృతి వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి సన్నిధిలో ఉందని గుర్తు చేశారు. భక్తుల విశ్వాసానికి ప్రతీక కోడె మొక్కు చెల్లింపు అని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రైతులకు తిప్పాపూర్ గోశాలలో ఉచితంగా స్వామివారి కోడెలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. పంపిణీ చేసిన కోడెలను తనిఖీ చేయిస్తామని స్పష్టం చేశారు. కోడెలను పక్కదారి పట్టించి ఇతర అవసరాలకు ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.రాష్ట్ర ప్రభుత్వం వేములవాడ పరిధిలో అధునాతన సౌకర్యాలతో సువిశాల స్థలంలో గోశాల నిర్మాణానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. రూ.150 కోట్లతో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. కోడెలను రైతులు సంరక్షించాలని సూచించారు. అర్హులైన రైతులకు మాత్రమే పంపిణీ కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. ఆన్లైన్ లో అన్ని పత్రాలతో దరఖాస్తు చేసుకున్న రైతులకు కోడెలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. రైతులు ఆన్లైన్ లో దరఖాస్తులను వ్యవసాయ, పశు సంవర్ధక శాఖ, రెవెన్యూ, దేవాదాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో తనిఖీ చేసిన తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా, పరిసర జిల్లాలకు చెందిన 1.5 నుంచి 5 ఎకరాల వరకు సాగు భూమి ఉన్న సన్నకారు, చిన్నకారు అర్హులైన రైతులకు మాత్రమే పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. అర్హులైన రైతులకు కోడెల పంపిణీ నిరంతరం చేస్తామని తెలిపారు.కోడెలు, వెబ్సైట్ లో రైతుల వివరాలు నమోదు చేయడంతో జీవాలు పక్కదారి పట్టే అవకాశం ఉండదని, భవిష్యత్తులో వాటి సంరక్షణను పరిశీలించవచ్చని కలెక్టర్ స్పష్టం చేశారు.కోడెలను తీసుకువెళ్లే రైతులు వాటి సంరక్షణ బాధ్యతను సక్రమంగా పక్కాగా చూసుకోవాలని సూచించారు. వాటిని ఎల్లప్పుడూ అధికారులతో తనిఖీ చేయిస్తామని స్పష్టం చేశారు. గోశాలలో కోడెల సంరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటు న్నామని, గడ్డి, నీరు, అందిస్తున్నామని, దాదాపు 8 కూలర్లు ఏర్పాటు చేయించామని పేర్కొన్నారు. అలాగే జిల్లా పశు వైద్యాధికారి, వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్నారని కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు.కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్ చైర్మన్ రాకేష్, ఆర్డీఓ రాధాభాయ్, ఆలయ ఇంచార్జి ఈఓ అంజనారెడ్డి, డీఎస్పీ శ్రీనివాసులు, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి రవీందర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, తహసీల్దార్ జయంత్ కుమార్, వ్యవసాయ, రెవెన్యూ, ఆలయ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
    2
    వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి గోశాల కోడెలను అర్హులైన రైతులకు పారదర్శకంగా పంపిణీ చేస్తున్నామని, కోడెలను సంరక్షించి.. సాగు పనులకు వినియోగించుకోవాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పిలుపు నిచ్చారు. వేములవాడ పట్టణం తిప్పాపూర్ లోని శ్రీ రాజరాజేశ్వర స్వామి గోశాలలో రైతులకు మంగళవారం కోడెల ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించగా, ముఖ్య అతిథిగా హాజరై రైతులకు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరిమ అగ్రవాల్ అందజేశారు. ప్రభుత్వ విప్, కలెక్టర్ కు శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఇంచార్జి ఈఓ అంజనారెడ్డి పుష్పగుచ్చం అందజేసి, స్వాగతం పలికారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారి పత్రాలను అధికారులు తనిఖీ చేస్తుండగా, ప్రభుత్వ విప్, కలెక్టర్ పరిశీలించి రైతులతో మాట్లాడారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి కోడెను కట్టే సంస్కృతి వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి సన్నిధిలో ఉందని గుర్తు చేశారు. భక్తుల విశ్వాసానికి ప్రతీక కోడె మొక్కు చెల్లింపు అని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రైతులకు తిప్పాపూర్ గోశాలలో  ఉచితంగా స్వామివారి కోడెలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. పంపిణీ చేసిన కోడెలను తనిఖీ చేయిస్తామని స్పష్టం చేశారు. కోడెలను పక్కదారి పట్టించి ఇతర అవసరాలకు ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.రాష్ట్ర ప్రభుత్వం వేములవాడ పరిధిలో అధునాతన సౌకర్యాలతో సువిశాల స్థలంలో గోశాల నిర్మాణానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. రూ.150 కోట్లతో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. కోడెలను రైతులు సంరక్షించాలని సూచించారు.
అర్హులైన రైతులకు మాత్రమే పంపిణీ
కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. ఆన్లైన్ లో అన్ని పత్రాలతో దరఖాస్తు చేసుకున్న రైతులకు కోడెలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. రైతులు ఆన్లైన్ లో దరఖాస్తులను వ్యవసాయ, పశు సంవర్ధక శాఖ, రెవెన్యూ, దేవాదాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో తనిఖీ చేసిన తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా, పరిసర జిల్లాలకు చెందిన 1.5 నుంచి 5 ఎకరాల వరకు సాగు భూమి ఉన్న సన్నకారు, చిన్నకారు అర్హులైన రైతులకు మాత్రమే పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. అర్హులైన రైతులకు కోడెల పంపిణీ నిరంతరం చేస్తామని తెలిపారు.కోడెలు, వెబ్సైట్ లో రైతుల వివరాలు నమోదు చేయడంతో జీవాలు పక్కదారి పట్టే అవకాశం ఉండదని, భవిష్యత్తులో వాటి సంరక్షణను పరిశీలించవచ్చని కలెక్టర్ స్పష్టం చేశారు.కోడెలను తీసుకువెళ్లే రైతులు వాటి సంరక్షణ బాధ్యతను సక్రమంగా పక్కాగా చూసుకోవాలని సూచించారు. వాటిని ఎల్లప్పుడూ అధికారులతో తనిఖీ చేయిస్తామని స్పష్టం చేశారు. గోశాలలో కోడెల సంరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటు న్నామని, గడ్డి, నీరు, అందిస్తున్నామని, దాదాపు 8 కూలర్లు ఏర్పాటు చేయించామని పేర్కొన్నారు. అలాగే జిల్లా పశు వైద్యాధికారి, వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్నారని కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు.కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్ చైర్మన్ రాకేష్, ఆర్డీఓ రాధాభాయ్, ఆలయ ఇంచార్జి ఈఓ అంజనారెడ్డి, డీఎస్పీ శ్రీనివాసులు, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి రవీందర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, తహసీల్దార్ జయంత్ కుమార్, వ్యవసాయ, రెవెన్యూ, ఆలయ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    6 hrs ago
  • జగిత్యాల : రాష్ట్ర కార్యవర్గసభ్యులుగా పార్టీ తనకు 2వసారి బాధ్యతలు అప్పగించిననందున మంత్రి జి.కిషన్ రెడ్డి , బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావుకు సురభి నవీన్ కృతజ్ఞతలు  బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా పార్టీ రెండవసారి బాధ్యతలు అప్పగించిన సంగతితెలిసిందే. ఈ సందర్బంగా కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డిని మరియు బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు ను బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోరుట్ల నియోజకవర్గ నాయకులు సురభి నవీన్ కుమార్  మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
    1
    జగిత్యాల :
రాష్ట్ర కార్యవర్గసభ్యులుగా పార్టీ తనకు 2వసారి బాధ్యతలు అప్పగించిననందున మంత్రి జి.కిషన్ రెడ్డి , బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావుకు సురభి నవీన్ కృతజ్ఞతలు 
బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా పార్టీ రెండవసారి బాధ్యతలు అప్పగించిన సంగతితెలిసిందే. ఈ సందర్బంగా కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డిని మరియు బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు ను బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోరుట్ల నియోజకవర్గ నాయకులు సురభి నవీన్ కుమార్ 
మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
    user_Sk chaitanya
    Sk chaitanya
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.