గోపాలపురం ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం : ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు గోపాలపురం ప్రాంతంలో భవిష్యత్తులో ముంపు, వరద సమస్యలు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు తెలిపారు. చెరువు గట్టు వద్ద బలమైన రిటైనింగ్ వాల్ నిర్మాణం ద్వారా కాలనీల్లోకి వరద నీరు చేరకుండా నివారిస్తామని చెప్పారు. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ముంపు ప్రభావిత ప్రాంతాల్లో మౌలిక వసతులను బలోపేతం చేసి ప్రజలకు భద్రత కల్పిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అలాగే చెరువు అక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకుంటూ, అక్కడ వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేసేలా కృషి చేస్తామని అన్నారు. రాబోయే రోజుల్లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన జరగనుందని, తాగునీటి సమస్య పరిష్కారం కోసం రూ. 512 కోట్ల నిధులు మంజూరు అయినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.
గోపాలపురం ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం : ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు గోపాలపురం ప్రాంతంలో భవిష్యత్తులో ముంపు, వరద సమస్యలు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు తెలిపారు. చెరువు గట్టు వద్ద బలమైన రిటైనింగ్ వాల్ నిర్మాణం ద్వారా కాలనీల్లోకి వరద నీరు చేరకుండా నివారిస్తామని చెప్పారు. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ముంపు ప్రభావిత ప్రాంతాల్లో మౌలిక వసతులను బలోపేతం చేసి ప్రజలకు భద్రత కల్పిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అలాగే చెరువు అక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకుంటూ, అక్కడ వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేసేలా కృషి చేస్తామని అన్నారు. రాబోయే రోజుల్లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన జరగనుందని, తాగునీటి సమస్య పరిష్కారం కోసం రూ. 512 కోట్ల నిధులు మంజూరు అయినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.
- గోపాలపురం ప్రాంతంలో భవిష్యత్తులో ముంపు, వరద సమస్యలు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు తెలిపారు. చెరువు గట్టు వద్ద బలమైన రిటైనింగ్ వాల్ నిర్మాణం ద్వారా కాలనీల్లోకి వరద నీరు చేరకుండా నివారిస్తామని చెప్పారు. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ముంపు ప్రభావిత ప్రాంతాల్లో మౌలిక వసతులను బలోపేతం చేసి ప్రజలకు భద్రత కల్పిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అలాగే చెరువు అక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకుంటూ, అక్కడ వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేసేలా కృషి చేస్తామని అన్నారు. రాబోయే రోజుల్లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన జరగనుందని, తాగునీటి సమస్య పరిష్కారం కోసం రూ. 512 కోట్ల నిధులు మంజూరు అయినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.1
- మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దారుణ హత్య కేసులో నిందితుడైన రౌడీ షీటర్ అంగోత్ హరీష్‌కు గౌరవ కోర్టు జీవిత ఖైదు విధిస్తూ కీలక తీర్పు వెలువరించింది. 2020 సంవత్సరం ఆగస్టు నెల 23వ తేదీ అర్థరాత్రి సమయంలో, కేసముద్రం మండలం గిర్నీతండాకు చెందిన అంగోత్ హరీష్ (30) అనే వ్యక్తి ప్రజలను భయపెట్టడం ద్వారా రౌడీగా ఎదగాలనే ఉద్దేశంతో, అనంతపురం జిల్లాకు చెందిన అమాయకుడైన బిచ్చగాడు వెంకన్న (40)ను లక్ష్యంగా ఎంచుకున్నాడు. కేసముద్రం రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతంలో పారా తో దాడి చేసి హత్య చేసి, అనంతరం కత్తితో తలను మొండెం నుండి వేరు చేసి ఘోరంగా హత్య చేశాడు. హత్య అనంతరం మొండెంను ఖాళీ స్థలంలో, తలను కూరగాయలు అమ్మే లక్ష్మి ఇంటి పక్కన పడేసి పరారయ్యాడు. ఈ ఘటనపై అప్పటి కేసముద్రం ఎస్సై శ్రీ బి. సతీష్ , వీఆర్‌ఓ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అప్పటి మహబూబాబాద్ రూరల్ సీఐలుగా పనిచేసిన జే. వెంకటరత్నం మరియు పి. రవికుమార్ ఆధారాలు సేకరించి నిందితుడిని అరెస్ట్ చేసి, చార్జ్‌షీట్‌ను గౌరవ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టులో దాఖలు చేశారు. తదుపరి, ఈ కేసు విచారణ దశలో మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్. పి, ఐపీఎస్ ఆదేశాల మేరకు, డీఎస్పీ తిరుపతి రావు పర్యవేక్షణలో కేసముద్రం సీఐ సత్యనారాయణ మరియు ఎస్సైలు క్రాంతి కిరణ్, నరేష్ కేసును ప్రత్యేకంగా పరిగణించి ప్రతి సాక్షిని విచారణకు ముందు సమగ్రంగా బ్రీఫ్ చేశారు. కోర్టు సీడీఓ అశోక్ రెడ్డి సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టి, సాక్ష్యాలను సమర్పించగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొంపెల్లి వెంకటయ్య బలమైన వాదనలు వినిపించారు. గౌరవ కోర్టు సమగ్ర సాక్ష్యాధారాలను పరిశీలించి, నిందితుడు అంగోత్ హరీష్‌ను దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు శిక్షతో పాటు రూ.30,000/- జరిమానా విధించింది. ఇది మాత్రమే కాకుండా, నిందితుడైన అంగోత్ హరీష్‌పై అక్రమ వసూళ్లు, హత్యాయత్నం, గాయపరిచిన కేసులు, దొంగతనం మరియు మహిళలను వేధించిన కేసులు కలిపి మొత్తం 18 కేసులు నమోదై ఉన్నాయి. కేసముద్రం ప్రాంతంలో తాను రౌడీ అని ప్రజలను బెదిరిస్తూ వ్యాపారుల నుండి డబ్బులు వసూలు చేయడం, ఇవ్వనివారిపై దాడులు చేయడం వంటి చర్యలతో ప్రజల్లో భయాందోళనలకు కారణమయ్యాడు. అతనిపై ఫిర్యాదు చేయడానికి కూడా ప్రజలు భయపడేవారు. కానీ కేసముద్రం సీఐ సత్యనారాయణ , ఎస్సై క్రాంతి కిరణ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకొని కఠినంగా వ్యవహరించి, రౌడీ షీటర్ నుండి ప్రజలకు, వ్యాపారులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడంతో పాటు, నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష పడేలా కృషి చేశారు. ఈ సందర్భంగా కేసముద్రం ప్రాంత ప్రజలు పోలీసు శాఖ కృషిని అభినందిస్తూ, తమకు భద్రత కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.1
- వరంగల్ జిల్లా: పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఎంజీఎం ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. వైద్యులు సమయపాలన పాటించాలని, సూపర్డెంట్, ఆర్‌ఎంఓలు క్షేత్రస్థాయి పర్యవేక్షణ బలోపేతం చేయాలని తెలిపారు. ఆస్పత్రిలో ఔషధాల కొరత లేకుండా టెండర్ ప్రక్రియ చేపట్టాలని, పారిశుద్ధ్యాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని వైద్యులు, సిబ్బందిని హెచ్చరించారు.1
- జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ సోదాల్లో అనేక లోపాలు, అవకతవకలు బయటపడ్డాయి. అధికారుల నిర్లక్ష్యం, నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగుల పనితీరు తేటతెల్లం అయింది. 10 గంటల పాటు కొనసాగిన ఏసిబి అధికారుల తనిఖీలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయని ఏసిబి ఇన్ స్పెక్టర్ పూర్ణచందర్ తెలిపారు. పన్నుల వసూళ్ళలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలిపారు. ఏటా 14 కోట్ల 76 లక్షల ఆస్తిపన్ను వసూలు చేయాల్సి ఉండగా 50 శాతం మాత్రమే వసూలు చేశారని, హోర్డింగ్ ల పన్ను జీరోగా ఉందని చెప్పారు. గత ఐదు సంవత్సరాలుగా షాప్ ల ప్రాపర్టీ టాక్స్ పూర్తి స్థాయిలో వసూలు చేయలేదని, మున్సిపల్ కు చెందిన అద్దె భవనాల విషయంలో గత 18 సంవత్సరాలుగా రీ టెండర్ నిర్వహించలేదని తేలిందన్నారు. పారిశుద్ధ వాహనాల డీజీల్, రిపేర్ బిల్లుల విషయంలో అవకతవకలు జరిగాయని, మున్సిపాలిటీకి చెందిన ఒక ట్రాక్టర్, 4 ఆటోలు 5 సంవత్సరాల క్రితం మాయంకాగ, ఆ వాహనాలకు సంబంధించిన సమాచారం ఇప్పటికి కార్యాలయంలో లేదని తెలిపారు. టౌన్ ప్లానింగ్ కు సంబంధించి LRS, బిల్డింగ్ అనుమతులకు సంబంధించిన ఫైల్స్ పెండింగ్ లో ఉన్నాయని, జగిత్యాల టౌన్ తోపాటు శివారు గ్రామాల్లో ఫాగింగ్ సంబంధించిన బిల్లుల్లో అవకతవకలు జరిగాయని తెలిపారు. కార్యాలయంకు సంబంధించిన జిఎస్టీ బిల్లుల్లో తేడాలున్నాయని, కార్యాలయానికి సంబంధించిన సిబ్బంది ఫోన్ పే గూగుల్ పే లావాదేవీలు పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక పంపుతామని ఎసిబి సిఐ పూర్ణచందర్ తెలిపారు. *16 మంది కమీషనర్ లు బదిలీ* 2019 నుంచి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో ఇప్పటి వరకు 16 మంది కమీషన్లు బదిలీ అయ్యారు. అవినీతి ఆరోపణలపై 8 మంది ఉద్యోగులు జైలు కెళ్లారు. గతంలోనూ రెండు సార్లు ఏసీబీ, రెండు సార్లు విజిలెన్స్ అధికారుల సోదాలు నిర్వహించారు. తాజాగా జరిగిన ఏసీబీ అధికారుల సోదాలతో మరోసారి జగిత్యాల మున్సిపల్ కార్యాలయం వార్తల్లో నిలిచింది.4
- గన్నేరువరం మండలం చాకలివానిపల్లి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) నిధులతో రూ.5 లక్షల వ్యయంతో కూనవాణిపల్లి పరిధిలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఈరోజు ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ రేపాక బానవ్వ గారు వాటర్ ట్యాంక్ నుండి పెద్దమ్మ గుడి వరకు ఈ రోడ్డు పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... గ్రామ ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా కోసం ఈ రోడ్డు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు బోయిని బాలయ్య, బామండ్ల మల్లేష్, కూన శ్రవంతి, MRPS మండల అధ్యక్షులు రేపాక బాబు, కూన చంద్రశేఖర్, కూన రవి, కూన రాజు, కూన సతీష్, కూన శ్రీనివాస్, జెరిపోతుల అనిల్ తదితరులు పాల్గొన్నారు.1
- గన్నేరువరం మండల కేంద్రంలో బి ఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గంప వెంకన్న ఆధ్వర్యంలో మాజీ సుడ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణారావు జన్మదిన వేడుకలు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పుల్లెల లక్ష్మణ్, నేత సుధాకర్, మీసాల ప్రభాకర్, కొట్టే భూమయ్య, బొడ్డు శ్రీనివాస్ అధిక సంఖ్యలో బి ఆర్ ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు1
- Post by Tagore1
- జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ స్నేహ శబరీష్, జిల్లాలోని తొర్రూరు పట్టణ కేంద్రంలో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల (బాలికల)ప్రీ మెట్రిక్ , పోస్ట్ మెట్రిక్ అప్పర్ ప్రైమర్ హాస్పిటల్, హెల్త్ సెంటర్ లను ఆకస్మికంగా తనిఖీ చేశారు, ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాలలో తరగతి గదులు, డార్మెంటరీ, డైనింగ్ హాల్, కిచెన్ షెడ్, టాయిలెట్స్, పరిసరాలను పరిశీలించి విద్యార్థిని, విద్యార్థులతో మాట్లాడి వారి విద్యా సామర్థ్యాలను స్వయంగా పరిశీలించారు, ప్రభుత్వం కల్పించే పక్కా డైట్ మెనూ ను కచ్చితంగా అమలు చేయాలని, నాణ్యమైన వేడివేడి ఆహార పదార్థాలను అందించాలని, భోజనం సిద్ధం చేసే సిబ్బంది తగిన జాగ్రత్తలు వహిస్తూ భోజనం, టిఫిన్స్, స్నాక్స్ సిద్ధం చేయాలని, పిల్లలకు, వసతి గృహాలు పాఠశాలలో భోజనం సిద్ధం చేసే సిబ్బందికి షెడ్యూల్ ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించి అట్టి నివేదికలను సమర్పించాలని సంబంధిత వార్డెన్, ప్రిన్సిపల్ను ఆదేశించారు, ప్రత్యేక అధికారులు వారికి కేటాయించిన వసతి గృహాలను క్రమం తప్పకుండా బ్రేక్ ఫాస్ట్, భోజనం, డిన్నర్ సమయాలలో సందర్శించి వారితో కలిసి భోజనం చేయాలని సూచించారు, ప్రతి విద్యా సంస్థ వసతి గృహాలలో కంప్లైంట్ బాక్స్ ఏర్పాటు చేయాలని అందుకు సంబంధించిన కి సంబంధిత శాఖ ప్రధాన అధికారి లేదా ప్రత్యేక అధికారి వద్దనే ఉండాలని, భోజనం, సౌకర్యం తదితర అంశాలపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు, ప్రస్తుత వేసవికాలం నేపథ్యంలో విద్యార్థిని విద్యార్థులకు అన్ని ఏర్పాట్లను, సౌకర్యాలను కల్పించాలని తగినన్ని మందులు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు, వసతి గృహాలలో హెల్త్, ఎడ్యుకేషన్, న్యూట్రిషన్ ,సానిటేషన్ లపై పిల్లలకు అవగాహన కల్పించాలని తెలిపారు, ఉపాధ్యాయుని,ఉపాధ్యాయులు, పిల్లల యొక్క హాజరు శాతం పూర్తిగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు, నూతన టెక్నాలజీ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తరగతులను నిర్వహించి ఉత్తమ ఫలితాలను సాధించుటకు కృషి చేయాలని తెలిపారు, పిల్లల యొక్క మానసిక, ఆరోగ్య స్థితిగతులను గమనిస్తూ ఉండాలని విద్యతోపాటు క్రీడల్లో నైపుణ్యత ఉండే విధంగా ప్రతి విభాగం టీచర్ ముందుకు సాగాలన్నారు, అనంతరం అప్పర్ ప్రైమర్ హాస్పిటల్, కమ్యూనిటీ హెల్త్ ను సందర్శించి ఇన్ పేషెంట్, ఔట్ పేషెంట్ వివరాలను అడిగి తెలుసుకున్నారు, మందుల స్టాక్ రిజిస్టర్, తదితర రికార్డులను తనిఖీ చేశారు, హాస్పిటల్ పరిధిలోని సబ్ సెంటర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ద్వారా మెరుగైన వైద్యం ప్రతి ఒక్కరికి అందించాలని సూచించారు, వైద్యం కోసం వచ్చే వారికి సేవలు అందించడం కోసం డాక్టర్స్ నిత్యం అందుబాటులో ఉండాలని, వేసవి ప్రభావం నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ కార్యక్రమాలు నిర్వహించాలని, అవసరం ఉన్నచోట వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు, సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని మాత, శిశు మరణాలను జరగకుండా చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బంది పోలీస్ సంబంధిత విభాగాలు నిత్యం ప్రైవేటు ఆసుపత్రులపై నిఘా పెట్టాలని ఆదేశించారు, అక్రమ స్కానింగ్ లు, లింగ నిర్ధారణ పరీక్షలు నిబంధనలకు విరుద్ధంగా నడిచే ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు, వైద్యం కోసం వచ్చే ప్రతి ఒక్కరికి ధైర్యం భరోసా కల్పించాలని తమ పరిధిలో ఉన్నటువంటి సేవలను వేగంగా అందించాలని సూచించారు, ఆశా కార్యకర్తలతో మాట్లాడుతూ వార్డు గ్రామస్థాయిలో ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ ను మెయింటైన్ చేయాలని, గర్భిణీ స్త్రీలను, చిన్న పిల్లలను ఇతర వ్యాధిగ్రస్తులను గమనిస్తూ ఉండాలని, సూచించారు,1