logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మహబూబాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు,జనాలను భయబ్రాంతులకు గురిచేయడానికి అమాయకుడిని హత్య చేసిన రౌడీ షీటర్‌కు జీవిత ఖైదు మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దారుణ హత్య కేసులో నిందితుడైన రౌడీ షీటర్ అంగోత్ హరీష్‌కు గౌరవ కోర్టు జీవిత ఖైదు విధిస్తూ కీలక తీర్పు వెలువరించింది. 2020 సంవత్సరం ఆగస్టు నెల 23వ తేదీ అర్థరాత్రి సమయంలో, కేసముద్రం మండలం గిర్నీతండాకు చెందిన అంగోత్ హరీష్ (30) అనే వ్యక్తి ప్రజలను భయపెట్టడం ద్వారా రౌడీగా ఎదగాలనే ఉద్దేశంతో, అనంతపురం జిల్లాకు చెందిన అమాయకుడైన బిచ్చగాడు వెంకన్న (40)ను లక్ష్యంగా ఎంచుకున్నాడు. కేసముద్రం రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతంలో పారా తో దాడి చేసి హత్య చేసి, అనంతరం కత్తితో తలను మొండెం నుండి వేరు చేసి ఘోరంగా హత్య చేశాడు. హత్య అనంతరం మొండెంను ఖాళీ స్థలంలో, తలను కూరగాయలు అమ్మే లక్ష్మి ఇంటి పక్కన పడేసి పరారయ్యాడు. ఈ ఘటనపై అప్పటి కేసముద్రం ఎస్సై శ్రీ బి. సతీష్ , వీఆర్‌ఓ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అప్పటి మహబూబాబాద్ రూరల్ సీఐలుగా పనిచేసిన జే. వెంకటరత్నం మరియు పి. రవికుమార్ ఆధారాలు సేకరించి నిందితుడిని అరెస్ట్ చేసి, చార్జ్‌షీట్‌ను గౌరవ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టులో దాఖలు చేశారు. తదుపరి, ఈ కేసు విచారణ దశలో మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్. పి, ఐపీఎస్ ఆదేశాల మేరకు, డీఎస్పీ తిరుపతి రావు పర్యవేక్షణలో కేసముద్రం సీఐ సత్యనారాయణ మరియు ఎస్సైలు క్రాంతి కిరణ్, నరేష్ కేసును ప్రత్యేకంగా పరిగణించి ప్రతి సాక్షిని విచారణకు ముందు సమగ్రంగా బ్రీఫ్ చేశారు. కోర్టు సీడీఓ అశోక్ రెడ్డి సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టి, సాక్ష్యాలను సమర్పించగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొంపెల్లి వెంకటయ్య బలమైన వాదనలు వినిపించారు. గౌరవ కోర్టు సమగ్ర సాక్ష్యాధారాలను పరిశీలించి, నిందితుడు అంగోత్ హరీష్‌ను దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు శిక్షతో పాటు రూ.30,000/- జరిమానా విధించింది. ఇది మాత్రమే కాకుండా, నిందితుడైన అంగోత్ హరీష్‌పై అక్రమ వసూళ్లు, హత్యాయత్నం, గాయపరిచిన కేసులు, దొంగతనం మరియు మహిళలను వేధించిన కేసులు కలిపి మొత్తం 18 కేసులు నమోదై ఉన్నాయి. కేసముద్రం ప్రాంతంలో తాను రౌడీ అని ప్రజలను బెదిరిస్తూ వ్యాపారుల నుండి డబ్బులు వసూలు చేయడం, ఇవ్వనివారిపై దాడులు చేయడం వంటి చర్యలతో ప్రజల్లో భయాందోళనలకు కారణమయ్యాడు. అతనిపై ఫిర్యాదు చేయడానికి కూడా ప్రజలు భయపడేవారు. కానీ కేసముద్రం సీఐ సత్యనారాయణ , ఎస్సై క్రాంతి కిరణ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకొని కఠినంగా వ్యవహరించి, రౌడీ షీటర్ నుండి ప్రజలకు, వ్యాపారులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడంతో పాటు, నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష పడేలా కృషి చేశారు. ఈ సందర్భంగా కేసముద్రం ప్రాంత ప్రజలు పోలీసు శాఖ కృషిని అభినందిస్తూ, తమకు భద్రత కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.

5 hrs ago
user_Mogulagani Mahendar Mogulagani Mahendar
Mogulagani Mahendar Mogulagani Mahendar
మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
5 hrs ago

మహబూబాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు,జనాలను భయబ్రాంతులకు గురిచేయడానికి అమాయకుడిని హత్య చేసిన రౌడీ షీటర్‌కు జీవిత ఖైదు మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దారుణ హత్య కేసులో నిందితుడైన రౌడీ షీటర్ అంగోత్ హరీష్‌కు గౌరవ కోర్టు జీవిత ఖైదు విధిస్తూ కీలక తీర్పు వెలువరించింది. 2020 సంవత్సరం ఆగస్టు నెల 23వ తేదీ అర్థరాత్రి సమయంలో, కేసముద్రం మండలం గిర్నీతండాకు చెందిన అంగోత్ హరీష్ (30) అనే వ్యక్తి ప్రజలను భయపెట్టడం ద్వారా రౌడీగా ఎదగాలనే ఉద్దేశంతో, అనంతపురం జిల్లాకు చెందిన అమాయకుడైన బిచ్చగాడు వెంకన్న (40)ను లక్ష్యంగా ఎంచుకున్నాడు. కేసముద్రం రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతంలో పారా తో దాడి చేసి హత్య చేసి, అనంతరం కత్తితో తలను మొండెం నుండి వేరు చేసి ఘోరంగా హత్య చేశాడు. హత్య అనంతరం మొండెంను ఖాళీ స్థలంలో, తలను కూరగాయలు అమ్మే లక్ష్మి ఇంటి పక్కన పడేసి పరారయ్యాడు. ఈ ఘటనపై అప్పటి కేసముద్రం ఎస్సై శ్రీ బి. సతీష్ , వీఆర్‌ఓ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అప్పటి మహబూబాబాద్ రూరల్ సీఐలుగా పనిచేసిన జే. వెంకటరత్నం మరియు పి. రవికుమార్ ఆధారాలు సేకరించి నిందితుడిని అరెస్ట్ చేసి, చార్జ్‌షీట్‌ను గౌరవ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టులో దాఖలు చేశారు. తదుపరి, ఈ కేసు విచారణ దశలో మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్. పి, ఐపీఎస్ ఆదేశాల మేరకు, డీఎస్పీ తిరుపతి రావు పర్యవేక్షణలో కేసముద్రం సీఐ సత్యనారాయణ మరియు ఎస్సైలు క్రాంతి కిరణ్, నరేష్ కేసును ప్రత్యేకంగా పరిగణించి ప్రతి సాక్షిని విచారణకు ముందు సమగ్రంగా బ్రీఫ్ చేశారు. కోర్టు సీడీఓ అశోక్ రెడ్డి సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టి, సాక్ష్యాలను సమర్పించగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొంపెల్లి వెంకటయ్య బలమైన వాదనలు వినిపించారు. గౌరవ కోర్టు సమగ్ర సాక్ష్యాధారాలను పరిశీలించి, నిందితుడు అంగోత్ హరీష్‌ను దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు శిక్షతో పాటు రూ.30,000/- జరిమానా విధించింది. ఇది మాత్రమే కాకుండా, నిందితుడైన అంగోత్ హరీష్‌పై అక్రమ వసూళ్లు, హత్యాయత్నం, గాయపరిచిన కేసులు, దొంగతనం మరియు మహిళలను వేధించిన కేసులు కలిపి మొత్తం 18 కేసులు నమోదై ఉన్నాయి. కేసముద్రం ప్రాంతంలో తాను రౌడీ అని ప్రజలను బెదిరిస్తూ వ్యాపారుల నుండి డబ్బులు వసూలు చేయడం, ఇవ్వనివారిపై దాడులు చేయడం వంటి చర్యలతో ప్రజల్లో భయాందోళనలకు కారణమయ్యాడు. అతనిపై ఫిర్యాదు చేయడానికి కూడా ప్రజలు భయపడేవారు. కానీ కేసముద్రం సీఐ సత్యనారాయణ , ఎస్సై క్రాంతి కిరణ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకొని కఠినంగా వ్యవహరించి, రౌడీ షీటర్ నుండి ప్రజలకు, వ్యాపారులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడంతో పాటు, నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష పడేలా కృషి చేశారు. ఈ సందర్భంగా కేసముద్రం ప్రాంత ప్రజలు పోలీసు శాఖ కృషిని అభినందిస్తూ, తమకు భద్రత కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.

More news from తెలంగాణ and nearby areas
  • మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం దుబ్బగూడెం గ్రామ సమీపంలో పాలేరు లింకు కెనాల్ సర్వే ఉద్రిక్తతకు దారి తీసింది. మున్నేరు జలసాధన కమిటీ సభ్యులను తెల్లవారుజామున పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. సర్వేను అడ్డుకోవాలని అఖిలపక్ష నాయకులు పిలుపునిచ్చారు. భారీ బందోబస్తు మధ్య అధికారులు సర్వే కొనసాగించగా, తమ భూములు ఎడారిగా మారుతాయని అఖిలపక్ష నాయకులు ఆరోపించారు. అనంతరం గార్ల పట్టణంలో రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
    1
    మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం దుబ్బగూడెం గ్రామ సమీపంలో పాలేరు లింకు కెనాల్ సర్వే ఉద్రిక్తతకు దారి తీసింది. మున్నేరు జలసాధన కమిటీ సభ్యులను తెల్లవారుజామున పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. సర్వేను అడ్డుకోవాలని అఖిలపక్ష నాయకులు పిలుపునిచ్చారు.
భారీ బందోబస్తు మధ్య అధికారులు సర్వే కొనసాగించగా, తమ భూములు ఎడారిగా మారుతాయని అఖిలపక్ష నాయకులు ఆరోపించారు. అనంతరం గార్ల పట్టణంలో రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    7 hrs ago
  • ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యాలయాల్లో ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సిరిసిల్ల కలెక్టర్ గరిమా అగ్రవాల్ సూచించారు. వేములవాడలోని మహాత్మాజ్యోతి బాపూలే బాలికల రెసిడెన్షియల్ విద్యాలయంలో కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యాలయం ఆవరణ, తరగతి గదులు, కిచెన్ లో ఆహార పదార్థాలను పరిశీలించారు. మెనూ చార్ట్ పరిశీలించి.. ఏ ఏ వంటకాలు సిద్ధం చేస్తున్నారో తనిఖీ చేశారు. ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, తమ కుటుంబంలో పిల్లలకు ఆహార పదార్థాలు ఎలా సిద్ధం చేస్తారో అలాగే ఇక్కడ విద్యార్థుల కోసం వండాలని ఆదేశించారు. అనంతరం 9వ తరగతి విద్యార్థులతో కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడారు. అన్ని పరీక్షలకు సంబంధించిన టైమ్ టేబుల్ సిద్ధం చేసుకోవాలని, ఏ రోజు ఏ సబ్జెక్ట్ చదవాలో ముందే రాసుకోవాలని, దానికి అనుగుణంగా అన్ని సబ్జెక్టులు చదవడం, రాయడం పూర్తి చేయాలని తెలిపారు. రైటింగ్ కూడా సాధన చేయాలని, వార్షిక పరీక్షల సమయానికి అనుగుణంగా ఇప్పుడు అదే సమయంలో అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాసేలా సాధన చేయాలని పేర్కొన్నారు. ఇప్పటి మార్కులు మీరు తర్వాత చదివే ఉన్నత తరగతులకు ఎంతో కీలకమని స్పష్టం చేశారు. విద్యార్థులం దరూ రానున్న పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థులు ఏ నేపథ్యం నుంచి వచ్చినా.. ఇప్పుడు ఇష్టపడి సాధన చేయడం.. అన్ని సబ్జెక్టుల్లో రాణించడంతో వారి భవిష్యత్తు ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతి విద్యార్థి వివిధ ఉద్యోగాలు, వృత్తుల్లో స్థిరపడాలని, ఉన్నత స్థానాల్లో నిలవాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకాంక్షించారు.
    1
    ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యాలయాల్లో ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సిరిసిల్ల కలెక్టర్ గరిమా అగ్రవాల్ సూచించారు. వేములవాడలోని మహాత్మాజ్యోతి బాపూలే బాలికల రెసిడెన్షియల్ విద్యాలయంలో కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా విద్యాలయం ఆవరణ, తరగతి గదులు, కిచెన్ లో ఆహార పదార్థాలను పరిశీలించారు. మెనూ చార్ట్ పరిశీలించి.. ఏ ఏ వంటకాలు సిద్ధం చేస్తున్నారో తనిఖీ చేశారు. ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, తమ కుటుంబంలో పిల్లలకు ఆహార పదార్థాలు ఎలా సిద్ధం చేస్తారో అలాగే ఇక్కడ విద్యార్థుల కోసం వండాలని ఆదేశించారు.
అనంతరం 9వ తరగతి విద్యార్థులతో కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడారు. అన్ని పరీక్షలకు సంబంధించిన టైమ్ టేబుల్ సిద్ధం చేసుకోవాలని, 
ఏ రోజు ఏ సబ్జెక్ట్ చదవాలో ముందే రాసుకోవాలని, దానికి అనుగుణంగా అన్ని సబ్జెక్టులు చదవడం, రాయడం పూర్తి చేయాలని తెలిపారు. రైటింగ్ కూడా సాధన చేయాలని, వార్షిక పరీక్షల సమయానికి అనుగుణంగా ఇప్పుడు అదే సమయంలో అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాసేలా సాధన చేయాలని పేర్కొన్నారు. ఇప్పటి మార్కులు మీరు తర్వాత చదివే ఉన్నత తరగతులకు ఎంతో కీలకమని స్పష్టం చేశారు. విద్యార్థులం దరూ రానున్న పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థులు ఏ నేపథ్యం నుంచి వచ్చినా.. ఇప్పుడు ఇష్టపడి సాధన చేయడం.. అన్ని సబ్జెక్టుల్లో రాణించడంతో వారి భవిష్యత్తు ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతి విద్యార్థి వివిధ ఉద్యోగాలు, వృత్తుల్లో స్థిరపడాలని, ఉన్నత స్థానాల్లో నిలవాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకాంక్షించారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    3 hrs ago
  • గన్నేరువరం మండలం చాకలివానిపల్లి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) నిధులతో రూ.5 లక్షల వ్యయంతో కూనవాణిపల్లి పరిధిలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఈరోజు ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ రేపాక బానవ్వ గారు వాటర్ ట్యాంక్ నుండి పెద్దమ్మ గుడి వరకు ఈ రోడ్డు పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... గ్రామ ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా కోసం ఈ రోడ్డు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు బోయిని బాలయ్య, బామండ్ల మల్లేష్, కూన శ్రవంతి, MRPS మండల అధ్యక్షులు రేపాక బాబు, కూన చంద్రశేఖర్, కూన రవి, కూన రాజు, కూన సతీష్, కూన శ్రీనివాస్, జెరిపోతుల అనిల్ తదితరులు పాల్గొన్నారు.
    1
    గన్నేరువరం మండలం చాకలివానిపల్లి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) నిధులతో రూ.5 లక్షల వ్యయంతో కూనవాణిపల్లి పరిధిలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఈరోజు ప్రారంభించారు.
గ్రామ సర్పంచ్ రేపాక బానవ్వ గారు వాటర్ ట్యాంక్ నుండి పెద్దమ్మ గుడి వరకు ఈ రోడ్డు పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...  గ్రామ ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా కోసం ఈ రోడ్డు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు బోయిని బాలయ్య, బామండ్ల మల్లేష్, కూన శ్రవంతి, MRPS మండల అధ్యక్షులు రేపాక బాబు, కూన చంద్రశేఖర్, కూన రవి, కూన రాజు, కూన సతీష్, కూన శ్రీనివాస్, జెరిపోతుల అనిల్ తదితరులు పాల్గొన్నారు.
    user_Shuru
    Shuru
    Grain Importer గన్నేరువరం, కరీంనగర్, తెలంగాణ•
    5 hrs ago
  • గన్నేరువరం మండల కేంద్రంలో బి ఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గంప వెంకన్న ఆధ్వర్యంలో మాజీ సుడ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణారావు జన్మదిన వేడుకలు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పుల్లెల లక్ష్మణ్, నేత సుధాకర్, మీసాల ప్రభాకర్, కొట్టే భూమయ్య, బొడ్డు శ్రీనివాస్ అధిక సంఖ్యలో బి ఆర్ ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు
    1
    గన్నేరువరం మండల కేంద్రంలో బి ఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గంప వెంకన్న ఆధ్వర్యంలో 
మాజీ సుడ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణారావు జన్మదిన వేడుకలు మండల కేంద్రంలో  ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. 
ఈ కార్యక్రమంలో నాయకులు పుల్లెల లక్ష్మణ్, నేత సుధాకర్, మీసాల ప్రభాకర్, కొట్టే భూమయ్య, బొడ్డు శ్రీనివాస్ అధిక సంఖ్యలో బి ఆర్ ఎస్ పార్టీ శ్రేణులు  పాల్గొన్నారు
    user_Vodnala thirupthi
    Vodnala thirupthi
    గన్నేరువరం, కరీంనగర్, తెలంగాణ•
    13 hrs ago
  • సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో నిర్వహించిన మైనార్టీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మైనార్టీ నాయకుడు సయ్యద్ మతిన్ మాట్లాడారు.బిఆర్ఎస్ పార్టీ అనవసర ఆరోపణలు చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తోందని ఆయన విమర్శించారు. టిఆర్ఎస్ హయాంలో మైనార్టీలకు ఎలాంటి ప్రయోజనం కలగలేదని, మైనార్టీ చెక్కులు, కుట్టు మిషన్లు వచ్చినప్పటికీ వాటిని కొంతమంది మాత్రమే పొందారని ఆరోపించారు. ముస్లింలకు 12% రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ ఆ వాగ్దానాన్ని అమలు చేయలేదని, ఈ విషయంలో ప్రతాప్ రెడ్డి స్పందించలేదని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతాప్ రెడ్డి, 2018లో టిఆర్ఎస్‌కు మద్దతు ఇచ్చి పదవులు పొందారని అన్నారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టినందుకు విమర్శలు చేయడం, పోలీస్ కేసులు నమోదు చేయడం తగదని, కేసుల్లో సంబంధం లేని వారిని కూడా ఇరికిస్తున్నారని ఆరోపించారు. అలాగే తమ నాయకుడు నరసన్నపై అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలను మానుకోవాలని, ప్రజల్లో శాంతి భద్రతలను కాపాడాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు సయ్యద్ మతిన్ మాజీ కౌన్సిలర్ సమీర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ డాక్టర్ వహీద్, మహమ్మద్ జలాల్, మహమ్మద్ జహీర్, సమీర్ ఇర్షాద్, అత ఉల్లా బేగ్, షకీల్ పటేల్, మొహమ్మద్ జుబేర్, భారీ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
    4
    సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో నిర్వహించిన మైనార్టీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మైనార్టీ నాయకుడు సయ్యద్ మతిన్ మాట్లాడారు.బిఆర్ఎస్ పార్టీ అనవసర ఆరోపణలు చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తోందని ఆయన విమర్శించారు. టిఆర్ఎస్ హయాంలో మైనార్టీలకు ఎలాంటి ప్రయోజనం కలగలేదని, మైనార్టీ చెక్కులు, కుట్టు మిషన్లు వచ్చినప్పటికీ వాటిని కొంతమంది మాత్రమే పొందారని ఆరోపించారు.
ముస్లింలకు 12% రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ ఆ వాగ్దానాన్ని అమలు చేయలేదని, ఈ విషయంలో ప్రతాప్ రెడ్డి స్పందించలేదని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతాప్ రెడ్డి, 2018లో టిఆర్ఎస్‌కు మద్దతు ఇచ్చి పదవులు పొందారని అన్నారు.
ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టినందుకు విమర్శలు చేయడం, పోలీస్ కేసులు నమోదు చేయడం తగదని, కేసుల్లో సంబంధం లేని వారిని కూడా ఇరికిస్తున్నారని ఆరోపించారు. అలాగే తమ నాయకుడు నరసన్నపై అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలను మానుకోవాలని, ప్రజల్లో శాంతి భద్రతలను కాపాడాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ  నాయకులు సయ్యద్ మతిన్ మాజీ కౌన్సిలర్ సమీర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ డాక్టర్ వహీద్, మహమ్మద్ జలాల్, మహమ్మద్ జహీర్, సమీర్ ఇర్షాద్, అత ఉల్లా బేగ్, షకీల్ పటేల్, మొహమ్మద్ జుబేర్, భారీ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
    user_GOUSE BEURO REPORTER
    GOUSE BEURO REPORTER
    రిపోర్టర్ వర్గల్, సిద్దిపేట, తెలంగాణ•
    4 hrs ago
  • Post by పొనుగుమటి. శ్రీనివాస్
    1
    Post by పొనుగుమటి. శ్రీనివాస్
    user_పొనుగుమటి. శ్రీనివాస్
    పొనుగుమటి. శ్రీనివాస్
    గన్నవరం, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • ములుగు జిల్లా కర్రెగుట్టలపై ఉన్న ఆటంకాలు పూర్తిగా తొలగిపోయాయని రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి తెలిపారు. మంగళవారం అక్కడికి చేరుకున్న ఆయన మారుమూల ప్రాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కరెగుట్టల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం అందిస్తున్నాయని, ప్రస్తుతం ఎలాంటి సమస్యలు లేవని ఆయన స్పష్టం చేశారు.
    1
    ములుగు జిల్లా కర్రెగుట్టలపై ఉన్న ఆటంకాలు పూర్తిగా తొలగిపోయాయని రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి తెలిపారు. మంగళవారం అక్కడికి చేరుకున్న ఆయన మారుమూల ప్రాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కరెగుట్టల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం అందిస్తున్నాయని, ప్రస్తుతం ఎలాంటి సమస్యలు లేవని ఆయన స్పష్టం చేశారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    9 hrs ago
  • కరీంనగర్ లో డివిజన్ల మ్యాపింగ్ పేరుతో అన్ని డివిజన్లలో చేపడుతున్న సర్వే లోపభూయిష్టంగా ఉందని, దానికి ప్రధాన కారణం సంబంధిత అధికారుల నిర్లక్ష్యంతోనే ఓట్ల గల్లంతు జరిగిందని జనసేన పార్టీ పార్లమెంట్ కో-ఆర్డినేటర్ బేతి మహేందర్ రెడ్డి ఆరోపించారు. కరీంనగర్ లోని బూత్ లెవెల్ ఆఫీసర్స్ చేపట్టిన మ్యాపింగ్ సర్వేను పరిశీలించి లోపాలను ఎత్తి చూపారు. పలు డివిజన్లలో బూత్ లెవెల్ ఆఫీసర్ (బి.ఎల్.ఓ) లు పని చేస్తున్నట్టు కనిపించడం, కానీ బి.ఎల్.ఓ లు డివిజన్ లో గడప గడపకు తిరగకుండా స్థానిక కార్పొరేటర్ కనుసన్నుల్లో ఒకే స్థానంలో కూర్చుని ఓట్ల మ్యాపింగ్ చేస్తున్నట్టు తప్పుడు నివేదికలు తయారు చేయడంతోనే డివిజన్లలోని ఓట్లు గల్లంతు అవుతున్నాయని తెలిపారు. ఓట్ల గల్లంతు విషయంలో మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల ముందు వందల సంఖ్యలో పిర్యాదులు వచ్చిన వాటిని పరిష్కరించకపోవడంతోనే నేడు భారీగా పోలింగ్ శాతం తగ్గిందని, దీనికి ప్రధాన కారణం బి.ఎల్.ఓ లు వారి పై ఆధారపడుతున్న జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ లే భాద్యులని బేతి మహేందర్ రెడ్డి ఆరోపించారు. ఓటరు జాబితాలో మరణించినవారి ఓట్లు యధాతథంగా ఉండడం, బ్రతికున్నవారి ఓట్లు తొలగించడం ఎంత పెద్ద నేరమో జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ గమనించాలని పేర్కొంటూ, అలాగే డివిజన్ లో ఒక ఇంటిలో ఉన్న నాలుగు ఓట్లు నలుదిక్కుల నాలుగు ఇతర డివిజన్లలో బదిలీ కావడం, ఇతర గ్రామాలలోని ఓట్లు డివిజన్లలో దొంగ ఓట్లు నమోదు చేయించడం, డబుల్ ఓట్లు రావడం, అలాగే ఓటరు జాబితాలో పేరు ఒకటి, ఫోటో మరొకటి ఉండటం లాంటి ఎన్నో తప్పులు దొర్లాయని తెలిపారు. తప్పులకు ప్రధాన కారకులుగా జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, సంబంధిత శాఖల సిబ్బంది సమన్వయ లోపంతో జరిగిందని బేతి మహేందర్ రెడ్డి ఆరోపించారు. అందుకే రాష్ట్రంలో ఆధార్ కార్డు ఓటరు కార్డుతో లింక్ పెట్టే స్పెషల్ఇంటెన్సివ్ రివిజన్ “సర్” నిబంధన కఠినతరం చేయాలని, అప్పుడే దొంగ ఓట్లకు, డబుల్ ఓట్లకు చెక్ పడే అవకాశం ఉంటుందని, లేనిపక్షంలో తెలంగాణలో సర్ నిబంధనను అమలు చేసే విధంగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు.
    2
    కరీంనగర్ లో డివిజన్ల మ్యాపింగ్ పేరుతో అన్ని డివిజన్లలో చేపడుతున్న సర్వే లోపభూయిష్టంగా ఉందని, దానికి ప్రధాన కారణం సంబంధిత అధికారుల నిర్లక్ష్యంతోనే ఓట్ల గల్లంతు జరిగిందని జనసేన పార్టీ పార్లమెంట్ కో-ఆర్డినేటర్ బేతి మహేందర్ రెడ్డి ఆరోపించారు. కరీంనగర్ లోని బూత్ లెవెల్ ఆఫీసర్స్ చేపట్టిన మ్యాపింగ్ సర్వేను పరిశీలించి లోపాలను ఎత్తి చూపారు. పలు  డివిజన్లలో బూత్ లెవెల్ ఆఫీసర్ (బి.ఎల్.ఓ) లు పని చేస్తున్నట్టు కనిపించడం, కానీ బి.ఎల్.ఓ లు డివిజన్ లో గడప గడపకు తిరగకుండా స్థానిక కార్పొరేటర్ కనుసన్నుల్లో ఒకే స్థానంలో కూర్చుని ఓట్ల మ్యాపింగ్ చేస్తున్నట్టు తప్పుడు నివేదికలు తయారు చేయడంతోనే డివిజన్లలోని ఓట్లు గల్లంతు అవుతున్నాయని తెలిపారు. ఓట్ల గల్లంతు విషయంలో మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల ముందు వందల సంఖ్యలో పిర్యాదులు వచ్చిన వాటిని పరిష్కరించకపోవడంతోనే నేడు భారీగా పోలింగ్ శాతం తగ్గిందని, దీనికి ప్రధాన కారణం బి.ఎల్.ఓ లు వారి పై ఆధారపడుతున్న జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ లే భాద్యులని బేతి మహేందర్ రెడ్డి ఆరోపించారు. ఓటరు జాబితాలో మరణించినవారి ఓట్లు యధాతథంగా ఉండడం, బ్రతికున్నవారి ఓట్లు తొలగించడం ఎంత పెద్ద నేరమో జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ గమనించాలని పేర్కొంటూ, అలాగే డివిజన్ లో ఒక ఇంటిలో ఉన్న నాలుగు ఓట్లు నలుదిక్కుల నాలుగు ఇతర డివిజన్లలో బదిలీ కావడం, ఇతర గ్రామాలలోని ఓట్లు డివిజన్లలో  దొంగ ఓట్లు నమోదు చేయించడం, డబుల్ ఓట్లు రావడం, అలాగే ఓటరు జాబితాలో పేరు ఒకటి, ఫోటో మరొకటి ఉండటం లాంటి ఎన్నో తప్పులు దొర్లాయని తెలిపారు. తప్పులకు ప్రధాన కారకులుగా జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, సంబంధిత శాఖల సిబ్బంది సమన్వయ లోపంతో జరిగిందని బేతి మహేందర్ రెడ్డి ఆరోపించారు. అందుకే రాష్ట్రంలో ఆధార్ కార్డు ఓటరు కార్డుతో లింక్ పెట్టే స్పెషల్ఇంటెన్సివ్ రివిజన్ “సర్” నిబంధన కఠినతరం చేయాలని, అప్పుడే దొంగ ఓట్లకు, డబుల్ ఓట్లకు చెక్ పడే అవకాశం ఉంటుందని, లేనిపక్షంలో తెలంగాణలో సర్ నిబంధనను అమలు చేసే విధంగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    4 hrs ago
  • 📅 తేదీ: 07-04-2026 (మంగళవారం) ⏰ సమయం: ఉదయం 9:30 గంటలకు సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ప్రతి మంగళవారం నిర్వహించే పులిహోర పంపిణీ కార్యక్రమం ఈ మంగళవారం దాతలు: 🙏 మానమ్మ భూపాతిరావు లక్ష్మి దంపతులు 👨‍👩‍👧‍👦 మరియు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం స్థానిక అంగడిపేట్ హనుమాన్ దేవాలయం వద్ద నిర్వహించబడును. 👉 కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో కొమరవెల్లి దేవస్థానం డైరెక్టర్ నంగునూరు సత్యనారాయణ, కైలాస ప్రశాంత్, గందె సంతోష్, మురికి విజయ్, రాములు, ఆర్యవైశ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు
    4
    📅 తేదీ: 07-04-2026 (మంగళవారం)
⏰ సమయం: ఉదయం 9:30 గంటలకు
సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ప్రతి మంగళవారం నిర్వహించే పులిహోర పంపిణీ కార్యక్రమం ఈ మంగళవారం
దాతలు:
🙏 మానమ్మ భూపాతిరావు లక్ష్మి దంపతులు
👨‍👩‍👧‍👦 మరియు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో
ఈ కార్యక్రమం స్థానిక అంగడిపేట్ హనుమాన్ దేవాలయం వద్ద నిర్వహించబడును.
👉 కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో కొమరవెల్లి దేవస్థానం డైరెక్టర్ నంగునూరు సత్యనారాయణ, కైలాస ప్రశాంత్, గందె సంతోష్, మురికి విజయ్, రాములు, ఆర్యవైశ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు
    user_GOUSE BEURO REPORTER
    GOUSE BEURO REPORTER
    రిపోర్టర్ వర్గల్, సిద్దిపేట, తెలంగాణ•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.