జగిత్యాల మున్సిపాలిటీలో అన్ని అవకతవకలే...భారీగా లోపాలను బయటపెట్టిన ఎసిబి అధికారులు. జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ సోదాల్లో అనేక లోపాలు, అవకతవకలు బయటపడ్డాయి. అధికారుల నిర్లక్ష్యం, నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగుల పనితీరు తేటతెల్లం అయింది. 10 గంటల పాటు కొనసాగిన ఏసిబి అధికారుల తనిఖీలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయని ఏసిబి ఇన్ స్పెక్టర్ పూర్ణచందర్ తెలిపారు. పన్నుల వసూళ్ళలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలిపారు. ఏటా 14 కోట్ల 76 లక్షల ఆస్తిపన్ను వసూలు చేయాల్సి ఉండగా 50 శాతం మాత్రమే వసూలు చేశారని, హోర్డింగ్ ల పన్ను జీరోగా ఉందని చెప్పారు. గత ఐదు సంవత్సరాలుగా షాప్ ల ప్రాపర్టీ టాక్స్ పూర్తి స్థాయిలో వసూలు చేయలేదని, మున్సిపల్ కు చెందిన అద్దె భవనాల విషయంలో గత 18 సంవత్సరాలుగా రీ టెండర్ నిర్వహించలేదని తేలిందన్నారు. పారిశుద్ధ వాహనాల డీజీల్, రిపేర్ బిల్లుల విషయంలో అవకతవకలు జరిగాయని, మున్సిపాలిటీకి చెందిన ఒక ట్రాక్టర్, 4 ఆటోలు 5 సంవత్సరాల క్రితం మాయంకాగ, ఆ వాహనాలకు సంబంధించిన సమాచారం ఇప్పటికి కార్యాలయంలో లేదని తెలిపారు. టౌన్ ప్లానింగ్ కు సంబంధించి LRS, బిల్డింగ్ అనుమతులకు సంబంధించిన ఫైల్స్ పెండింగ్ లో ఉన్నాయని, జగిత్యాల టౌన్ తోపాటు శివారు గ్రామాల్లో ఫాగింగ్ సంబంధించిన బిల్లుల్లో అవకతవకలు జరిగాయని తెలిపారు. కార్యాలయంకు సంబంధించిన జిఎస్టీ బిల్లుల్లో తేడాలున్నాయని, కార్యాలయానికి సంబంధించిన సిబ్బంది ఫోన్ పే గూగుల్ పే లావాదేవీలు పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక పంపుతామని ఎసిబి సిఐ పూర్ణచందర్ తెలిపారు. *16 మంది కమీషనర్ లు బదిలీ* 2019 నుంచి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో ఇప్పటి వరకు 16 మంది కమీషన్లు బదిలీ అయ్యారు. అవినీతి ఆరోపణలపై 8 మంది ఉద్యోగులు జైలు కెళ్లారు. గతంలోనూ రెండు సార్లు ఏసీబీ, రెండు సార్లు విజిలెన్స్ అధికారుల సోదాలు నిర్వహించారు. తాజాగా జరిగిన ఏసీబీ అధికారుల సోదాలతో మరోసారి జగిత్యాల మున్సిపల్ కార్యాలయం వార్తల్లో నిలిచింది.
జగిత్యాల మున్సిపాలిటీలో అన్ని అవకతవకలే...భారీగా లోపాలను బయటపెట్టిన ఎసిబి అధికారులు. జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ సోదాల్లో అనేక లోపాలు, అవకతవకలు బయటపడ్డాయి. అధికారుల నిర్లక్ష్యం, నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగుల పనితీరు తేటతెల్లం అయింది. 10 గంటల పాటు కొనసాగిన ఏసిబి అధికారుల తనిఖీలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయని ఏసిబి ఇన్ స్పెక్టర్ పూర్ణచందర్ తెలిపారు. పన్నుల వసూళ్ళలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలిపారు. ఏటా 14 కోట్ల 76 లక్షల ఆస్తిపన్ను వసూలు
చేయాల్సి ఉండగా 50 శాతం మాత్రమే వసూలు చేశారని, హోర్డింగ్ ల పన్ను జీరోగా ఉందని చెప్పారు. గత ఐదు సంవత్సరాలుగా షాప్ ల ప్రాపర్టీ టాక్స్ పూర్తి స్థాయిలో వసూలు చేయలేదని, మున్సిపల్ కు చెందిన అద్దె భవనాల విషయంలో గత 18 సంవత్సరాలుగా రీ టెండర్ నిర్వహించలేదని తేలిందన్నారు. పారిశుద్ధ వాహనాల డీజీల్, రిపేర్ బిల్లుల విషయంలో అవకతవకలు జరిగాయని, మున్సిపాలిటీకి చెందిన ఒక ట్రాక్టర్, 4 ఆటోలు 5
సంవత్సరాల క్రితం మాయంకాగ, ఆ వాహనాలకు సంబంధించిన సమాచారం ఇప్పటికి కార్యాలయంలో లేదని తెలిపారు. టౌన్ ప్లానింగ్ కు సంబంధించి LRS, బిల్డింగ్ అనుమతులకు సంబంధించిన ఫైల్స్ పెండింగ్ లో ఉన్నాయని, జగిత్యాల టౌన్ తోపాటు శివారు గ్రామాల్లో ఫాగింగ్ సంబంధించిన బిల్లుల్లో అవకతవకలు జరిగాయని తెలిపారు. కార్యాలయంకు సంబంధించిన జిఎస్టీ బిల్లుల్లో తేడాలున్నాయని, కార్యాలయానికి సంబంధించిన సిబ్బంది ఫోన్ పే గూగుల్ పే లావాదేవీలు పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక పంపుతామని ఎసిబి
సిఐ పూర్ణచందర్ తెలిపారు. *16 మంది కమీషనర్ లు బదిలీ* 2019 నుంచి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో ఇప్పటి వరకు 16 మంది కమీషన్లు బదిలీ అయ్యారు. అవినీతి ఆరోపణలపై 8 మంది ఉద్యోగులు జైలు కెళ్లారు. గతంలోనూ రెండు సార్లు ఏసీబీ, రెండు సార్లు విజిలెన్స్ అధికారుల సోదాలు నిర్వహించారు. తాజాగా జరిగిన ఏసీబీ అధికారుల సోదాలతో మరోసారి జగిత్యాల మున్సిపల్ కార్యాలయం వార్తల్లో నిలిచింది.
- జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ సోదాల్లో అనేక లోపాలు, అవకతవకలు బయటపడ్డాయి. అధికారుల నిర్లక్ష్యం, నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగుల పనితీరు తేటతెల్లం అయింది. 10 గంటల పాటు కొనసాగిన ఏసిబి అధికారుల తనిఖీలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయని ఏసిబి ఇన్ స్పెక్టర్ పూర్ణచందర్ తెలిపారు. పన్నుల వసూళ్ళలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలిపారు. ఏటా 14 కోట్ల 76 లక్షల ఆస్తిపన్ను వసూలు చేయాల్సి ఉండగా 50 శాతం మాత్రమే వసూలు చేశారని, హోర్డింగ్ ల పన్ను జీరోగా ఉందని చెప్పారు. గత ఐదు సంవత్సరాలుగా షాప్ ల ప్రాపర్టీ టాక్స్ పూర్తి స్థాయిలో వసూలు చేయలేదని, మున్సిపల్ కు చెందిన అద్దె భవనాల విషయంలో గత 18 సంవత్సరాలుగా రీ టెండర్ నిర్వహించలేదని తేలిందన్నారు. పారిశుద్ధ వాహనాల డీజీల్, రిపేర్ బిల్లుల విషయంలో అవకతవకలు జరిగాయని, మున్సిపాలిటీకి చెందిన ఒక ట్రాక్టర్, 4 ఆటోలు 5 సంవత్సరాల క్రితం మాయంకాగ, ఆ వాహనాలకు సంబంధించిన సమాచారం ఇప్పటికి కార్యాలయంలో లేదని తెలిపారు. టౌన్ ప్లానింగ్ కు సంబంధించి LRS, బిల్డింగ్ అనుమతులకు సంబంధించిన ఫైల్స్ పెండింగ్ లో ఉన్నాయని, జగిత్యాల టౌన్ తోపాటు శివారు గ్రామాల్లో ఫాగింగ్ సంబంధించిన బిల్లుల్లో అవకతవకలు జరిగాయని తెలిపారు. కార్యాలయంకు సంబంధించిన జిఎస్టీ బిల్లుల్లో తేడాలున్నాయని, కార్యాలయానికి సంబంధించిన సిబ్బంది ఫోన్ పే గూగుల్ పే లావాదేవీలు పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక పంపుతామని ఎసిబి సిఐ పూర్ణచందర్ తెలిపారు. *16 మంది కమీషనర్ లు బదిలీ* 2019 నుంచి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో ఇప్పటి వరకు 16 మంది కమీషన్లు బదిలీ అయ్యారు. అవినీతి ఆరోపణలపై 8 మంది ఉద్యోగులు జైలు కెళ్లారు. గతంలోనూ రెండు సార్లు ఏసీబీ, రెండు సార్లు విజిలెన్స్ అధికారుల సోదాలు నిర్వహించారు. తాజాగా జరిగిన ఏసీబీ అధికారుల సోదాలతో మరోసారి జగిత్యాల మున్సిపల్ కార్యాలయం వార్తల్లో నిలిచింది.4
- గన్నేరువరం మండలం చాకలివానిపల్లి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) నిధులతో రూ.5 లక్షల వ్యయంతో కూనవాణిపల్లి పరిధిలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఈరోజు ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ రేపాక బానవ్వ గారు వాటర్ ట్యాంక్ నుండి పెద్దమ్మ గుడి వరకు ఈ రోడ్డు పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... గ్రామ ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా కోసం ఈ రోడ్డు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు బోయిని బాలయ్య, బామండ్ల మల్లేష్, కూన శ్రవంతి, MRPS మండల అధ్యక్షులు రేపాక బాబు, కూన చంద్రశేఖర్, కూన రవి, కూన రాజు, కూన సతీష్, కూన శ్రీనివాస్, జెరిపోతుల అనిల్ తదితరులు పాల్గొన్నారు.1
- గన్నేరువరం మండల కేంద్రంలో బి ఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గంప వెంకన్న ఆధ్వర్యంలో మాజీ సుడ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణారావు జన్మదిన వేడుకలు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పుల్లెల లక్ష్మణ్, నేత సుధాకర్, మీసాల ప్రభాకర్, కొట్టే భూమయ్య, బొడ్డు శ్రీనివాస్ అధిక సంఖ్యలో బి ఆర్ ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.నర్సంపేటకు చెందిన రంపిస ప్రణయ్ అనే భక్తుడు స్వామివారి దర్శనం అనంతరం ఆలయం బయటకు వెళ్తుండగా ఆయనకు చెందిన బంగారు బ్రేస్ లెట్ ఆలయం ముందు భాగంలో పడిపోయింది. అక్కడ పెలాలు అమ్ముకునే ఇద్దరు వ్యక్తులు ఆ బ్రేస్‌లెట్ తమదేనని చెప్పుకుంటూ వాదనకు దిగారు. ఈ సమయంలో వేములవాడ గాంధీనగర్‌లో గత పది సంవత్సరాలుగా సోడా బండి వ్యాపారం చేస్తున్న కొంపల్లి రమేష్ ఆ బ్రేస్ లెట్‌ను వారి దగ్గర నుండి తీసుకొని ఆలయం లో విధులు నిర్వహిస్తున్న ఎస్పీఎఫ్ హోంగార్డులకు అందజేశారు. అనంతరం హోంగార్డులు ఎస్పీ ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ ఆ విషయాన్ని ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మకి తెలియజేశారు.భక్తుల ద్వారా సమాచారం అందడంతో ఆలయ అధికారులు వివరాలు సేకరించి, రసీదులు పరిశీలించి బ్రేస్‌లెట్ నిజమైన యజమాని అయిన రప్పిస ప్రణయ్‌కు ఆలయ ఈవో ఎస్. అంజనా రెడ్డి చేతుల మీదుగా తిరిగి అందజేశారు.నిజాయితీగా వ్యవహరించిన కొంపల్లి రమేష్‌ను ఆలయ ఈవో అభినందించి స్వామివారి శేష వస్త్రం, లడ్డూ ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయంలో విధులు నిర్వహిస్తున్న ఎస్పీఎఫ్, హోంగార్డులు సిబ్బందికి మరియు ఆలయ సిబ్బందికి కూడా ఈవో అభినందనలు తెలిపారు.అందజేసిన బంగారు బ్రేస్‌లెట్ బరువు సుమారు 8 గ్రాములు 130 మిల్లీ గ్రాములు ఉండగా, దాని విలువ సుమారు రూ.1.18 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.1
- జగిత్యాల : 👉 కార్యాలయం గేటుకు తాళాలు వేసి పలు విభాగాల్లో ఫైలు తనిఖీ జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో ఏసిబి డి ఎస్పీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో అధికారులు మంగళవారం ఉదయం 11 గంటల నుండి దాడులు నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయంలో పలు శాఖల్లో అవినీతి ఆరోాపణలు వినిపిస్తున్న నేపథ్యంలో పలు శాఖల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ డి.ఎస్.పి విజయ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు . గత కొన్ని రోజులుగా మున్సిపాలిటీలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు, వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ దాడులు జరుగుతున్నట్లు తెలుస్తుంది. కరీంనగర్ పరిధికి చెందిన ACB బృందం మున్సిపల్ కార్యాలయంలో పత్రాలు, ఫైళ్లను పరిశీలిస్తూ, ఆర్థిక లావాదేవీలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. కొందరు అధికారుల పనితీరుపై కూడా విచారణ జరుగుతోందని తెలుస్తోంది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.1
- వరంగల్ జిల్లా: పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఎంజీఎం ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. వైద్యులు సమయపాలన పాటించాలని, సూపర్డెంట్, ఆర్‌ఎంఓలు క్షేత్రస్థాయి పర్యవేక్షణ బలోపేతం చేయాలని తెలిపారు. ఆస్పత్రిలో ఔషధాల కొరత లేకుండా టెండర్ ప్రక్రియ చేపట్టాలని, పారిశుద్ధ్యాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని వైద్యులు, సిబ్బందిని హెచ్చరించారు.1
- సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో నిర్వహించిన మైనార్టీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మైనార్టీ నాయకుడు సయ్యద్ మతిన్ మాట్లాడారు.బిఆర్ఎస్ పార్టీ అనవసర ఆరోపణలు చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తోందని ఆయన విమర్శించారు. టిఆర్ఎస్ హయాంలో మైనార్టీలకు ఎలాంటి ప్రయోజనం కలగలేదని, మైనార్టీ చెక్కులు, కుట్టు మిషన్లు వచ్చినప్పటికీ వాటిని కొంతమంది మాత్రమే పొందారని ఆరోపించారు. ముస్లింలకు 12% రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ ఆ వాగ్దానాన్ని అమలు చేయలేదని, ఈ విషయంలో ప్రతాప్ రెడ్డి స్పందించలేదని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతాప్ రెడ్డి, 2018లో టిఆర్ఎస్‌కు మద్దతు ఇచ్చి పదవులు పొందారని అన్నారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టినందుకు విమర్శలు చేయడం, పోలీస్ కేసులు నమోదు చేయడం తగదని, కేసుల్లో సంబంధం లేని వారిని కూడా ఇరికిస్తున్నారని ఆరోపించారు. అలాగే తమ నాయకుడు నరసన్నపై అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలను మానుకోవాలని, ప్రజల్లో శాంతి భద్రతలను కాపాడాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు సయ్యద్ మతిన్ మాజీ కౌన్సిలర్ సమీర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ డాక్టర్ వహీద్, మహమ్మద్ జలాల్, మహమ్మద్ జహీర్, సమీర్ ఇర్షాద్, అత ఉల్లా బేగ్, షకీల్ పటేల్, మొహమ్మద్ జుబేర్, భారీ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.4
- ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యాలయాల్లో ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సిరిసిల్ల కలెక్టర్ గరిమా అగ్రవాల్ సూచించారు. వేములవాడలోని మహాత్మాజ్యోతి బాపూలే బాలికల రెసిడెన్షియల్ విద్యాలయంలో కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యాలయం ఆవరణ, తరగతి గదులు, కిచెన్ లో ఆహార పదార్థాలను పరిశీలించారు. మెనూ చార్ట్ పరిశీలించి.. ఏ ఏ వంటకాలు సిద్ధం చేస్తున్నారో తనిఖీ చేశారు. ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, తమ కుటుంబంలో పిల్లలకు ఆహార పదార్థాలు ఎలా సిద్ధం చేస్తారో అలాగే ఇక్కడ విద్యార్థుల కోసం వండాలని ఆదేశించారు. అనంతరం 9వ తరగతి విద్యార్థులతో కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడారు. అన్ని పరీక్షలకు సంబంధించిన టైమ్ టేబుల్ సిద్ధం చేసుకోవాలని, ఏ రోజు ఏ సబ్జెక్ట్ చదవాలో ముందే రాసుకోవాలని, దానికి అనుగుణంగా అన్ని సబ్జెక్టులు చదవడం, రాయడం పూర్తి చేయాలని తెలిపారు. రైటింగ్ కూడా సాధన చేయాలని, వార్షిక పరీక్షల సమయానికి అనుగుణంగా ఇప్పుడు అదే సమయంలో అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాసేలా సాధన చేయాలని పేర్కొన్నారు. ఇప్పటి మార్కులు మీరు తర్వాత చదివే ఉన్నత తరగతులకు ఎంతో కీలకమని స్పష్టం చేశారు. విద్యార్థులం దరూ రానున్న పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థులు ఏ నేపథ్యం నుంచి వచ్చినా.. ఇప్పుడు ఇష్టపడి సాధన చేయడం.. అన్ని సబ్జెక్టుల్లో రాణించడంతో వారి భవిష్యత్తు ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతి విద్యార్థి వివిధ ఉద్యోగాలు, వృత్తుల్లో స్థిరపడాలని, ఉన్నత స్థానాల్లో నిలవాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకాంక్షించారు.1