జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల సోదాలు,కార్యాలయం గేటుకు తాళాలు వేసి పలు విభాగాల్లో ఫైలు తనిఖీ జగిత్యాల : 👉 కార్యాలయం గేటుకు తాళాలు వేసి పలు విభాగాల్లో ఫైలు తనిఖీ జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో ఏసిబి డి ఎస్పీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో అధికారులు మంగళవారం ఉదయం 11 గంటల నుండి దాడులు నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయంలో పలు శాఖల్లో అవినీతి ఆరోాపణలు వినిపిస్తున్న నేపథ్యంలో పలు శాఖల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ డి.ఎస్.పి విజయ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు . గత కొన్ని రోజులుగా మున్సిపాలిటీలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు, వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ దాడులు జరుగుతున్నట్లు తెలుస్తుంది. కరీంనగర్ పరిధికి చెందిన ACB బృందం మున్సిపల్ కార్యాలయంలో పత్రాలు, ఫైళ్లను పరిశీలిస్తూ, ఆర్థిక లావాదేవీలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. కొందరు అధికారుల పనితీరుపై కూడా విచారణ జరుగుతోందని తెలుస్తోంది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల సోదాలు,కార్యాలయం గేటుకు తాళాలు వేసి పలు విభాగాల్లో ఫైలు తనిఖీ జగిత్యాల : 👉 కార్యాలయం గేటుకు తాళాలు వేసి పలు విభాగాల్లో ఫైలు తనిఖీ జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో ఏసిబి డి ఎస్పీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో అధికారులు మంగళవారం ఉదయం 11 గంటల నుండి దాడులు నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయంలో పలు శాఖల్లో అవినీతి ఆరోాపణలు వినిపిస్తున్న నేపథ్యంలో పలు శాఖల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ డి.ఎస్.పి విజయ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు . గత కొన్ని రోజులుగా మున్సిపాలిటీలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు, వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ దాడులు జరుగుతున్నట్లు తెలుస్తుంది. కరీంనగర్ పరిధికి చెందిన ACB బృందం మున్సిపల్ కార్యాలయంలో పత్రాలు, ఫైళ్లను పరిశీలిస్తూ, ఆర్థిక లావాదేవీలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. కొందరు అధికారుల పనితీరుపై కూడా విచారణ జరుగుతోందని తెలుస్తోంది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
- జగిత్యాల : 👉 కార్యాలయం గేటుకు తాళాలు వేసి పలు విభాగాల్లో ఫైలు తనిఖీ జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో ఏసిబి డి ఎస్పీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో అధికారులు మంగళవారం ఉదయం 11 గంటల నుండి దాడులు నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయంలో పలు శాఖల్లో అవినీతి ఆరోాపణలు వినిపిస్తున్న నేపథ్యంలో పలు శాఖల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ డి.ఎస్.పి విజయ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు . గత కొన్ని రోజులుగా మున్సిపాలిటీలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు, వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ దాడులు జరుగుతున్నట్లు తెలుస్తుంది. కరీంనగర్ పరిధికి చెందిన ACB బృందం మున్సిపల్ కార్యాలయంలో పత్రాలు, ఫైళ్లను పరిశీలిస్తూ, ఆర్థిక లావాదేవీలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. కొందరు అధికారుల పనితీరుపై కూడా విచారణ జరుగుతోందని తెలుస్తోంది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.1
- లక్షేట్టిపేట్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని పునరుద్ధరించాలని కోరుతూ సాధన కమిటీ నాయకులు సంతకాల సేకరణను ప్రారంభించారు. మంగళవారం వారు లక్షెట్టిపేట పట్టణంలోని ఉత్కూర్ చౌరస్తా వద్ద హమాలీ కార్మికులు, తదితరుల నుండి సంతకాలు సేకరించారు.ఈ కార్యక్రమంలో లక్షేటీపేట్ నియోజకవర్గం సాధన సమితి సభ్యులు బిరుదుల సంతోష్, గడుసు సత్యనారాయణ, గంధం సత్యం, హమాలీ కార్మికుల అధ్యక్షులు గడికొప్పుల. చంద్రయ్య, కమాటం.రమేష్, కొట్టె బానేష్, కండ్రపు సత్తయ్య, ఎగ్గడి నరేష్, దర్శనాల శంకర్, చుక్క తిరుపతి, దండ్రే కిషన్, తదితరులు పాల్గొన్నారు.3
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.నర్సంపేటకు చెందిన రంపిస ప్రణయ్ అనే భక్తుడు స్వామివారి దర్శనం అనంతరం ఆలయం బయటకు వెళ్తుండగా ఆయనకు చెందిన బంగారు బ్రేస్ లెట్ ఆలయం ముందు భాగంలో పడిపోయింది. అక్కడ పెలాలు అమ్ముకునే ఇద్దరు వ్యక్తులు ఆ బ్రేస్‌లెట్ తమదేనని చెప్పుకుంటూ వాదనకు దిగారు. ఈ సమయంలో వేములవాడ గాంధీనగర్‌లో గత పది సంవత్సరాలుగా సోడా బండి వ్యాపారం చేస్తున్న కొంపల్లి రమేష్ ఆ బ్రేస్ లెట్‌ను వారి దగ్గర నుండి తీసుకొని ఆలయం లో విధులు నిర్వహిస్తున్న ఎస్పీఎఫ్ హోంగార్డులకు అందజేశారు. అనంతరం హోంగార్డులు ఎస్పీ ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ ఆ విషయాన్ని ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మకి తెలియజేశారు.భక్తుల ద్వారా సమాచారం అందడంతో ఆలయ అధికారులు వివరాలు సేకరించి, రసీదులు పరిశీలించి బ్రేస్‌లెట్ నిజమైన యజమాని అయిన రప్పిస ప్రణయ్‌కు ఆలయ ఈవో ఎస్. అంజనా రెడ్డి చేతుల మీదుగా తిరిగి అందజేశారు.నిజాయితీగా వ్యవహరించిన కొంపల్లి రమేష్‌ను ఆలయ ఈవో అభినందించి స్వామివారి శేష వస్త్రం, లడ్డూ ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయంలో విధులు నిర్వహిస్తున్న ఎస్పీఎఫ్, హోంగార్డులు సిబ్బందికి మరియు ఆలయ సిబ్బందికి కూడా ఈవో అభినందనలు తెలిపారు.అందజేసిన బంగారు బ్రేస్‌లెట్ బరువు సుమారు 8 గ్రాములు 130 మిల్లీ గ్రాములు ఉండగా, దాని విలువ సుమారు రూ.1.18 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.1
- గన్నేరువరం మండలం చాకలివానిపల్లి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) నిధులతో రూ.5 లక్షల వ్యయంతో కూనవాణిపల్లి పరిధిలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఈరోజు ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ రేపాక బానవ్వ గారు వాటర్ ట్యాంక్ నుండి పెద్దమ్మ గుడి వరకు ఈ రోడ్డు పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... గ్రామ ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా కోసం ఈ రోడ్డు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు బోయిని బాలయ్య, బామండ్ల మల్లేష్, కూన శ్రవంతి, MRPS మండల అధ్యక్షులు రేపాక బాబు, కూన చంద్రశేఖర్, కూన రవి, కూన రాజు, కూన సతీష్, కూన శ్రీనివాస్, జెరిపోతుల అనిల్ తదితరులు పాల్గొన్నారు.1
- గన్నేరువరం మండల కేంద్రంలో బి ఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గంప వెంకన్న ఆధ్వర్యంలో మాజీ సుడ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణారావు జన్మదిన వేడుకలు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పుల్లెల లక్ష్మణ్, నేత సుధాకర్, మీసాల ప్రభాకర్, కొట్టే భూమయ్య, బొడ్డు శ్రీనివాస్ అధిక సంఖ్యలో బి ఆర్ ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు1
- ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యాలయాల్లో ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సిరిసిల్ల కలెక్టర్ గరిమా అగ్రవాల్ సూచించారు. వేములవాడలోని మహాత్మాజ్యోతి బాపూలే బాలికల రెసిడెన్షియల్ విద్యాలయంలో కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యాలయం ఆవరణ, తరగతి గదులు, కిచెన్ లో ఆహార పదార్థాలను పరిశీలించారు. మెనూ చార్ట్ పరిశీలించి.. ఏ ఏ వంటకాలు సిద్ధం చేస్తున్నారో తనిఖీ చేశారు. ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, తమ కుటుంబంలో పిల్లలకు ఆహార పదార్థాలు ఎలా సిద్ధం చేస్తారో అలాగే ఇక్కడ విద్యార్థుల కోసం వండాలని ఆదేశించారు. అనంతరం 9వ తరగతి విద్యార్థులతో కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడారు. అన్ని పరీక్షలకు సంబంధించిన టైమ్ టేబుల్ సిద్ధం చేసుకోవాలని, ఏ రోజు ఏ సబ్జెక్ట్ చదవాలో ముందే రాసుకోవాలని, దానికి అనుగుణంగా అన్ని సబ్జెక్టులు చదవడం, రాయడం పూర్తి చేయాలని తెలిపారు. రైటింగ్ కూడా సాధన చేయాలని, వార్షిక పరీక్షల సమయానికి అనుగుణంగా ఇప్పుడు అదే సమయంలో అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాసేలా సాధన చేయాలని పేర్కొన్నారు. ఇప్పటి మార్కులు మీరు తర్వాత చదివే ఉన్నత తరగతులకు ఎంతో కీలకమని స్పష్టం చేశారు. విద్యార్థులం దరూ రానున్న పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థులు ఏ నేపథ్యం నుంచి వచ్చినా.. ఇప్పుడు ఇష్టపడి సాధన చేయడం.. అన్ని సబ్జెక్టుల్లో రాణించడంతో వారి భవిష్యత్తు ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతి విద్యార్థి వివిధ ఉద్యోగాలు, వృత్తుల్లో స్థిరపడాలని, ఉన్నత స్థానాల్లో నిలవాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకాంక్షించారు.1
- కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం కేంద్రంలో రహదారి విస్తరణ పనుల్లో భాగంగా చేపట్టిన కూల్చివేతలను ఎస్పీఎం పరిశ్రమ ప్రతినిధులు అడ్డుకోవడంతో పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనతో రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడి ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు జోక్యం చేసుకోగా, అధికారులు మరియు పరిశ్రమ ప్రతినిధుల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి.1
- జగిత్యాల : వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ను ,రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డిని జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ మరియు కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ జువ్వాడి నరసింగరావు లు మంగళవారం ఉదయం11-30 గంటలప్రాంతంలో హైదరాబాద్ లో కలిశారు. వారితోపాటుగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గాజంగి నందయ్య,మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం,జగిత్యాల AMC ఛైర్మెన్ గడ్డం నారాయణరెడ్డి,సేవాదళ్ నాయకులు ముకేష్ ఖన్నా లు కలిసి రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డిని శాలువాకప్పి సన్మానించారు.1