Shuru
Apke Nagar Ki App…
గాలివాన బీభత్సానికి బోయినపల్లి గ్రామంలో లేచిపోయిన ఇంటి పైకప్పు రేకులు కనగల్ మండలం బోయినపల్లి గ్రామంలో ఆదివారం కురిసిన ఈదురు గాలులతో కూడిన వర్షం గ్రామస్తులను భయభ్రాంతులకు గురిచేసింది. ఒకసారిగా ఉరుములతో కూడిన గాలివానకు పలువురి గ్రామస్తుల ఇండ్ల రేకులు లేచిపోయాయి. అంతేకాకుండా గ్రామంలో వ్యవసాయ బోరుబావుల వద్ద ఉన్న పలు విద్యుత్ స్తంభాలు నేలమట్టమై ట్రాన్స్ఫార్మర్ల మీద పడడంతో ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసం అయ్యాయి. తీవ్రంగా నష్టపోయిన బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని, విద్యుత్ అధికారులు ధ్వంసమైన స్థానంలో నూతన స్తంభాలు ఏర్పాటు చేయాలని కోరారు.
T Shankar Public News Reporter Nalgonda
గాలివాన బీభత్సానికి బోయినపల్లి గ్రామంలో లేచిపోయిన ఇంటి పైకప్పు రేకులు కనగల్ మండలం బోయినపల్లి గ్రామంలో ఆదివారం కురిసిన ఈదురు గాలులతో కూడిన వర్షం గ్రామస్తులను భయభ్రాంతులకు గురిచేసింది. ఒకసారిగా ఉరుములతో కూడిన గాలివానకు పలువురి గ్రామస్తుల ఇండ్ల రేకులు లేచిపోయాయి. అంతేకాకుండా గ్రామంలో వ్యవసాయ బోరుబావుల వద్ద ఉన్న పలు విద్యుత్ స్తంభాలు నేలమట్టమై ట్రాన్స్ఫార్మర్ల మీద పడడంతో ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసం అయ్యాయి. తీవ్రంగా నష్టపోయిన బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని, విద్యుత్ అధికారులు ధ్వంసమైన స్థానంలో నూతన స్తంభాలు ఏర్పాటు చేయాలని కోరారు.
More news from Telangana and nearby areas
- చిట్యాల మండలం, వెలిమినేడు గ్రామ శివారులోని నోస్ట్ కంపెనీలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ ప్రజా పోరాట సమితి ఆధ్వర్యంలో ఆదివారం కంపెనీ ముందు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకటస్వామి మాట్లాడుతూ.. ప్రమాదంలో గాయపడిన వారికి రూ. కోటి నష్టపరిహారం చెల్లించాలని, నిబంధనలు ఉల్లంఘించిన కంపెనీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.1
- Post by Tagore1
- వరంగల్ నగరంలో ఈ నెల 6న నిర్వహించనున్న రైతు సదస్సుకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు రానున్న నేపథ్యంలో, వర్ధన్నపేట పట్టణంలో సదస్సుకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రైతుల సమస్యల పరిష్కారానికి ఈ సదస్సు దోహదపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- మహిళా రిజర్వేషన్ బిల్లుకు బిజెపి వ్యతిరేకం కాదు: సంగారెడ్డిలో చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి1
- సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జాలిగామ గ్రామంలో నల్లచెరువు కట్ట పరిసరాల్లో జరుగుతున్న చెట్ల నరికివేతపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.గ్రామంలోని నల్లచెరువు కట్టకు ఇరువైపులా ఉన్న చెట్లను అక్రమంగా నరికి వేస్తున్నారని స్థానికులు గమనించారు. ఈ విషయం గురించి ప్రశ్నించగా, గ్రామ సర్పంచ్ మరియు ఆమె భర్త తాళ్ళ ఆంజనేయులు గౌడ్ ఆదేశాల మేరకు చెట్లు నరుకుతున్నామని కొందరు తెలిపారు అని గ్రామస్తులు చెబుతున్నారు.అయితే ఈ నిర్ణయం గురించి కనీసం వార్డ్ మెంబర్లకు లేదా ఉప సర్పంచ్‌కు సమాచారం ఇవ్వకుండా, సర్పంచ్ మరియు ఆమె భర్త ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.ఈ విషయంపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పూర్తి స్థాయిలో విచారణ జరిపి, తప్పు జరిగినట్లయితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.4
- మహబూబాబాద్ జిల్లాలో కురుస్తున్న అకాల వర్షాల మధ్య మాజీ ఎంపీ మాలోత్ కవిత ధాన్య కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ముందుగానే వర్షాల హెచ్చరికలు ఉన్నప్పటికీ ప్రభుత్వం వేగంగా కొనుగోళ్లు పూర్తి చేయలేదని విమర్శించారు. జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం తడిసిపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యమేనని ఆరోపించారు. రైతుల సమస్యలను పట్టించుకోకుండా కేవలం కేంద్రాల ప్రారంభంపైనే ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. రైతులను ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నాలు సహించబోమని, చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేయాలని హెచ్చరించారు. నెల్లికుదురు మండలంలో వర్షంలోనే తడిసిన ధాన్యం వద్ద రైతులకు ధైర్యం చెప్పారు.1
- గజ్వేల్ మండలంలోని అక్కారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. శాసనసభ పక్ష ఉపనేత, మాజీ మంత్రి T. Harish Rao మరియు గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ Vanteru Pratap Reddy సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా కొత్తగా చేరిన నాయకులను బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ గులాబీ కండువాలు వేసి అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్‌లో చేరిన వారిలో బుడుగు ఎల్లం (సింగర్), మాదరబోయిన శేఖర్, మంద రవి, బత్తిని భాను, గుండబోయిన రాజు, దామరకుంట మహేందర్, రాహుల్, విజయ్ తదితరులు ఉన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ Yadav Reddy, మండల పార్టీ అధ్యక్షుడు బెండ మధు, గజ్వేల్ పట్టణ అధ్యక్షుడు మరియు మాజీ వైస్ చైర్మన్ నర్సింగరావు, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, కౌన్సిలర్లు గోలి మమత సంతోష్, అత్తిలి, శ్రీనివాస్, మన్నే రూపా వెంకటేష్, కనక సేన, కప్ప పోచయ్య, మాజీ కౌన్సిలర్లు గుంటుకు రాజు, మరికంటి కనకయ్య, అక్కారం మాజీ సర్పంచ్ బాలచందర్ తదితరులు పాల్గొన్నారు.4
- కనగల్ మండలం బోయినపల్లి గ్రామంలో ఆదివారం కురిసిన ఈదురు గాలులతో కూడిన వర్షం గ్రామస్తులను భయభ్రాంతులకు గురిచేసింది. ఒకసారిగా ఉరుములతో కూడిన గాలివానకు పలువురి గ్రామస్తుల ఇండ్ల రేకులు లేచిపోయాయి. అంతేకాకుండా గ్రామంలో వ్యవసాయ బోరుబావుల వద్ద ఉన్న పలు విద్యుత్ స్తంభాలు నేలమట్టమై ట్రాన్స్ఫార్మర్ల మీద పడడంతో ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసం అయ్యాయి. తీవ్రంగా నష్టపోయిన బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని, విద్యుత్ అధికారులు ధ్వంసమైన స్థానంలో నూతన స్తంభాలు ఏర్పాటు చేయాలని కోరారు.1