Shuru
Apke Nagar Ki App…
అకాల వర్షాల్లో తడిసిన ధాన్యం – కొనుగోలు కేంద్రాలపై తీవ్ర ఆగ్రహం మహబూబాబాద్ జిల్లాలో కురుస్తున్న అకాల వర్షాల మధ్య మాజీ ఎంపీ మాలోత్ కవిత ధాన్య కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ముందుగానే వర్షాల హెచ్చరికలు ఉన్నప్పటికీ ప్రభుత్వం వేగంగా కొనుగోళ్లు పూర్తి చేయలేదని విమర్శించారు. జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం తడిసిపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యమేనని ఆరోపించారు. రైతుల సమస్యలను పట్టించుకోకుండా కేవలం కేంద్రాల ప్రారంభంపైనే ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. రైతులను ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నాలు సహించబోమని, చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేయాలని హెచ్చరించారు. నెల్లికుదురు మండలంలో వర్షంలోనే తడిసిన ధాన్యం వద్ద రైతులకు ధైర్యం చెప్పారు.
Mediya wgl medical wgl
అకాల వర్షాల్లో తడిసిన ధాన్యం – కొనుగోలు కేంద్రాలపై తీవ్ర ఆగ్రహం మహబూబాబాద్ జిల్లాలో కురుస్తున్న అకాల వర్షాల మధ్య మాజీ ఎంపీ మాలోత్ కవిత ధాన్య కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ముందుగానే వర్షాల హెచ్చరికలు ఉన్నప్పటికీ ప్రభుత్వం వేగంగా కొనుగోళ్లు పూర్తి చేయలేదని విమర్శించారు. జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం తడిసిపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యమేనని ఆరోపించారు. రైతుల సమస్యలను పట్టించుకోకుండా కేవలం కేంద్రాల ప్రారంభంపైనే ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. రైతులను ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నాలు సహించబోమని, చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేయాలని హెచ్చరించారు. నెల్లికుదురు మండలంలో వర్షంలోనే తడిసిన ధాన్యం వద్ద రైతులకు ధైర్యం చెప్పారు.
More news from తెలంగాణ and nearby areas
- మహబూబాబాద్ జిల్లాలో కురుస్తున్న అకాల వర్షాల మధ్య మాజీ ఎంపీ మాలోత్ కవిత ధాన్య కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ముందుగానే వర్షాల హెచ్చరికలు ఉన్నప్పటికీ ప్రభుత్వం వేగంగా కొనుగోళ్లు పూర్తి చేయలేదని విమర్శించారు. జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం తడిసిపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యమేనని ఆరోపించారు. రైతుల సమస్యలను పట్టించుకోకుండా కేవలం కేంద్రాల ప్రారంభంపైనే ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. రైతులను ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నాలు సహించబోమని, చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేయాలని హెచ్చరించారు. నెల్లికుదురు మండలంలో వర్షంలోనే తడిసిన ధాన్యం వద్ద రైతులకు ధైర్యం చెప్పారు.1
- వరంగల్ నగరంలో ఈ నెల 6న నిర్వహించనున్న రైతు సదస్సుకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు రానున్న నేపథ్యంలో, వర్ధన్నపేట పట్టణంలో సదస్సుకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రైతుల సమస్యల పరిష్కారానికి ఈ సదస్సు దోహదపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట్ భూంపల్లి చౌరస్తా వద్ద ఈ రోజు నిర్వహించిన రైతుల ధర్నాలో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వరి కొనుగోలు కేంద్రాల్లో అమలు చేస్తున్న గ్రేడ్‌ల విధానం కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు ఎన్నో ఆశలతో, అప్పులు చేసి, ఎండను వానను లెక్కచేయకుండా పంట పండిస్తారని, కానీ ధాన్యం అమ్ముకునే సమయంలో మాత్రం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రైతు నాయకులు తెలిపారు. ఒకవైపు పెట్టుబడి ఖర్చులు పెరిగిపోతుండగా, మరోవైపు కొనుగోలు కేంద్రాల్లో ఆలస్యం, మిల్లర్ల నిర్లక్ష్యం, గ్రేడ్‌ల పేరుతో కోతలు విధించడం రైతులను మరింత ఆర్థికంగా దెబ్బతీస్తోందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో సరైన సౌకర్యాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ట్రాక్టర్లు, లారీలు రోజుల తరబడి నిలిపివేయడం వల్ల రవాణా ఖర్చులు పెరిగిపోతున్నాయని, రైతులు రాత్రింబవళ్లు ధాన్యం దగ్గరే కాపలా కాయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. తాగునీరు, టెంట్లు, హమాలీల సౌకర్యాలు కూడా సరైన విధంగా లేవని విమర్శించారు. తేమ, రంగు, గ్రేడ్ పేర్లతో ధాన్యాన్ని తిరస్కరించడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, అదే ధాన్యాన్ని తర్వాత మిల్లర్లు తీసుకుంటున్న పరిస్థితి రైతుల్లో అనుమానాలకు తావిస్తున్నదన్నారు. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర రైతులకు పూర్తిగా అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే పరిష్కరించి, ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని, గ్రేడ్‌ల విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే వచ్చే మంగళవారం భారీ సంఖ్యలో రైతులతో కలిసి కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు.1
- కరీంనగర్ లో జ్యువెలరీ షాప్ లో చోరీ, కాల్పుల ఘటనకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. దొంగలు జరిపిన కాల్పుల్లో గాయపడి కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముస్తాక్ మధుకర్, రాజేష్, కమలాసన్ ను కరీంనగర్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పరామర్శించారు. ఈ ఘటన ప్రభుత్వ శాంతి భద్రతల వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. పట్టపగలు చోరీకి పాల్పడి పోలీసులకు సవాల్ విసిరారని తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. కరీంనగర్ లో ఇలాంటి ఘటనలు గతంలో ఎప్పుడు జరగలేదని గంగుల కమలాకర్ తెలిపారు. స్మార్ట్ సిటీలో భాగంగా నగరంలో 750 కెమెరాలు పెట్టించి కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వానిదేనని చెప్పారు. కరీంనగర్ సేఫ్ సిట్టిగా భావించి అనేక జువెలరీ సంస్థలు వచ్చాయని, ఇవాల్టి ఘటనతో అందరూ భయపడుతున్నారని కమలాకర్ అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠిన చర్యలు చేపట్టాలని కోరారు.2
- బెజ్జంకి మండలంలోని కల్లెపల్లి గ్రామంలో చేతికొచ్చిన మొక్కజొన్న పంటకు ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించి రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూశారు. పంట పూర్తిగా కాలిపోవడంతో రైతుల ఆర్థిక పరిస్థితి దెబ్బతింది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే బెజ్జంకి మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ గ్రామాన్ని సందర్శించి బాధిత రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని ధైర్యం చెప్పడంతో పాటు ప్రభుత్వం తరఫున తగిన నష్టపరిహారం అందేలా ఉన్నతాధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రవి, ఐలయ్య, ప్రభాకర్, సంతోష్ తదితరులు పాల్గొని రైతులకు సంఘీభావం తెలిపారు. గ్రామంలో జరిగిన ఈ ఘటనపై స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.1
- ఖమాండ్ కంట్రోల్,సిసి కెమెరాలు అన్నీ పని చేస్తున్నాయి దుండగులను పోలీసులు త్వరలోనే పట్టుకుంటారు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం సీరియస్ గా చర్యలు తీసుకుంటుంది జ్యువెల్లరీ షాపు సంఘటనలో గాయపడ్డ బాధితులను పరామర్శించి మీడియాతో మాట్లాడిన సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పిఎంజే జ్యువెల్లరి షాపులో జరిగిన సంఘటన దురదృష్టకరం అని దుండగులను కఠినంగా శిక్షించాలని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పోలీసులను కోరారు.దుండగులు అదను చూసి చోరీకి పాల్పడ్డారని షాపు ఉద్యోగులు ప్రతిఘటించగానే దుండగులు కాల్పులకు పాల్పడ్డారని త్వరలోనే దుండగులను పట్టుకోవడం జరుగుతుందని నరేందర్ రెడ్డి అన్నారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్,పాడి కౌశిక్ రెడ్డి లు దీన్ని రాజకీయం చేయాలని చూడడం సరికాదని కేసీఆర్ పాలనలో చీమకు కూడా హాని జరుగలేదని ఈ సమయంలో డబ్బా కొట్టుకోవడం బాధాకరం అని లెక్కలు పెట్టుకునే సమయం ఇది కాదని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.జరిగిన సంఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని ఎప్పడికప్పుడు పర్యవేక్షిస్తుందని దుండగులను పోలీసులు పట్టుకొని కఠినంగా శిక్షించి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టడం జరుగుతుందని నరేందర్ రెడ్డి అన్నారు.ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కమాండ్ కంట్రోల్ సెంటర్ పనిచేస్తలేదని,సీసీ కెమెరాలు పనిచేస్తలేవని తప్పుడు సమాచారం ఇచ్చారని అన్నీ పని చేస్తున్నాయని వాటిని ఇంకా మెరుగు పరచడానికి పోలీసులతో సమన్వయం చేసి నిధులు కేటాయిస్తామని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.4
- కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారం గ్రామంలోని శ్రీ మల్లిఖార్జున దేవస్థానం నందు శ్రీగిరి ప్రదక్షిణ, ద్వాదశ జ్యోతిర్లింగాల నిర్మాణం కొనసాగుతోంది. ఈ క్రమంలో కేదార్నాథ్ గుడి నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. దాతలు కరీంనగర్‌కు చెందిన గందె శ్రీ శ్రీనివాస్,రాచమల్ల ప్రసాద్,ఎలుగురి విజయభాస్కర్, పల్లా శివకుమార్ కొండూరి వేణుగోపాల్ కేదార్నాథ్ గుడి నిర్మాణ భూమి పూజ ఆలయ కమిటీ చైర్మన్ వారాల పరశురాములు, అక్క నా పెళ్లి రాజేష్ విజయ్ మసాలా తో కలిసి భూమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆలయ అభివృద్ధికి సహకరించిన దాతలను అభినందించి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో జక్కనపల్లి సత్తయ్య, నూకల తిరుపతి, బద్దం శ్రీనివాస్ రెడ్డి, గాలి పెళ్లి శంకర్ భక్తులు పాల్గొన్నారు1
- జనగామ జిల్లా కేంద్రంలోని బచ్చన్నపేటలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఏనుగుల ప్రశాంత్ అనే యువకుడు ఈతకు వెళ్లి బావిలో మునిగిపోయి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని రెస్క్యూ బృందంతో కలిసి గాలింపు చర్యలు ప్రారంభించారు. మూడు గంటల పాటు శ్రమించినప్పటికీ మృతదేహం ఆచూకీ లభించలేదు. చీకటి పడటంతో అధికారులు గాలింపు చర్యలను తాత్కాలికంగా నిలిపివేశారు.1