ఆదర్శ కాలనీలో బాల గణేష్ మండపంలో భక్తి ఉత్సవ శోభ — ప్రతిరోజూ యజ్ఞాలు, హోమాలతో ఆధ్యాత్మిక వాతావరణం కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఆదర్శ కాలనీలో ఏర్పాటు చేసిన బాల గణేష్ మండపం వద్ద భక్తి ఉత్సవ శోభ మరింతగా వెలుగొందుతోంది. ప్రతిరోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు యజ్ఞాలు, పూజలు, హోమాలు ఘనంగా నిర్వహిస్తూ కాలనీవాసులు భక్తి భావంలో మునిగిపోయారు. గణేశుని మంగళ వచనాలతో మండప పరిసరాలు ఆధ్యాత్మిక శోభతో నిండిపోయాయి. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుని కృప కోసం భక్తులు కుటుంబ సమేతంగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భజనలు, సంకీర్తనలు, గణేశుని నామస్మరణతో మండపం పరిసరాలు పవిత్రతను సంతరించుకున్నాయి. బుధవారం రోజున ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు బాల గణేష్ మండలి సభ్యులు తెలిపారు. ఆర్ల దివ్య, సుధాకర్ రెడ్డి, మాశెట్టి హేమలత, దేవేందర్ గుప్తా వారి ఆశీస్సులతో అన్నదాన ప్రసాదం భక్తులకు అందించబడనుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని అన్నదానం, తీర్థ ప్రసాదాలను స్వీకరించి విఘ్నేశ్వరుని అనంత కృప కటాక్షాలు ప్రతి ఒక్కరిపై కలగాలని బాల గణేష్ మండలి సభ్యులు భక్తులకు విజ్ఞప్తి చేశారు.
ఆదర్శ కాలనీలో బాల గణేష్ మండపంలో భక్తి ఉత్సవ శోభ — ప్రతిరోజూ యజ్ఞాలు, హోమాలతో ఆధ్యాత్మిక వాతావరణం కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఆదర్శ కాలనీలో ఏర్పాటు చేసిన బాల గణేష్ మండపం వద్ద భక్తి ఉత్సవ శోభ మరింతగా వెలుగొందుతోంది.
ప్రతిరోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు యజ్ఞాలు, పూజలు, హోమాలు ఘనంగా నిర్వహిస్తూ కాలనీవాసులు భక్తి భావంలో మునిగిపోయారు. గణేశుని మంగళ వచనాలతో మండప పరిసరాలు ఆధ్యాత్మిక శోభతో నిండిపోయాయి. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుని కృప కోసం భక్తులు కుటుంబ సమేతంగా హాజరై
ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భజనలు, సంకీర్తనలు, గణేశుని నామస్మరణతో మండపం పరిసరాలు పవిత్రతను సంతరించుకున్నాయి. బుధవారం రోజున ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు బాల గణేష్ మండలి సభ్యులు తెలిపారు. ఆర్ల దివ్య, సుధాకర్ రెడ్డి, మాశెట్టి హేమలత, దేవేందర్ గుప్తా వారి
ఆశీస్సులతో అన్నదాన ప్రసాదం భక్తులకు అందించబడనుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని అన్నదానం, తీర్థ ప్రసాదాలను స్వీకరించి విఘ్నేశ్వరుని అనంత కృప కటాక్షాలు ప్రతి ఒక్కరిపై కలగాలని బాల గణేష్ మండలి సభ్యులు భక్తులకు విజ్ఞప్తి చేశారు.
- జుక్కల్ రైతుల సమస్యలపై అసెంబ్లీలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు గళం జుక్కల్: కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని ఉద్యానవన రైతుల సమస్యలను ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అసెంబ్లీలో ప్రస్తావించారు. నియోజకవర్గంలో బొప్పాయితో పాటు వివిధ రకాల ఉద్యానవన పంటలను రైతులు విస్తారంగా సాగు చేస్తున్న నేపథ్యంలో, రైతులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతుల పంటలకు మెరుగైన ధరలు లభించేలా అత్యాధునిక కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు, గ్రేడింగ్–ప్యాకింగ్ కేంద్రాలు, మార్కెట్ సదుపాయాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే నియోజకవర్గానికి కీలకమైన లెండి ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకు సంబంధిత మంత్రి ప్రత్యేక చొరవ తీసుకోవాలని అసెంబ్లీ వేదికగా కోరారు.1
- 34 ఏళ్లుగా మావోయిస్టు పార్టీలో ఉన్న సీనియర్ మహిళా నేత లొంగుబాటు నిజామాబాద్ జిల్లా బోధన్‌కు చెందిన సీపీఐ మావోయిస్టు పార్టీ సీనియర్ మహిళా నాయకురాలు నిక్కా శశీల అలియాస్ రాజి పోలీసుల ఎదుట లొంగిపోయారు. 57 ఏళ్ల నిక్కా శశీల 1992లో పీపుల్స్ వార్‌లో చేరి.. 34 ఏళ్లుగా మావోయిస్టు పార్టీలో కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. డివిజన్ కమిటీ సభ్యురాలిగా పనిచేసిన ఆమె.. అనారోగ్య సమస్యల కారణంగా మావోయిస్టు పార్టీని వీడి సాధారణ జీవితంలోకి రావాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. లొంగిపోయిన శశీలకు ప్రభుత్వం తరఫున 5 లక్షల రూపాయల చెక్‌తో పాటు 25 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. మిగిలిన మావోయిస్టు కేడర్లు కూడా హింసా మార్గాన్ని వీడి లొంగిపోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.1
- కామారెడ్డిలో గణేష్ నిమజ్జన రూట్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ • గణేష్ నిమజ్జనానికి పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు – ముందస్తు చర్యలపై అధికారులతో సమీక్ష కామారెడ్డిలో గణేష్ నిమజ్జన రూట్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ • గణేష్ నిమజ్జనానికి పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు – ముందస్తు చర్యలపై అధికారులతో సమీక్ష • వివిధ సంబంధిత శాఖల అధికారులతో కలిసి నిమజ్జన రూట్‌ను స్వయంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ • నిమజ్జన మార్గంలో ట్రాఫిక్, విద్యుత్, రహదారులు, పారిశుద్ధ్యం, తాగునీరు తదితర ఏర్పాట్ల పరిశీలన - అధికారులకు సూచనలు • నిమజ్జన ప్రదేశాల్లో గజఈతగాళ్లు, రెస్క్యూ బృందాలు, వైద్య సిబ్బంది సిద్ధంగా ఉండేలా చర్యలు • గణేష్ నవరాత్రులు పూర్తయ్యే వరకు సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిరంతర నిఘా • డీజేలకు స్వస్తి – సాంప్రదాయ పద్ధతిలో గణేష్ ఉత్సవాలు నిర్వహించాలని పిలుపు: జిల్లా ఎస్పీ కామారెడ్డి పట్టణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిర్వహించనున్న గణేష్ విగ్రహాల నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా మరియు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగాలు చేపడుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, , జిల్లా ఎస్పీ . రాజేష్ చంద్ర, బుధవారం పరిశీలించారు. తొలుత ట్రాఫిక్ గణపతిని దర్శించుకున్న అనంతరం జిల్లా కలెక్టర్, ఎస్పీ గార్లు అధికారులు, మున్సిపల్ చైర్‌పర్సన్, గణేష్ ఉత్సవ సమితుల ప్రతినిధులు, ఆర్గనైజర్లతో కలిసి ప్రత్యేక బస్సులో నిమజ్జన రూట్‌ను స్వయంగా పరిశీలించారు. కామారెడ్డి ఓల్డ్ బస్టాండ్ – ఇందిరాగాంధీ చౌరస్తా నుంచి ప్రారంభమయ్యే ముఖ్య ప్రాంతాల గుండా బాంబే క్లాత్, పాన్ చౌరస్తా, బడా మసీద్, రైల్వే ఫ్లైఓవర్, నిజాంసాగర్ చౌరస్తా, న్యూ బస్టాండ్ మీదిగా నిమజ్జన మార్గాన్ని పరిశీలిస్తూ, నిమజ్జన ముగింపు ప్రదేశమైన టేకిర్యాల్ చెరువు, దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి వరకు రూట్‌లోని అన్నీ ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా నిమజ్జన రూట్‌లో ఎదురయ్యే ట్రాఫిక్ సమస్యలు, రహదారుల పరిస్థితి, విద్యుత్ లైన్లు, వీధి దీపాలు, పారిశుద్ధ్యం, తాగునీటి సదుపాయం, బారికేడ్లు, అత్యవసర మార్గాలు, విగ్రహాల తరలింపు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రూట్‌లో గుర్తించిన సమస్యలను నిమజ్జన కార్యక్రమానికి ముందే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు జిల్లా కలెక్టర్, ఎస్పీ సూచించారు. జిల్లా కలెక్టర్ శ్రీ ఆశిష్ సంగ్వాన్, మాట్లాడుతూ, గణేష్ నిమజ్జన కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు పోలీస్, మున్సిపల్, ఇరిగేషన్, విద్యుత్, ఆర్ అండ్ బి తదితర అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నిమజ్జన మార్గంలో భక్తులు, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అవసరమైన మౌలిక సదుపాయాలను ముందుగానే ఏర్పాటు చేయాలని, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ మరియు రహదారి సంబంధిత పనుల ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, IPS గారు మాట్లాడుతూ, గణేష్ నిమజ్జన కార్యక్రమంలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. గణేష్ ఉత్సవ కమిటీలు, నిర్వాహకులు, భక్తులు మరియు ప్రజల సమన్వయంతో నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. నిమజ్జన ప్రదేశాల్లో ఎలాంటి ప్రమాదాలకు తావులేకుండా గజఈతగాళ్లు, రెస్క్యూ బృందాలు మరియు వైద్య సహాయ బృందాలను సిద్ధంగా ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా రెస్క్యూ వ్యవస్థను అందుబాటులో ఉంచాలని సూచించారు. నిమజ్జన రూట్‌లో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక ట్రాఫిక్ ప్రణాళికను అమలు చేయడంతో పాటు, సీసీ కెమెరాలు మరియు డ్రోన్ల ద్వారా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ డీజేలకు స్వస్తి పలికి సాంప్రదాయ పద్ధతిలో గణేష్ ఉత్సవాలను నిర్వహించుకుందామని జిల్లా ఎస్పీ ప్రజలకు పిలుపునిచ్చారు. అధిక శబ్దంతో కూడిన డీజేల కారణంగా చిన్నపిల్లలు, విద్యార్థులు, వృద్ధులు మరియు అనారోగ్యంతో ఉన్నవారు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని తెలిపారు. ప్రజల ఆరోగ్యం, శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా అమలులో ఉన్న నిబంధనలు, ఆదేశాల మేరకు డీజేల వినియోగంపై నిషేధం అమల్లో ఉందని స్పష్టం చేశారు. గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, సాంప్రదాయ పద్ధతుల్లో, శాంతియుతంగా మరియు ఆనందోత్సాహాలతో నిర్వహించాలని, నిమజ్జన సమయంలో పోలీస్ మరియు ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు సూచించే భద్రతా నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని ఎస్పీ కోరారు. నిమజ్జన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు గణేష్ ఉత్సవ కమిటీలు, నిర్వాహకులు మరియు ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అడ్మిన్ కె. నరసింహారెడ్డి, కామారెడ్డి డీఎస్పీ ఎస్. మధుసూదన్, కామారెడ్డి టౌన్ ఎస్‌హెచ్‌ఓ బి. నరహరి, కామారెడ్డి ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్‌పర్సన్, పోలీస్, ఇరిగేషన్, విద్యుత్, ఆర్ అండ్ బి, మున్సిపల్ తదితర శాఖల అధికారులు, గణేష్ ఉత్సవ సమితుల ప్రతినిధులు, ఆర్గనైజర్లు పాల్గొన్నారు.1
- గిరిజన తండాల్లో బీరస్ పార్టీ పదార్థం ఆవిష్కరించి మాజీ సీఎం కేసీఆర్ పాలాభిషేకం చేయాలి మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్ రెడ్డి పిలుపు గిరిజనులకు4%రిజర్వేషన్లు 10 శాతానికి పెంచింది కేసీఆరే తండాలను పంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్‌దే..సెప్టెంబర్ 17న ప్రతి తండాలో కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేయాలి.మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం. పద్మా దేవేందర్‌రెడ్డి..గిరిజనుల రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం. పద్మా దేవేందర్‌రెడ్డి అన్నారు. గిరిజనుల హక్కుల పరిరక్షణలో కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గుర్తుచేస్తూ సెప్టెంబర్ 17న మెదక్ జిల్లాలో ప్రతి తండాలో కేసీఆర్‌కు క్షీరాభిషేకం నిర్వహించాలనిపిలుపునిచ్చారు. బుధవారం మెదక్ జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో బిఆర్‌ఎస్ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం గిరిజనుల జనాభాకు అనుగుణంగా ఎస్టీ రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచేందుకు కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. గిరిజనుల స్వయం పాలన కోసం తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత కూడా కేసీఆర్ ప్రభుత్వానిదేనన్నారు.గిరిజనుల విద్యా, సామాజిక అభివృద్ధి కోసం గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశారని తెలిపారు. గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించేలా చర్యలు చేపట్టారని గుర్తుచేశారు.గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. 10 శాతం రిజర్వేషన్ కారణంగా గిరిజన విద్యార్థులకు విద్యా రంగంలో ప్రయోజనం కలుగుతోందని, వైద్య విద్యలో ఏటా విద్యార్థులకు సీట్లు లభిస్తున్నాయని తెలిపారు. గిరిజనుల హక్కులు, సంక్షేమం కోసం కేసీఆర్ చేసిన కృషిని గుర్తుచేసుకునేందుకే సెప్టెంబర్ 17న ప్రతి తండాలో క్షీరాభిషేకం నిర్వహించాలని పిలుపునిచ్చారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 500 జనాభా ఉన్న తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి గిరిజనులకే సర్పంచులుగా అవకాశం కల్పించిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. తండాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి రోడ్లు, తాగునీరు, ఇతర మౌలిక వసతులు కల్పించారని తెలిపారు. తండాలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీరు, 24 గంటల విద్యుత్, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను అందించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని గుర్తుచేశారు. రోడ్లు లేని పలు తండాలకు రహదారులు నిర్మించి మౌలిక సదుపాయాలు కల్పించారని పేర్కొన్నారు.మెదక్ పట్టణంలో బంజారా భవన్ నిర్మాణానికి ఒక ఎకరం స్థలం కేటాయించామని గుర్తు చేశారు. నిధులు కూడా మంజూరు చేసినప్పటికీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని రద్దు చేసిందని ఆరోపించారు. గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించేలా నిర్ణయం తీసుకున్నది కూడా కేసీఆర్ ప్రభుత్వమేనన్నారు. కేసీఆర్ హయాంలో తండాల్లో జరిగిన అభివృద్ధిని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని, మళ్లీ కేసీఆర్ పాలన రావాలని ,ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, ఇతర హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. ఇది ప్రజా పాలన కాదని, కాంగ్రెస్ నాయకుల పాలనగా మారిందని ఆరోపించారు. ప్రస్తుత రేవంత్‌రెడ్డి ప్రభుత్వం గిరిజనుల హక్కులు, సంక్షేమాన్ని విస్మరిస్తోందని విమర్శించారు. గిరిజనుల అభివృద్ధికి కేటాయించిన నిధులను సక్రమంగా వినియోగించడం లేదని ఆరోపించారు. గిరిజనుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని డిమాండ్ చేశారు.అనంతరరం సుల్తాన్‌పూర్ తండా సర్పంచ్ రమేష్, గిరిజన నాయకులు శ్రీను నాయక్, రంజిత్ నాయక్, ధన్ సింగ్ లు మాట్లాడుతూ.. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి గిరిజనులకు స్వయం పాలన కల్పించిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌కే దక్కుతుందనిఅన్నారు. గిరిజనుల రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచి వారి హక్కులకు గుర్తింపు కల్పించారని తెలిపారు.కేసీఆర్ హయాంలో తండాలకు పంచాయతీ హోదా కల్పించడంతో పాటు రోడ్లు, ఇతర మౌలిక వసతులు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సౌకర్యం కల్పించారని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజన తండాల్లో సమస్యలు మళ్లీ మొదలయ్యాయని ఆరోపించారు.మెదక్ పట్టణంలో బంజారా భవన్ నిర్మాణానికి ఒక ఎకరం స్థలం కేటాయించి, నిధులు మంజూరు చేసినప్పటికీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు రద్దు చేసిందని ఆరోపించారు.గిరిజనుల సంక్షేమం, అభివృద్ధిని ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు విమర్శించారు. తండాలకు గతంలో కల్పించిన మౌలిక వసతులను కొనసాగించాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 17న మెదక్ జిల్లాలోని అన్ని తండాల్లో బిఆర్‌ఎస్ జెండాలు ఎగురవేసి, కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున్ గౌడ్,జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షురాలు ఏం లావణ్య రెడ్డి, పట్టణ పార్టీ కన్వీనర్ కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు, మెదక్ హవెలిఘనపూర్ మండల పార్టీ అధ్యక్షులు యం అంజ గౌడ్ సిహెచ్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గంగా. నరేందర్, నాయకులు గడ్డమీద కృష్ణ గౌడ్,ప్రభు రెడ్డి,ఆర్కే శ్రీనివాస్,సాప సాయిలు, మార్గం. ఆంజనేయులు, శ్రీహరి, ప్రభాకర్, మంగ్యా,ఫుల్ సింగ్, ధన్ సింగ్,పాండు నాయక్ తదితరులు పాల్గొన్నారు.1
- ఇందిరమ్మ లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసిన సర్పంచ్ వెంకటేష్ గౌడ్... నిర్మల్ జిల్లా // బాసర గుడిసె లేని బాసర నా కల.. ఆ కలను నిజం చేసే బాధ్యత నాది... సొంతింటి కలను కాంగ్రెస్ నిజం చేస్తుంది.. విడతల వారీగా అర్హులైన ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు అందిస్తాం : సర్పంచ్ వెంకటేష్ గౌడ్.... బాసర లోని గ్రామ పంచాయతీ భవనం లో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందించిన సర్పంచ్ వెంకటేష్ గౌడ్, స్థానిక నాయకులు..... ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు ఆందోళన చెందవద్దు...: *సర్పంచ్ వెంకటేష్ గౌడ్* పాల్గొన్న ఈవో ప్రసాద్ గౌడ్.. ఉపసర్పంచ్ సయ్యద్ అలీ, వార్డ్ మెంబర్ లు కృష్ణ, ఫసి, అన్నెల లక్ష్మణ్, ఏజాస్, సాయిలు, ఫారుక్, అశోక్, నాయకులు షానవాజ్...1
- కాచాపూర్ లో కరెంటు కోతలపై బిఆర్ఎస్ నాయకుల నిరసన కార్యక్రమం బిక్కనూరు మండలం కాచాపూర్ గ్రామంలో కరెంటు కోతలపై బిఆర్ఎస్ నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వ్యవసాయానికి 18 గంటల పాటు నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. కరెంటు కోతల వల్ల రైతుల సాగు చేసిన పంటలు ఎండి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సమస్యలపై నిరంతర పోరాటం చేస్తామని హెచ్చరించారు.1
- మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం. బొమ్మెన లక్ష్మి కుటుంబాన్ని పరామర్శించిన మోహన్‌నాయక్ మెదక్ జిల్లా, నిజాంపేట మండలం: అనారోగ్యంతో మృతి చెందిన బొమ్మెన లక్ష్మి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ నాయకుడు, లీలా గ్రూప్ చైర్మన్ మీనాక్షి డాక్టర్ మోహన్‌నాయక్ ఆపన్నహస్తం అందించారు. నిజాంపేట మండలం చల్మెడ గ్రామానికి చెందిన లక్ష్మి మృతి విషయం తెలుసుకున్న ఆయన మంగళవారం గ్రామానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి ఆర్థిక పరిస్థితిని తెలుసుకుని రూ.5 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మల్లేశం, ముత్యం రెడ్డి, రామ్‌రెడ్డి, నారాయణ, ఫీల్డ్ అసిస్టెంట్ బిక్షపతి, మాజీ ఉపసర్పంచ్ రమేష్, స్వామి, మల్లేష్, నర్సింలు, బాలచందర్, యాదగిరి, భాస్కర్, ఎల్లయ్య, సురేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.2
- నయాబాది టీచర్స్ కాలనీలో చిన్నారులచే హనుమాన్ చాలీసా పారాయణం ఎల్లారెడ్డి: పట్టణంలోని టీచర్స్ కాలనీలో మంగళవారం చిన్నారులు భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ముందుగా ఆంజనేయ స్వామి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. కార్యక్రమంలో పెద్దలు పాల్గొని చిన్నారులకు సహకరించారు.1