పెద్దపల్లికి ప్రభుత్వ విప్ విజయరమణారావు...తనకు పదవులు ముఖ్యం కాదు, ప్రజలే ముఖ్యమని స్పష్టం చేసిన విజయరమణారావు పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలందరూ కార్యకర్తలు ప్రభుత్వ విప్ లేనని నూతనంగా ప్రభుత్వ విప్ గా నియమితులైన ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. ప్రభుత్వ విప్ హోదాలో తొలిసారి పెద్దపల్లి కి వచ్చిన విజయ రమణారావుకు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. జిల్లా సరిహద్దు సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి నుండి బాణాసంచా పేల్చి భారీ బైకు ర్యాలీతో కాట్నపల్లి, సుల్తానాబాద్ నుండి సుగ్లాంపల్లి, చిన్నకల్వల పెద్దపల్లి జెండా చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అడుగడుగునా అభిమానులు నీరాజనం పలికారు. నిలువెత్తు గజమాలతో సన్మానించారు. తనకు పదవులు ముఖ్యం కాదని ప్రజలు కార్యకర్తలే ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రతీ ఆలోచన ప్రజల శ్రేయస్సు కోసమేనని, ప్రస్తుతం తనకు లభించిన ప్రభుత్వ విప్ పదవి ప్రజలకే అంకితం చేస్తున్నానని నియోజకవర్గ ప్రజలందరూ విప్ లేనని స్పష్టం చేశారు.
పెద్దపల్లికి ప్రభుత్వ విప్ విజయరమణారావు...తనకు పదవులు ముఖ్యం కాదు, ప్రజలే ముఖ్యమని స్పష్టం చేసిన విజయరమణారావు పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలందరూ కార్యకర్తలు ప్రభుత్వ విప్ లేనని నూతనంగా ప్రభుత్వ విప్ గా నియమితులైన ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. ప్రభుత్వ విప్ హోదాలో తొలిసారి పెద్దపల్లి కి వచ్చిన విజయ రమణారావుకు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. జిల్లా సరిహద్దు సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి నుండి బాణాసంచా పేల్చి భారీ బైకు ర్యాలీతో కాట్నపల్లి, సుల్తానాబాద్ నుండి సుగ్లాంపల్లి, చిన్నకల్వల పెద్దపల్లి జెండా చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అడుగడుగునా అభిమానులు నీరాజనం పలికారు. నిలువెత్తు గజమాలతో సన్మానించారు. తనకు పదవులు ముఖ్యం కాదని ప్రజలు కార్యకర్తలే ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రతీ ఆలోచన ప్రజల శ్రేయస్సు కోసమేనని, ప్రస్తుతం తనకు లభించిన ప్రభుత్వ విప్ పదవి ప్రజలకే అంకితం చేస్తున్నానని నియోజకవర్గ ప్రజలందరూ విప్ లేనని స్పష్టం చేశారు.
- దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజన్నను భక్తులు దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రీతిపాత్రమైన కోడె మొక్కులను చెల్లించుకున్నారు.1
- వరంగల్ జిల్లా: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 35వ డివిజన్ పరిధిలోని నాలుగు జెండాల వద్ద మూడు రోజుల వ్యవధిలో ఇద్దరు చిన్న పిల్లలపై కుక్కలు దాడి చేసిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే స్పందించి వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని గ్రేటర్ మున్సిపల్ అధికారులను ప్రజలు కోరుతున్నారు.1
- *ములుగు మంత్రి సీతక్క క్యాంప్ ఆఫీస్ ముట్టడి చేసిన ఆశా వర్కర్లు* ములుగు జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత నేలకొన్నది సీతక్క క్యాంపు కార్యాలయాన్ని ఆశా వర్కర్లు ముట్టడించారు సీఐటీయూ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించి రోడ్డుపై బైఠాయించారు కాంగ్రెస్ హామీల అమలు 18 000/- వేతనం కొరకు ఆశా వర్కర్లు భారీగా మోహరించి నినాదాలు చేశారు పోలీసులు మోహరించి కొంతమందిని అరెస్టు చేయగా ఉద్రిక్తత వాతావరణం చెక్కబడింది1
- తెలంగాణ ప్రభుత్వం 2026–27 బడ్జెట్‌లో విద్యా రంగానికి భారీ ప్రాధాన్యత ఇస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, విద్యా సంస్థల అభివృద్ధికి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించింది. విద్యాశాఖకు సుమారు ₹26,674 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించారు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల మెరుగుదలకు ప్రత్యేక నిధులు గురుకులాలు, వసతి గృహాల వంటశాలల ఆధునీకరణకు ₹100 కోట్లు ప్రతిపాదన ప్రీ-ప్రైమరీ నుంచి విద్యను బలోపేతం చేయడానికి కొత్త ప్రణాళికలు రాష్ట్రంలోని వేలాది పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ విభాగాల విస్తరణ ఇక విద్యార్థుల సంక్షేమం కోసం కూడా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది: పాఠశాల విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రారంభం ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం అందించే నిర్ణయం టెక్నాలజీ ఆధారిత విద్య కోసం పాలిటెక్నిక్, ఐటీఐల్లో కొత్త కోర్సులు మొత్తం మీద, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి విద్యా ప్రమాణాలను పెంచడం లక్ష్యంగా ఈ నిధుల విడుదల జరిగినట్లు ప్రభుత్వం తెలిపింది. 👉 ఇది విద్యా రంగంలో పెద్ద మార్పులకు దారితీసే నిర్ణయంగా భావిస్తున్నారు.1
- వరంగల్ జిల్లా నర్సంపేట మార్కెట్ యార్డ్‌లో తెలంగాణ మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రైతులకు సరైన ధర అందించడంలో కొనుగోలు కేంద్రాలు కీలకమని పేర్కొన్నారు. కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా, వేగంగా నిర్వహించడంతో పాటు తేమ శాతం 14% లోపే ఉండాలని సూచించారు. క్వింటాల్‌కు రూ.2400 ధర నిర్ణయించినట్లు తెలిపారు. రైతులు మధ్యవర్తులపై ఆధారపడకుండా నేరుగా కేంద్రాల్లోనే పంటను విక్రయించాలని, చెల్లింపులు సమయానికి జరగాలని అధికారులకు ఆదేశించారు. మార్కెట్ యార్డ్‌లో తాగునీరు, విశ్రాంతి సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.1
- కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం : *విద్యాకు 8% శాతం బడ్జెట్ ప్రవేశపెట్టి విద్యార్థులను మరియు తెలంగాణ ఏర్పాటుకు కోసం ప్రాణాలను త్యాగం చేసిన విద్యార్థులను అవమానించిన కాంగ్రెస్ ప్రభుత్వం* *విద్యార్థుల సమస్యల పై మౌనం పాటించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు* అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జిల్లా ఎబివిపి నాయకులు మాట్లాడుతూ నూతన తెలంగాణ ఏర్పాటుకు విద్యార్థులు కీలకపాత్ర అప్ పోషించి ఎంతో మంది విద్యార్థుల బలిదలన పై తెలంగాణ తెచ్చుకుంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో విద్యార్థులకు కేటాయించింది కేవలం 8% మాత్రమే ఈ ఇది విద్యార్థులను అవమాన చేస్తూ తెలంగాణ వస్తే విద్యార్థుల బతుకులు మారుతాయి అని భావించిన శ్రీకాంతాచార్య లాంటి త్యాగ మూర్తులకు అవమాన పరిచింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పక్క రాష్ట్రలను చూసి సిగ్గు తెచ్చుకోవాలని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు వెంకట్,కౌశిక్ తదితరులు పాల్గొనడం జరిగింది1
- కరీంనగర్ టూ టౌన్ ఎస్ఐ చంద్రశేఖర్ ఆత్మహత్య కలకలం సృష్టించింది. అత్తగారి ఊరైన ఇల్లంతకుంట మండలం సీతంపేటలో ఉరి వేసుకుని ఎస్ఐ చంద్రశేఖర్ ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికులు గమనించి వెంటనే జమ్మికుంట ఆసుపత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఐదు రోజుల క్రితం ఎస్ఐ భార్య దివ్య ఆత్మహత్య చేసుకుంది. ఐదవ రోజు పిట్టకు పెట్టొచ్చి ఇంట్లోకి వెళ్లి ఎస్ఐ చంద్రశేఖర్ ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. కడుపు నొప్పితో ఐదు రోజుల క్రితం విషపూరితమైన గన్నేరుపప్పు గ్రైండర్ చేసుకొని తాగి భార్య దివ్య ఆత్మహత్య చేసుకోగా, భార్య ఆత్మహత్యకు భర్తే కారణమని బంధువులు ఆందోళన ఆందోళనకు దిగారు. దివ్య తండ్రి మాత్రం తన కూతురు కడుపునొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకుందని స్పష్టం చేశారు. భార్య ఆత్మహత్య బంధువుల ఆందోళనతో తీవ్ర మనస్థాపన చెందిన ఎస్సై చంద్రశేఖర్ ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న ఎస్సై దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. అన్యోన్యంగా కలిసి మెలిసి ఉండి ఎస్సై దంపతులు ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడంతో పిల్లలు ఇద్దరు అనాధలుగా మారడం కుటుంబ సభ్యులను బంధుమిత్రులను తీవ్ర ఆవేదన గురిచేస్తుంది. క్షణికావేశంలో తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయంతో 8 ఏళ్ళ లోపు పిల్లలు ఇద్దరు అనాధలుగా మారడం చూపరుల హృదయాలను ద్రవింపజేస్తుంది.4
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని Sri Raja Rajeshwara Swamy Temple లో జరగబోయే శ్రీరామనవమి ఉత్సవాల ఏర్పాట్లపై ఆలయ అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు.శ్రీ పరాభవ నామ సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి తేది 19-03-2026 గురువారం నుండి చైత్ర శుద్ధ నవమి తేది 27-03-2026 శుక్రవారం వరకు వసంత నవరాత్రోత్సవాలు ఏకాంతంగా నిర్వహించబడనున్నాయి. చైత్ర శుద్ధ నవమి రోజైన 27-03-2026 శుక్రవారం నాడు శ్రీ సీతారాముల కల్యాణోత్సవం ఆలయ పార్కింగ్ స్థలం వద్ద ఏర్పాటు చేసిన శివార్చన వేదికపై అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు రథోత్సవం నిర్వహించనున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు.ఈ ఉత్సవాల్లో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లపై దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీమతి ఎల్. రమాదేవి గారు ఈరోజు భీమేశ్వర సదన్ మీటింగ్ హాల్ లో జిల్లా స్థాయి అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.భక్తుల సౌకర్యార్థం ప్రత్యేకంగాక్యూలైన్లు చలి వేంద్రాలు, పందిళ్లు త్రాగునీరు, మజ్జిగ పంపిణీ అన్న ప్రసాదం పంపిణీ భారీ ప్రవేశ ద్వారాలు (గేట్లు) విద్యుత్ దీపాల అలంకరణ కూలర్లు కళ్యాణ వేదికను రంగురంగుల పూలతో అలంకరణ తో పాటు హెల్త్ క్యాంపులు, ఫైర్ ఇంజిన్ సదుపాయం, ప్రత్యేక బస్సులు, సేవా సమితుల సహకారం, పారిశుభ్రత ఏర్పాట్లు, భద్రత కోసం పోలీసు బందోబస్తు వంటి ఏర్పాట్లు చేపట్టనున్నట్లు సమావేశంలో నిర్ణయించారు.ఈ సందర్భంగా ఆలయ ఈవో ఎల్. రమాదేవి మాట్లాడుతూ, శ్రీరామనవమి మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి అనుగ్రహంతో పాటు శ్రీ సీతారాముల దివ్య ఆశీస్సులు పొందాలని కోరారు.1
- హన్మకొండ జిల్లా కాజీపేట పట్టణంలోని ఈద్గాలో రంజాన్ పర్వదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, తెలంగాణ స్టేట్ గ్రంథాలయ చైర్మన్ డా. రియాజ్, 62వ డివిజన్ కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథులు ముస్లిం సోదరులతో కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసి, అలైబలై చేసుకున్నారు. కార్యక్రమంలో 63వ డివిజన్ కార్పొరేటర్ విజయ శ్రీరజలి, స్థానిక నాయకులు, మైనారిటీ ప్రతినిధులు, ముస్లిం మత పెద్దలు, కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1