Shuru
Apke Nagar Ki App…
జర్నలిస్ట్ ని అభినందించిన ప్రజా ప్రతినిధులు, నాయకులు* మదనపల్లి: APJ అబ్దుల్ కలాం సమ్మాన్ సర్వేక్షన్ నేషనల్ అవార్డు గ్రహీత పాత్రికేయుడు శ్యామ్ ని పీలేరు MLA నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, మదనపల్లి మాజీ శాసన సభ్యులు దొమ్మల పాటి రమేష్, మదనపల్లి డివిజన్ మాజీ సైనికుల అధ్యక్షులు కంచర్ల శ్రీనివాసుల నాయుడు, నారా లోకేష్ యువసేన వ్యవస్థాపకులు కంచర్ల చింటూ తదితరులు ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. జర్నలిస్ట్ గా గత కొన్ని సంవత్సరాలనుండి నీతి, నిజాయితీగా పనిచేస్తూ, నిజాన్ని నిర్భయంగా తెలియజేస్తున్న శ్యామ్ కి నేషనల్ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని, రానున్న రోజుల్లో ఆయన మరింతగా ఎదగాలని కోరారు.
SN MEDIA
జర్నలిస్ట్ ని అభినందించిన ప్రజా ప్రతినిధులు, నాయకులు* మదనపల్లి: APJ అబ్దుల్ కలాం సమ్మాన్ సర్వేక్షన్ నేషనల్ అవార్డు గ్రహీత పాత్రికేయుడు శ్యామ్ ని పీలేరు MLA నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, మదనపల్లి మాజీ శాసన సభ్యులు దొమ్మల పాటి రమేష్, మదనపల్లి డివిజన్ మాజీ సైనికుల అధ్యక్షులు కంచర్ల శ్రీనివాసుల నాయుడు, నారా లోకేష్ యువసేన వ్యవస్థాపకులు కంచర్ల చింటూ తదితరులు ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. జర్నలిస్ట్ గా గత కొన్ని సంవత్సరాలనుండి నీతి, నిజాయితీగా పనిచేస్తూ, నిజాన్ని నిర్భయంగా తెలియజేస్తున్న శ్యామ్ కి నేషనల్ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని, రానున్న రోజుల్లో ఆయన మరింతగా ఎదగాలని కోరారు.
More news from Annamayya and nearby areas
- వైరల్: కారు ఢీకొనడంతో మహిళ గాలిలోకి విసిరివేయబడింది *రోడ్డు దాటేటప్పుడు ఎంత అప్రమత్తంగా ఉండాలో ఈ సంఘటన తెలియజేస్తుంది. కర్ణాటకలోని బంట్వాల్‌లో భారతి(48) అనే యువతి రోడ్డు దాటేందుకు ప్రయత్నించింది. మధ్యలోకి రాగానే ఎదురుగా వస్తున్న వాహనం వేగాన్ని అంచనా వేయకుండా ముందుకు పరుగులు తీశారు. ఆ సమయంలో ఎదురుగా వస్తున్న కారు ఆమెను బలంగా ఢీకొట్టడంతో గాలిలోకి దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన భారతిని ఆస్పత్రికి తరలించారు. గత నెల 30న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.*1
- అప్పు అడిగినందుకే చంద్రమను హత్య చేశారు: DSP డేగల ప్రభాకర్ పెద్ద పంజాణి మండలం ముద్దేపల్లికి చెందిన చంద్రమ్మను సమీప బంధువైన సుబ్రహ్మణ్యం హత్య చేసి జగమర్ల అడవిలో పడేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విషయమై పలమనేరు డిఎస్పి డేగల ప్రభాకర్, సిఐ పరశురాముడు పలమనేరు పోలీస్ స్టేషన్లో గురువారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రమ్మను సమీప బంధువైన సుబ్రమణి మరో ఇద్దరు స్నేహితులతో కలిసి హత్య చేశారన్నారు. చీటీల డబ్బు మరియు అప్పుగా తీసుకున్న మొత్తం సుమారు రెండు లక్షల నగదును తిరిగి ఇవ్వమని ఒత్తిడి చేయడంతో ముందుగా పన్నిన పథకం ప్రకారం చంద్రమ్మను బైక్ పై తీసుకెళ్లి స్నేహితులతో కలిసి ఓ మామిడి తోపులో హత్య చేశారన్నారు. అనంతరం ఓ బొలెరో వాహనాన్ని బాడుగకు తీసుకొని వారే స్వయంగా నడుపుకుంటూ చంద్రమ్మ మృతదేహాన్ని పలమనేరు సమీపంలోని జగమర్ల అటవీ ప్రాంతంలో పారవేశారన్నారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసే క్రమంలో సుబ్రహ్మణ్యం ను విచారించాగా మరో ఇద్దరితో కలిసి హత్య చేసి జగమర్ల అడవిలో పారవేసినట్లు తెలిపారు. ఈ కేసులో సుబ్రమణి అరెస్ట్ చేయగా మరో ఇద్దరు ముద్దాయిలైన నూర్ అహ్మద్, దేవి వరప్రసాద్ లను తొందర్లోనే అరెస్టు చేస్తామని ఆయన తెలిపారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని అన్ని సాక్ష్యాదారాలు సేకరించామన్నారు.1
- కదిరి మండల పరిధిలోని ముత్యాల చెరువు గ్రామంలో శుక్రవారం మన ఊరు మన నీరు మన అందరి బాధ్యత కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి సాగునీటి చైర్మన్ ఉపేందర్ రెడ్డి, సీనియర్ టిడిపి నాయకుడు న్యాయవాది వాసుదేవరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. రైతు బాగుంటే రాజ్యం బాగుంటుందనే ఉద్దేశంతో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఇలాంటి మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఓటమి నాయకులు పాల్గొన్నారు.1
- ఆంధ్రప్రదేశ్ లో... ఆగని డోలి మోతలు *అల్లూరి జిల్లా. న్యూస్ డోలిలో గర్భిణి… 5 కి.మీ నడక. ▪️అల్లూరి సీతారామరాజు జిల్లాలో గిరిజనుల కష్టాలు మరోసారి వెలుగులోకి. ▪️డుంబ్రిగూడ మండలం డొక్రిపాడు గ్రామంలో రోడ్డు సౌకర్యం లేకపోవడంతో గర్భిణి మహిళను కుటుంబ సభ్యులు డోలిలో మోసుకెళ్లాల్సిన పరిస్థితి. ▪️పురిటి నొప్పులతో బాధపడుతున్న ఆమెను భర్తతో పాటు బంధువులు సుమారు 5 కిలోమీటర్ల మేర డోలిలో మోసుకుంటూ ఆస్పత్రికి తరలింపు. ▪️రోడ్డు లేకపోవడంతో ప్రతిసారి ఇలాంటి కష్టాలు పడాల్సి వస్తోందని గిరిజనులు ఆగ్రహం. ▪️వెంటనే రోడ్డు సౌకర్యం కల్పించాలని ప్రభుత్వానికి వినతి.1
- బద్వేలు:రాజధాని అమరావతి అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదం తెలపడంతో రాజధానిపై కమ్ముకున్న అనిశ్చితి, చీకట్లు పూర్తిగా తొలగిపోయాయని ఉమ్మడి కడప జిల్లా డీసీసీ బ్యాంక్ చైర్మన్ శ్రీ మంచూరు సూర్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా బద్వేలు పట్టణంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన సంబరాలు నిర్వహించారు. అమరావతికి వెలుగులు వచ్చినట్లుగా సంకేతంగా దీపాలు వెలిగించి ఆనందాన్ని వ్యక్తం చేశారు., “ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక చారిత్రాత్మకమైన రోజు. ఐదున్నర కోట్ల మంది ప్రజల ఆకాంక్ష మేరకు అమరావతి ఇక శాశ్వత రాజధానిగా నిలవనుంది” అని అన్నారు. అమరావతి నిర్మాణానికి రైతులు తమ సొంత భూములను త్యాగంగా సమర్పించిన విషయాన్ని గుర్తు చేస్తూ, గత ప్రభుత్వ కాలంలో రాజధాని అభివృద్ధి నిలిచిపోయిందని విమర్శించారు. ప్రజలు ఇప్పటికే ఆ పరిస్థితులను అర్థం చేసుకుని తగిన తీర్పు ఇచ్చారని తెలిపారు. ఇకపై ఎలాంటి రాజకీయ మార్పులు వచ్చినా అమరావతిని ఎవరూ కదిలించలేరని, ఇది రాష్ట్ర ప్రజల సంకల్పమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బద్వేలు నియోజకవర్గం తరఫున దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ కి, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, ఐటీ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బద్వేలు నియోజకవర్గం తెలుగు దేశం పార్టీ నాయకులు డాక్టర్ ఓబులాపురం రాజశేఖర్,చెరుకూరి రవికుమార్, పరిటాల వెంకట సుబ్బయ్య,బీరం జయ రామి రెడ్డి, పాలకొండు రాజశేఖర్ రెడ్డి,గాజులపల్లె శంకర్ రెడ్డి కొంకుల రాంబాబు, కల్వపల్లె వీర రెడ్డి, జహంగీర్ భాష,బోవిళ్ళ నరసింహ రెడ్డి,బిజీవేముల రమణారెడ్డి,మాచుపల్లి కృష్ణారెడ్డి, పఠాన్ మౌలాలి, రసూల్, ఉపత్తి సుబ్బారెడ్డి,గోపి రెడ్డి, సుబ్బా రాయుడు,రాము,గురు ప్రసాద్ రెడ్డి,కోటపాటి పెంచలయ్య,చిన్నప్ప రెడ్డి, గంగాధర్ రెడ్డి, వెంకటేష్ తదితరు తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.1
- ఆకలి కడుపులు నింపుటకై పెట్టిన కార్యక్రమం అన్న క్యాంటీన్. దయచేసి ఒక టోకెన్ మాత్రమే తీసుకోవాలి అని మనవి.మీ వెనకాల ఉన్న పేద వాడి కడుపు కూడా నిండాలి అంటే ..1
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొట్టే పాలెం గ్రామం నెల్లూరు జిల్లా రూరల్ మండలం నందు శ్రీ కోదండ రామయ్య స్వామి వారి గరుడ సేవ ఘనంగా నిర్వహించారు. శ్రీ కోదండరామ స్వామి వారి దేవస్థానము నందు బ్రహ్మోత్సవాలలో భాగంగా నేటి సాయంత్రం అంగరంగ వైభవంగా ఉదయం మోహిని ఉత్సవాము మరియు సాయంత్రం 8 గంటలకు గరుడ సేవ అంగరంగ వైభవంగా కన్నుల పండుగ గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉభయ కర్తలగా వ్యవహరించిన వారు కీర్తిశేషులు అల్లా రెడ్డి పిచ్చమ్మ గారి జ్ఞాపకార్థం భర్త అల్లా రెడ్డి రంగారెడ్డి గారి కుమారులు అల్లారెడ్డి రవీందర్ రెడ్డి మరియు శ్రీమతి కవిత అల్లారెడ్డి సురేందర్రెడ్డి శ్రీమతి మాధవి లత అల్లా రెడ్డి నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అర్చకుల వేదమంత్రాలతో వైభవంగా నగర ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వచ్చిన భక్తులందరికీ కూడా అన్న వితరణ కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో దేవస్థానం అర్చకులు భక్తులు స్థానికులు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతంగా కొనసాగించారు. దేవస్థానానికి వచ్చిన భక్తులందరూ కూడా తీర్థప్రసాదాలు తీసుకొని స్వామివారి కృపకు పాత్రులు అయ్యారని నిర్వాహకులు మీడియాతో తెలిపారు.1
- *🔰ఏపీలో నేటితో ముగియనున్న సర్పంచుల పదవీ కాలం* రేపటి నుంచి ప్రత్యేక అధికారుల నియామకానికి ఉత్తర్వులు తహశీల్దార్, MPDO స్థాయి అధికారులు, కొత్త పాలకమండలి వచ్చే వరకు బాధ్యతలు జీవో జారీ చేసిన ప్రభుత్వం1