Shuru
Apke Nagar Ki App…
మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం ముల్కలపేట గ్రామ సమీపంలోని ఆర్టీసీ బస్సు - ఆటో ఢీ.. వెంటనే పొదలు, పిచ్చి మొక్కలను తొలగించిన ఎస్సై మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం ముల్కలపేట గ్రామ సమీపంలోని మూలమలుపు వద్ద గురువారం ఆర్టీసీ బస్సు, ఆటో ప్రమాదానికి గురయ్యాయి. విషయం తెలుసుకున్న నీల్వాయి ఎస్‌ఐ నాగరాజు వెంటనే స్పందించి, జేసీబీ సహాయంతో మలుపు వద్ద ఉన్న ముళ్ల పొదలు, పిచ్చి మొక్కలను తొలగించి రోడ్డును క్లియర్ చేయించారు. మలుపు వద్ద ఎదురుగా వచ్చే వాహనాలు స్పష్టంగా కనిపించేలా చర్యలు చేపట్టారు. భవిష్యత్‌లో ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఎస్‌ఐ నాగరాజు తక్షణ చర్యపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
Bellamplly Ashok kumar
మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం ముల్కలపేట గ్రామ సమీపంలోని ఆర్టీసీ బస్సు - ఆటో ఢీ.. వెంటనే పొదలు, పిచ్చి మొక్కలను తొలగించిన ఎస్సై మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం ముల్కలపేట గ్రామ సమీపంలోని మూలమలుపు వద్ద గురువారం ఆర్టీసీ బస్సు, ఆటో ప్రమాదానికి గురయ్యాయి. విషయం తెలుసుకున్న నీల్వాయి ఎస్‌ఐ నాగరాజు వెంటనే స్పందించి, జేసీబీ సహాయంతో మలుపు వద్ద ఉన్న ముళ్ల పొదలు, పిచ్చి మొక్కలను తొలగించి రోడ్డును క్లియర్ చేయించారు. మలుపు వద్ద ఎదురుగా వచ్చే వాహనాలు స్పష్టంగా కనిపించేలా చర్యలు చేపట్టారు. భవిష్యత్‌లో ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఎస్‌ఐ నాగరాజు తక్షణ చర్యపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
More news from తెలంగాణ and nearby areas
- కాటాపూర్ పీహెచ్‌సీలో ఐటీడీఏ పీవో లెనిన్ వత్సల్ టోప్పో ఆకస్మిక తనిఖీ MLG: కాటాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఐటీడీఏ ఏటూరునాగారం ప్రాజెక్ట్ అధికారి లెనిన్ వత్సల్ టోప్పో ఐఏఎస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇన్‌పేషెంట్, మందుల స్టాక్, హాజరు రిజిస్టర్లను పరిశీలించి, రికార్డులు రోజూ అప్‌డేట్ చేయాలని సూచించారు. ఆస్పత్రి పరిశుభ్రత, సిబ్బంది సమయపాలన, మందుల పంపిణీలో జాగ్రత్తలు పాటించాలని ఆదేశించారు.1
- లక్షెట్టిపేటలో బిజెపి నాయకుల ఆందోళన, ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని డిమాండ్ విద్యార్థుల పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ లక్షేట్టిపేట పట్టణంలో బిజెపి నాయకులు ఆందోళన నిర్వహించారు. రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా వారు గురువారం పట్టణంలోని ఉత్కూర్ చౌరస్తా ప్రధాన రహదారిపై ఆందోళన చేసి ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులకు, పోలీసులకు మధ్య పెనుగులాట జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- 22ఏ నిషేధిత భూముల నుంచి పట్టా భూములను తొలగించాలి మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల రిజిస్ట్రేషన్ చట్టంలోని 22ఏ సెక్షన్‌ను దుర్వినియోగం చేస్తూ పట్టా భూములను నిషేధిత జాబితాలో చేర్చడం సరికాదని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. నిషేధిత జాబితాలో ఉన్న అర్హత కలిగిన పట్టా భూములను వెంటనే తొలగించి రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. భూ బాధితులకు మద్దతుగా బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ, అసైన్డ్, దేవాదాయ, వక్ఫ్ తదితర భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడేందుకు రిజిస్ట్రేషన్ చట్టం-1908లోని 22ఏ సెక్షన్ ఉద్దేశించబడిందన్నారు. అయితే ఆ నిబంధనలను ఆధారంగా చేసుకుని ప్రైవేటు పట్టా భూములను కూడా నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల వేలాది మంది భూ యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. 22ఏ(2) నిబంధనల ప్రకారం నిషేధిత జాబితాలో భూములను చేర్చే ప్రక్రియను చట్టబద్ధంగా చేపట్టాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కేవలం తహసీల్దార్, ఆర్డీవో లేదా జిల్లా కలెక్టర్ స్థాయిలోనే సర్వే నంబర్లను నిషేధిత జాబితాలో చేర్చడం సాధ్యం కాదని, ప్రభుత్వ స్థాయిలో నిర్దేశిత ప్రక్రియను పాటించాల్సి ఉంటుందని అన్నారు. నిషేధిత జాబితాలో చేర్చిన భూముల విషయంలో భూ యజమానులకు న్యాయం జరిగేలా సమగ్రంగా పరిశీలించాలని కోరారు. ప్రైవేటు పట్టా భూములను నిషేధిత జాబితాలో చేర్చే విషయంలో చట్టపరమైన ప్రక్రియను పాటించాల్సిన అవసరం ఉందన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 22ఏ సెక్షన్‌ను రాజకీయ ప్రయోజనాలు, అవినీతికి వేదికగా మార్చిందని ఆయన ఆరోపించారు. పట్టాదారులకు సరైన నోటీసులు ఇవ్వకుండా, నిర్దేశిత ప్రక్రియను పాటించకుండా వేలాది ఎకరాల భూములు, వేలాది ప్లాట్లను నిషేధిత జాబితాలో చేర్చారని విమర్శించారు. ఊర్లకు ఊర్లే నిషేధిత జాబితాలో... కరీంనగర్ నియోజకవర్గ పరిధిలోని రేకుర్తి, కొత్తయాస్వాడ, విద్యానగర్, కొత్తపల్లి తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పట్టా భూములు 22ఏ జాబితాలోకి వెళ్లాయని గంగుల కమలాకర్ తెలిపారు. రేకుర్తి, విద్యానగర్, కొత్తపల్లి ప్రాంతాల్లో 22ఏ కారణంగా వేలాది మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఇటీవల వచ్చిన నివేదికలు కూడా పేర్కొంటున్నాయన్నారు గ్రామపంచాయతీ, మున్సిపల్ అనుమతులతో ఇళ్లు నిర్మించుకున్న వారు, ఏళ్ల తరబడి భూములను అనుభవిస్తున్న పట్టాదారులు సైతం ఇప్పుడు వాటిని విక్రయించుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. విద్య, వైద్యం, వివాహాలు, కుటుంబ అవసరాల కోసం భూములను విక్రయించుకోవాల్సిన సమయంలో రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో బాధితులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. భూముల రికార్డుల విషయంలో ప్రభుత్వం, రెవెన్యూ అధికారులు సమగ్రంగా పరిశీలించి స్పష్టత తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఒకవైపు అర్హత కలిగిన పట్టా భూములను 22ఏ జాబితాలో చేర్చి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ, మరోవైపు ప్రభుత్వ ప్రయోజనాల కోసం సేకరించిన భూముల రికార్డులు సరిచేయకపోవడం ఏంటని ప్రశ్నించారు. రెవెన్యూ మంత్రి రాజీనామా చేయాలి రాష్ట్రవ్యాప్తంగా 22ఏ సెక్షన్ దుర్వినియోగంపై నైతిక బాధ్యత వహించి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాజీనామా చేయాలని గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. కరీంనగర్ నియోజకవర్గంలోని రేకుర్తి, కొత్తయాస్వాడ, విద్యానగర్, కొత్తపల్లి తదితర ప్రాంతాల్లో నిషేధిత జాబితాలో చేర్చిన అర్హత కలిగిన పట్టా భూములను వెంటనే 22ఏ నుంచి తొలగించి రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించాలని జిల్లా కలెక్టర్‌ను కోరినట్లు తెలిపారు. సమస్యను వెంటనే పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని గంగుల కమలాకర్ హెచ్చరించారు. అవసరమైతే పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి ‘చలో సెక్రటేరియట్’ కార్యక్రమానికి పిలుపునిస్తామని స్పష్టం చేశారు. భూ బాధితులకు న్యాయం జరిగే వరకు బీఆర్‌ఎస్ వారి తరఫున పోరాటం కొనసాగిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో.. ఎమ్మెల్యే గంగులతో పాటు.. మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, టిఆర్ఎస్ నగర శాఖ అధ్యక్షులు చల్ల హరిశంకర్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్, ఏనుగు రవీందర్ రెడ్డి, పలువురు టిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు.. ప్రజా ప్రతినిధులు.. భూ బాధితులు.. బిఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.2
- రామంచ ప్రైమరీ స్కూల్ లో రాఖీ పర్వదిన వేడుకలు....రాఖీలు కట్టుకుని పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్న విద్యార్థులు అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగ వేడుకలు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రామంచ మండల పరిషత్ ప్రైమరీ స్కూల్లో ఘనంగా నిర్వహించారు. టీచర్ల సమక్షంలో విద్యార్థులు సోదరీ సోదర భావంతో రాఖీలు కట్టుకొని పరస్పర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నీవు నాకు రక్ష నేను నీకు రక్ష మనిద్దరం దేశానికి రక్ష అంటూ పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటు రాఖీ వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఆనంద్ టీచర్ చీల పద్మా తోపాటు పేరెంట్స్ విద్యార్థులు పాల్గొన్నారు.1
- గన్నేరువరం మండలం డబుల్ రోడ్డు కోసం 30న నిరాహార దీక్ష.. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ యువజన సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 30న 24 గంటల నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు నాయకులు తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో 100 రోజుల్లో డబుల్ రోడ్డు నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చినా, రెండున్నరేళ్లు గడిచినా పనులు ప్రారంభం కాలేదని ఆరోపించారు. రోడ్డు సమస్యపై ప్రజలు, యువజన సంఘాలు పలుమార్లు ప్రశ్నించినా సరైన సమాధానం రాలేదన్నారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు చిత్తశుద్ధి ఉంటే 30న లక్ష్మీనరసింహస్వామి కాంప్లెక్స్ ఎదుట జరిగే నిరాహార దీక్షకు హాజరై తమతో కలిసి కూర్చోవాలని కోరారు. రోడ్డు సమస్య పరిష్కారం కోసం పార్టీలకతీతంగా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు దీక్షకు మద్దతుగా తరలిరావాలని పిలుపునిచ్చారు. యువజన సంఘాల ఐక్యతతో డబుల్ రోడ్డు సాధించే వరకు పోరాటం కొనసాగిస్తాం” అని నాయకులు స్పష్టం చేశారు.1
- *కుక్క కాటుకు ఇద్దరు.. ఆసుపత్రిలో చికిత్స* *కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స.. బాధితులను పరామర్శించిన మున్సిపల్ కమిషనర్ రాఘవేంద్ర*1
- *శిశు మందిర్ పాఠశాలలో రాఖీ పౌర్ణమి సందర్భంగా పౌర్ణమి హోమం మరియు రాఖీ ఉత్సవం* శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాలలో ముందస్తు రాఖీ పౌర్ణమి పండుగను పురస్కరించుకుని పౌర్ణమి యజ్ఞాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు యజ్ఞంలో పాల్గొని వేద మంత్రోచ్ఛారణల మధ్య హవన కార్యక్రమాన్ని నిర్వహించారు. రక్షాబంధన్ పండుగ అన్నాచెల్లెళ్ల ఆత్మీయతకు, పరస్పర ప్రేమకు, రక్షణ భావానికి ప్రతీక అని ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, సోదరభావం, దేశభక్తి వంటి విలువలను విద్యార్థుల్లో పెంపొందించడమే ఇటువంటి కార్యక్రమాల ముఖ్య ఉద్దేశమని పాఠశాల ప్రధానాచార్యులు మోర రణధీర్ తెలిపారు. యజ్ఞం అనంతరం విద్యార్థులు పరస్పరం రాఖీలు కట్టుకుని రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. పాఠశాల ఆవరణం భక్తి, ఆనందోత్సాహాలతో కళకళలాడింది. కార్యక్రమంలో కార్యదర్శి ఇంజనీర్ కోల అన్నారెడ్డి, ఎలగందుల సత్యనారాయణ, డా. ఎలగందుల శ్రీనివాస్, కొణిజర్ల మహేష్, శిరీష, పులాల శ్యామ్, అల్లాడి ఆనంద్ కుమార్, ముసుకుల విద్యాసాగర్ రెడ్డి, పండుగ నాగరాజు, టి రాజేశ్వర్ రావు, అప్పిడి వకుళా దేవి తదితరులు పాల్గొన్నారు.2
- రుద్రంగిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ రసాభస...కాంగ్రెస్ బిజేపి కార్యకర్తలు మద్య తోపులాట ఉద్రిక్తత రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కాంగ్రెస్ బిజెపి మధ్య వాగ్వివాదానికి దారి తీసింది. ఘర్షణ వాతావరణంతో ఉద్రిక్తత ఏర్పడింది. ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్వగ్రామం రుద్రంగిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణి రసాభాసగా మారింది. స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధాని మోడీ ఫోటో లేదని బిజెపి కార్యకర్తలు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ను నిలదీశారు. దీంతో బిజెపి పాలిత ప్రాంతాల్లో సన్న బియ్యం ఎందుకు ఇవ్వడం లేదని కాంగ్రెస్ కార్యకర్తలు బిజేపి నాయకుల్ని నిలదీశారు. దీంతో కాంగ్రెస్ బిజెపి కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇరుపార్టీల నాయకుల తోపులాటతో ఘర్షణ వాతావరణం ఏర్పడి ఉద్రిక్తతకు దారి తీసింది. వెంటనే పోలీసులు ఇరు పార్టీల నాయకులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.4
- స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. కోరుట్లలో డా. రఘు టీఆర్ఎస్ నాయకుల ఆందోళన.1