కేసీఆర్ కుటుంబం ఆక్రమించిన ప్రభుత్వ భూములను పేదలకు, ఉద్యమకారులకు పంచాలి:ప్రొఫెసర్ కోదండరాం.(హైదరాబాద్)సెప్టెంబర్ 17: తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17 ఒక ముఖ్యమైన రోజు అని, హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం జరిగిన సందర్భాన్ని చారిత్రక వాస్తవాల నేపథ్యంలో అర్థం చేసుకోవాలని శాసనమండలి సభ్యుడు తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. సెప్టెంబర్ 17 విలీన దినోత్సవాన్ని పురస్కరించుకుని నాంపల్లిలోని తెలంగాణ జన సమితి రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమమే సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం జరిగిన విషయాన్ని తిరిగి ప్రజల చర్చలోకి తీసుకొచ్చిందన్నారు. 1989లో ‘మా తెలంగాణ’ పత్రిక ఆవిష్కరణతో తెలంగాణ చరిత్ర, అస్తిత్వంపై చర్చ ప్రారంభమైందని, 1996లో వరంగల్‌లో జరిగిన సమావేశం తరువాత తెలంగాణ వాదం ప్రజల్లోకి వెళ్లిందని గుర్తు చేశారు.సెప్టెంబర్ 17ను కేవలం సైనిక చర్య ఫలితంగా చూడటం సరికాదని, నిజాం పాలనకు వ్యతిరేకంగా సాగిన ప్రజా పోరాటాల పాత్రను విస్మరించలేమన్నారు. మతపరమైన కోణంలో ప్రచారం చేస్తూ తెలంగాణలోని గంగా-జమునా తహజీబ్‌కు భంగం కలిగించే ప్రయత్నాలు చేయడం తగదన్నారు. ప్రజలు కోరుకున్నది ప్రజాస్వామిక పాలన, ప్రజాస్వామిక సమాజమని, ఆ లక్ష్యాల సాధన కోసం పోరాట స్ఫూర్తిని కొనసాగించాలన్నారు.రాష్ట్రంలో ప్రభుత్వ భూములపై జరుగుతున్న చర్చ నేపథ్యంలో కేసీఆర్ కుటుంబం పేర్లతో అక్రమంగా ఉన్నట్లు తేలిన ప్రభుత్వ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, భూమిలేని పేద దళితులకు, తెలంగాణ ఉద్యమకారులకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆస్తిగా ఉన్న ప్రభుత్వ భూములు కొద్దిమంది చేతుల్లో ఉండకుండా సామాజిక న్యాయం కోసం వినియోగించాలన్నారు.నాటి నిజాం వ్యతిరేక పోరాటం నుంచి సీమాంధ్ర పాలకుల దోపిడీకి వ్యతిరేకంగా సాగిన తెలంగాణ ఉద్యమం వరకు ప్రజాస్వామిక తెలంగాణ కోసం జరిగిన పోరాట స్ఫూర్తిని కొనసాగించాలని ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు.

- శంషాబాద్ లో బుల్లెట్ ట్రైన్ భూసేకరణలో రేవంత్ రెడ్డి సన్నిహితుడి కుంభకోణం:MLA సుధీర్ రెడ్డి శంషాబాద్లో బుల్లెట్ ట్రైన్ భూసేకరణలో రేవంత్ రెడ్డి సన్నిహితుడైన ఒక ఎంపీ కుంభకోణం బహదూర్‌గూడాలో 650 ఎకరాలు బుల్లెట్ ట్రైన్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది అందులో 300 ఎకరాల భూ యజమానులను, నీకు ప్రభుత్వం ఇచ్చే పరిహారం కంటే ఎక్కువ ఇప్పిస్తా, అందులో సగం నాకు ఇవ్వాలని కొందరు దళారులు దందా చేస్తున్నారు ఆ దళారుల వెనుక ఒక ఎంపీ, రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఉన్నాడని మాకు తెలిసింది – బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి1
- ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్ పరిధిలో వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి. పోలీస్ సిబ్బంది, మహిళా కానిస్టేబుళ్లు, ఎస్‌ఐలు భక్తిశ్రద్ధలతో నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. బ్యాండ్ మేళాల మధ్య ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. మహిళా పోలీసుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తిభావంతో గణనాథుడిని సాగనంపారు.4
- తెలంగాణ దొంగలు YouTube ఛానల్, సోషల్ మీడియా ఖాతాలపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన BRSV కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై అభ్యంతరకరమైన, అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తూ, వారి ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వీడియోలు ప్రచారం చేస్తున్నారని, ఆ ఛానల్లను బ్లాక్ చేసి వాటి నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు1
- గణనాధుడి సేవలో కాచిగూడ ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది ఘనంగా గంగమ్మ తల్లి ఒడికి గణనాథుని పంపుతున్న పోలీసులు ఉత్సవాలకు కుల మతాలు, అధికార తారతమ్యాలు లేవని పోలీసులు రుజువు చేశారు... విజ్ఞాలను తొలగించే గణనాథుడిని సాంప్రదాయ బద్ధంగా పూజలు చేసిన ట్రాఫిక్ పోలీసులు ఆ గణనాథుడి విగ్రహ ఊరేగింపు అత్యంత ఆనందోత్సవాల మధ్య నిర్వహించారు... కాచిగూడ ట్రాఫిక్ అధికారులు, సిబ్బంది కలిసి ఆడుతూ పాడుతూ ఆ గణనాథుడి విగ్రహ నిమజ్జనం ఊరేగింపులో సందడి చేశారు... హైదరాబాద్ కాచిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో సిబ్బంది కలిసి గణనాథుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మూడు రోజులపాటు గణనాథుడికి సాంప్రదాయపద్ధంగా శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు... కాచిగూడ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కౌశిక్ నేతృత్వంలో ఎస్ఐలు సిబ్బంది కలిసి బ్యాండ్ మేళా కనుగొనగా నృత్యాలు చేస్తూ గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పలికారు....3
- శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని గురువారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.1
- మెదక్ జిల్లా కేంద్రంలో విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి వేడుకలు మెదక్ జిల్లా కేంద్రంలో విశ్వకర్మ జయంతి వేడుకలను విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, కలెక్టర్ ప్రతిమా సింగ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విశ్వకర్మలు తమ వృత్తి, ఉపాధికి సంబంధించిన సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వారి సమస్యలను సానుకూలంగా విన్న మంత్రి.. ప్రభుత్వం తరఫున అవసరమైన చర్యలు తీసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో విశ్వకర్మ సంఘం ప్రతినిధులు, నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.1
- సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలి మాజీ మేయర్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ కార్తిక రెడ్డి సెప్టెంబర్ 17 భారతదేశానికి 1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ హైదరాబాద్ సంస్థానానికి మాత్రం స్వాతంత్ర్యం లభించలేదని మాజీ మేయర్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ కార్తిక రెడ్డి అన్నారు. అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభభాయ్ పటేల్ చొరవతో 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమై విమోచనం పొందిందని ఆమె పేర్కొన్నారు. సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని తార్నాక చౌరస్తాలో బండ కార్తిక రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17ను వివిధ రాజకీయ పార్టీలు తమ కార్యక్రమాల్లో నిర్వహిస్తున్నప్పటికీ, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారికంగా నిర్వహించడం లేదని విమర్శించారు. అధికారంలోకి వస్తే సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించే పార్టీలు అధికారంలోకి వచ్చిన ఆ హామీని ఎందుకు అమలు చేయడం లేదని ఆమె ప్రశ్నించారు. తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17కు ఉన్న ప్రాధాన్యతను గుర్తించి అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు3
- యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్య నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్‌ఆర్ చౌరస్తాలో నడిరోడ్డుపై హరిబాబును కారులో వచ్చి కత్తితో నరికి చంపిన దుండగుడు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు గతంలో అదనపు కట్నం విషయంలో 4 నెలల గర్భిణీగా ఉన్న వైష్ణవిని చంపిన భర్త హరిబాబు1