logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్య నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్‌ఆర్‌ చౌరస్తాలో నడిరోడ్డుపై హరిబాబును కారులో వచ్చి కత్తితో నరికి చంపిన దుండగుడు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు గతంలో అదనపు కట్నం విషయంలో 4 నెలల గర్భిణీగా ఉన్న వైష్ణవిని చంపిన భర్త హరిబాబు

1 hr ago
user_@ANUNEWS143
@ANUNEWS143
Newspaper publisher యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
1 hr ago

యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్య నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్‌ఆర్‌ చౌరస్తాలో నడిరోడ్డుపై హరిబాబును కారులో వచ్చి కత్తితో నరికి చంపిన దుండగుడు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు గతంలో అదనపు కట్నం విషయంలో 4 నెలల గర్భిణీగా ఉన్న వైష్ణవిని చంపిన భర్త హరిబాబు

More news from తెలంగాణ and nearby areas
  • సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలి మాజీ మేయర్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ కార్తిక రెడ్డి సెప్టెంబర్ 17 భారతదేశానికి 1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ హైదరాబాద్‌ సంస్థానానికి మాత్రం స్వాతంత్ర్యం లభించలేదని మాజీ మేయర్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ కార్తిక రెడ్డి అన్నారు. అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభభాయ్ పటేల్ చొరవతో 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్‌ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమై విమోచనం పొందిందని ఆమె పేర్కొన్నారు. సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని తార్నాక చౌరస్తాలో బండ కార్తిక రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17ను వివిధ రాజకీయ పార్టీలు తమ కార్యక్రమాల్లో నిర్వహిస్తున్నప్పటికీ, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారికంగా నిర్వహించడం లేదని విమర్శించారు. అధికారంలోకి వస్తే సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించే పార్టీలు అధికారంలోకి వచ్చిన ఆ హామీని ఎందుకు అమలు చేయడం లేదని ఆమె ప్రశ్నించారు. తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17కు ఉన్న ప్రాధాన్యతను గుర్తించి అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
    3
    సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలి మాజీ మేయర్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ కార్తిక రెడ్డి

సెప్టెంబర్ 17 భారతదేశానికి 1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ హైదరాబాద్‌ సంస్థానానికి మాత్రం స్వాతంత్ర్యం లభించలేదని మాజీ మేయర్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ కార్తిక రెడ్డి అన్నారు. అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభభాయ్ పటేల్ చొరవతో 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్‌ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమై విమోచనం పొందిందని ఆమె పేర్కొన్నారు.
సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని తార్నాక చౌరస్తాలో బండ కార్తిక రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17ను వివిధ రాజకీయ పార్టీలు తమ కార్యక్రమాల్లో నిర్వహిస్తున్నప్పటికీ, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారికంగా నిర్వహించడం లేదని విమర్శించారు. అధికారంలోకి వస్తే సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించే పార్టీలు అధికారంలోకి వచ్చిన ఆ హామీని ఎందుకు అమలు చేయడం లేదని ఆమె ప్రశ్నించారు. తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17కు ఉన్న ప్రాధాన్యతను గుర్తించి అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
    user_DASU GANESH  REPORTER
    DASU GANESH REPORTER
    తిరుమలగిరి, హైదరాబాద్, తెలంగాణ•
    8 hrs ago
  • *బిజెపి అధికారం లోకి వచ్చిన వెంటనే అధికారికంగా విమోచన దినోత్సవాన్ని జరుపుతాం* కోరుకొప్పుల నాగేష్ గౌడ్ బిజెపి మండల అధ్యక్షులు జాఫర్ ఘడ్ మండలం ఈ రోజు జాఫర్ ఘడ్ మండల కేంద్రం లో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బిజెపి జాఫర్ ఘడ్ మండల కమిటి ఆధ్వర్యం లో దేశ తొలి ఉప ప్రధాని హోం శాఖ మంత్రి వర్యులు సర్దార్ వల్లభాయ్ పటేల్ రజాకార్లను ఊచకోత కోసిన బత్తిన మొగిలయ్య గౌడ్ చిత్రపటాలకు నివాళాలు అర్పించి జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వచించడం జరిగింది అనంతరం సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడతు సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజల స్వేచ్ఛ సమానత్వం పొందిన రోజు రజాకార్ల రాక్షసత్వానికి వ్యతిరేకంగా తుపాకీ చేతబట్టి పోరాటం చేసిన కూనూరు గ్రామానికి చెందిన నెల్లుట్ల సుశీలాదేవి అలియాస్ అచ్చమాంబ ఇప్పటికీ నాడు జరిగిన రాక్షసత్వానికి నిజాం నిరంకుశత్వానికి సజీవ సాక్ష్యం MIM పార్టీ మెప్పు పొందడం కోసమే నాటి BRS ప్రభుత్వం నేటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవం ని అధికారికంగా నిర్వహించడం లో విఫలం అయ్యాయి నిజాం కాలంలో తెలంగాణ ప్రాంతం బానిసలుగా వెట్టి చాకిరి చేసి యంత్రాలు గా ఉండేవాళ్ళు తెలంగాణ సాయుధ పోరాటం లో అమరులైన జాఫర్ ఘడ్ మండలం లోని పోరాట యోదులు చాలా మంది బిజెపి ఆద్వర్యం లో తెలంగాణ విమోచన దినోత్సవం ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా పరేడ్ గ్రౌండ్ లో జరపడం తెలంగాణ పైన బిజెపి కి ఉన్న చిత్త శుద్ధి కి నిదర్శనం తెలంగాణ బిజెపి అధికారం లోకి వచ్చిన వెంటనే తెలంగాణ విమోచన దినోత్సవం ని అధికారికంగా నిర్వహించడం జరుగుతుంది అధికారం లోకి రాకముందు BRS పార్టీ కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా జరుపుతామని ప్రకటించి అధికారం లోకి రాగానే మాట మార్చాయి అని వివరించడం జరిగింది అనంతరం దేశ ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా జాఫర్ ఘడ్ మండల కేంద్రం లో అరటిపండ్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు సింగరాపు రమేష్ మారపల్లి రవి BJYM జిల్లా నాయకులు పల్లె సంతోష్ రెడ్డి OBC మోర్చా మండల కన్వీనర్ పందిబోయినా యాదగిరి మన్ కి బాత్ మండల కన్వీనర్ గిరగొని యాదగిరి కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు అబ్బరాబోయిన యాకస్వామీ మండల నాయకులు అశోక్ దాంశెట్టి సోమేశ్వర్ పళ్ళ దయాకర్ బూత్ అధ్యక్షులు చవనబోయిన శ్రీనివాస్ సంగ గోపాల్ తాటికాయల హరికృష్ణ రాపర్తి వినయ్ రాజు దినేష్ తో పాటుగా గ్రామస్తులు తదితరులు పాల్గొనడం జరిగింది
    1
    *బిజెపి అధికారం లోకి వచ్చిన వెంటనే అధికారికంగా విమోచన దినోత్సవాన్ని జరుపుతాం* 
             కోరుకొప్పుల నాగేష్ గౌడ్ 
            బిజెపి మండల అధ్యక్షులు 
               జాఫర్ ఘడ్ మండలం

ఈ రోజు జాఫర్ ఘడ్ మండల కేంద్రం లో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బిజెపి జాఫర్ ఘడ్ మండల కమిటి ఆధ్వర్యం లో దేశ తొలి ఉప ప్రధాని హోం శాఖ మంత్రి వర్యులు సర్దార్ వల్లభాయ్ పటేల్  రజాకార్లను ఊచకోత కోసిన బత్తిన మొగిలయ్య గౌడ్  చిత్రపటాలకు నివాళాలు అర్పించి జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వచించడం జరిగింది 
అనంతరం సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడతు 
సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజల స్వేచ్ఛ సమానత్వం పొందిన రోజు 
రజాకార్ల రాక్షసత్వానికి వ్యతిరేకంగా తుపాకీ చేతబట్టి పోరాటం చేసిన కూనూరు గ్రామానికి చెందిన నెల్లుట్ల సుశీలాదేవి అలియాస్ అచ్చమాంబ ఇప్పటికీ నాడు జరిగిన రాక్షసత్వానికి నిజాం నిరంకుశత్వానికి సజీవ సాక్ష్యం MIM పార్టీ మెప్పు పొందడం కోసమే నాటి BRS ప్రభుత్వం నేటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవం ని అధికారికంగా నిర్వహించడం లో విఫలం అయ్యాయి 
నిజాం కాలంలో తెలంగాణ ప్రాంతం బానిసలుగా వెట్టి చాకిరి చేసి యంత్రాలు గా ఉండేవాళ్ళు 
తెలంగాణ సాయుధ పోరాటం లో అమరులైన జాఫర్ ఘడ్ మండలం లోని పోరాట యోదులు చాలా మంది 
బిజెపి ఆద్వర్యం లో తెలంగాణ విమోచన దినోత్సవం ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా పరేడ్ గ్రౌండ్ లో జరపడం తెలంగాణ పైన బిజెపి కి ఉన్న చిత్త శుద్ధి కి నిదర్శనం 
తెలంగాణ బిజెపి అధికారం లోకి వచ్చిన వెంటనే తెలంగాణ విమోచన దినోత్సవం ని అధికారికంగా నిర్వహించడం జరుగుతుంది
అధికారం లోకి రాకముందు BRS పార్టీ కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా జరుపుతామని ప్రకటించి అధికారం లోకి రాగానే మాట మార్చాయి అని వివరించడం జరిగింది 
అనంతరం దేశ ప్రధాని నరేంద్ర మోదీ  పుట్టిన రోజు సందర్భంగా జాఫర్ ఘడ్ మండల కేంద్రం లో అరటిపండ్లు పంపిణీ చేయడం జరిగింది 
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు సింగరాపు రమేష్ మారపల్లి రవి BJYM జిల్లా నాయకులు పల్లె సంతోష్ రెడ్డి OBC మోర్చా మండల కన్వీనర్ పందిబోయినా యాదగిరి మన్ కి బాత్ మండల కన్వీనర్ గిరగొని యాదగిరి కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు అబ్బరాబోయిన యాకస్వామీ మండల నాయకులు అశోక్ దాంశెట్టి సోమేశ్వర్ పళ్ళ దయాకర్ బూత్ అధ్యక్షులు చవనబోయిన శ్రీనివాస్ సంగ గోపాల్ తాటికాయల హరికృష్ణ రాపర్తి వినయ్ రాజు దినేష్ తో పాటుగా గ్రామస్తులు తదితరులు పాల్గొనడం జరిగింది
    user_Ramanakar
    Ramanakar
    Local News Reporter ఘన్‌పూర్ (స్టేషన్), జనగాం, తెలంగాణ•
    4 hrs ago
  • గణనాధుడి సేవలో కాచిగూడ ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది ఘనంగా గంగమ్మ తల్లి ఒడికి గణనాథుని పంపుతున్న పోలీసులు ఉత్సవాలకు కుల మతాలు, అధికార తారతమ్యాలు లేవని పోలీసులు రుజువు చేశారు... విజ్ఞాలను తొలగించే గణనాథుడిని సాంప్రదాయ బద్ధంగా పూజలు చేసిన ట్రాఫిక్ పోలీసులు ఆ గణనాథుడి విగ్రహ ఊరేగింపు అత్యంత ఆనందోత్సవాల మధ్య నిర్వహించారు... కాచిగూడ ట్రాఫిక్ అధికారులు, సిబ్బంది కలిసి ఆడుతూ పాడుతూ ఆ గణనాథుడి విగ్రహ నిమజ్జనం ఊరేగింపులో సందడి చేశారు... హైదరాబాద్ కాచిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో సిబ్బంది కలిసి గణనాథుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మూడు రోజులపాటు గణనాథుడికి సాంప్రదాయపద్ధంగా శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు... కాచిగూడ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కౌశిక్ నేతృత్వంలో ఎస్ఐలు సిబ్బంది కలిసి బ్యాండ్ మేళా కనుగొనగా నృత్యాలు చేస్తూ గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పలికారు....
    3
    గణనాధుడి సేవలో కాచిగూడ ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది ఘనంగా గంగమ్మ తల్లి ఒడికి గణనాథుని పంపుతున్న పోలీసులు 
ఉత్సవాలకు కుల మతాలు, అధికార తారతమ్యాలు లేవని పోలీసులు రుజువు చేశారు... విజ్ఞాలను తొలగించే గణనాథుడిని సాంప్రదాయ బద్ధంగా పూజలు చేసిన ట్రాఫిక్ పోలీసులు ఆ గణనాథుడి విగ్రహ ఊరేగింపు అత్యంత ఆనందోత్సవాల మధ్య నిర్వహించారు... కాచిగూడ ట్రాఫిక్ అధికారులు, సిబ్బంది కలిసి ఆడుతూ పాడుతూ ఆ గణనాథుడి విగ్రహ నిమజ్జనం ఊరేగింపులో సందడి చేశారు... హైదరాబాద్ కాచిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో సిబ్బంది కలిసి గణనాథుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మూడు రోజులపాటు గణనాథుడికి సాంప్రదాయపద్ధంగా శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు... 
కాచిగూడ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కౌశిక్ నేతృత్వంలో ఎస్ఐలు సిబ్బంది కలిసి బ్యాండ్ మేళా కనుగొనగా నృత్యాలు చేస్తూ గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పలికారు....
    user_B N RAJU
    B N RAJU
    అంబర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    22 hrs ago
  • రివెంజ్ హత్య...యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు దారుణహత్య జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్ కు చెందిన యూట్యూబర్ గంధం వైష్ణవి భర్త చిత్తరి హరిబాబు (26) గురువారం నిజామాబాద్ లో దారుణ హత్యకు గురయ్యారు. కారులో వచ్చిన వ్యక్తులు హరిబాబుపై కొబ్బరి బొండాలు కొట్టే కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి పారిపోయారు. తీవ్ర గాయాలతో హరిబాబు అక్కడికక్కడే మృతి చెందారు. హత్య అనంతరం నిందితులు కారులో అక్కడి నుంచి పరారైనట్లు సీసీ ఫుటేజ్ ద్వారా తెలుస్తోంది. హరిబాబు భార్య వైష్ణవి ని సరిగ్గా ఆరు మాసాల క్రితం మార్చి 17న హత్యకు గురయ్యారు. వైష్ణవిని భర్తనే హత్య చేయడంతో ప్రతికారంగా వైష్ణవి కుటుంబ సభ్యులు హత్య చేసినట్లు సమాచారం. వైష్ణవి హత్య జరిగిన సమయంలో ఎప్పటికైనా వాన్ని వదలమని శపథం చేశారు. అన్నంత పని చేసినట్లు తెలుస్తోంది. వైష్ణవి హత్య కేసులో హరిబాబు ఆయన తల్లిదండ్రులను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. ఇటీవల బెయిల్ పై విడుదల అయి నిజామాబాద్ లో ఉంటున్నాడు.‌ హరిబాబు అక్కడ ఉంటున్నాడనే విషయం తెలుసుకొని వైష్ణవి కుటుంబ సభ్యులు కాపు కాసి హత్య చేసినట్లు స్థానికులు భావిస్తున్నారు.‌
    2
    రివెంజ్ హత్య...యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు దారుణహత్య
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్ కు చెందిన యూట్యూబర్ గంధం వైష్ణవి భర్త చిత్తరి హరిబాబు (26) గురువారం నిజామాబాద్ లో దారుణ హత్యకు గురయ్యారు. కారులో వచ్చిన వ్యక్తులు హరిబాబుపై కొబ్బరి బొండాలు కొట్టే కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి పారిపోయారు. తీవ్ర గాయాలతో హరిబాబు అక్కడికక్కడే మృతి చెందారు. హత్య అనంతరం నిందితులు కారులో అక్కడి నుంచి పరారైనట్లు సీసీ ఫుటేజ్ ద్వారా తెలుస్తోంది. హరిబాబు భార్య వైష్ణవి ని సరిగ్గా ఆరు మాసాల క్రితం మార్చి 17న హత్యకు గురయ్యారు. వైష్ణవిని భర్తనే హత్య చేయడంతో ప్రతికారంగా వైష్ణవి కుటుంబ సభ్యులు హత్య చేసినట్లు సమాచారం. వైష్ణవి హత్య జరిగిన సమయంలో ఎప్పటికైనా వాన్ని వదలమని శపథం చేశారు. అన్నంత పని చేసినట్లు తెలుస్తోంది. వైష్ణవి హత్య కేసులో హరిబాబు ఆయన తల్లిదండ్రులను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. ఇటీవల బెయిల్ పై విడుదల అయి నిజామాబాద్ లో ఉంటున్నాడు.‌ హరిబాబు అక్కడ ఉంటున్నాడనే విషయం తెలుసుకొని వైష్ణవి కుటుంబ సభ్యులు కాపు కాసి హత్య చేసినట్లు స్థానికులు భావిస్తున్నారు.‌
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    12 min ago
  • మెదక్ జిల్లా కేంద్రంలో విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి వేడుకలు మెదక్ జిల్లా కేంద్రంలో విశ్వకర్మ జయంతి వేడుకలను విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, కలెక్టర్ ప్రతిమా సింగ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విశ్వకర్మలు తమ వృత్తి, ఉపాధికి సంబంధించిన సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వారి సమస్యలను సానుకూలంగా విన్న మంత్రి.. ప్రభుత్వం తరఫున అవసరమైన చర్యలు తీసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో విశ్వకర్మ సంఘం ప్రతినిధులు, నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.
    1
    మెదక్ జిల్లా కేంద్రంలో విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి వేడుకలు 
మెదక్ జిల్లా కేంద్రంలో విశ్వకర్మ జయంతి వేడుకలను విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, కలెక్టర్ ప్రతిమా సింగ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విశ్వకర్మలు తమ వృత్తి, ఉపాధికి సంబంధించిన సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వారి సమస్యలను సానుకూలంగా విన్న మంత్రి.. ప్రభుత్వం తరఫున అవసరమైన చర్యలు తీసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో విశ్వకర్మ సంఘం ప్రతినిధులు, నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.
    user_Sraya
    Sraya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    5 hrs ago
  • బావి భారత అభివృద్ధి నరేంద్ర మోడీ తోనే సాధ్యం. భారత ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా అమ్మాపురం గుట్టమీద రామాలయంలో ప్రత్యేక పూజలు... భారతదేశ అభివృద్ధి యొక్క నరేంద్ర మోడీ తోనే సాధ్యపడుతుందని బిజెపి నాయకులు గట్టు రాంబాబు గుండా సురేష్ లు అన్నారు. గురువారం భారత ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా తొర్రూరు మండలం లోని అమ్మాపురం గ్రామ గుట్టమీద రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
    1
    బావి భారత అభివృద్ధి నరేంద్ర మోడీ తోనే సాధ్యం. 
భారత ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా అమ్మాపురం గుట్టమీద రామాలయంలో ప్రత్యేక పూజలు... 
భారతదేశ అభివృద్ధి యొక్క నరేంద్ర మోడీ తోనే సాధ్యపడుతుందని బిజెపి నాయకులు గట్టు రాంబాబు గుండా సురేష్ లు అన్నారు. గురువారం భారత ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా తొర్రూరు మండలం లోని అమ్మాపురం గ్రామ గుట్టమీద రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
    user_జర్నలిస్ట్ యాకయ్య-పుష్ప యాదవ్
    జర్నలిస్ట్ యాకయ్య-పుష్ప యాదవ్
    Doctor తొర్రూరు, మహబూబాబాద్, తెలంగాణ•
    6 hrs ago
  • 51 ఏళ్ల బంధం 💚 విడాకుల దాకా వెళ్లి ఒక్కటైంది* UPలోని బులంద్హర్లో 51 ఏళ్ల వివాహ బంధం విడాకుల దాకా వెళ్లి పోలీసుల చొరవతో ఒక్కటైంది. కలిసుండాల్సిన వృద్ధాప్యంలో నలుగురు కొడుకులు తల్లిదండ్రులను పంచుకోవడంతో వారి మధ్య దూరం పెరిగింది *51 ఏళ్ల బంధం 💚 విడాకుల దాకా వెళ్లి ఒక్కటైంది* UPలోని బులంద్హర్లో 51 ఏళ్ల వివాహ బంధం విడాకుల దాకా వెళ్లి పోలీసుల చొరవతో ఒక్కటైంది. కలిసుండాల్సిన వృద్ధాప్యంలో నలుగురు కొడుకులు తల్లిదండ్రులను పంచుకోవడంతో వారి మధ్య దూరం పెరిగింది. ఇటీవల ఇద్దరూ కలిసుండగా మందులకు భర్త డబ్బివ్వకపోవడంతో ఆ భార్య కుమిలిపోయింది. విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే పోలీసులు జోక్యం చేసుకొని భార్యకు నెలకు రూ.5వేలు ఇవ్వాలని ఒప్పించి ఆ బంధాన్ని నిలబెట్టారు..
    1
    51 ఏళ్ల బంధం 💚 విడాకుల దాకా వెళ్లి ఒక్కటైంది*

UPలోని బులంద్హర్లో 51 ఏళ్ల వివాహ బంధం విడాకుల దాకా వెళ్లి పోలీసుల చొరవతో ఒక్కటైంది. కలిసుండాల్సిన వృద్ధాప్యంలో నలుగురు కొడుకులు తల్లిదండ్రులను పంచుకోవడంతో వారి మధ్య దూరం పెరిగింది
*51 ఏళ్ల బంధం 💚 విడాకుల దాకా వెళ్లి ఒక్కటైంది*
UPలోని బులంద్హర్లో 51 ఏళ్ల వివాహ బంధం విడాకుల దాకా వెళ్లి పోలీసుల చొరవతో ఒక్కటైంది. కలిసుండాల్సిన వృద్ధాప్యంలో నలుగురు కొడుకులు తల్లిదండ్రులను పంచుకోవడంతో వారి మధ్య దూరం పెరిగింది. ఇటీవల ఇద్దరూ కలిసుండగా మందులకు భర్త డబ్బివ్వకపోవడంతో ఆ భార్య కుమిలిపోయింది. విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే పోలీసులు జోక్యం చేసుకొని భార్యకు నెలకు రూ.5వేలు ఇవ్వాలని ఒప్పించి ఆ బంధాన్ని నిలబెట్టారు..
    user_SIRIPATI ARUNKUMAR
    SIRIPATI ARUNKUMAR
    Local News Reporter బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    4 hrs ago
  • *బీఆర్ఎస్ పార్టీ – స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం* **చిల్పూర్ మండలం* * *తండాలకు గ్రామపంచాయతీ హోదా – కేసీఆర్‌కు కృతజ్ఞతగా పాలాభిషేo* *మా తండాలో మా పాలన – మా గూడేoలో మా పాలన* తండాలు, గూడేలు, ఆవాసాలను ప్రత్యేక గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసి గిరిజనుల స్థానిక పాలనకు మార్గం సుగమం చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కృతజ్ఞతగా స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలోని నూతన గ్రామపంచాయతీలలో నిర్వహిస్తున్న కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం ఘనంగా కొనసాగుతోంది.ఉదయం 10:00 గంటలకు నిర్వహించిన కార్యక్రమంలో మాలోతు రమేష్ నాయక్ ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. గార్లగడ్డ తండా, దేవోజీ తండా లింగంపల్లి, తీగలాతండా గ్రామ లలో పాలాభిషేకం కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది. లంబాడ మహిళలు KCR నూ గుర్తు చేసుకొని డాన్స్ లు చేసారు ఈ కార్యక్రమం లో మార్కెట్ మాజీ డైరెక్టర్ బత్తులా రాజన్ బాబు, భూక్యా గోపాల్ నాయక్, లింగంపల్లి సర్పంచ్ భూక్యా సునీత లాలు,కొండాపూర్ సర్పంచ్ గుగులోత్ దేవేందర్ నాయక్,ఉప సర్పంచ్ రాజు oరాధికా, రమేష్, రాజేందర్, వార్డ్ మెంబెర్స్,లింగంపల్లి మాజీ అధ్యక్షులు రచ్చ రవి, ఎల్లాయ్య, శంకర్ నాయక్,మాజీ ఉప íసర్పంచ్ బాలరాజు, మాటూరి శ్రీను, కొండ కనకయ్య, లకావత్ బాగ్న, సంపత్, తిరుపతి పతేపూర్ గ్రామ మాజీ అధ్యక్షులు, ఉమ్లా,వెంకన్నా, లింగన్న,మాజీ సర్పంచ్ వెంకటేష్, యూత్ అధ్యక్షులు భూక్యా విజయ్ నాయక్, అధ్యక్షులు మాజీ తీగల్ తండా వెంకటేష్,వార్డ్ మెంబెర్ రవి,యూత్ నాయకులు సుధాకర్, రాజు,మహిళాలు తదితరులు పాల్గొన్నారు.
    1
    *బీఆర్ఎస్ పార్టీ – స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం* **చిల్పూర్ మండలం* * 
 *తండాలకు గ్రామపంచాయతీ హోదా – కేసీఆర్‌కు కృతజ్ఞతగా పాలాభిషేo*

*మా తండాలో మా పాలన – మా గూడేoలో మా పాలన* 
తండాలు, గూడేలు, ఆవాసాలను ప్రత్యేక గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసి గిరిజనుల స్థానిక పాలనకు మార్గం సుగమం చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కృతజ్ఞతగా స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలోని నూతన గ్రామపంచాయతీలలో నిర్వహిస్తున్న కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం ఘనంగా కొనసాగుతోంది.ఉదయం 10:00 గంటలకు నిర్వహించిన కార్యక్రమంలో
మాలోతు రమేష్ నాయక్ ఆధ్వర్యంలో కేసీఆర్  చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. 
గార్లగడ్డ తండా, దేవోజీ తండా లింగంపల్లి, తీగలాతండా గ్రామ లలో పాలాభిషేకం కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది. 
లంబాడ మహిళలు KCR నూ గుర్తు చేసుకొని డాన్స్ లు చేసారు
ఈ కార్యక్రమం లో మార్కెట్ మాజీ డైరెక్టర్ బత్తులా రాజన్ బాబు, భూక్యా గోపాల్ నాయక్, లింగంపల్లి సర్పంచ్ భూక్యా సునీత లాలు,కొండాపూర్ సర్పంచ్ గుగులోత్ దేవేందర్ నాయక్,ఉప సర్పంచ్ రాజు oరాధికా, రమేష్, రాజేందర్, వార్డ్ మెంబెర్స్,లింగంపల్లి మాజీ అధ్యక్షులు రచ్చ రవి, ఎల్లాయ్య, శంకర్ నాయక్,మాజీ ఉప íసర్పంచ్ బాలరాజు, మాటూరి శ్రీను, కొండ కనకయ్య, లకావత్ బాగ్న, సంపత్, తిరుపతి పతేపూర్ గ్రామ మాజీ అధ్యక్షులు, ఉమ్లా,వెంకన్నా, లింగన్న,మాజీ సర్పంచ్ వెంకటేష్, యూత్ అధ్యక్షులు భూక్యా విజయ్ నాయక్, అధ్యక్షులు మాజీ తీగల్ తండా వెంకటేష్,వార్డ్ మెంబెర్ రవి,యూత్ నాయకులు సుధాకర్, రాజు,మహిళాలు తదితరులు పాల్గొన్నారు.
    user_Ramanakar
    Ramanakar
    Local News Reporter ఘన్‌పూర్ (స్టేషన్), జనగాం, తెలంగాణ•
    5 hrs ago
  • కరీంనగర్ లో ఈనెల 23న గణేష్ నిమజ్జనోత్సవం...ఏర్పాట్లను పరిశీలించిన కేంద్రమంత్రి బండి సంజయ్ కరీంనగర్ లో గణేష్ నిమజ్జనోత్సవానికి పకడ్బందీగా విస్తృత ఏర్పాట్లు చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. మానకొండూరు, చింతకుంట, కొత్తపల్లిలో వినాయక నిమజ్జనానికి సంబంధించి ఏర్పాట్లను మేయర్ శ్రీనివాస్, కలెక్టర్ చిత్రా మిశ్రా సిపి గౌస్ ఆలం తో కలిసి బండి సంజయ్ పరిశీలించారు. కరీంనగర్‌ లో ఈ నెల 23న నిర్వహించనున్న వినాయక నిమజ్జనోత్సవాన్ని బ్రహ్మాండంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. గతంలో నిమజ్జన సమయంలో ఎదురైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈసారి ముందస్తు ప్రణాళికతో పకడ్బందీ చర్యలు చేపట్టాలని అధికారులను కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, విద్యుత్‌, లైటింగ్‌, భారీ క్రేన్లు, పారిశుధ్యం, ట్రాఫిక్‌ నియంత్రణ తదితర సౌకర్యాలను ముందుగానే సిద్ధం చేయాలని సూచించారు. మానకొండూరు చెరువుతో పాటు చింతకుంట కాకతీయ కెనాల్‌, కొత్తపల్లి ప్రాంతాల్లో నిమజ్జనానికి అవసరమైన నీటిని విడుదల చేయాలని సాగునీటి శాఖ మంత్రి, ఉన్నతాధికారులను కోరినట్లు ఆయన చెప్పారు. నిమజ్జనోత్సవ సమయానికి అవసరమైన నీటిని అందుబాటులోకి తీసుకురావడానికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నామని తెలిపారు. ఇరిగేషన్ అధికారులు ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. కరీంనగర్‌లోని సుమారు 50 శాతం వినాయక విగ్రహాలు మానకొండూరు చెరువు వద్ద నిమజ్జనం కానున్నందున అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని చెప్పారు.
    1
    కరీంనగర్ లో ఈనెల 23న గణేష్ నిమజ్జనోత్సవం...ఏర్పాట్లను పరిశీలించిన కేంద్రమంత్రి బండి సంజయ్
కరీంనగర్ లో గణేష్ నిమజ్జనోత్సవానికి  పకడ్బందీగా విస్తృత ఏర్పాట్లు చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. మానకొండూరు, చింతకుంట, కొత్తపల్లిలో వినాయక నిమజ్జనానికి సంబంధించి ఏర్పాట్లను మేయర్ శ్రీనివాస్, కలెక్టర్ చిత్రా మిశ్రా సిపి గౌస్ ఆలం తో కలిసి బండి సంజయ్ పరిశీలించారు. కరీంనగర్‌ లో ఈ నెల 23న నిర్వహించనున్న వినాయక నిమజ్జనోత్సవాన్ని బ్రహ్మాండంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. గతంలో నిమజ్జన సమయంలో ఎదురైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈసారి ముందస్తు ప్రణాళికతో పకడ్బందీ చర్యలు చేపట్టాలని అధికారులను కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, విద్యుత్‌, లైటింగ్‌, భారీ క్రేన్లు, పారిశుధ్యం, ట్రాఫిక్‌ నియంత్రణ తదితర సౌకర్యాలను ముందుగానే సిద్ధం చేయాలని సూచించారు. మానకొండూరు చెరువుతో పాటు చింతకుంట కాకతీయ కెనాల్‌, కొత్తపల్లి ప్రాంతాల్లో నిమజ్జనానికి అవసరమైన నీటిని విడుదల చేయాలని సాగునీటి శాఖ మంత్రి, ఉన్నతాధికారులను కోరినట్లు ఆయన చెప్పారు. నిమజ్జనోత్సవ సమయానికి అవసరమైన నీటిని అందుబాటులోకి తీసుకురావడానికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నామని తెలిపారు. ఇరిగేషన్ అధికారులు ఇందుకు
అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు.
కరీంనగర్‌లోని సుమారు 50 శాతం వినాయక విగ్రహాలు మానకొండూరు చెరువు వద్ద నిమజ్జనం కానున్నందున అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని చెప్పారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.