Shuru
Apke Nagar Ki App…
*తప్పులుంటే ఆందోళన అవసరం లేదు: ఎమ్మెల్యే చదలవాడ* *నరసరావుపేట మండలం ఇక్కురు గ్రామంలో రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాసు పుస్తకాలను ఎమ్మెల్యే డా. చదలవాడ అరవిందబాబు రైతులకు పంపిణీ చేశారు. పాసు పుస్తకాలలో ఏవైనా తప్పులు ఉంటే సరిచేసుకునేందుకు మరో అవకాశం కల్పిస్తామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. భూమిపై రైతులకు సంపూర్ణ హక్కులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు.*
ఉంగరాల కార్తీక్
*తప్పులుంటే ఆందోళన అవసరం లేదు: ఎమ్మెల్యే చదలవాడ* *నరసరావుపేట మండలం ఇక్కురు గ్రామంలో రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాసు పుస్తకాలను ఎమ్మెల్యే డా. చదలవాడ అరవిందబాబు రైతులకు పంపిణీ చేశారు. పాసు పుస్తకాలలో ఏవైనా తప్పులు ఉంటే సరిచేసుకునేందుకు మరో అవకాశం కల్పిస్తామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. భూమిపై రైతులకు సంపూర్ణ హక్కులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు.*
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- బద్వేల్ పట్టణంలో మున్సిపల్ రెవెన్యూ సిబ్బందితో కలసి పన్ను వసూలు కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి హాజరయ్యారు. సత్వరమే పన్నులు చెల్లించి పట్టణాభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. టాప్ 100 నుండి బకాయిదారుల జాబితా బహిరంగ ప్రదేశాల్లో కూడళ్లలో త్వరలో ప్రదర్శన చేస్తామన్నారు. ఏళ్ల తరబడి బకాయిలు ఉన్న పన్ను ఎగవేతదారులు తక్షణమే పన్నులు చెల్లించకపోతే వ్యాపార సముదాయాలు సీజ్ చేస్తామన్నారు.1
- నల్గొండ జిల్లా కేంద్రంలోని సంజీవిని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన నాలుగు సంవత్సరాల బాబు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. డాక్టర్ పై దాడి చేయడంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు అసలు బాలుడు మరణానికి గల కారణాలను అడిగి తెలుసుకుని కుటుంబ సభ్యులకు తెలిపారు. డాక్టర్లపై దాడి చేయడం సరి కాదని ఏదైనా అనుమానం ఉంటే టెక్నికల్గా ప్రూఫ్ చేయాలని సూచించారు.1
- యాదాద్రి జిల్లాలో బిజెపి రాష్ట్ర నాయకుల పర్యటన.. మున్సిపల్ ఎన్నికల్లో పొత్తులు ఉండవు..1
- హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్‌ఐ శ్రీకాంత్ రూ.15 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు గురువారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇటీవల పేకాట రాయుళ్లను పట్టుకున్న కేసులో స్వాధీనం చేసుకున్న వాహనాలు, సెల్‌ఫోన్లు విడుదల చేయడానికి ఎస్‌ఐ శ్రీకాంత్ లంచం డిమాండ్ చేసినట్లు బాధితులు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు ముందస్తు ప్రణాళికతో వల పన్ని, డ్రైవర్ ద్వారా లంచం మొత్తాన్ని అందుకుంటున్న సమయంలో ఎస్‌ఐని పట్టుకున్నారు.1
- మేడారం జాతరకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే. చంద్ర శేఖర్ రావుకు ఆత్మీయ ఆహ్వానం పలికిన రాష్ట్ర మహిళా మంత్రులు.. రాష్ట్ర మహిళా మంత్రులకు.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆత్మీయ పలకరింపు.ఇంటికి వచ్చిన అతిథులకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సాదర ఆహ్వానం అతిధి మర్యాదలతో, పసుపు కుంకుమలు చీర, తాంబూలాలతో ఆడబిడ్డలకు సంప్రదాయ సత్కారం రాష్ట్ర దేవదాయ ధర్మదాయ మరియు అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ.. పంచాయతీ రాజ్ & మహిళా మరియు శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి సీతక్క గురువారం ఎర్రవెల్లి నివాసంలో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసారు. మరికొద్ది రోజుల్లో, మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం కానున్న సందర్భంగా, జాతరను సందర్శించాల్సిందిగా కోరుతూ కేసీఆర్ని ప్రభుత్వం తరఫున వారు ఆహ్వానించారు. ఈ సందర్భంగా, శాలువాకప్పి ఆహ్వాన పత్రికను అందజేసిన మంత్రులు కేసీఆర్ కి మేడారం ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా... తన ఇంటికి వచ్చిన ఆడబిడ్డలను ఆత్మీయంగా పలకరించి సాదరంగా ఆహ్వానించిన కేసీఆర్ శోభమ్మ దంపతులు, వారిని పసుపు కుంకుమ వస్త్రాలు, తాంబులాలతో సాంప్రదాయ పద్ధతిలో సత్కరించారు. కేసీఆర్ దంపతులు అందించిన తేనీటి విందు స్వీకరించిన మహిళా మంత్రులు, కాసేపు పరస్పర యోగక్షేమాలు, ఇష్టాగోష్టి అనంతరం మంత్రులు తిరుగు ప్రయాణం అయ్యారు. కాగా.. తొలుత, ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్న మహిళా మంత్రులకు మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, సాదర ఆహ్వానం పలికారు.1
- మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో పోలీసులు భారీగా దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను రికవరీ చేసి అభినందనలు అందుకుంటున్నారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోగొట్టుకున్న మరియు దొంగిలించబడిన మొబైల్ ఫోన్ల రికవరీలో పోలీసులు కీలక విజయం సాధించారు. సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రీ – CEIR పోర్టల్ సహాయంతో మొత్తం 1039 మొబైల్ ఫోన్లను రికవరీ చేయగా, వీటి విలువ రూ. 2 కోట్ల 8 లక్షలుగా అధికారులు తెలిపారు.పోలీస్ కమిషనర్ అవినాష్ మొహంతి ఐపిఎస్ ఆదేశాల మేరకు, సీసీఎస్ ఎల్బీ నగర్, మల్కాజిగిరి యూనిట్లు, ఐటి సెల్ కలిసి ప్రత్యేక బృందాలుగా పనిచేసి ఆరు నెలల వ్యవధిలో ఈ ఫోన్లను గుర్తించారు. ఎల్బీ నగర్ పరిధిలో 739, మల్కాజిగిరి పరిధిలో 300 మొబైల్ ఫోన్లు రికవరీ అయ్యాయి. గురువారం రోజు జనవరి 8న రికవరీ చేసిన ఫోన్లను అసలైన యజమానులకు అందజేయగా, బాధితులు మల్కాజిగిరి పోలీసుల పనితీరును ప్రశంసించారు. మొబైల్ పోయిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, దొంగిలించిన ఫోన్ల కొనుగోలు నేరమని పోలీసులు హెచ్చరించారు.2
- గుంటూరు/చుట్టుగుంట గుంటూరులోని చుట్టుగుంట VIP రోడ్డు గుంతలమయంగా మారి ప్రయాణికులకు నరకం చూపిస్తోంది. కేవలం 500 మీటర్లు మాత్రమే రోడ్డు వేసి అధికారులు వదిలేయడంతో, మిగిలిన భాగం అస్తవ్యస్తంగా తయారైందని వాహనదారులు మండిపడుతున్నారు. ఈ అసంపూర్తి పనుల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, అధికారులు తక్షణమే స్పందించి రహదారిని బాగు చేయాలని స్థానికులు కోరుతున్నారు1
- నల్గొండ జిల్లా కేంద్రంలోని సంజీవిని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన నాలుగు సంవత్సరాల బాబు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. డాక్టర్ పై దాడి చేయడంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు అసలు బాలుడు మరణానికి గల కారణాలను అడిగి తెలుసుకుని కుటుంబ సభ్యులకు తెలిపారు. డాక్టర్లపై దాడి చేయడం సరి కాదని ఏదైనా అనుమానం ఉంటే టెక్నికల్గా ప్రూఫ్ చేయాలని సూచించారు.1
- వరంగల్:వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రి ఏర్పాటు కోసం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ ఆస్పత్రి ఏర్పాటుతో వర్ధన్నపేటతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు వైద్య సదుపాయాలు సులభంగా అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ టెస్కాబ్ ఛైర్మన్ మార్నేని రవీందర్ రావు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1