logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

రైతుల సౌకర్యార్థం ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రానికి ప్రభుత్వ భూమి కేటాయించాలని కోరుతున్న రైతులు కరీంనగర్ జిల్లా గంగాధర మండలం చెర్లపల్లి గ్రామంలో రైతుల సౌకర్యార్థం ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రానికి ప్రభుత్వ భూమి కేటాయించాలని రైతులు కోరుతున్నారు. ఈ మేరకు గ్రామ సర్పంచ్ ఎట్టెపు కనుకయ్య ఆధ్వర్యంలో రైతులు ఎమ్మార్వో అంబటి రజితకు వినతి పత్రం అందజేశారు. గ్రామానికి చెందిన సుమారు నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిని ధాన్యం కొనుగోలు కేంద్రం కోసం కేటాయించాలని వారు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ధాన్యం ఆరబెట్టేందుకు అద్దె స్థలాలను ఉపయోగించాల్సి వస్తోందని, ప్రతి సారి తగినంత స్థలం లేక రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రైతుల సమస్యను ఎమ్మార్వోకు వివరించగా ఆమె సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నేరళ్ళ అయిలయ్య, వార్డు సభ్యులు మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు.

1 hr ago
user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
1 hr ago
37799ea7-3cbd-4ee1-bc79-1ea165c29dc7

రైతుల సౌకర్యార్థం ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రానికి ప్రభుత్వ భూమి కేటాయించాలని కోరుతున్న రైతులు కరీంనగర్ జిల్లా గంగాధర మండలం చెర్లపల్లి గ్రామంలో రైతుల సౌకర్యార్థం ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రానికి ప్రభుత్వ భూమి కేటాయించాలని రైతులు కోరుతున్నారు. ఈ మేరకు గ్రామ సర్పంచ్ ఎట్టెపు కనుకయ్య ఆధ్వర్యంలో రైతులు ఎమ్మార్వో అంబటి రజితకు వినతి పత్రం అందజేశారు. గ్రామానికి చెందిన సుమారు నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిని ధాన్యం కొనుగోలు కేంద్రం కోసం కేటాయించాలని వారు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ధాన్యం ఆరబెట్టేందుకు అద్దె స్థలాలను ఉపయోగించాల్సి వస్తోందని, ప్రతి సారి తగినంత స్థలం లేక రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రైతుల సమస్యను ఎమ్మార్వోకు వివరించగా ఆమె సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నేరళ్ళ అయిలయ్య, వార్డు సభ్యులు మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • జగిత్యాల జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. పార్టీ మారుతున్నారన్న ప్రచారంపై మీడియా ప్రశ్నలకు స్పందించిన ఆయన, కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలా లేదా అనే విషయంపై ఆలోచించాల్సిన పరిస్థితి ఉందన్నారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. సరైన సమయం, సందర్భం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుంటానని, ఏ నిర్ణయం తీసుకున్నా మీడియా ద్వారానే వెల్లడిస్తానని స్పష్టం చేశారు.
    1
    జగిత్యాల జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. పార్టీ మారుతున్నారన్న ప్రచారంపై మీడియా ప్రశ్నలకు స్పందించిన ఆయన, కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలా లేదా అనే విషయంపై ఆలోచించాల్సిన పరిస్థితి ఉందన్నారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. సరైన సమయం, సందర్భం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుంటానని, ఏ నిర్ణయం తీసుకున్నా మీడియా ద్వారానే వెల్లడిస్తానని స్పష్టం చేశారు.
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    3 hrs ago
  • యుద్ధ ప్రభావం ఎరువుల ఉత్పత్తి పై చూపుతుంది. గ్యాస్ కొరతతో రామగుండం ఎరువుల కర్మాగారంలో సగానికిపైగా ఎరువుల ఉత్పత్తి తగ్గిపోయింది. ఇప్పటికే యూరియా కొరతతో రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో యుద్ద ప్రభావంతో గ్యాస్ కొరత వల్ల ఎరువుల ఉత్పత్తి తగ్గడంతో రైతన్నలు ఆవేదనతో ఆందోళన చెందే పరిస్థితి ఏర్పడింది. గ్యాస్ ఆధారిత రామగుండం ఎరువుల కర్మాగారంలో రోజుకు 3850 టన్నుల ఎరువులు ఉత్పత్తి కావలసి ఉండగా ప్రస్తుతం సగానికి పైగా ఉత్పత్తి తగ్గింది. గ్యాస్ సప్లై లో అంతరాయం ఇలాగే కొనసాగితే ఎరువుల ఉత్పత్తి మరింత క్షీణించే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యామ్నాయంగా అత్యవసరాలకు ఎన్పీడీసీఎల్ విద్యుత్తును వినియోగంలోకి తెచ్చే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. గత ఐదు నెలలుగా ఎలాంటి అంతరాయాలు లేకుండా RFCL లో ఎరువుల ఉత్పత్తి కొనసాగుతుండగా గ్యాస్ కొరతతో ప్రస్తుతం ఉత్పత్తి నిలిచిపోయే పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయి. ఆర్ఎఫ్సీఎల్ లో రోజుకు 3850 టన్నుల ఎరువుల ఉత్పత్తి కావాల్సి ఉండగా అందులో సగం కూడా ప్రస్తుతం ఉత్పత్తి కావడం లేదు. వార్షిక లక్ష్యం 12 లక్షల 70 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు ఉత్పత్తి కాగా, ఫిబ్రవరి మాసాంతానికి 8 లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు ఉత్పత్తి అయింది. ఈనెలలో ఇప్పటి వరకు 1900 టన్నుల ఎరువులు ఉత్పత్తి అయింది. దేశవ్యాప్తంగా గ్యాస్ ఆధారిత ఎరువుల కర్మాగారాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.
    1
    యుద్ధ ప్రభావం ఎరువుల ఉత్పత్తి పై చూపుతుంది. గ్యాస్ కొరతతో రామగుండం ఎరువుల కర్మాగారంలో సగానికిపైగా ఎరువుల ఉత్పత్తి తగ్గిపోయింది. ఇప్పటికే యూరియా కొరతతో రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో యుద్ద ప్రభావంతో గ్యాస్ కొరత వల్ల ఎరువుల ఉత్పత్తి తగ్గడంతో రైతన్నలు ఆవేదనతో ఆందోళన చెందే పరిస్థితి ఏర్పడింది. గ్యాస్ ఆధారిత రామగుండం ఎరువుల కర్మాగారంలో రోజుకు 3850 టన్నుల ఎరువులు ఉత్పత్తి కావలసి ఉండగా ప్రస్తుతం సగానికి పైగా ఉత్పత్తి తగ్గింది. గ్యాస్ సప్లై లో అంతరాయం ఇలాగే కొనసాగితే ఎరువుల ఉత్పత్తి మరింత క్షీణించే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యామ్నాయంగా అత్యవసరాలకు ఎన్పీడీసీఎల్ విద్యుత్తును వినియోగంలోకి తెచ్చే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. గత ఐదు నెలలుగా ఎలాంటి అంతరాయాలు లేకుండా RFCL లో ఎరువుల ఉత్పత్తి కొనసాగుతుండగా గ్యాస్ కొరతతో ప్రస్తుతం ఉత్పత్తి నిలిచిపోయే పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయి. ఆర్ఎఫ్సీఎల్ లో రోజుకు 3850 టన్నుల ఎరువుల ఉత్పత్తి కావాల్సి ఉండగా అందులో సగం కూడా ప్రస్తుతం ఉత్పత్తి కావడం లేదు. వార్షిక లక్ష్యం 12 లక్షల 70 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు ఉత్పత్తి కాగా, ఫిబ్రవరి మాసాంతానికి 8 లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు ఉత్పత్తి అయింది. ఈనెలలో ఇప్పటి వరకు 1900 టన్నుల ఎరువులు ఉత్పత్తి అయింది.
దేశవ్యాప్తంగా గ్యాస్ ఆధారిత ఎరువుల కర్మాగారాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    56 min ago
  • తంగళ్లపల్లి మండలం 11వ ప్యాకేజీ కింద ఎల్ ఎం -6, ఎల్ ఎం -4 కెనాల్ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ తంగళ్లపల్లి మండల రైతులు ధర్నా చేపట్టారు. సిరిసిల్ల - తంగళ్లపల్లి మానేరు వాగు బ్రిడ్జిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ ధర్నాకు బిజెపి జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి, నాయకులు మద్దతు పలికి ధర్నాలో పాల్గొన్నారు. ఈ సంధర్బంగా బిజెపి జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి మాట్లాడారు.
    1
    తంగళ్లపల్లి మండలం 11వ ప్యాకేజీ కింద ఎల్ ఎం -6, ఎల్ ఎం -4 కెనాల్ పనులను వెంటనే   పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ తంగళ్లపల్లి మండల రైతులు ధర్నా చేపట్టారు. సిరిసిల్ల - తంగళ్లపల్లి మానేరు వాగు బ్రిడ్జిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ ధర్నాకు బిజెపి జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి, నాయకులు మద్దతు పలికి ధర్నాలో పాల్గొన్నారు. ఈ సంధర్బంగా బిజెపి జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి మాట్లాడారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    4 hrs ago
  • జన్నారం మండలంలోని తాళ్లపెట్ రేంజ్ పరిధిలోని కవ్వాల్ అభయారణ్యంలో అనేక పక్షులు కనువిందు చేస్తున్నాయని వన్యప్రాణి పరిశోధకుడు, హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ సమన్వయకర్త డా.వెంకట్ ఎనగందుల తెలిపారు. మంగళవారం ఆయన మల్యాల బీట్ లో ఓరియంటల్ గోల్డెన్ ఒరియోల్, స్ట్రీక్ త్రోటేడ్ వుడ్ పీకర్, కామన్ కింగ్ ఫిషర్, ఎల్లో త్రోటెడ్ ప్యారో, ఆరెంజ్ హేడెడ్ త్రష్, టికెట్స్ బ్లూ ఫ్లై క్యాచర్ లాంటి పక్షులను తన కెమేరాలలో బంధించారు.
    1
    జన్నారం మండలంలోని తాళ్లపెట్ రేంజ్ పరిధిలోని కవ్వాల్ అభయారణ్యంలో అనేక పక్షులు కనువిందు చేస్తున్నాయని వన్యప్రాణి పరిశోధకుడు, హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ సమన్వయకర్త 
డా.వెంకట్ ఎనగందుల తెలిపారు. మంగళవారం ఆయన మల్యాల బీట్ లో ఓరియంటల్ గోల్డెన్ ఒరియోల్, స్ట్రీక్ త్రోటేడ్ వుడ్ పీకర్, కామన్ కింగ్ ఫిషర్, ఎల్లో త్రోటెడ్ ప్యారో, ఆరెంజ్ హేడెడ్ త్రష్, టికెట్స్ బ్లూ ఫ్లై క్యాచర్ లాంటి పక్షులను తన కెమేరాలలో బంధించారు.
    user_Gourinatha p.g
    Gourinatha p.g
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    14 min ago
  • కొలనూరు ప్రాంతానికి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ (ROB) మంజూరు కావడం ఆ ప్రాంత ప్రజలకు ఆనందకరమైన విషయమని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ తెలిపారు. కొలనూరు, ఓదేలు ప్రాంతాల్లో రైల్వే గేటు కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన పేర్కొన్నారు. ​గతంలో రైల్వే అధికారులు కొలనూరును సందర్శించినప్పుడు స్వయంగా వారితో కలిసి ఆన్‌సైట్ పరిశీలన నిర్వహించి, ఓదేలు ప్రాంతానికి కూడా ఆర్ఓబీ అత్యవసరమని వివరించినట్లు చెప్పారు. మొదట రైల్వే శాఖ కొలనూరుకు మాత్రమే మంజూరు ఇచ్చి, ఓదేలుకు సాధ్యం కాదని తెలిపినా.. ప్రజల ప్రయోజనాల కోసం నిరంతరం ప్రయత్నాలు కొనసాగించినట్లు వివరించారు. ​ముఖ్య అంశాలు: ​నిరంతర పోరాటం: రైల్వే శాఖకు పలుమార్లు లేఖలు రాసి, రిప్రెజెంటేషన్లు ఇవ్వడం వల్ల కొలనూరు ఆర్ఓబీని రైల్వే శాఖ స్వంత ఖర్చులతో నిర్మించడానికి అంగీకరించింది. ​ఓదేలుపై హామీ: కొలనూరు తరహాలోనే ఓదేలు ప్రాంతానికి కూడా ఆర్ఓబీ మంజూరు అయ్యేలా కృషి చేస్తానని ఎంపీ స్పష్టం చేశారు. ​శాశ్వత పరిష్కారం: ఈ రెండు ప్రాంతాల్లో ప్రజల రవాణా ఇబ్బందులను శాశ్వతంగా పరిష్కరించడానికి కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు. ​కొలనూరు గ్రామ ప్రజలకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపిన వంశీకృష్ణ, త్వరలోనే పనులు ప్రారంభమై పూర్తి అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
    1
    కొలనూరు ప్రాంతానికి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ (ROB) మంజూరు కావడం ఆ ప్రాంత ప్రజలకు ఆనందకరమైన విషయమని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ తెలిపారు. కొలనూరు, ఓదేలు ప్రాంతాల్లో రైల్వే గేటు కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన పేర్కొన్నారు.
​గతంలో రైల్వే అధికారులు కొలనూరును సందర్శించినప్పుడు స్వయంగా వారితో కలిసి ఆన్‌సైట్ పరిశీలన నిర్వహించి, ఓదేలు ప్రాంతానికి కూడా ఆర్ఓబీ అత్యవసరమని వివరించినట్లు చెప్పారు. మొదట రైల్వే శాఖ కొలనూరుకు మాత్రమే మంజూరు ఇచ్చి, ఓదేలుకు సాధ్యం కాదని తెలిపినా.. ప్రజల ప్రయోజనాల కోసం నిరంతరం ప్రయత్నాలు కొనసాగించినట్లు వివరించారు.
​ముఖ్య అంశాలు:
​నిరంతర పోరాటం: రైల్వే శాఖకు పలుమార్లు లేఖలు రాసి, రిప్రెజెంటేషన్లు ఇవ్వడం వల్ల కొలనూరు ఆర్ఓబీని రైల్వే శాఖ స్వంత ఖర్చులతో నిర్మించడానికి అంగీకరించింది.
​ఓదేలుపై హామీ: కొలనూరు తరహాలోనే ఓదేలు ప్రాంతానికి కూడా ఆర్ఓబీ మంజూరు అయ్యేలా కృషి చేస్తానని ఎంపీ స్పష్టం చేశారు.
​శాశ్వత పరిష్కారం: ఈ రెండు ప్రాంతాల్లో ప్రజల రవాణా ఇబ్బందులను శాశ్వతంగా పరిష్కరించడానికి కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు.
​కొలనూరు గ్రామ ప్రజలకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపిన వంశీకృష్ణ, త్వరలోనే పనులు ప్రారంభమై పూర్తి అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
    user_తుడుం జితేందర్
    తుడుం జితేందర్
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    59 min ago
  • పత్రికా ప్రకటన తేది :10.03.2026 కామారెడ్డి జిల్లా మంగళవారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం మాచారెడ్డి మండలంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ప్రారంభించారు. కామారెడ్డి జిల్లాలో పశువుల ఆరోగ్య సంరక్షణ కోసం 8వ విడత గాలికుంటు వ్యాధి (FMD) నివారణ టీకా కార్యక్రమాన్ని ఆశిష్ సంగ్వాన్, IAS అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం మార్చి 10, 2026 నుండి ఏప్రిల్ 9, 2026 వరకు నెల రోజుల పాటు కొనసాగుతుంది. జిల్లాలోని 25 మండలాల్లో మొత్తం 1,42,400 ఆవులు , గేదెలకు టీకాలు వేయడం లక్ష్యంగా పెట్టబడింది. ఈ భారీ కార్యక్రమం కోసం పశుసంవర్ధక శాఖ 48 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఈ బృందాలు ఇంటింటికి వెళ్ళి ఏ ఒక్క పశువు మిగిలిపోకుండా టీకాలు వేస్తాయి. జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ, గాలికుంటు వ్యాధి (FMD) అనేది గాలి ద్వారా వేగంగా వ్యాపించే వైరల్ ఇన్ఫెక్షన్ అని, ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని వివరించారు. "టీకా వేయించడం అనేది కేవలం ఆరోగ్య చర్య మాత్రమే కాదు; ఇది రైతు జీవనోపాధికి ఒక రక్షణ కవచం వంటిది. గాలికుంటు వ్యాధి వల్ల పశువుల పాల దిగుబడి తగ్గడం, వంధ్యత్వం , బరువు తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ 8వ విడతలో అన్ని ఆవులు, గేదెలకు టీకాలు వేయించడం ద్వారా రైతులు ఆర్థిక నష్టాలను నివారించడం , పశువుల దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు" అని తెలిపారు. పశువైద్య బృందాలు గ్రామాలను సందర్శించే సమయంలో రైతులు , పశువుల యజమానులు పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ కోరారు. గ్రామాలకు బృందాలు వచ్చినప్పుడు పశువులను సిద్ధంగా ఉంచి, వాటిని కట్టి ఉంచాలని పశుసంవర్ధకశాఖ అభ్యర్థించింది. ఈ కార్యక్రమానికి జిల్లా పశు వైద్య ,పశుసంవర్ధక అధికారి, కామారెడ్డి నేరుగా పర్యవేక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమం లో సంబంధిత, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
    1
    పత్రికా ప్రకటన
తేది :10.03.2026
కామారెడ్డి జిల్లా
మంగళవారం
ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం మాచారెడ్డి మండలంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్  సాంగ్వాన్  ప్రారంభించారు.
కామారెడ్డి జిల్లాలో పశువుల ఆరోగ్య సంరక్షణ కోసం 8వ విడత గాలికుంటు వ్యాధి (FMD) నివారణ టీకా కార్యక్రమాన్ని  ఆశిష్ సంగ్వాన్, IAS అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం మార్చి 10, 2026 నుండి ఏప్రిల్ 9, 2026 వరకు నెల రోజుల పాటు కొనసాగుతుంది. జిల్లాలోని 25 మండలాల్లో మొత్తం 1,42,400 ఆవులు ,  గేదెలకు టీకాలు వేయడం లక్ష్యంగా పెట్టబడింది. ఈ భారీ కార్యక్రమం కోసం పశుసంవర్ధక శాఖ 48 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఈ బృందాలు ఇంటింటికి వెళ్ళి ఏ ఒక్క పశువు మిగిలిపోకుండా టీకాలు వేస్తాయి.
జిల్లా కలెక్టర్  ఆశిష్ సంగ్వాన్  మాట్లాడుతూ, గాలికుంటు వ్యాధి (FMD) అనేది గాలి ద్వారా వేగంగా వ్యాపించే వైరల్ ఇన్ఫెక్షన్ అని, ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని వివరించారు. "టీకా వేయించడం అనేది కేవలం ఆరోగ్య చర్య మాత్రమే కాదు; ఇది రైతు జీవనోపాధికి ఒక రక్షణ కవచం వంటిది. గాలికుంటు వ్యాధి వల్ల పశువుల పాల దిగుబడి తగ్గడం, వంధ్యత్వం ,  బరువు తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ 8వ విడతలో అన్ని ఆవులు, గేదెలకు టీకాలు వేయించడం ద్వారా రైతులు ఆర్థిక నష్టాలను నివారించడం , పశువుల దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు" అని తెలిపారు.
పశువైద్య బృందాలు గ్రామాలను సందర్శించే సమయంలో రైతులు ,  పశువుల యజమానులు పూర్తి సహకారం అందించాలని కలెక్టర్  కోరారు. గ్రామాలకు బృందాలు వచ్చినప్పుడు పశువులను సిద్ధంగా ఉంచి, వాటిని కట్టి ఉంచాలని పశుసంవర్ధకశాఖ అభ్యర్థించింది. ఈ కార్యక్రమానికి జిల్లా పశు వైద్య ,పశుసంవర్ధక అధికారి, కామారెడ్డి నేరుగా పర్యవేక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమం లో సంబంధిత, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    1 hr ago
  • వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణానికి చెందిన వడ్లకొండ శ్రీనివాస్–సరిత దంపతుల కుమారుడు సాయి చరణ్ రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. కొడుకు జ్ఞాపకాలను శాశ్వతంగా నిలుపుకోవాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు అతని రూపంలో నిలువెత్తు విగ్రహాన్ని తయారు చేయించి ఇంట్లో ప్రతిష్టించారు. నేడు కుమారుడి జన్మదినం సందర్భంగా ఆ విగ్రహానికి కొత్త రంగులు వేసి పూలమాలలతో అలంకరించి కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలను భావోద్వేగభరితంగా నిర్వహించారు. కుమారుడు తమతోనే ఉన్నాడన్న భావనతో ప్రతి ఏడాది ఇలాంటి వేడుకలు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
    1
    వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణానికి చెందిన వడ్లకొండ శ్రీనివాస్–సరిత దంపతుల కుమారుడు సాయి చరణ్ రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. కొడుకు జ్ఞాపకాలను శాశ్వతంగా నిలుపుకోవాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు అతని రూపంలో నిలువెత్తు విగ్రహాన్ని తయారు చేయించి ఇంట్లో ప్రతిష్టించారు.
నేడు కుమారుడి జన్మదినం సందర్భంగా ఆ విగ్రహానికి కొత్త రంగులు వేసి పూలమాలలతో అలంకరించి కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలను భావోద్వేగభరితంగా నిర్వహించారు. కుమారుడు తమతోనే ఉన్నాడన్న భావనతో ప్రతి ఏడాది ఇలాంటి వేడుకలు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    2 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. కాలేశ్వరం 11/6 ప్యాకేజీ పనులు నిలిచిపోవడంతో పంటలకు నీరు అందక ఎండిపోతున్నాయని ఆరోపిస్తూ రైతులు సిరిసిల్ల–సిద్దిపేట ప్రధాన రహదారిపై మానేరు వంతెన వద్ద బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో పలు గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 15 గ్రామాలకు సంబంధించిన దాదాపు 9500 ఎకరాలకు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే కాలేశ్వరం పనులు పూర్తి చేసి నీటి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రైతులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా మానేరు వంతెనపై కొంతసేపు వాహన రాకపోకలు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం
    3
    రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. కాలేశ్వరం 11/6 ప్యాకేజీ పనులు నిలిచిపోవడంతో పంటలకు నీరు అందక ఎండిపోతున్నాయని ఆరోపిస్తూ రైతులు సిరిసిల్ల–సిద్దిపేట ప్రధాన రహదారిపై మానేరు వంతెన వద్ద బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో పలు గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 15 గ్రామాలకు సంబంధించిన దాదాపు 9500 ఎకరాలకు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే కాలేశ్వరం పనులు పూర్తి చేసి నీటి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రైతులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా మానేరు వంతెనపై కొంతసేపు వాహన రాకపోకలు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.