Shuru
Apke Nagar Ki App…
బీసీ అభ్యర్థికి మద్దతు జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామ పంచాయతీ ఎన్నికల బరిలో ఉన్న సులువ శైలజ జనార్దన్ కు బీసీ సంఘాలు మద్దతు ప్రకటిస్తున్నాయని బీసీ కులాల ఐక్యవేదిక ఉద్యమ పోరాట సమితి కరీంనగర్ కన్వీనర్ కాసెట్టి లక్ష్మణ్ అన్నారు. మంగళవారం జన్నారంలో బీసీ సంఘాల నాయకుల సమావేశం నిర్వహించారు. బీసీ బిడ్డగా ఉన్న శైలజ జనార్ధన్ అభివృద్ధి లక్ష్యంగా ఎన్నికల బరిలో ఉన్నారని తెలిపారు.ఆమెకు మద్దతుగా నిలిచి గెలిపించాలని ఆయన కోరారు.
P.G.Murthy
బీసీ అభ్యర్థికి మద్దతు జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామ పంచాయతీ ఎన్నికల బరిలో ఉన్న సులువ శైలజ జనార్దన్ కు బీసీ సంఘాలు మద్దతు ప్రకటిస్తున్నాయని బీసీ కులాల ఐక్యవేదిక ఉద్యమ పోరాట సమితి కరీంనగర్ కన్వీనర్ కాసెట్టి లక్ష్మణ్ అన్నారు. మంగళవారం జన్నారంలో బీసీ సంఘాల నాయకుల సమావేశం నిర్వహించారు. బీసీ బిడ్డగా ఉన్న శైలజ జనార్ధన్ అభివృద్ధి లక్ష్యంగా ఎన్నికల బరిలో ఉన్నారని తెలిపారు.ఆమెకు మద్దతుగా నిలిచి గెలిపించాలని ఆయన కోరారు.
More news from Medchal Malkajgiri and nearby areas
- మలి దశ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం తెలంగాణ ఉద్యమకారిణి బెల్లి లలిత యాదవ్ అక్క గారి ఆశయాలు సాధిస్తాం జోహార్ బెల్లి లలిత యాదవ్ అక్క జోహార్ జోహార్1
- నరసన్నపేట: కాలువలలో కదలని మురుగు.. దోమల వ్యాప్తి నరసన్నపేట పట్టణంలో ప్రధాన రహదారిపై ఇరువైపులా మురుగు కాలువలు నిండిపోయి దుర్గంధం వెదజల్లుతున్నాయని, దీనివల్ల దోమలు విపరీతంగా పెరిగిపోయి ప్రజలు రోగాల బారిన పడుతున్నారని స్థానికులు తెలిపారు. మహిళా మార్ట్ నుండి పాత బస్టాండు వరకు ఈ దుస్థితి నెలకొందని, మురుగు బయటకు వెళ్లేందుకు తగిన మార్గం చూపాలని వారు కోరుతున్నారు. లేనిపక్షంలో ఆరోగ్య సమస్యలు తప్పవని వాపోతున్నారు.1
- Post by User85021
- అంబేద్కర్ భవన్ స్థలాన్ని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని ధర్నా. గంగవరం డిసెంబర్ 10( ప్రజా ప్రతిభ) గంగవరం మండలం అంబేద్కర్ భవనం స్థలాన్ని ఆక్రమిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని మండలంలోని దళిత నాయకులు తహసిల్దార్ కార్యాలయం ముందు బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత నాయకులు డి.వి. మునిరత్నం, ఆర్. రెడ్డప్ప, ఈశ్వర్, రవి కుమార్, రెడ్డి ప్రసాద్, మహేష్,వేళాయుధం,మోహన్ బాబు, డేవిడ్, మాట్లాడుతూ గతంలో ప్రభుత్వం దళిత నాయకుల విజ్ఞప్తి మేరకు ఎంపీడీవో కార్యాలయం ముందు సుమారు 10 సెంట్లు స్థలాన్ని కేటాయించి అందులో పక్కా భవనం కోసం నిధులు మంజూరు చేశారన్నారు. అప్పటినుంచి అంబేద్కర్ జయంతి వర్ధంతిలు నిర్వహించుకునే వారమని తెలిపారు. ఖాళీగా ఉన్న స్థలంపై కన్నేసిన శ్రీలంక కాలనీవాసులు గుడి పేరుతో అంబేద్కర్ భావన స్థలాన్ని ఆక్రమించారని పేర్కొన్నారు. స్థల ఆక్రమణ పై పలుమార్లు వారిని అడిగిన వినిపించుకోలేదని కాదని ప్రశ్నిస్తే దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. శరణార్థులకు ఎస్సీ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడానికి ఎన్నో ఏళ్ల నుండి ప్రభుత్వాలు, జిల్లా కలెక్టర్లు సైతం జీవో లేదని ముక్తకంఠముతో తేల్చి చెప్పినా గత ప్రభుత్వంలో చట్టాలను ఉల్లంఘిస్తూ దొడ్డిదారుల్లో శరణార్థులకు ఏ ప్రాతిపదిక పైన ఎస్సీ ధ్రువీకరణ పత్రం ఇచ్చారని నిలదీశారు. ధ్రువీకరణ మంజూరు చేసిన అధికారి ఏ మండలంలో విధులు నిర్వహిస్తున్నా, లేక పదవి విరమణ చేసినా అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాయకులు ఓబుల్ రాజు, ప్రహ్లాద, కవీశ్వర్, శివాడి గోవిందు, కత్తిశీను మాట్లాడుతూ అంబేద్కర్ భావన స్థలాన్ని కాపాడవలసిన బాధ్యత అధికారులుదేనని అలాంటివారు బాధ్యత రాహిత్యంగా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించారు . అదేవిధంగా మదనపల్లి రోడ్డు నందు ప్రభుత్వ డ్రైనేజీలను సైతం పంచాయతీ అనుమతులు లేకుండా ఆక్రమించుకొని వ్యాపారం చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి అంబేద్కర్ భవన స్థలాన్ని ఆక్రమణదారుల నుండి కాపాడాలని డిమాండ్ చేశారు. అనంతరం తాసిల్దార్ కు, ఆర్డీవో కు మెమోరండం సమర్పించారు. ఈ కార్యక్రమంలో 100 మంది దళిత నాయకులు పాల్గొన్నారు.1
- గ్రామాలకు తరలి వెళ్తున్న ఎన్నికల సిబ్బంది లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని లక్షెట్టిపేట, జన్నారం, దండేపల్లి మండలాల్లోని అన్ని గ్రామాలలో నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికల విధులను నిర్వహించేందుకు అధికారులు, సిబ్బంది వారికి కేటాయించిన గ్రామాలకు తరలి వెళ్తున్నారు. బుధవారం సాయంత్రం వరకు వారికి అధికారులు ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేశారు. అనంతరం ఎన్నికల సామాగ్రితో అధికారులు సిబ్బంది ఎన్నికల సామాగ్రిని తీసుకొని వారి కోసం సిద్ధంగా ఉంచిన ప్రత్యేక బస్సులలో నిర్దేశిత గ్రామాలకు బయలుదేరి వెళుతున్నారు. గురువారం ఉదయం ఏడు నుండి మధ్యాహ్నం 1:00 వరకు ఎన్నికల పోలింగ్ జరగనుండగా, మధ్యాహ్నం నుండి కౌంటింగ్ ప్రారంభం కానుంది. రేపే సర్పంచ్, ఉప సర్పంచ్ ఫలితాలు వెల్లడి కానున్నాయని అధికారులు తెలిపారు. ఓటర్లు కూడా తమ గ్రామానికి సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను ఎన్నుకునేందుకు సిద్ధమయ్యారు. చాలాచోట్ల బలమైన అభ్యర్థులు బరిలో ఉండడంతో పోటీ ఆసక్తికరంగా మారింది.1
- భారత్ మాత కి జై 🇮🇳1
- భారత్ మాత కి జై 🇮🇳 బిజెపి మహిళా నాయకురాలు మౌనిక సుంకర హైకోర్టు అడ్వకేట్ గారు1