*కాప్రా, నాచారం సర్కిల్స్‌లో చెత్త సమస్యలకు వాట్సాప్ సేవ* _ఫోటో పంపితే వెంటనే స్పందన – ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మున్సిపల్ చర్యలు కాప్రా, ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా కాప్రా సర్కిల్–7 మరియు నాచారం సర్కిల్–8 పరిధిలోని ప్రజలకు మున్సిపల్ అధికారులు ముఖ్య గమనిక జారీ చేశారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం, ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడం లక్ష్యంగా ప్రత్యేక వాట్సాప్ సేవను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. ప్రజలు చెత్త పేరుకుపోవడం, గ్రీన్ వేస్ట్, పొంగిపొర్లుతున్న చెత్త డబ్బాలు లేదా జివిపి (వల్నరబుల్ పాయింట్స్) వద్ద ఉన్న చెత్త సమస్యలను సులభంగా రిపోర్ట్ చేయవచ్చు. ఇందుకోసం 9063421300 నంబర్‌కు వాట్సాప్ ద్వారా ఫోటోలు మరియు సమస్య ఉన్న ప్రాంతం యొక్క లొకేషన్ పంపితే సంబంధిత సిబ్బంది వెంటనే స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని అధికారులు తెలిపారు.ఈ విధానం ద్వారా మున్సిపల్ కార్యాలయాలను సందర్శించాల్సిన అవసరం లేకుండా ప్రజలు సులభంగా ఫిర్యాదులు తెలియజేయవచ్చని పేర్కొన్నారు. త్వరిత ప్రతిస్పందనతో పాటు సరళమైన ప్రక్రియ ద్వారా నగర పరిశుభ్రతను మెరుగుపరచడం లక్ష్యమని వివరించారు.ప్రజలు ఈ సేవను వినియోగించి నగరాన్ని శుభ్రంగా ఉంచడంలో సహకరించాలని కోరారు. మరిన్ని వివరాలకు సూచించారు.

- సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం శ్రీగిరిపల్లి గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.శ్రీగిరిపల్లి గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిమ్మి రెడ్డి, నెంటూరి కుమార్ హాజరయ్యారు. ఈ కార్యక్రమం ఉప సర్పంచ్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా గ్రామ ఉపసర్పంచ్ పాండవుల బాలరాజ్ ముదిరాజ్, మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ ప్రజల్లోకి తీసుకువెళ్తూ ప్రజల్లో చైతన్యం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణ ముదిరాజ్, వెంకట్ ముదిరాజ్, భాస్కర్ యాదవ్, హరీష్ గౌడ్, పెద్దోళ్ళ బాలయ్య, ఏముల రాములు, పొట్ట మల్లేష్, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు దాసరి వెంకటేష్, చిత్ర ఆర్ట్స్ నర్సింలు. పొట్ట రాజు చేబర్తి వెంకటేష్ పొట్ట కరుణాకర్ పాపయ్య, తిమ్మకపల్లి రవి, తదితరులు పాల్గొన్నారు.అలాగే శ్రీగిరిపల్లి గ్రామ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు4
- Post by Tagore3
- ఈనెల 20 నుండి సంగారెడ్డి జిల్లాలో ఓపెన్ స్కూల్ పరీక్షలు1
- కౌడిపల్లి నివాసిస్తుడు రెడ్డి నర్సింహులు అయినా పూరి గుడిసె నిప్పు అంటుకొని మొత్తం గుడిసె దగ్ధం అయిపోయింది. అగ్నిమాపక సిబ్బంది హుటా హుటిన వచ్చి మంటలు చిల్లరేగకుండా ఆపివేయడం జరిగింది. అయినప్పటికీ పూరి గుడిసె మొత్తం దగ్ధమైపోయింది.2
- ఇందిరమ్మ ఇండ్ల మంజూరి పత్రాలను అందజేత పేదోడి సొంతింటి కల నెరవేర్చేందుకే ఇందిరమ్మ ఇళ్ల పథకం తెచ్చామని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. చిన్నశంకరంపేట రైతు వేదికలో శనివారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 88 మంది లబ్ధిదారులకు ఆయన ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. అర్హులైన ప్రతి పేదవాడికి ప్రభుత్వం అండగా ఉంటుందని, సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.*సొంతింటి కల నెరవేర్చేందుకే ఇందిరమ్మ ఇళ్ల మంజూరు* ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇచ్చేందుకు గాను ప్రభుత్వం ప్రజలకు అండగా నిలిచిందనిమెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. శనివారం చిన్న శంకరంపేట రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 88 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే రోహిత్ రావు అందజేశారు. అలాగే నార్సింగ్ మండలం కళ్యాణ లక్ష్మి చెక్కులు20, చిన్నశంకరంపేట మండలంకు సీఎంఆర్ ఎఫ్ చెక్కులు 50 మందికి, నార్సింగి మండలంకు చెందిన 20 కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రతి ఇల్లు లేని పేదవాడికి ఇల్లు నిర్మించుకునే విధంగా కృషి చేస్తుందని అన్నారు. అర్హత కలిగిన వారికి ఎవరికైనా ఇల్లు రానిక రాలేక పోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, విడుతల వారీగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేసేందుకు గాను ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పేదలకు సొంతింటి దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఎమ్మెల్యే రోహిత్ రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.1
- వికారాబాద్ : వికారాబాద్ మున్సిపల్ కార్యాలయంలో శనివారం చైర్పర్సన్ గడ్డం అనన్య అధ్యక్షతన మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి వైస్ చైర్పర్సన్ అర్ధ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో 14 అంశాలతో కూడిన ఎజెండాను కౌన్సిల్ సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ వేసవికాలం దృష్ట్యా పురపాలక సంఘ పరిధిలో ఎక్కడ కూడా నీటి సరఫరా సమస్యలు లేకుండా చూడాలని వీధి దీపాల నిర్వహణ సక్రమంగా జరిగేలా చూడాలని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యలను సరిగా చేయాలని అధికారులకు ఆదేశించారు.1
- లోక రక్షకుడు యేసుక్రీస్తు పునరుత్థాన సందేశాన్ని చాటి చెబుతూ మెదక్ లో 'రన్ ఫర్ జీసస్' 2026 ర్యాలీ ని సిఎస్ఐ సంఘం ఆద్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ బీటర్ ఇంచార్జీ శాంతయ్య ప్రార్థన చేసి ర్యాలీ ప్రారంభించారు. ఈ ర్యాలీ చర్చ్ నుంచి పట్టణ పుర వీధుల గుండా సాగింది. ర్యాలీ లో యువతి, యువకులు, చిన్నారులు యేసు క్రీస్తు పునరుద్ధన కోసం నినాదాలు చేస్తూ యేసు క్రీస్తు పాటలకు నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా ప్రెస్ బీటర్ ఇంచార్జీ శాంతయ్య మాట్లాడుతూ ఈస్టర్ పండుగకు ముందు వచ్చే మహా శనివారం రోజు యేసు క్రీస్తు పునరుద్ధన కోసం రన్ ఫర్ జీసస్ ర్యాలీ జరుపుతారని అన్నారు. ఈ ర్యాలీ ప్రతి సంవత్సరం సీఎస్ఐ సంఘం ఆధ్వర్యంలో అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో చిన్న, పెద్ద తేడా లేకుండా లోక రక్షకుడి తిరిగి రాకడ కోసం చేసుకోనున్న ర్యాలీ గా చేసుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గంట సంపత్, చర్చ్ కమిటీ సభ్యులు, గురువులు పాల్గొన్నారు.1
- Post by Tagore1