Shuru
Apke Nagar Ki App…
వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం అనన్య ఆధ్వర్యంలో శనివారం కౌన్సిల్ సాధారణ సమావేశం. వికారాబాద్ : వికారాబాద్ మున్సిపల్ కార్యాలయంలో శనివారం చైర్పర్సన్ గడ్డం అనన్య అధ్యక్షతన మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి వైస్ చైర్పర్సన్ అర్ధ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో 14 అంశాలతో కూడిన ఎజెండాను కౌన్సిల్ సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ వేసవికాలం దృష్ట్యా పురపాలక సంఘ పరిధిలో ఎక్కడ కూడా నీటి సరఫరా సమస్యలు లేకుండా చూడాలని వీధి దీపాల నిర్వహణ సక్రమంగా జరిగేలా చూడాలని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యలను సరిగా చేయాలని అధికారులకు ఆదేశించారు.
Thanmai Sri
వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం అనన్య ఆధ్వర్యంలో శనివారం కౌన్సిల్ సాధారణ సమావేశం. వికారాబాద్ : వికారాబాద్ మున్సిపల్ కార్యాలయంలో శనివారం చైర్పర్సన్ గడ్డం అనన్య అధ్యక్షతన మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి వైస్ చైర్పర్సన్ అర్ధ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో 14 అంశాలతో కూడిన ఎజెండాను కౌన్సిల్ సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ వేసవికాలం దృష్ట్యా పురపాలక సంఘ పరిధిలో ఎక్కడ కూడా నీటి సరఫరా సమస్యలు లేకుండా చూడాలని వీధి దీపాల నిర్వహణ సక్రమంగా జరిగేలా చూడాలని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యలను సరిగా చేయాలని అధికారులకు ఆదేశించారు.
More news from తెలంగాణ and nearby areas
- Post by Tagore3
- ధరూర్: మండలంలోని గుడ్డం దొడ్డి రిజర్వాయర్ కెనాల్ ద్వారా పంటలకు సాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టాలని రైతులు కోరారు. ప్రస్తుతం వరి పంట చివరి దశలో ఉన్నప్పటికీ వేరుశనగ సాగు చేసేందుకు రైతులను దుక్కులు తడుపుకునేందుకు, మామిడి, కూరగాయల పంటలు సాగుకు నీరు ఎంతగానో అవసరం ఉంది. ఇది ఇలా ఉంటే చివరి ఆయకట్టుకు మాత్రం చుక్కనీరు కోరడం లేదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేశారు.1
- శనివారం కామారెడ్డి జిల్లా మదనూరు మండలంలోని సుల్తాన్‌పేట గ్రామాన్ని బలమైన గాలులు, వడగళ్ల వాన తాకాయి. దీంతో వరి, మొక్కజొన్న, జొన్న, ఇతర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లడంతో మండల రైతులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నష్టాన్ని పరిష్కరిస్తుందా?1
- *పేకాట స్థావరంపై CCS టీం మెరుపుదాడి – నలుగురు అరెస్ట్* నేడు *గౌరవనీయులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, IPS.,* గారి ఆదేశాల మేరకు CCS ఏసీపీ మస్తాన్ అలీ గారి ఆధ్వర్యంలో CCS సిబ్బంది పేకాట స్థావరంపై మెరుపుదాడి నిర్వహించారు. జక్రాన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కలిగొట్ గ్రామ శివారులో నడుస్తున్న పేకాట స్థావరంపై నేడు దాడి చేసి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి నాలుగు వాహనాలు, మూడు సెల్‌ఫోన్లు మరియు రూ.10,940 నగదు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వ్యక్తులను మరియు స్వాధీనం చేసుకున్న వస్తువులను తదుపరి చట్టపరమైన చర్యల కోసం జక్రాన్‌పల్లి పోలీస్ స్టేషన్ SHO గారికి అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.1
- నల్గొండ: నల్గొండ నుంచి దేవరకొండ వెళ్లే మార్గంలో రోడ్డు పక్కన ఉన్న ఎండిన చెట్లు వాహనదారులకు, పాదచారులకు ప్రమాదకరంగా మారాయి. ఈ మార్గంలో నిత్యం ప్రజలు పెద్ద ఎత్తున ప్రయాణిస్తుంటారు. ఎండిన చెట్ల కొమ్మలు విరిగి పడతాయనే భయంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కతాల్ గూడ నుంచి నల్గొండ వైపు వెళ్లే మార్గంలో కూడా ఇలాంటి ఎండిన చెట్లు ఉన్నాయని, ఏదైనా ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించి వాడిని తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ సమస్యపై పడితేనే.. పట్టించుకుంటారా..! అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.1
- నల్లగొండ బ్రేకింగ్: నల్లగొండ బస్టాండ్ సమీపంలో అత్యాధునిక సదుపాయాలతో *సాయి నైసా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం..* ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన రాష్ట్రమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి... మంత్రి మాట్లాడుతూ.. నల్లగొండ పట్టణం వైద్యరంగంలో ముందంజలో నిలవాలని ఆకాంక్ష... లాభాపేక్ష కాకుండా మానవతా దృక్పథంతో సేవలు అందించాలి... పేదలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన వైద్యం అందించాలి... డబ్బు కోసం కాకుండా మనశ్శాంతి కోసం వైద్యం చేయాలి.. అంటూ డాక్టర్లకు సూచన... అత్యాధునిక సదుపాయాలతో ఆస్పత్రి ఏర్పాటుపై హర్షం వ్యక్తం... అత్యవసర వైద్యం 24 గంటలు హాస్పిటల్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి... గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కూడా సేవలు విస్తరించాలి... ప్రభుత్వం కూడా వైద్య రంగ అభివృద్ధికి పూర్తి మద్దతు ఇస్తుంది... కార్యక్రమంలో మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి,కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి,మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి,కార్పొరేటర్ అబ్బగోని కవిత రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు..1
- కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన గ్రామ సేవకుల సమావేశానికి సిఐటియు జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ హాజరై మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో తాత ముత్తాతల నుండి వంశపారపర్యంగా సుంకరీ పని నీరడు పని చేసిన ఎస్సీ ఎస్టీ బీసీ కార్మికులను యధావిధిగా పనుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు గ్రామాలలో గ్రామ సెక్రెటరీ కానీ జీపీఓ కానీ ఏ అధికారులు ఉన్నా రైతులకు పంట నీరు వదలడానికి నీరడీ పని వాళ్లు అధికారులకు భూముల సర్వేలలో కానీ గ్రామంలో ఎలాంటి అవసరాలు వచ్చినా సుంకరి పని వాళ్లు కచ్చితంగా అవసరం ఉంటుందని రాష్ట్ర ప్రజల కామారెడ్డి జిల్లా ప్రజల రైతుల అవసరాలు పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా వంతుల వారి గ్రామ సేవకును అందరినీ కూడా మళ్లీ గ్రామాలలో ఏదైతే వంతుల వారి పని సుంకర పని చేస్తూ ప్రజలకు రైతులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి సహకరించే సుంకర పని వారికి గతంలో ఏదైతే వంతుల వారి సిస్టం ఉండెనో అదే పద్ధతిలో మళ్లీ వారి ఉద్యోగాలు వారికి ఇవ్వాలని సిఐటియుగా ఈ సమావేశం డిమాండ్ చేస్తున్నది అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్య పైన ఆలోచించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సోమవారం నాడు జిల్లా కలెక్టర్ గారి ద్వారా మెమోరాండం ఇవ్వాలని సమావేశం నిర్ణయించింది కావున కామారెడ్డి జిల్లాలోని వంతుల వారి సుంకరి పనివారు నీరడీ పనివారు అందరూ కూడా సోమవారము ఉదయం 10 గంటల వరకు కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజ్వీర్, నేరడి సాయిలు, అనిల్, గోపి, సాయిలు మరియు గ్రామ సేవకులు పాల్గొన్నారు1
- Post by Tagore1
- ఈ నెల 6వ తేదీన బాసర పుణ్యక్షేత్రాన్ని సందర్శించనున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ *అనుముల రేవంత్ రెడ్డి *గారి పర్యటన ఏర్పాట్లను సమీక్షించేందుకు, రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు మరియు వివేక్ వెంకటస్వామి గారు నేడు బాసరకు విచ్చేశారు.ఈ సమీక్షా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ అభిలాష అభినవ్ గారు, బాసర సర్పంచ్ శ్రీ తీగల వెంకటేష్ గౌడ్ గారు మరియు EX MLA జి.విఠల్ రెడ్డి గారు EX సర్పంచ్ దయల లక్ష్మణ్ రావు గారు EX సర్పంచ్ కిర్గుల్ శ్రీ పెద్దకొండూరి సుధాకర్ రెడ్డి గారు ఉప సర్పంచ్ సయ్యద్ అలీ గారు బాసర గ్రామ టీమ్ విఠల్ రెడ్డి గారు కాంగ్రెస్ కార్యకర్తలు ఇతర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.ముఖ్యమంత్రి గారి పర్యటనకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భద్రత మరియు ఇతర ఏర్పాట్లపై వారు క్షేత్రస్థాయిలో చర్చించారు.1