ఎస్‌ఐఆర్ హియరింగ్ ప్రక్రియను పరిశీలించిన అదనపు కలెక్టర్ విక్టర్, ఎస్‌ఐఆర్ హియరింగ్ ప్రక్రియను పరిశీలించిన అదనపు కలెక్టర్ విక్టర్, అర్హులైన ఓటర్ల వివరాలు సక్రమంగా నమోదు అయ్యేలా చర్యలు చేపట్టాలి పిట్లం: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా పిట్లం మండలంలోని బొల్లక్‌పల్లి, మద్దెల చెరువు గ్రామాల్లో నిర్వహిస్తున్న ఎస్‌ఐఆర్ హియరింగ్ ప్రక్రియను జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్, శుక్రవారం పరిశీలించారు. పిట్లం మండల తహసీల్దార్, పీడీసీ అధికారితో కలిసి ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన హియరింగ్ కేంద్రాలను అదనపు కలెక్టర్ సందర్శించి, హియరింగ్ ప్రక్రియ నిర్వహణ తీరును పరిశీలించారు. నోటీసులు అందుకున్న ఓటర్ల నుంచి సమర్పిస్తున్న ధ్రువపత్రాలు, ఆధారాలను పరిశీలించి, నిబంధనల ప్రకారం ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ విక్టర్ మాట్లాడుతూ, ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా అర్హులైన ప్రతి ఓటరు పేరు ఓటరు జాబితాలో ఉండేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. హియరింగ్‌కు హాజరయ్యే ఓటర్లకు అవసరమైన సమాచారం, మార్గదర్శకాలను అందించి, వారి అభ్యంతరాలు, వివరణలను నిబంధనల మేరకు నమోదు చేయాలని సూచించారు. హియరింగ్ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ డిప్యూటీ కలెక్టర్ రవితేజ,పిట్లం మండల తహసీల్దార్, పీడీసీ అధికారి, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్‌ఐఆర్ హియరింగ్ ప్రక్రియను పరిశీలించిన అదనపు కలెక్టర్ విక్టర్, ఎస్‌ఐఆర్ హియరింగ్ ప్రక్రియను పరిశీలించిన అదనపు కలెక్టర్ విక్టర్, అర్హులైన ఓటర్ల వివరాలు సక్రమంగా నమోదు అయ్యేలా చర్యలు చేపట్టాలి పిట్లం: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా పిట్లం మండలంలోని బొల్లక్‌పల్లి, మద్దెల చెరువు గ్రామాల్లో నిర్వహిస్తున్న ఎస్‌ఐఆర్ హియరింగ్ ప్రక్రియను జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్, శుక్రవారం పరిశీలించారు. పిట్లం మండల తహసీల్దార్, పీడీసీ అధికారితో కలిసి ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన హియరింగ్ కేంద్రాలను అదనపు కలెక్టర్ సందర్శించి, హియరింగ్ ప్రక్రియ నిర్వహణ తీరును పరిశీలించారు. నోటీసులు అందుకున్న ఓటర్ల నుంచి సమర్పిస్తున్న ధ్రువపత్రాలు, ఆధారాలను పరిశీలించి, నిబంధనల ప్రకారం ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ విక్టర్ మాట్లాడుతూ, ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా అర్హులైన ప్రతి ఓటరు పేరు ఓటరు జాబితాలో ఉండేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. హియరింగ్‌కు హాజరయ్యే ఓటర్లకు అవసరమైన సమాచారం, మార్గదర్శకాలను అందించి, వారి అభ్యంతరాలు, వివరణలను నిబంధనల మేరకు నమోదు చేయాలని సూచించారు. హియరింగ్ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ డిప్యూటీ కలెక్టర్ రవితేజ,పిట్లం మండల తహసీల్దార్, పీడీసీ అధికారి, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.
- వరదల వినాశనానికి BRS అశాస్త్రీయ పాలనే కారణం:-కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఇప్ప శ్రీనివాస్... వరదల వినాశనానికి BRS అశాస్త్రీయ పాలనే కారణం:-కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఇప్ప శ్రీనివాస్... పిండ ప్రదానాల నాటకాలకు కామారెడ్డి ప్రజలే బుద్ధి చెబుతారు! కామారెడ్డి అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ... ముందస్తు చూపు లేకుండా, ఎలాంటి శాస్త్రీయ పద్ధతులు పాటించకుండా పదేళ్ల పాలనలో ఇష్టారీతిన డివైడర్లు నిర్మించి కామారెడ్డిలో వరద వినాశనానికి BRS పార్టీయే ప్రధాన కారణమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఇప్ప శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు BRS నాయకులకు లేదని ఆయన ఖండించారు. ఈ సందర్భంగా ఇప్ప శ్రీనివాస్ మాట్లాడుతూ... గతంలో వచ్చిన వరదల వల్ల ప్రజలు పడిన అపారమైన ఇబ్బందులకు BRS నాయకులు తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తమ పాలనలో చేసిన చారిత్రక తప్పులను, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు 'పిండ ప్రదానాలు' అంటూ చౌకబారు రాజకీయాలు, నాటకాలు ఆడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. శాశ్వత పరిష్కారం దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం:- BRS చేసిన తప్పులను సరిదిద్ది, కామారెడ్డి ప్రజలకు వరద ముప్పు నుండి శాశ్వత ఉపశమనం కలిగించేందుకు అవసరమైన చర్యలపై ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి దృష్టికి ప్రభుత్వ సలహాదారు శ్రీ షబ్బీర్ అలీ గారు ఇప్పటికే తీసుకెళ్లారని తెలిపారు. కామారెడ్డి అభివృద్ధి, ప్రజల భద్రతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందని స్పష్టం చేశారు. అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ షబ్బీర్ అలీ:- కామారెడ్డి నియోజకవర్గంలో షబ్బీర్ అలీ కృషి వల్లే ప్రతీ ఊరికి సబ్ స్టేషన్లు, మల్లన్న గుట్ట వద్ద ఫిల్టర్ బెడ్ నిర్మాణం సాధ్యమయ్యాయని గుర్తుచేశారు. ఈ వేసవి కాలంలో నీటి సమస్య లేకుండా పోవడం ఆయన దూరదృష్టికి నిదర్శనమన్నారు. "గతంలో పట్టణానికి 7 MLD నీరు మాత్రమే వస్తే, ఇప్పుడు అది 11 MLD కి పెరిగింది. అది షబ్బీర్ అలీ సామర్థ్యానికి తార్కాణం. ఇందిరా గాంధీ స్టేడియం నిర్మాణం, ఫ్లడ్ లైట్లు, ప్రధాన రహదారుల అభివృద్ధి అంతా ఆయన హయాంలోనే జరిగింది" అని పేర్కొన్నారు. BRS కు సవాల్:- ప్రజలను మభ్యపెట్టి, కేవలం రాజకీయ లబ్ధి పొందడం కోసం ధర్నాలు, నాటకాలు చేయడం BRS నాయకులు మానుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యకమంలో పట్టణ అధ్యక్షులు సందీప్,రాజగౌడ్,గూడెం శ్రీనివాస్,పండ్లరాజు,గోనె శ్రీనివాస్ గొడుగుల,శ్రీనివాస్,కౌన్సిలర్స్ అంజాద్,జావీద్,నిట్టూ గంగాధర్,కాళ్ళ గణేష్,లడ్డు,కన్నయ్య కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.1
- రక్షాబంధన్ ఎఫెక్ట్... రద్దీగా బస్సులు........( వీడియో) బిక్కనూర్ రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఉదయం నుండి మండల కేంద్రంలో ఆర్టీసీ బస్సులలో మహిళా ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు తరలి వెళ్లడంతో బస్సులు రద్దీగా మారాయి. దీనికి తోడు బస్సుల సంఖ్యను తగ్గించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బస్సులో చోటు కోసం మహిళల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. కొందరు చేసేది ఏమీ లేక ఆటోలలో ప్రయాణాలు కొనసాగించారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో నూలు పౌర్ణమి వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి శోభాయాత్ర అంగరంగ వైభవో పేతంగా జరిగింది. శుక్రవారం సాయంత్రం శోభాయాత్రలో కన్నుల పండుగలా సాగిన రథయాత్రలో ఒకవైపు మార్కండేయ స్వామి, మరో రథంపై స్వామి ధరించడానికి రథయాత్రలో నేతన్న మొగ్గంపై వస్త్రం నేస్తూ సాగడం భక్తులను ప్రజలను అలరించింది. అంతకు ముందు శ్రీ మార్కండేయ స్వామి దేవస్థానం లో ఉదయం "రక్షాబంధన్" , అలాగే నేతన్నల సామూహిక యజ్ఞోపవీతధారణ (జంజీరమలు ధరించుట) కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం శ్రీ శివభక్త మార్కండేయ స్వామి శోభాయాత్ర ప్రారంభమైంది. సిరిసిల్ల పద్మశాలి సంఘం, పద్మశాలి యువజన సంఘం, పద్మశాలి మహిళా సంఘం సంయుక్త ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. శుక్రవారం శ్రీ మార్కండేయ దేవస్థానంలో ఉదయం నుంచి రాత్రి వరకు వేడుకలు జరిగాయి. శ్రీ మార్కండేయుని శోభాయాత్రను వేములవాడ ఎమ్మెల్యే విప్ ఆది శ్రీనివాస్, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, డిఎస్పి నాగేంద్ర చారీలు ప్రత్యేక పూజలు చేసి శ్రీ మార్కండేయ స్వామి శోభాయాత్రను ప్రారంభించారు. వందలాది మంది పాల్గొన్న ఈ రథయాత్ర లో నేతన్న చౌక్ లో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ లు నేతన్న విగ్రహానికి పూలమాలలు వేసి ప్రసంగించారు. అనంతరం పట్టణంలోని గాంధీ చౌక్, అంబేద్కర్ చౌక్ మీదుగా వెంకటేశ్వర దేవస్థానం నుంచి మళ్లీ తిరిగి మార్కండేయ దేవస్థానానికి చేరుకుంది. జై మార్కండేయ, జై జై మార్కండేయ అంటూ భక్తుల నినాదాలతో మారు మోగింది. కోలాటాలు, భజనలు, నృత్యాలతో ఆకట్టుకున్నారు. రథంపై శ్రీ మార్కండేయుని ఉత్సవ విగ్రహాలను అలంకరించారు. మరో రథంపై చేనేత మగ్గం పై నేత కార్మికుడు వస్త్రాన్ని తయారుచేసి శ్రీ మార్కండేయునికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, పద్మశాలి నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, పద్మశాలి సంఘం, యువజన సంఘం నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పోలీసుల భారీ బందోబస్తు మధ్య మార్కండేయుని శోభాయాత్ర సాగింది.4
- *ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు రాఖీ కట్టిన సోదరి* రాఖీ పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు ఆయన సోదరి లీల స్వగృహంలో రాఖీ కట్టారు. అనంతరం స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా అన్నాచెల్లెళ్ల ఆత్మీయ అనుబంధాన్ని చాటుకున్నారు. రక్షాబంధన్ సందర్భంగా సోదర సోదరీమణుల ప్రేమకు ప్రతీకగా నిలుస్తుందని ఆది శ్రీనివాస్ పేర్కొంటూ, ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు...1
- నందిపేట్ కేజీవీపీ విద్యాలయంలో రాఖీ వేడుకలు.. అనాథ చిన్నారులకు వస్త్రాల పంపిణీ చేసిన సర్పంచ్ ఎర్రం లింగం నందిపేట్ కేజీవీపీ విద్యాలయంలో రాఖీ వేడుకలు.. అనాథ చిన్నారులకు వస్త్రాల పంపిణీ చేసిన సర్పంచ్ ఎర్రం లింగం నందిపేట్: మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ పాఠశాలలో రాఖీ పౌర్ణమి పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో చదువుతున్న అనాథ, నిరుపేద చిన్నారులు నందిపేట్ సర్పంచ్ సిలిండర్ లింగంకు రాఖీలు కట్టి, ఆయనతో కలిసి పండుగను ఆత్మీయంగా జరుపుకున్నారు. అనంతరం తల్లిదండ్రులు లేని 20 మంది అనాథ అమ్మాయిలకు కొత్త దుస్తులను పంపిణీ చేశారు. అనంతరం సర్పంచ్ విద్యార్థినులతో కలిసి భోజనం చేసి, వారితో ఆత్మీయంగా గడిపారు. దీంతో పండుగ సందర్భంగా చిన్నారుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులు, ఉపాధ్యాయినులు సర్పంచ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నందిపేట్ సర్పంచ్ ఎర్రం (సిలిండర్) లింగం మాట్లాడుతూ.. అనాథ చిన్నారుల విద్యాభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. తల్లిదండ్రులు లేకపోయినా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని, కష్టపడి చదివి పాఠశాల పేరు ప్రఖ్యాతులు పెంచేలా తమ భవిష్యత్తును మెరుగుపరుచుకోవాలని చిన్నారులకు సూచించారు. చిన్నారుల సంక్షేమం కోసం తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని, భవిష్యత్తులో కూడా వారికి అవసరమైన సహకారం అందిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శాంతా కుమారి, ఉపాధ్యాయినులు, సిబ్బంది పాల్గొన్నారు.1
- బోధన్ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్.. కాంగ్రెస్, మజ్లిస్ మధ్య రాజకీయ విభేదాలపై చర్చ బోధన్ రాజకీయాల్లో మరోసారి రాజకీయ వేడి కనిపిస్తోంది. ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) తరఫున కాంగ్రెస్‌కు గట్టి రాజకీయ సందేశం రావడంతో బోధన్‌లో రాజకీయ వాతావరణంపై చర్చ మొదలైంది. మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ బ్యారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్ పార్టీకి బుల్డోజర్ చర్యల విషయంలో హెచ్చరిక చేసిన నేపథ్యంలో బోధన్ రాజకీయ పరిస్థితి మరోసారి చర్చనీయాంశంగా మారింది. రానున్న 2028 ఎన్నికల్లో ఈ రాజకీయ విభేదాల ప్రభావం ఎవరిపై పడుతుంది? ప్రజలు ఈ వ్యవహారంపై ఎలాంటి తీర్పు ఇస్తారు? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు తెలంగాణలో కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల మధ్య పలు అంశాల్లో సహకారం, రాజకీయ సమన్వయం కనిపిస్తూ వచ్చింది. అయితే బోధన్‌లో కాంగ్రెస్, మజ్లిస్ స్థానిక నాయకుల మధ్య ఏర్పడుతున్న రాజకీయ ఉద్రిక్తతలు పలు ప్రశ్నలకు దారితీస్తున్నాయి. బోధన్ ప్రజల్లో ఇప్పుడు ఒక చర్చ కొనసాగుతోంది. ఈ రాజకీయ వివాదం తర్వాత బోధన్ రాజకీయ వాతావరణం మారుతుందా? రానున్న ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఈ రాజకీయ పరిణామాలపై సమాధానం ఇస్తారా? బోధన్ కాంగ్రెస్ నాయకులు, మజ్లిస్ నాయకుల మధ్య ఇదే విధమైన రాజకీయ పోరు కొనసాగుతుందా? అన్నింటికంటే ముఖ్యమైన ప్రశ్న... ఈ రాజకీయ విభేదాల కారణంగా బోధన్ అభివృద్ధి ప్రభావితమవుతుందా? గతంలో కూడా రాజకీయ విభేదాలు, రాజకీయ ఆధిపత్య పోరు కారణంగా బోధన్ అభివృద్ధి దెబ్బతిన్నదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు మరోసారి రాజకీయ వివాదాల కారణంగా బోధన్ అభివృద్ధి పనులు ప్రభావితమవుతాయా? అనే ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది. అలాగే ప్రజల్లో మరో ప్రశ్న కూడా వినిపిస్తోంది... అసలు బోధన్‌లో కాంగ్రెస్ పార్టీ ఏం కోరుకుంటోంది? తెలంగాణ స్థాయిలో రాష్ట్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మజ్లిస్‌తో కలిసి పనిచేయగలిగినప్పుడు, బోధన్‌లో మాత్రం కాంగ్రెస్, మజ్లిస్ స్థానిక నాయకుల మధ్య రాజకీయ విభేదాలు ఎందుకు ఏర్పడుతున్నాయి? బోధన్ అభివృద్ధే లక్ష్యమైతే, రెండు పార్టీల స్థానిక నాయకులు రాజకీయ విభేదాలను పక్కనపెట్టి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కలిసి పనిచేయకూడదా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బుల్డోజర్ చర్యలు, రాజకీయ వివాదాల విషయంలో కూడా ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రాజకీయ విభేదాలు ఎవరి మధ్య ఉన్నా, వాటి ప్రభావం బోధన్ అభివృద్ధిపై పడకూడదని ప్రజలు కోరుతున్నారు. బోధన్ ప్రజల డిమాండ్ ఏమిటంటే.. అన్ని రాజకీయ పార్టీలు రాజకీయ విభేదాలకు అతీతంగా పట్టణ అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. మౌలిక సదుపాయాలు, రోడ్లు, ఆరోగ్యం, విద్య, ఉపాధి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పుడు చూడాల్సింది ఏమిటంటే... బోధన్‌లో కొనసాగుతున్న ఈ రాజకీయ వివాదం రానున్న రోజుల్లో ఎలాంటి మలుపు తిరుగుతుంది? కాంగ్రెస్, మజ్లిస్ స్థానిక నాయకుల మధ్య విభేదాలు మరింత తీవ్రతరం అవుతాయా?** లేక బోధన్ ప్రజా ప్రయోజనాలు, పట్టణ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రాజకీయ విభేదాలను పక్కనపెట్టి ఇరు వర్గాలు కలిసి పనిచేస్తాయా? బోధన్ రాజకీయ పరిణామాలపై ఇప్పుడు ప్రజల దృష్టి అంతా ఉంది. రానున్న ఎన్నికల్లో ప్రజల ఓటే ఈ రాజకీయ పరిస్థితికి అసలైన సమాధానం కానుంది.1
- *SIR ప్రక్రియపై ( డ్రప్ట్ ఓటర్ లిస్టు పై ) అవగాహన కోసం 46 & 47వ పరిదిలోని భారత్ రోడ్డులో వార్డు సభ* *కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక 46 & 47వ వార్డు కౌన్సిలర్లు గెరిగంటి స్వప్న - లక్ష్మినారాయణ ఆధ్వర్యంలో 46 & 47వ వార్డు పరిధిలోని భారత్ రోడ్ లో SIR ప్రక్రియపై ఈ రోజు వార్డు సభ నిర్వహించడం జరిగింది. వార్డులో నిర్వహించిన సమావేశంలో ఓటర్ జాబితా చదివి వినిపించారు. ఓటర్లకు పలు అనుమానాలపై అవగాహన కల్పించారు. జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా బీఎల్ఓలు ఓటర్లకు పలు విషయాలపై వివరించారు. ఇట్టి వార్డు సభ కార్యక్రమంలో మున్సిపల్ RO రవి గోపాల్ రెడ్డి, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రసన్న, మున్సిపల్ అధికారి భాగ్యలక్ష్మీ, 46, 47 వార్డు అధికారి కిశోర్, BLO లు కాశీరాం, పిట్ల రేఖ, వేంకట లక్ష్మి, బాబిత మరియు స్థానిక 46 & 47వ వార్డు ఓటర్లు తదితరులు పాల్గొన్నారు1
- రాఖీ పండుగ రోజు రక్తమోడుతున్నా.. బిడ్డ ఆకలి తీర్చిన తల్లి మమకారం రాఖీ పండుగ రోజున బంధువులకు రాఖీలు కట్టేందుకు బయలుదేరిన ఓ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం విషాదంలోకి నెట్టింది. హత్నూర మండలం చందాపూర్‌కు చెందిన కుటుంబం చిలిపిచేడ్ చౌరస్తా వద్దకు చేరుకోగానే బైక్‌కు కుక్కలు అడ్డురావడంతో అదుపుతప్పి కిందపడింది. ప్రమాదంలో తల్లికి తీవ్ర గాయాలై రక్తస్రావమైనప్పటికీ.. ఒడిలో ఉన్న చిన్నారి ఆకలిని మాత్రం ఆమె పట్టించుకోకుండా ఉండలేకపోయింది. గాయాల బాధను భరిస్తూనే బిడ్డకు పాలు ఇచ్చింది. రక్తమోడుతున్న స్థితిలోనూ బిడ్డ ఆకలి తీర్చిన ఆ తల్లి మమకారం అక్కడున్న వారిని కదిలించింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే బాధితులను సమీప ఆసుపత్రికి తరలించారు. రాఖీ పండుగ వేళ చోటుచేసుకున్న ఈ ఘటన కుటుంబ సభ్యుల్లో విషాదాన్ని నింపింది.1