Shuru
Apke Nagar Ki App…
రాయగిరి కి చేరుకున్న 'బీసీ రాజాధికారయాత్ర' తీన్మార్ మల్లన్న పాదయాత్ర గోల్కొండ కోట నుండి కాకతీయ కోట వరకు తీన్మార్ మల్లన్న చేపట్టిన 'బీసీ రాజ్యాధికార యాత్ర' పాదయాత్ర సోమవారం రాయగిరికి చేరుకున్నారు. బీసీ రాజ్యాధికార సంకల్పాన్ని మరింత బలంగా, మరింత దూకుడుగా ముందుకు తీసుకెళ్లాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) నిర్ణయించిందని తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు. బీసీలకు అన్ని రంగాల్లో సరైన వాటా దక్కేంతవరకు పోరాటం కొనసాగిస్తానన్నారు.
P.srinu
రాయగిరి కి చేరుకున్న 'బీసీ రాజాధికారయాత్ర' తీన్మార్ మల్లన్న పాదయాత్ర గోల్కొండ కోట నుండి కాకతీయ కోట వరకు తీన్మార్ మల్లన్న చేపట్టిన 'బీసీ రాజ్యాధికార యాత్ర' పాదయాత్ర సోమవారం రాయగిరికి చేరుకున్నారు. బీసీ రాజ్యాధికార సంకల్పాన్ని మరింత బలంగా, మరింత దూకుడుగా ముందుకు తీసుకెళ్లాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) నిర్ణయించిందని తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు. బీసీలకు అన్ని రంగాల్లో సరైన వాటా దక్కేంతవరకు పోరాటం కొనసాగిస్తానన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- రాయగిరి కి చేరుకున్న 'బీసీ రాజాధికారయాత్ర' తీన్మార్ మల్లన్న పాదయాత్ర గోల్కొండ కోట నుండి కాకతీయ కోట వరకు తీన్మార్ మల్లన్న చేపట్టిన 'బీసీ రాజ్యాధికార యాత్ర' పాదయాత్ర సోమవారం రాయగిరికి చేరుకున్నారు. బీసీ రాజ్యాధికార సంకల్పాన్ని మరింత బలంగా, మరింత దూకుడుగా ముందుకు తీసుకెళ్లాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) నిర్ణయించిందని తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు. బీసీలకు అన్ని రంగాల్లో సరైన వాటా దక్కేంతవరకు పోరాటం కొనసాగిస్తానన్నారు.1
- ఉద్యమకారుడు లక్ష్మణ్ గౌడ్ మృతి చాలా బాధాకరం, దురదృష్టకరం, మా అందరిని కూడా ఎంతగానో కలచి వేసింది. ఉద్యమకారుడు లక్ష్మణ్ గౌడ్ మృతి చాలా బాధాకరం, దురదృష్టకరం, మా అందరిని కూడా ఎంతగానో కలచి వేసింది. నేడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి ఆదేశంతో నేను, పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు లక్ష్మణ్ గౌడ్ కుటుంబాన్ని ఓదార్చి, అన్ని రకాలుగా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చి వారికి పార్టీ తరఫున ఆర్థిక సహాయాన్ని అందించాం. వారి సతీమణికి ఉద్యోగం ఇవ్వడంతో పాటు ఆ పిల్లల్ని చదివించే బాధ్యత కూడా నేను తీసుకుంటా అని చెప్పి రాజేశ్వర్ రెడ్డి గారు ఆ కుటుంబానికి భరోసానిచ్చారు. - మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు1
- వెంకటేశ్వర నగర్‌లో అగ్నిప్రమాదం.. రూ.25 లక్షల ఆస్తి నష్టం హెచ్‌బీ కాలనీ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర నగర్‌లో మదర్ థెరిస్సా స్కూల్ సమీపంలోని రామ్‌దేవ్ మినీ సూపర్ మార్కెట్‌లో సోమవారం ఉదయం షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం సంభవించింది. ఉదయం 5.30 నుంచి 6 గంటల మధ్య జరిగిన ఈ ఘటనలో సుమారు రూ.25 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే చేరుకుని మంటలను అదుపు చేశారు. బీజేపీ నాయకుడు రామ్ ప్రదీప్ మునుగంటి ఘటనా స్థలాన్ని పరిశీలించి, పోలీసులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. షాపునకు ఇన్సూరెన్స్ లేకపోవడంతో యజమానికి జరిగిన నష్టంపై ఆందోళన వ్యక్తం చేశారు.1
- అక్రమంగా అండాల సేకరణ: ఐదు ప్రముఖ ఫెర్టిలిటీ సెంటర్లకు తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు! హైదరాబాద్, నవంబర్ 10: నిబంధనలకు విరుద్ధంగా మహిళల నుంచి అక్రమంగా అండాలు (Eggs) సేకరిస్తున్నారన్న తీవ్ర ఆరోపణలపై తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఉక్కుపాదం మోపింది. నగరంలోని ఐదు ప్రముఖ సంతాన సాఫల్య కేంద్రాలకు (Fertility Centres) కమిషన్ అధికారికంగా నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న కేంద్రాల మేనేజింగ్ డైరెక్టర్లు, మెడికల్ సూపరింటెండెంట్లు, సెంటర్ హెడ్స్ సోమవారం బుద్ధభవన్‌లోని కమిషన్ కార్యాలయంలో స్వయంగా హాజరయ్యారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే... ఇందిరా ఐవీఎఫ్ సెంటర్ (Indira IVF Centre), నర్మదా ఫెర్టిలిటీ సెంటర్ (Narmada Fertility Centre), ఒయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ (Oasis Fertility Centre), సద్గురు ఏఆర్టీ సెంటర్ (Sadguru ART Centre), పద్మజా ఫెర్టిలిటీ సెంటర్ (Padmaja Fertility Centre) లపై నిబంధనల ఉల్లంఘన ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో మహిళా కమిషన్ చైర్‌పర్సన్ శారద నెరేళ్ల ఎదుట హాజరైన ఆయా ఆసుపత్రుల యాజమాన్యాలు తమ వివరణలను లిఖితపూర్వకంగా సమర్పించాల్సి ఉంది. అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ (రెగ్యులేషన్) చట్టం, 2021 (ART Act) ప్రకారం అండ దాతల నుంచి తప్పనిసరిగా లిఖితపూర్వక అనుమతి తీసుకోవడం, తగిన వైద్య రక్షణలు కల్పించడం, అండాల సేకరణపై నిర్దేశించిన పరిమితులను పాటించడం తప్పనిసరి. అయితే ఈ ఐదు కేంద్రాలు సదరు నిబంధనలను ఉల్లంఘించాయా లేదా అన్న కోణంలో కమిషన్ సమగ్ర విచారణ జరుపుతోంది. మహిళల ఆరోగ్యం, వారి ఆత్మగౌరవం, పునరుత్పత్తి హక్కులకు భంగం వాటిల్లిందా అనే అంశాన్ని నిర్ధారించేందుకు ఆసుపత్రులు ఇచ్చే వివరణలు, సాక్ష్యాలను పరిశీలించి బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయనున్నట్లు కమిషన్ వెల్లడించింది. కీలక ముఖ్యాంశాలు: - మహిళల నుంచి అక్రమంగా అండాల సేకరణ ఆరోపణలపై ఐదు ఫెర్టిలిటీ కేంద్రాలకు మహిళా కమిషన్ నోటీసులు - ఇందిరా ఐవీఎఫ్, నర్మదా, ఒయాసిస్, సద్గురు, పద్మజా ఫెర్టిలిటీ కేంద్రాలకు చెందిన ప్రతినిధులు హాజరు - బుద్ధభవన్‌లో మహిళా కమిషన్ చైర్‌పర్సన్ శారద నెరేళ్ల ఎదుట హాజరై లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశం - ఏఆర్టీ (రెగ్యులేషన్) చట్టం-2021 నిబంధనల ఉల్లంఘనలపై సమగ్ర విచారణ - వివరణలు, ఆధారాలను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు కమిషన్ స్పష్టీకరణ1
- అండాల సేకరణ ఆరోపణలు.. ఐదు ఫెర్టిలిటీ కేంద్రాలకు నోటీసులు హైదరాబాద్‌లో మహిళల నుంచి నిబంధనలకు విరుద్ధంగా అండాలు సేకరిస్తున్నారనే ఆరోపణలపై తెలంగాణ మహిళా కమిషన్ స్పందించింది. ఇందిరా ఐవీఎఫ్, నర్మదా, ఒయాసిస్, సద్గురు ఏఆర్‌టీ, పద్మజ ఫెర్టిలిటీ కేంద్రాలకు నోటీసులు జారీ చేసింది. సోమవారం చైర్‌పర్సన్ నేరెళ్ల శారద సమక్షంలో ఆయా కేంద్రాల ప్రతినిధులను విచారించింది. మహిళల రాతపూర్వక సమ్మతి, వైద్య భద్రత, ఏఆర్‌టీ చట్టం–2021 నిబంధనల అమలుపై వివరణ కోరింది. విచారణ అనంతరం ఆధారాల ప్రకారం తదుపరి చర్యలు తీసుకోనుంది.1
- అట్లాస్ జానయ్య వేధింపులు అరికట్టాలని అతనిపై చర్యలు తీసుకోవాలని నిరసన ర్యాలీ వైస్ ఛాన్సలర్ అల్డాస్ జానయ్య వేధింపులు తట్టుకోలేక కంటతడి పెట్టుకున్న మరో మహిళా ప్రొఫెసర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో కొనసాగుతున్న వైస్ ఛాన్సలర్ అల్డాస్ జానయ్య మహిళా ప్రొఫెసర్, మరో ప్రొఫెసర్‌ను పట్టుకొని మీరిద్దరూ మొగుడు పెళ్లాం లాగా యూనివర్సిటీలో తిరుగుతున్నారని వేధించిన అల్డాస్ జానయ్య డీజీపీ స్థాయిలో ఫిర్యాదు చేసినా మాకు న్యాయం దక్కడం లేదు - బాధిత మహిళా ప్రొఫెసర్1
- గురుకులంలో విద్యార్థులపై అసభ్య ప్రవర్తన.. విద్యార్థుల బాధ వారి మాటల్లోనే నిడమనూరు గురుకులంలో మైనర్ బాలికలకు రక్షణ కరువు... బాలికలను బాత్రూమ్‌లోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ పారిశుద్ధ్య కార్మికుడిపై తీవ్ర ఆరోపణలు... నిడమనూరు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో కలకలం... తమను అసభ్యకరంగా తాకుతున్నాడంటూ చిన్నారుల ఆవేదన... బాత్రూమ్‌లోకి తీసుకెళ్లి తలుపులు వేస్తున్నాడంటూ విద్యార్థినుల ఆరోపణలు... అభం శుభం తెలియని బాలికల పట్ల ఇలాంటి ప్రవర్తన ఏమిటి..? బాలికల భద్రతను పర్యవేక్షించాల్సిన గురుకుల యాజమాన్యం ఏం చేస్తోంది..? చిన్నారుల ఫిర్యాదులు బయటకు వస్తున్నా అధికారులు ఎందుకు స్పందించడం లేదు... *జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ గారూ.. తక్షణమే స్పందించండి!* ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించాలి... బాధిత బాలికలకు భరోసా కల్పించి, మహిళా అధికారుల ద్వారా రహస్యంగా వాంగ్మూలాలు సేకరించాలి... ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్మికుడిని వెంటనే విధుల నుంచి తప్పించి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలి... బాలికల భద్రతలో నిర్లక్ష్యం వహించిన అధికారుల బాధ్యతను కూడా తేల్చాలి... *సూటి ప్రశ్న.. గురుకులంలో చిన్నారులకు రక్షణ లేదా..?* *బాలికల భద్రతపై రాజీ పడొద్దు.. ఆరోపణలపై తక్షణమే నిష్పక్షపాత విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి..!*1
- పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చొరవతో కాంగ్రెస్ శ్రేణులను వరించిన నూతన పదవులు. గిరిజన సమాజానికి దక్కిన రాజకీయ గుర్తింపు అవమానించిన చోటే సముచిత గౌరవం.. పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చొరవతో కాంగ్రెస్ శ్రేణులను వరించిన నూతన పదవులు. గిరిజన సమాజానికి దక్కిన రాజకీయ గుర్తింపు రాజకీయాల్లో అవమానాలు ఎదురైన చోటే అరుదైన గుర్తింపు గౌరవం లభించింది. తమకు రాజకీయంగా పెద్దపీట వేసి, సముచిత గౌరవం కల్పించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా కృతజ్ఞతలు తెలిపారు. మల్హర్ మండలం కొయ్యూర్‌లో ఎంపీ గడ్డం వంశీకృష్ణ చిత్రపటానికి స్థానిక నేతలు పాలాభిషేకం నిర్వహించి, మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు జరుపుకున్నారు.ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన స్థానిక ప్రజాప్రతినిధులు, నేతలకు ఎంపీ వంశీకృష్ణ రాజకీయ అండగా నిలిచారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ప్రతిష్టాత్మక కమిటీల్లో మల్హర్ మండల నేతలకు స్థానం కల్పించడంపై హర్షం వ్యక్తమైంది.రైల్వే సలహా మండలి సభ్యురాలిగా లకావత్ లక్ష్మి,టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ సభ్యులుగా లకావత్ సవేందర్, మహమ్మద్ కలిముద్దీన్, దేవి భూమయ్య లకు పదవులు లభించాయి.తమ గిరిజన సమాజానికి రాజకీయంగా సముచిత ప్రాధాన్యత కల్పించడమే కాకుండా కీలక పదవుల్లో అవకాశం కల్పించడంపై ఆనందం వ్యక్తం చేశారు. తమను గుర్తించి గౌరవించిన ఎంపీ గడ్డం వంశీకృష్ణకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని, రాజకీయంగా ఆయనకు పూర్తి అండగా నిలుస్తామని నాయకులు స్పష్టం చేశారు.1