logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చొరవతో కాంగ్రెస్ శ్రేణులను వరించిన నూతన పదవులు. గిరిజన సమాజానికి దక్కిన రాజకీయ గుర్తింపు అవమానించిన చోటే సముచిత గౌరవం.. పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చొరవతో కాంగ్రెస్ శ్రేణులను వరించిన నూతన పదవులు. గిరిజన సమాజానికి దక్కిన రాజకీయ గుర్తింపు రాజకీయాల్లో అవమానాలు ఎదురైన చోటే అరుదైన గుర్తింపు గౌరవం లభించింది. తమకు రాజకీయంగా పెద్దపీట వేసి, సముచిత గౌరవం కల్పించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా కృతజ్ఞతలు తెలిపారు. మల్హర్ మండలం కొయ్యూర్‌లో ఎంపీ గడ్డం వంశీకృష్ణ చిత్రపటానికి స్థానిక నేతలు పాలాభిషేకం నిర్వహించి, మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు జరుపుకున్నారు.ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన స్థానిక ప్రజాప్రతినిధులు, నేతలకు ఎంపీ వంశీకృష్ణ రాజకీయ అండగా నిలిచారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ప్రతిష్టాత్మక కమిటీల్లో మల్హర్ మండల నేతలకు స్థానం కల్పించడంపై హర్షం వ్యక్తమైంది.రైల్వే సలహా మండలి సభ్యురాలిగా లకావత్ లక్ష్మి,టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ సభ్యులుగా లకావత్ సవేందర్, మహమ్మద్ కలిముద్దీన్, దేవి భూమయ్య లకు పదవులు లభించాయి.తమ గిరిజన సమాజానికి రాజకీయంగా సముచిత ప్రాధాన్యత కల్పించడమే కాకుండా కీలక పదవుల్లో అవకాశం కల్పించడంపై ఆనందం వ్యక్తం చేశారు. తమను గుర్తించి గౌరవించిన ఎంపీ గడ్డం వంశీకృష్ణకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని, రాజకీయంగా ఆయనకు పూర్తి అండగా నిలుస్తామని నాయకులు స్పష్టం చేశారు.

1 hr ago
user_SIRIPATI ARUNKUMAR
SIRIPATI ARUNKUMAR
Voice of people బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
1 hr ago

పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చొరవతో కాంగ్రెస్ శ్రేణులను వరించిన నూతన పదవులు. గిరిజన సమాజానికి దక్కిన రాజకీయ గుర్తింపు అవమానించిన చోటే సముచిత గౌరవం.. పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చొరవతో కాంగ్రెస్ శ్రేణులను వరించిన నూతన పదవులు. గిరిజన సమాజానికి దక్కిన రాజకీయ గుర్తింపు రాజకీయాల్లో అవమానాలు ఎదురైన చోటే అరుదైన గుర్తింపు గౌరవం లభించింది. తమకు రాజకీయంగా పెద్దపీట వేసి, సముచిత గౌరవం కల్పించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా కృతజ్ఞతలు తెలిపారు. మల్హర్ మండలం కొయ్యూర్‌లో ఎంపీ గడ్డం వంశీకృష్ణ చిత్రపటానికి స్థానిక నేతలు పాలాభిషేకం నిర్వహించి, మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు జరుపుకున్నారు.ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన స్థానిక ప్రజాప్రతినిధులు, నేతలకు ఎంపీ వంశీకృష్ణ రాజకీయ అండగా నిలిచారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ప్రతిష్టాత్మక కమిటీల్లో మల్హర్ మండల నేతలకు స్థానం కల్పించడంపై హర్షం వ్యక్తమైంది.రైల్వే సలహా మండలి సభ్యురాలిగా లకావత్ లక్ష్మి,టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ సభ్యులుగా లకావత్ సవేందర్, మహమ్మద్ కలిముద్దీన్, దేవి భూమయ్య లకు పదవులు లభించాయి.తమ గిరిజన సమాజానికి రాజకీయంగా సముచిత ప్రాధాన్యత కల్పించడమే కాకుండా కీలక పదవుల్లో అవకాశం కల్పించడంపై ఆనందం వ్యక్తం చేశారు. తమను గుర్తించి గౌరవించిన ఎంపీ గడ్డం వంశీకృష్ణకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని, రాజకీయంగా ఆయనకు పూర్తి అండగా నిలుస్తామని నాయకులు స్పష్టం చేశారు.

More news from తెలంగాణ and nearby areas
  • తెలంగాణ ఉద్యమకారుడు వేముల లక్ష్మణ్ గౌడ్ మృతి పట్ల బీఆర్‌ఎస్ పార్టీ తీవ్ర సంతాపం వ్యక్తం తెలంగాణ ఉద్యమకారుడు వేముల లక్ష్మణ్ గౌడ్ మృతి పట్ల బీఆర్‌ఎస్ పార్టీ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, సాగునీరు లేక పంట ఎండిపోవడం, తరతరాలుగా ఉన్న భూమి దక్కదనే ఆవేదనతోనే ఆయన మృతి చెందారని ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి బీఆర్‌ఎస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
    1
    తెలంగాణ ఉద్యమకారుడు వేముల లక్ష్మణ్ గౌడ్ మృతి పట్ల బీఆర్‌ఎస్ పార్టీ తీవ్ర సంతాపం వ్యక్తం
తెలంగాణ ఉద్యమకారుడు వేముల లక్ష్మణ్ గౌడ్ మృతి పట్ల బీఆర్‌ఎస్ పార్టీ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, సాగునీరు లేక పంట ఎండిపోవడం, తరతరాలుగా ఉన్న భూమి దక్కదనే ఆవేదనతోనే ఆయన మృతి చెందారని ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.
లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి బీఆర్‌ఎస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
    user_SIRIPATI ARUNKUMAR
    SIRIPATI ARUNKUMAR
    Voice of people బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    10 min ago
  • రాయగిరి కి చేరుకున్న 'బీసీ రాజాధికారయాత్ర' తీన్మార్ మల్లన్న పాదయాత్ర గోల్కొండ కోట నుండి కాకతీయ కోట వరకు తీన్మార్ మల్లన్న చేపట్టిన 'బీసీ రాజ్యాధికార యాత్ర' పాదయాత్ర సోమవారం రాయగిరికి చేరుకున్నారు. బీసీ రాజ్యాధికార సంకల్పాన్ని మరింత బలంగా, మరింత దూకుడుగా ముందుకు తీసుకెళ్లాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) నిర్ణయించిందని తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు. బీసీలకు అన్ని రంగాల్లో సరైన వాటా దక్కేంతవరకు పోరాటం కొనసాగిస్తానన్నారు.
    1
    రాయగిరి కి చేరుకున్న 'బీసీ రాజాధికారయాత్ర' తీన్మార్ మల్లన్న పాదయాత్ర
గోల్కొండ కోట నుండి కాకతీయ కోట వరకు తీన్మార్ మల్లన్న చేపట్టిన 'బీసీ రాజ్యాధికార యాత్ర' పాదయాత్ర సోమవారం రాయగిరికి చేరుకున్నారు. బీసీ రాజ్యాధికార సంకల్పాన్ని మరింత బలంగా, మరింత
దూకుడుగా ముందుకు తీసుకెళ్లాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) నిర్ణయించిందని తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు. బీసీలకు అన్ని రంగాల్లో సరైన
వాటా దక్కేంతవరకు పోరాటం కొనసాగిస్తానన్నారు.
    user_P.srinu
    P.srinu
    యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    18 hrs ago
  • నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాల్సి ఉంది. బి.సి. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోహెడ మండలం వింజ పల్లిలో ఇందిరమ్మ ఇండ్లలో గృహప్రవేశం, దీపావళి సంబరాలకు బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ హాజరై, లబ్ధిదారులకు ఉత్సాహాన్ని నింపారు. నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల ప్రాముఖ్యత ఇవ్వాలని నాయకులను కోరారు. కార్యక్రమంలోమార్కెట్ కమిటీ చైర్మన్ భోగి నిర్మల, స్థానిక సర్పంచి అన్నాడీ శ్రీజ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శెట్టి సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.
    1
    నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాల్సి ఉంది. బి.సి. రవాణా శాఖ మంత్రి  పొన్నం ప్రభాకర్ 
కోహెడ మండలం వింజ పల్లిలో ఇందిరమ్మ ఇండ్లలో గృహప్రవేశం, దీపావళి సంబరాలకు బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ హాజరై, లబ్ధిదారులకు ఉత్సాహాన్ని నింపారు.  నిరుపేదలకు  ఇందిరమ్మ ఇండ్ల ప్రాముఖ్యత ఇవ్వాలని నాయకులను కోరారు. కార్యక్రమంలోమార్కెట్ కమిటీ చైర్మన్ భోగి నిర్మల, స్థానిక సర్పంచి  అన్నాడీ శ్రీజ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శెట్టి సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.
    user_Koheda, Siddipet, Telangana, I
    Koheda, Siddipet, Telangana, I
    Koheda, Siddipet, Telangana, India కోహెడ, సిద్దిపేట, తెలంగాణ•
    18 hrs ago
  • అండాల సేకరణ ఆరోపణలు.. ఐదు ఫెర్టిలిటీ కేంద్రాలకు నోటీసులు హైదరాబాద్‌లో మహిళల నుంచి నిబంధనలకు విరుద్ధంగా అండాలు సేకరిస్తున్నారనే ఆరోపణలపై తెలంగాణ మహిళా కమిషన్ స్పందించింది. ఇందిరా ఐవీఎఫ్, నర్మదా, ఒయాసిస్, సద్గురు ఏఆర్‌టీ, పద్మజ ఫెర్టిలిటీ కేంద్రాలకు నోటీసులు జారీ చేసింది. సోమవారం చైర్‌పర్సన్ నేరెళ్ల శారద సమక్షంలో ఆయా కేంద్రాల ప్రతినిధులను విచారించింది. మహిళల రాతపూర్వక సమ్మతి, వైద్య భద్రత, ఏఆర్‌టీ చట్టం–2021 నిబంధనల అమలుపై వివరణ కోరింది. విచారణ అనంతరం ఆధారాల ప్రకారం తదుపరి చర్యలు తీసుకోనుంది.
    1
    అండాల సేకరణ ఆరోపణలు.. ఐదు ఫెర్టిలిటీ కేంద్రాలకు నోటీసులు
హైదరాబాద్‌లో మహిళల నుంచి నిబంధనలకు విరుద్ధంగా అండాలు సేకరిస్తున్నారనే ఆరోపణలపై తెలంగాణ మహిళా కమిషన్ స్పందించింది. ఇందిరా ఐవీఎఫ్, నర్మదా, ఒయాసిస్, సద్గురు ఏఆర్‌టీ, పద్మజ ఫెర్టిలిటీ కేంద్రాలకు నోటీసులు జారీ చేసింది. సోమవారం చైర్‌పర్సన్ నేరెళ్ల శారద సమక్షంలో ఆయా కేంద్రాల ప్రతినిధులను విచారించింది. మహిళల రాతపూర్వక సమ్మతి, వైద్య భద్రత, ఏఆర్‌టీ చట్టం–2021 నిబంధనల అమలుపై వివరణ కోరింది. విచారణ అనంతరం ఆధారాల ప్రకారం తదుపరి చర్యలు తీసుకోనుంది.
    user_Jeetender
    Jeetender
    Mobile Phone Accessory Shop సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ•
    14 hrs ago
  • వెంకటేశ్వర నగర్‌లో అగ్నిప్రమాదం.. రూ.25 లక్షల ఆస్తి నష్టం హెచ్‌బీ కాలనీ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర నగర్‌లో మదర్ థెరిస్సా స్కూల్ సమీపంలోని రామ్‌దేవ్ మినీ సూపర్ మార్కెట్‌లో సోమవారం ఉదయం షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం సంభవించింది. ఉదయం 5.30 నుంచి 6 గంటల మధ్య జరిగిన ఈ ఘటనలో సుమారు రూ.25 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే చేరుకుని మంటలను అదుపు చేశారు. బీజేపీ నాయకుడు రామ్ ప్రదీప్ మునుగంటి ఘటనా స్థలాన్ని పరిశీలించి, పోలీసులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. షాపునకు ఇన్సూరెన్స్ లేకపోవడంతో యజమానికి జరిగిన నష్టంపై ఆందోళన వ్యక్తం చేశారు.
    1
    వెంకటేశ్వర నగర్‌లో అగ్నిప్రమాదం.. రూ.25 లక్షల ఆస్తి నష్టం
హెచ్‌బీ కాలనీ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర నగర్‌లో మదర్ థెరిస్సా స్కూల్ సమీపంలోని రామ్‌దేవ్ మినీ సూపర్ మార్కెట్‌లో సోమవారం ఉదయం షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం సంభవించింది. ఉదయం 5.30 నుంచి 6 గంటల మధ్య జరిగిన ఈ ఘటనలో సుమారు రూ.25 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే చేరుకుని మంటలను అదుపు చేశారు. బీజేపీ నాయకుడు రామ్ ప్రదీప్ మునుగంటి ఘటనా స్థలాన్ని పరిశీలించి, పోలీసులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. షాపునకు ఇన్సూరెన్స్ లేకపోవడంతో యజమానికి జరిగిన నష్టంపై ఆందోళన వ్యక్తం చేశారు.
    user_Bhaskar Reddy
    Bhaskar Reddy
    Detective కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    17 hrs ago
  • ఉద్యమకారుడు లక్ష్మణ్‌ గౌడ్‌ మృతి చాలా బాధాకరం, దురదృష్టకరం, మా అందరిని కూడా ఎంతగానో కలచి వేసింది. ఉద్యమకారుడు లక్ష్మణ్‌ గౌడ్‌ మృతి చాలా బాధాకరం, దురదృష్టకరం, మా అందరిని కూడా ఎంతగానో కలచి వేసింది. నేడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి ఆదేశంతో నేను, పల్లా రాజేశ్వర్‌ రెడ్డి గారు లక్ష్మణ్‌ గౌడ్‌ కుటుంబాన్ని ఓదార్చి, అన్ని రకాలుగా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చి వారికి పార్టీ తరఫున ఆర్థిక సహాయాన్ని అందించాం. వారి సతీమణికి ఉద్యోగం ఇవ్వడంతో పాటు ఆ పిల్లల్ని చదివించే బాధ్యత కూడా నేను తీసుకుంటా అని చెప్పి రాజేశ్వర్‌ రెడ్డి గారు ఆ కుటుంబానికి భరోసానిచ్చారు. - మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
    1
    ఉద్యమకారుడు లక్ష్మణ్‌ గౌడ్‌ మృతి చాలా బాధాకరం, దురదృష్టకరం, 
మా అందరిని కూడా ఎంతగానో కలచి వేసింది.
ఉద్యమకారుడు లక్ష్మణ్‌ గౌడ్‌ మృతి చాలా బాధాకరం, దురదృష్టకరం, 
మా అందరిని కూడా ఎంతగానో కలచి వేసింది.
నేడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి ఆదేశంతో నేను, పల్లా రాజేశ్వర్‌ రెడ్డి గారు లక్ష్మణ్‌ గౌడ్‌ కుటుంబాన్ని ఓదార్చి, అన్ని రకాలుగా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చి వారికి పార్టీ తరఫున ఆర్థిక సహాయాన్ని అందించాం. 
వారి సతీమణికి ఉద్యోగం ఇవ్వడంతో పాటు ఆ పిల్లల్ని చదివించే బాధ్యత కూడా నేను తీసుకుంటా అని చెప్పి రాజేశ్వర్‌ రెడ్డి గారు ఆ కుటుంబానికి భరోసానిచ్చారు. 
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
    user_SIRIPATI ARUNKUMAR
    SIRIPATI ARUNKUMAR
    Voice of people బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    26 min ago
  • సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తండ్రి, కూతురు మృతి హుస్నాబాద్ మండలం పందిళ్ల సమీపంలో ప్రధాన రహదారిపై ట్రాక్టర్, కారు ఢీకొని ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్‌కు చెందిన పైడిపల్లి శ్రీకాంత్ (35), ఆయన కుమార్తె మహిరి (7) మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలవడంతో హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి కారులో వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
    1
    సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తండ్రి, కూతురు మృతి
హుస్నాబాద్ మండలం పందిళ్ల సమీపంలో ప్రధాన రహదారిపై ట్రాక్టర్, కారు ఢీకొని ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్‌కు చెందిన పైడిపల్లి శ్రీకాంత్ (35), ఆయన కుమార్తె మహిరి (7) మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలవడంతో హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి కారులో వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
    user_వేణు విలేకరి
    వేణు విలేకరి
    Farmer హుస్నాబాద్, సిద్దిపేట, తెలంగాణ•
    23 hrs ago
  • కార్యకర్త అంతక్రియలు చూడడానికి పర్మిషన్ అవసరమా? కార్యకర్త ఓ టు వేయలేద కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ కోస్గిలో మృతి చెందిన కార్యకర్తల అంత్యక్రియలకు వెళ్తుండగా పరిగి వద్ద అడ్డుకున్న పోలీసులు రేవంత్ రెడ్డి వస్తున్నందుకు అదుపులోకి తీసుకుంటున్నామని పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు
    1
    కార్యకర్త అంతక్రియలు చూడడానికి పర్మిషన్ అవసరమా? కార్యకర్త ఓ టు వేయలేద 
కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్
కోస్గిలో మృతి చెందిన కార్యకర్తల అంత్యక్రియలకు వెళ్తుండగా పరిగి వద్ద అడ్డుకున్న పోలీసులు
రేవంత్ రెడ్డి వస్తున్నందుకు అదుపులోకి తీసుకుంటున్నామని పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు
    user_Vijay Kumar
    Vijay Kumar
    Reporter మసాయిపేట్, మెదక్, తెలంగాణ•
    21 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.