📢 డిసెంబర్ 9న చలో హైదరాబాద్! 📢 9 తెగల ఆదివాసీ ఐక్యతా సన్నాహక సమావేశం ఆదివాసీ హక్కుల సాధన కోసం... ఆదివాసీ అస్తిత్వ పరిరక్షణ కోసం... రాజ్యాంగ హక్కుల అమలు కోసం... ఆదివాసీ హక్కుల పోరాట సమితి – తుడుం దెబ్బ ఆధ్వర్యంలో డిసెంబర్ 9న నిర్వహించనున్న చలో హైదరాబాద్ – ఆదివాసీ అస్తిత్వ సభను విజయవంతం చేయాలనే సంకల్పంతో 9 తెగల ఆదివాసీ ఐక్యతా సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 9 తెగల ఆదివాసీ నాయకులు, గోండ్వానా పంచాయతీ రాయి సెంటర్ నాయకులు, ఆదివాసీ సంక్షేమ పరిషత్, ఆదివాసీ సేన, రాజ్ గోండ్ సేవా సమితి ప్రతినిధులు, గోండ్, కోయ, కొలం, మన్నెవార్, నాయక్‌పోడ్, అంద్, ప్రధాన్, తోటి, చెంచు తెగల ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరుతున్నాం. అదేవిధంగా తుడుం దెబ్బ, ఆదివాసీ విద్యార్థి సంఘం, ఆదివాసీ మహిళా సంఘం, ఉద్యోగుల సంఘం రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఈ సమావేశానికి తప్పనిసరిగా హాజరుకావాలి. డిసెంబర్ 9న నిర్వహించే చలో హైదరాబాద్ ఆదివాసీ అస్తిత్వ సభను విజయవంతం చేయడానికి తమ విలువైన సూచనలు, సలహాలు అందించి ఆదివాసీ ఐక్యతను చాటాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. 📍 సమావేశ వివరాలు 🗓️ తేదీ: 13-11-2026 (శుక్రవారం) ⏰ సమయం: నాయకులందరూ నిర్ణీత సమయానికి హాజరుకావాలి. 📌 వేదిక: ఆదివాసీ భవనం, ఉట్నూర్ జీసీసీ పెట్రోల్ పంపు దగ్గర. ఇట్లు – సమావేశ నిర్వాహకులు 1. పూర్కా బాపూరావు – తుడుం దెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ 2. కొడప నాగేష్ – తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి 3. పెందోర్ దాదిరావు – తుడుం దెబ్బ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు 4. పూర్కా చిత్రు – తుడుం దెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి 5. నైతం రమేష్ – తుడుం దెబ్బ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ 6. పెందోర్ సంతోష్ – ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు 7. పెందోర్ మహేందర్ – ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి 8. కనక గణేష్ – ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ 9. కనక ప్రభాకర్ – తుడుం దెబ్బ ఉట్నూర్ డివిజన్ అధ్యక్షులు 10. సోయం శంకర్ – తుడుం దెబ్బ ఉట్నూర్ అధ్యక్షులు 11. పెందోర్ మోతిరం – మండల ప్రధాన కార్యదర్శి 🏹 ఒక్కటవుదాం – ఐక్యంగా పోరాడుదాం! 🔥 ఆదివాసీ అస్తిత్వాన్ని కాపాడుకుందాం! 🏹 డిసెంబర్ 9న చలో హైదరాబాద్ – విజయవంతం చేద్దాం!

- జాతర్ల గ్రామంలో అంబరాంటిన దండారి గుస్సాడి ముగింపు వేడుకలు: ముఖ్య అతిథిగా హాజరైన ఐటీడీఏ పీఓ మకరంద్ బజార్హత్నూర్: ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలంలోని జాతర్ల గ్రామంలో దండారి గుస్సాడి వేడుకలు అత్యంత వైభవంగా ముగిశాయి.ఆదిలాబాద్ ఎంపీ శ్రీ గోడెం నగేష్ గారి ఆధ్వర్యంలో వారి స్వంత గ్రామమైన జాతర్లలో గత 11 సంవత్సరాలుగా ఈ ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా సుమారు 35 నుండి 40 గ్రామాల దండారి గుస్సాడి బృందాలను ఆహ్వానించి, వారికి బహుమతులు అందజేసి ఘనంగా సత్కరించారు. వేడుకల్లో భాగంగా ఎంపీ గోడం నగేష్ గారు పటేల్, దేవారీలతో కలిసి ఆదివాసుల ఆరాధ్య దైవమైన ఎత్మాసూర్, గుస్సాడి దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గుస్సాడి బృందాల ఆటపాటలు, సంప్రదాయ నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రతి ఏటా లాగే ఈసారి కూడా వచ్చిన భక్తులకు, కళాకారులకు ఎంపీ గారి ఆధ్వర్యంలో ఘనంగా భోజన వసతి కల్పించారు. ఈ సందర్భంగా ఎంపీ గోడెం నగేష్ గారు మాట్లాడుతూ.. మన పూర్వీకులు మనకు అందించిన ఈ సంస్కృతి, సంప్రదాయాల వల్లే మనకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఈ సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఎత్మాసూర్, గుస్సాడి దేవతల ఆశీస్సులు ఎల్లప్పుడూ ప్రజలపై ఉండాలని, అందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు నిండాలని ఆయన ఆకాంక్షించారు. వచ్చే ఏడాది ఈ దండారి ఉత్సవాలను మరింత ఉత్సాహంతో, సరికొత్త వెలుగులతో జరుపుకుందామని చెబుతూ అందరికీ గుస్సాడి దండారి ముగింపు శుభాకాంక్షలు తెలిపారు. ఆకట్టుకున్న ఐటీడీఏ పీఓ సంప్రదాయ వేషధారణ: ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉట్నూర్ ఐటీడీఏ పీఓ (PO) శ్రీ మకరంద్ గారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయన ఆదివాసుల సంప్రదాయ 'ధోతీ' వేషధారణలో విచ్చేసి అందరినీ ఆకట్టుకున్నారు. అంతేకాకుండా, ఆయన గోండి భాషలో మాట్లాడుతూ.. ఇంతటి గొప్ప సంస్కృతిని కాపాడుకుంటూ భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు. ఈ ముగింపు వేడుకల్లో 35 గ్రామాల గుస్సాడీలు, పటేళ్లు, దేవారీలతో పాటు బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు తాటిపల్లి రాజు, APO ఆత్రం భాస్కర్. గోడం చందన్ TW DTWO ఉట్నూర్ బీజేపీ రాష్ట్ర నాయకులు జి.వి. రమణ, దిశా డైరెక్టర్ పెందూర్ తులసీరామ్, పలు గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు1
- నేరడిగొండలో ఘనంగా దండారి గుస్సాడీ ఉత్సవాలు............ నేరడిగొండ మండల కేంద్రంలోని MLA అనిల్ జాదవ్ నివాసం వద్ద దండారి గుస్సాడీ ఉత్సవాలను మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసీలు, మహిళలు సాంప్రదాయబద్ధంగా నృత్యం చేస్తూ సందడి చేశారు. ఆదివాసీల ఆచారాలు, సంస్కృతిని భావితరాలకు అందించాలని MLA అనిల్ జాదవ్ పిలుపునిచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదివాసుల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు.1
- ఇంటింటా ఇందిరమ్మ దీపావళి సంబరాలు.. పాల్గొన్న ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి ఆదిలాబాద్: మావల మండలం కొలంగూడా గ్రామంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డికి గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులతో కలిసి ఆయన కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వాఘపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటా ఇందిరమ్మ దీపావళి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో ముందుకు సాగుతోందని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో మావల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కుదురుపాక సురేష్ కుమార్, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భూపెల్లి శ్రీధర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిలుకూరి శేఖర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ప్రతాప్ రెడ్డి, వినోద్, అశోక్, శంకర్, రవి, లవన్, మార్సకోల గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.1
- నిర్మల్ కలెక్టరేట్ కార్యాలయం ముందు ప్రగతిశీల బీడీ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో బీడీ కార్మికుల ఆందోళన నిర్మల్ జిల్లా జిల్లా కలెక్టర్ కాలనీ ఆవరణలో బీడీ కార్మికుల ధర్నా చేపట్టారు బీడీలకు నాణ్యమైన తునికాకు అందించాలని పని దినాలను పెంచాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రగతిశీల బీడీ కార్మికుల సంఘం నాయకులు రాజన్న మాట్లాడుతూ శివాజీ బీడీ కంపెనీ యాజమాన్యం బీడీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. బీడీ కార్మికులకు నెలలో వారం రోజులు కూడా ఉపాధి కల్పించడం లేదని నెలకు 26 రోజుల ఉపాధి కల్పించాలని ఆయన కోరారు. వేయి బీడీలకు సరిపడా నాణ్యమైన తుని కాకు అందించాలని పిఎఫ్ కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమానికి నిర్మల్ జిల్లా చెందిన శివాజీ బీడీ కంపెనీ కార్మికులు పాల్గొన్నారు.1
- పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు అన్నారు. సోమవారం మధ్యాహ్నం లక్షేట్టిపేట మండలంలోని వెంకట్రావుపేట గ్రామంలో మూడు మండలాల లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో మాజీ డిసిసి అధ్యక్షురాలు సురేఖ ప్రేమ్ సాగర్ రావ్, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు ఉన్నారు.1
- జన్నారం మండలం తపాలాపూర్ చెక్ పోస్ట్ వద్ద పొట్ట దశలో పంట.. నీటి కోసం రైతుల పోరు జన్నారం మండలం తపాలాపూర్ చెక్ పోస్ట్ వద్ద సాగునీటి కోసం వివిధ గ్రామాల రైతులు రోడ్డెక్కారు. వరి పొట్ట దశలో మరో రెండు తడుల నీరు అందకపోతే పంట నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తూ సోమవారం ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. కలెక్టర్, ఎమ్మెల్యే వచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని తేల్చిచెప్పారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారులు తక్షణమే స్పందించి నీటిని విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేశారు.1
- భైంసాలో ఘనంగా సదర్ ఉత్సవాలు... ఆకట్టుకున్న దున్నపోతుల విన్యాసాలు నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో కిసాన్ సదర్ కమిటీ ఆధ్వర్యంలో సదర్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, భైంసా మున్సిపల్ చైర్మన్ దత్తాత్రి ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. యాదవులతో పాటు పాడి రైతులు కూడా గత 4 సం.లుగా సదర్ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.పాడి రైతులు తమ దున్నపోతులను రంగురంగుల అలంకరణలతో ముస్తాబు చేసి ఊరేగించారు. యువకులు దున్నరాజులతో చేసిన విన్యాసాలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ అద్భుత దృశ్యాలను వీక్షించేందుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.అంతకుముందు దున్నపోతులను తీసుకొచ్చిన వారికి మెమెంటోలను అందజేశారు.1
- బోథ్ నియోజకవర్గంలో తెలంగాణ రక్షణ సేన (TRS)లోకి భారీ చేరికలు ADB: గుడిహత్నూర్ మండలం జవహర్ నగర్ కాలనీకి చెందిన కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సోమవారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా TRS పార్టీ పనిచేస్తోందని అన్నారు. ప్రతి కార్యకర్తకు పార్టీలో తగిన గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు.1